Wednesday, December 31, 2008 6 comments By: visalakshi

బ్లాగు కుటుంబ సభ్యులందరికీ 2009 " నూతన సంవత్సర శుభాకాంక్షలు ".


బ్లాగు కుటుంబ సభ్యులందరికీ 2009 " నూతన సంవత్సర శుభాకాంక్షలు ".
Tuesday, December 30, 2008 6 comments By: visalakshi

2008 అనుభవాలు,అనుభూతులు.

ఒక కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఎం.బీ. ఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా అన్నగారి వద్ద మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలకీ వయసు తేడా 2సం"లు.
ఈ ఇద్దరు అమ్మాయిలకి  కాలనీ  సిస్టర్స్ అని పేరు .ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇంట్లో ఏ అవసరమొచ్చినా , రేషన్ కి వెళ్ళాలన్నా ఇద్దరూ జంట కవుల వలె వెళ్ళేవారు .ఏపని ఐనా కలసి చేసే వారు . కాలనీ లో అందరికీ వెల్ నోటెడ్ వీళ్ళిద్దరూ.ఒకరికొకరు అన్ని విషయాలు షేర్ చేసుకునేవారు .అలాంటి తరుణంలో అక్కకి పెళ్ళై దూరంగా వెళ్ళి పోయినా ,తనూ ఉన్నత చదువు అభ్యసించి వివాహము చేసుకుని ఉద్యోగం చేస్తూ ఎవరికి వారు బిజీ అయ్యి మరల దూరంగా ఉన్న అక్కా,బావలు ట్రాన్స్ఫర్ తో దగ్గరైన ఇద్దరమ్మాయిలు ఎవరో కాదు వేద ,రమణిలు .
ఇక విషయానికొస్తే ఈ సంవత్సరము మొదట్లో రమణి నాకు బ్లాగు రాస్తున్నాననీ ,చదువు అని చెప్పేది .కానీ నేను చిన్నప్పుడు కవితలు రాసి వినిపించేది. ఇదీ అలాంటిదే ఐ ఉంటుంది అని పట్టించుకోలేదు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను చదవమని అడిగేది. అప్పుడు నాకు పెద్దగా నెట్ గురించి తెలియదు .సరే అని మా పాపని అడిగి తెలుసుకుంటూ తన బ్లాగు ఓపెన్ చేసి చదివాను. నిజంగా తనలో ఇంతటి భావుకత ఉందా ! ,తన సహజమైన శైలి తో ,హాస్యం పండిస్తూ .నివ్వెర పోయాను.తేరుకుని నీ సొంతమేనా ఎక్కడైన కాపీనా అని అక్కగా అధికారంగా అడిగాను.తన జవాబు హ..హ..హ..హ ఎప్పుడూ ఇలాగే చిలిపిగా ఉంటుంది నా చెల్లెలు. అలా తన పోస్టులు చదువుతూ గడుపుతున్న నన్ను ఒక రోజు నువ్వూ రాయక్కా .అని అడిగింది .చదవడం ఈజీ ,రాయడం కష్టము అన్నాను.కానీ మనసులో పడింది రాయాలని.నా కంటూ ఒక బ్లాగు ఎలా అని అడిగాను .తను బాగా బిజీ ఉన్న రోజుల్లో నాకు ఆసక్తి ఎక్కువై తన బ్లాగునుండి కామెంట్స్ వచ్చిన వారి బ్లాగులు చదువుతూ శ్రీధరు గారి చిట్కాలతో కష్టపడి బ్లాగరునయ్యాను. తరువాత తెలుగులో ఎలా రాయాలో రమణి చెప్పింది. ఆ విధంగా సెప్టెంబరులో ఈ -తెలుగు లోకంలో అడుగు పెట్టిన నేను ప్రముఖులు కొంతమంది ఆశీస్సులతో నాకు తోచిన చిన్న చిన్న అంశాలు రాస్తున్నాను.నేను బ్లాగ్లోకంలోకొచ్చిన 4నెలల్లోనే అంతర్జాలంలో తెలుగు వెలుగులు అంటూ ప్రముఖ తెలుగు బ్లాగర్లని కలవడం మేము చేసుకున్న అదృష్టము .మరియు ప్రమదావనంలో కూడా ప్రముఖుల పరిచయం ,మొత్తానికి బ్లాగు కుటుంబంలో నన్ను సభ్యురాలిని చేసిన నా చెల్లికి ముందుగా కృతజ్ఞతలు.ఇంతమంది స్నేహితులు ,సన్నిహితులు కల ఈtelugu బ్లాగులోకం దిన,దిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ...............వేద
Thursday, December 25, 2008 3 comments By: visalakshi

