Wednesday, June 9, 2021 1 comments By: visalakshi

త్రయంబకేశ్వరం - నాసిక్

           *త్రయంబకేశ్వర క్షేత్రం-  నాసిక్*

గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన  త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్క‌డ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని నమ్మకం.


స్థల పురాణం:


కొన్ని యుగాల‌కు పూర్వం ఈ ప్రదేశం అంతా  రుషులు, సాధువుల‌కు నివాస ప్రాంతంగా ఉండేది. సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరవుకాటకాలతో అల్లాడింది.. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన రుషి ప‌త్నులు  ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షిపట్ల, అహల్య పట్ల  అసూయా ద్వేషాలు పెరిగి, తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు రుషులందరు కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగగా, వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా, అదే వరం కావాలని పట్టుపడతారు. దాంతో ఏమి చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.


 ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా, అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన రుషులందరూ  గో హత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తిలతో కలిసి ప్రత్యక్షమవుతాడు.


ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా, గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది.  దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు.


ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన   ఈ మహా లింగం త్రయంబకం.


ఆలయ విశిష్టత: 


సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరున్ని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ని దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో  ఓ కోనేరు ఉంటుంది. అది ఎప్పుడూ  గోదావరి న‌దీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం   విశాల‌మైంది. గుడి మొత్తాన్ని  నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లోనే ఈ కలశాలను నిర్మించడానికి 16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు, వీటన్నింటిని కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.


 ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి. 


ఈ మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవట్టం లోపల నుంచి  ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది  ఇప్ప‌టికీ అంతు చిక్కని  విష‌య‌మే . ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అయితే గర్భగుడిలోనికి అంద‌రికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచే స్వామి వార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు.


పాండవులు ఇక్కడ ఒక కోనేటిని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కోనేరు ఎప్పుడు కూడా గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఆ కోనేట్లోకి నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుంచి వచ్చే నీరు ప్రవహిస్తుంది  అని చెబుతారు. ఈ కోనేట్లో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. 


కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాల‌యాల నుంచి వచ్చే రుషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారు.  ఈ కోనేరు   చుట్టూ అనేక లింగాలూ, వివిధ దేవతా మూర్తుల  విగ్ర‌హాలూ కొలువై ఉంటాయి.


పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మూడు కూడా ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రశస్థి.


              ఓం నమః శివాయ 🙏🙏

Thursday, June 3, 2021 1 comments By: visalakshi

కదంబ వృక్షం - ప్రత్యేకత

            .                *కదంబ వృక్షం*


హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం:

క్రిష్ణుడు గోపికల చీరలను దాచిన చెట్టు :

ప్రకృతిలో రాధాకృష్ణుల ముచ్చట్లన్నీ ఈ చెట్టు నీడలోనే:.


 పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికివస్తుంది. భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది... ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ వారి ప్రేమాయణం కొనసాగిందని, అందుకే దీనిని హిందువులు పవిత్రమొక్కగా భావిస్తారని సమాచారం. గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్టు కూడా మహాభారతంలో ఉందట. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.


ఇది ఆకురాల్చ‌దు. ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని క‌ల‌ప‌ను బొమ్మల తయారీకి ఉప‌యోగిస్తారు.


ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది అంటున్నారు. ఉష్ణ మండల ప్రాంతంలో విరివిగా ల‌భిస్తుందంటున్నారు బయాల‌జిస్టులు.


పురాణాల్లో కదంబ వృక్షం :


ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు.


ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి


దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’ అంటారు. కదంబ వృక్షానికి ‘ఓం శక్తిరూపిణ్యై నమః’ అనే మంత్రంతో  పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు


గ్రహదోషాలు తొలగించు కోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి


హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం.


దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’.. అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు ‘నారాయణా నారాయణి’ లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.


హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం :


అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. గార్దబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద, మనుషులతో, జంతువులతో మరణంలేకుండా ఉండాలని వరం కోరతాడు. శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు.


వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు. దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు. గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు.

 అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు. అయితే మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి.


దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి.


 అమ్మవారి అందానికి ముగ్దులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు. మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి.. తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు.


 ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి… పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది. అయితే సరదాగా అన్న మాట మాటే కాబట్టి… రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామబంటుగా సేవలు అందించాడు శివుడు.


జ్యోతిష్య శాస్త్రంలో కదంబం :


ఈ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు.


 జ్యోతిష శాస్త్రం లో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక వృక్షాన్ని గుర్తించారు అందు చేత నక్షత్రవనం లో కదంబ వృక్షాన్నిశతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు.


గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు.


 గ్రహదోషాలు ఉన్నవాళ్లు… కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.🌸 కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లు గా ఉంటాయి కదంబ పూలు.


గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి.


 ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి పూలు ఎక్కువ పూస్తాయి. ఆద్యాత్మిక పరంగానే కాక వాణిజ్య పరంగాను కడిమి చెట్టు ప్రత్యేకమే.


👌ఔషధ పరంగా ఈ కదంబ వృక్షం మనుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ చెట్టు ఆకులు షుగర్ వ్యాది నివారణకు ఉపయోగిస్తారు.

సేకరణ......From Face Book....