ఎందుకీ బలవన్మరణాలు;ఆత్మహత్యలు-

దార్ల వెంకటేశ్వర రావు గారి బ్లాగులో నిన్ననే చదివాను ఎం.ఫిల్ చేస్తున్న కేశవాచారి అనే విద్యార్ధి (తెలుగు బ్లాగరు)రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడుట .
ఒక నెల ముందు మా బాబు కాలేజీలో బీ.టెక్ 2వ సం" చదువుతున్న ఒకబ్బాయి ,వేరే కాలేజీ లో లైబ్రరీ బుక్ దొంగతనము చేసాడు అన్న అసత్య ఆరోపణతో మనస్థాపంచెంది రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు .
ఇలా ఎంతమంది?రోజుకో వార్త ఒక విద్యార్ధిని ఉరి వేసుకుంది. అని లేక పై నుండి దూకిందని వినడం,చూడడం జరుగుతోంది. పదవ తరగతి నుండి ఉన్నత విద్యలు చదివే విద్యార్ధుల వరకు అందరూ ఒకే మార్గంలో నడుస్తున్నారు ఆత్మహత్యల విషయంలో. మంచి మేధావులు, అవగాహన ఉన్నవాళ్ళూ క్షణికమైన ఆవేశంతో ఇలాంటి పిరికి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ?ఆలోచిస్తే మనసు ఆందోళనకు గురౌతోంది .ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలంటారు కానీ వీళ్ళందరికీ బతకడానికి ధైర్యం చాలడం లేదేమో .
చిన్నప్పటినుండి వారి నవ్వులో, మాటలో ,నడకలో, అన్నిటిలో మమేకమై వారి కోసమే జీవిస్తున్న తల్లి దండ్రుల కడుపుకోత ,ఇవన్నీ ఆసమయంలో వాళ్ళకి గుర్తురాదా! ఒక అమ్మాయి కోసమో,లేక మరే ఇతర కారణమైనా సమస్యకి పరిష్కారం చావొక్కటేనా !జీవితాన్ని ఆత్మ స్థైర్యంతో సాధించకుండా ,మరణాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు ఇలాటి నిస్థేజపరులు.
ఏదో సాధించాలనే తపన :అది నెరవేరకపోతే నిర్లిప్తత .ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు .ఆత్మకి శాంతి కలగాలి అంటున్నారు కొందరు, నిజంగా బలవన్మరణాలలో ఆత్మలు శాంతిస్తాయా ?లేక ఘోషిస్తాయా !తీరని కోరికలతో ఇలా ఎంతమంది ఆత్మహత్యల పాలవుతారు .స్నేహితులు, తెలిసిన వారు కొంత కాలం బాధపడతారు.కానీ కన్నవారి కడుపు తీపి జీవితాంతం వారు కుమిలిపోతూనే ఉంటారు. పుట్టి నప్పటి నుండి తనగురించే, చావులో కూడా తన గురించే ఆలోచించి స్వార్ధాన్ని చూసుకుంటున్న విద్యార్ధుల్ని ఏమనాలి? వాళ్ళ ఆత్మలు అసంతృప్తితో క్షోభించవా !
ఇలాటి అనాలోచిత నిర్ణయాలని అరికట్టాలంటే బాల్యం నుండీ పెరిగిన పరిసరాల ప్రభావం :మానసిక స్వభావాన్ని మెరుగు పరుస్తుంది .తల్లి దండ్రులు జీవితము పట్ల సరైన అవగాహన కలిగేట్టు బాధ్యతాయుతంగా పిల్లల వ్యక్తిగత జీవితాన్ని కూడా తెలుసుకుంటూ మెలకువతో వ్యవహరించాలి .ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా కాలేజీలో సమయం గడుపుతారు కాబట్టి అక్కడ ఉపాధ్యాయులూ,ప్రధానోపాధ్యాయులు యువతకి ఆత్మస్థైర్యాన్ని పెంచే బోధనలు చేయాలి .
కానీ దురద్రుష్టవశాత్తూ ఈ రోజుల్లో అమ్మాయిల కాలేజీ అయితే ,ప్రతీ అమ్మాయినీ ,ఆ అమ్మాయి ఎంత మంచి నడవడిక గల యువతి అయినా సరే(మంచి క్రమశిక్షణతో కాలేజీని నడుపుతున్నాము అనే ఆలోచనతో)ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో అమ్మాయిలను దూషిస్తూ ,ఆలస్యంగా వచ్చిన వారిని ఎవరితో తిరుగుతున్నావ్?అంటూ దారుణంగా మాట్లాడు తుంటే తల్లి దండ్రులకు ఇలాంటి ఫోనులు వెళుతుంటే యువతకి జీవితం మీద విరక్తి కాక అవగాహన ఎలా పెరుగుతుంది. ముందుగా చదువు చెప్పే ఇలాంటి గురువులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి .
యువతీ ,యువకులకు నాచిన్న సలహా మరియు అభ్యర్ధన . ఆవేశంతో కాక ఆలోచనతో భవిష్యత్ ని రసరమ్యంగా తీర్చి దిద్దుకోండి .తల్లి దండ్రులను నిరాశ పరచకండి .
Sunday, December 21, 2008 4 comments By: visalakshi

అంతర్జాలంలో తెలుగు వెలుగు వేదికపై బ్లాగు మిత్రులు కలిసిన శుభ తరుణం

అందమైన సాయం సంధ్యా సమయం లో హైదరాబాదు మహా నగరంలో నెక్లెస్ రోడ్ యందు జంటలన్నీ సరదా సరదాగా తిరుగాడు సమయాన పుస్తక ప్రదర్సన జరుగుతున్న ప్రదేశంలో మన వేదిక ఏర్పాటు చేసారు బ్లాగరులలో ప్రముఖులు .ఔత్సాహికులైన వారిని ప్రోత్సహించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చేయాలన్న సదుద్దేశ్యంతో చదువరిగారు, తాడేపల్లి సు భ్రమణ్యం గారు, నల్లమోతు శ్రీధరు గారు, అరుణ గారు, పూర్ణిమ గారు,జ్యోతి గారు ,నేను-లక్ష్మి లక్ష్మి గారు,నా చెల్లెలు రమణి(మనలొ మాట నా మనసులో మాట ),మరియు రవి గారు ,కత్తి మహేష్ గారు,చావా కిరణ్ గారు వేద అనబడే నేను ఇంకా చాలా మంది బ్లాగరులు కలుసుకుని పరిచయ కర్యక్రమాలయ్యాక సందర్సంచినవారికి ఈ -తెలుగు వెబ్సైట్ గురించి వివరిస్తూ బ్లాగుల సమాచారాన్ని అందరికీ అందజేసి సరదా సరదాగా గడిపిన శుభ తరుణం మరువ  లేనిది
Thursday, December 18, 2008 9 comments By: visalakshi

ప్రేమ కధ ( 1982) :


పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటరులో చేరాల్సిన అమ్మాయి ప్రేమలో పడింది .రోజూ వాళ్ళింటికి వచ్చే అన్న గారి స్నేహితుడిని చూసి మనసు పడి ,ఆ విషయం అతనితో చెప్పి పరస్పర అవగాహనతో ఇద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటే ,అన్నగారికి విషయం తెలిసి ఇద్దరినీ మందలించాడు. ఈ లోపులో అమ్మాయిది ఇంటరు పూర్తి అయింది. అబ్బాయికి గవర్నమెంటు జాబు వచ్చింది. ఇలా ఇంట్లో గొడవలతో వాయిదా పడుతూ వచ్చిన పెళ్ళి అనుకోకుండా ఇంకో వ్యక్తి అమ్మాయి జీవితం లోకి వచ్చి విసిగించడంతో ,అమ్మాయి డిగ్రీ పూర్తి కాకుండానే ,మరియు పెద్దవాళ్ళ అమోదం లేకుండా రిజిస్టారు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు ఆ జంట .పెళ్ళి అయ్యాక కుటుంబ సభ్యులు చాలా నెలలు కోపంగా ఉన్నా అటు వారిని ,ఇటు వారిని శాంత పరిచి అందరు ఆనందంగా కలుసుకునేలా ప్రవర్తించారు ఆ జంట .వారికి పెళ్ళి అయి ఈ రోజుకి 22సం"లు
పెళ్ళి అయిన తరువాత ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటరు కోర్సు చేసింది .కానీ హౌసు వైఫ్ గా స్థిరపడిపోయింది. ఆ అమ్మయికి ఒక పాప, ఒక బాబు.
ప్రస్తుతము పాప ,బాబు ఇంజనీరింగు చదువుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి అనబడే సదరు స్త్రీ నేనేనండీ ,వేద. మా వైవాహిక జీవితం ఒడి దుడికులతో,మరియు సుఖ సంతోషాలతో గడిచింది ,గడుస్తోంది. బ్లాగు మిత్రులందరితో సరదాగా నా కధ చెప్పాలని రాసాను .అంతే
Saturday, December 13, 2008 7 comments By: visalakshi

బ్లాగర్స్ డే:తెలుగు బ్లాగు మితృలందరికీ నా స్నేహపూర్వక మరియు హృదయ పూర్వక బ్లాగు దినోత్సవ శుభాకాంక్షలు .నేను కొత్తగా బ్లాగు లోకానికి వచ్చాను.తెలుగు బ్లాగర్లలో ఎందరో మహా మేధావులూ,కవి వర్యులూ ఉన్నారు.అందరికీ నా వందనాలు. దాదాపు కూడలిలో అన్ని బ్లాగులూ చదువుతాను.కొన్ని మనసుకి హత్తుకునేలా ఉంటాయి. అన్నిటికి వ్యాఖ్య రాయాలని ఉంటుంది కానీ కొన్ని బ్లాగులలో నా మనసులో భావాన్నే ఇంకొకరి వ్యాఖ్యలో చూస్తాను. వైజాగ్ డైలీ ,నవతరంగం ,పొద్దు వగైరా బ్లాగరులకు ,పెద్దలకు పిన్నలకు బ్లాగరులందరికీ మరోసారి శుభాకాంక్షలతో ...............మీ వేద.
Thursday, December 11, 2008 0 comments By: visalakshi

ఖడ్గ సృష్టి ;" మానవుడే నా సందేశం ,మనుష్యుడే నా సంగీతం "అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీ శ్రీ . తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహా కవి శ్రీ శ్రీ (మహా ప్రస్థానం }1950 లో పుస్తక రూపం ధరించింది .ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ఖడ్గ సృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డూ ,1973 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డూ ,1979 లో శ్రీ రాజ్య లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు .తెలుగు కవిత్వాన్ని ఖండించి ,దీవించి ,ఊగించి ,శాసించి ,రక్షించిన మహా కవి శ్రీ శ్రీ .
" కృష్ణ శాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీ శ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు."
"కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ,ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ"................... చలం గారు అన్న మాటలివి .
రెండు రెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో

అస్వ్తంత్రతని జయించడానికి
అహింసాయుధం ధరించామంటూ
రక్త పాతం లేకుండానే
రాజ్యం సంపాదించామంటూ

అవినీతి భారీ పరిశ్రమలో
అన్యాయాల ధరలు పెంచేసి
స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని
చక్ర వడ్డీ తిప్పే కామందులకు

క్షణ క్షణం మారుతున్న లోకాన్ని
సరీగా అర్ధం చేసుకున్న వాళ్ళంతా
పేద ప్రజల పక్షం వహించడమే
పెద్ద అపరాధమై పోయింది .

అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి.

ఆశయం ఉండడం మంచిదే కాని
అన్ని ఆశయాలూ మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ
ఆయుధం అలీనం కాదు

అందుకే అంటున్నాను నేను
అందుకో ఆయుధం అని
ఆచరణకి దారి తీస్తేనే
ఆవేశం సార్ధకమవుతుంది .

అందుకే సృష్టిస్తున్నాను
అధర్మనిధనంచేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది.

ఈ కత్తి
బూజు పట్టిన భావాలకి
పునర్జయం ఇవ్వడానికి కాదు
కుళ్ళి పోతున్న సమాజ వృక్షాన్ని
సమూలచ్చేదం చెయ్యడానికి ............................ఇంకా చాలా ఉంది.ప్రతి తెలుగు వారికి "అంకితం" చేసిన ఈ ఖడ్గ సృష్టి కావ్యం అందరూ చదివి తీరాల్సిన కావ్యం.
Friday, December 5, 2008 5 comments By: visalakshi

జీవితం--విలువలు:

మన జీవితం ఎలాంటి ఆందోళనలు లేకుండా నిర్భయంగా సాగిపోవాలంటె విలువల ఆధారంగా పయనించాలి.
జీవితంలో తమని తాము ప్రేమించుకోని వారు లోకంలో ఎవరినీ ప్రేమించలేరు.
ప్రతి వ్యక్తికీ జీవితంలో స్వార్ధం అవసరం.కానీ అది మితి మీర కూడదు.
జీవితం ముందుకు సాగిన తరువాత ,వెనక్కి గతం చుసి దిగులు పడడం అనేది వ్యర్ధమైన వేదన.
ప్రస్థుతపు నాగరికతలో తాను చేసే పనిలో తప్ప ఇతరులు చేసే పనిలో అర్ధం కనబడుటలేదు.ఈనాటి బుద్ధి మంతులకు .
ఒక బిచ్చగత్తెకి ఈ రోజు నేను ఇచ్చిన 2రూ"లు గొప్ప సంతోషాన్నిచ్చింది. కానీ నేనువారం రోజులు వరుసగా 2రూ"లు ఆమెకి ఇస్తే ,అటు తరవాత ఆ 2రూ"లు ఆమెకి ఏ సంతోషాన్ని ఇవ్వదు. 2రూ"లు దొరక నప్పుడు విచారాన్ని తప్ప .
సుఖము, బాధా ఈ రెండే జీవితపు విలువలు. ఏదైనా సరే ,ఏయత్నమైనా అన్నీ విడదీసి చూస్తే చివరికి మిగిలే అసలు విలువలు, బాధ నించి తప్పించుకోవడమూ ,సుఖాన్ని అనుభవించడమూ .
విలువల్ని మనసే కల్పిస్తుంది. మనకి కావాలనే కోర్కె పుట్టేదాకా ఎంత విలువైన పదార్ధమైనా మనకేం గొప్ప?
ఏది నిజం? ఏది న్యాయం? ఏది సుందరం?ఏది గొప్ప? ఎక్కడ వున్నాయి ఈ విలువలు ,ఎప్పుడూ మనుషులలో మారే మనసులలో తప్ప .
మన సౌఖ్యానికి ధనము ,ఆస్థి ముఖ్యమనుకున్నంత కాలమూ ఇంక ఏ విలువలకీ స్థానముండదు మన మనస్సుల్లో .
ఈ రోజుల్లో సాధారణ వ్యక్తులు ఎంతో నిజాయితీగా విలువలతో నడుచుకోవడం చూస్తుంటాము .కొందరు లక్షల్లో సంపాదిస్తూ ఉన్నత హోదా లో ఉండి కూడా చౌక బారుగా ప్రవర్తించడాన్ని గమనిస్తుంటాం .అందుకే స్థాయిని బట్టి కాకుండా సంస్కారాన్ని బట్టి ,విలువల ఆచరణను బట్టి మనిషికి ఆదరణ లభిస్తుంది.