Friday, September 30, 2022 0 comments By: visalakshi
Thursday, April 14, 2022 0 comments By: visalakshi

ఆప్తగమన....అంతగమన...

 శ్లో" ఊర్ధ్వమూలో 2 వాక్ శాఖ ఏషో 2 శ్వత్థః సనాతనః !

        తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవామృతముచ్యతే !

 తస్మింల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన !ఏతద్ వై తత్ !!

 

ఈ అశ్వత్థ వృక్షం పురాతనమైనది.పైకి వ్రేళ్ళూనినది. క్రిందికి వ్యాపించిన కొమ్మలు కలది. అదే పావనమైనది. అదే భగవంతుడు. అది అవినాశి. సమస్త లోకాలూ దానియందే ఉన్నాయి. దానిని ఎవరూ అతిక్రమించలేరు.అదే సత్యం.

తలక్రిందులుగా నిలబడి ఉన్న ఒక రావిచెట్టు తో (అశ్వత్థవృక్షం) జీవితం పోల్చబడుతోంది.ఎప్పుడు ఒక వస్తువు తలక్రిందులుగా కనిపిస్తుంది?ప్రతిబింబించి నప్పుడు. ఏటి ఒడ్డున నిలబడ్డ చెట్టు ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు చెట్టు తలక్రిందులుగా నిలబడ్డట్లుగా కనిపిస్తుంది. దాని వ్రేళ్ళభాగం పైన కొమ్మలు క్రింద ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిబింబం నిజం కాదు.

ఏటి నీటిలో చెట్టు తలక్రిందులుగా కనిపిస్తుంది. దాన్లోని సత్యాన్ని ఆకళింపు చేసుకోగోరితే ఆ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి, ఆ ప్రతిబింబానికి ఆధారమైన చెట్టును చూడాలి. అదే సత్యం. ఆ విధంగానే జీవిత సత్యాన్ని తెలుసుకోగోరితే జీవితానికి ఆధారమైన భగవంతుణ్ణి పొందగోరాలి.జీవిత వృక్షాన్నే భగవంతునిగా చెబుతోంది ఈ మంత్రం.

నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు శరీరధ్యాస ఉండదు. అప్పుడు మృత్యుభయముంటుందా..? నీవు పూర్తిగా మేల్కొని, నీ శరీరాన్ని, ప్రపంచాన్నికి చూస్తున్నప్పుడే ఆ భయముంటుంది. కలలు లేని నిద్రలో వలె నీవు వీటిని చూడకుండా, కేవలం ఆత్మగానే ఉన్నప్పుడు ఏ భయమూ నిన్ను సోకలేదు. ఏదో పోతుందన్న భావమే భయాన్ని కలిగిస్తుంది. ఆ పోయేదేమిటి అని విచారిస్తే అది నీ శరీరం కాదనీ, అందులో పని చేసే మనస్సనీ తేలుతుంది.


తనకి ఎల్లప్పుడు ఎరుక ఉండేట్టయితే, ఈ రోగపీడితమైన శరీరాన్ని, దాని వల్ల కలిగే ఇబ్బందినీ వదిలించు కోవటానికీ అందరూ సిద్దమే. పోతుందని అతను భయపడేది ఈ ఎరుకని, ఈ చైతన్యాన్ని. జీవించి ఉండటమంటే, సదా ఎరుక కలిగి ఉండటమే. అదే వారి ఆత్మ. ఇదంటేనే అందరికీ ప్రీతి. అటువంటప్పుడు ఈ దేహంలో ఉంటూనే ఆ శుద్ధ చైతన్యాన్నే పట్టుకొని ఎందుకుండ కూడదు.. అన్ని భయాలనీ ఎందుకు వదిలించుకోకూడదు..నీ సహజస్థితి లోనే ఉండు"...

అంతగమనమైన మృత్యువు ను అత్యంత ఆత్మీయమైన చెలికాడుగా భావించి, ఆలింగనం కోసం అంతరంగం పడుతున్న తపన ఇది. మరణం దారుణమైనది కాదనీ , దయామయమైందన్న భావనకు నిదర్శనమిది. పరమశాంతికి మనల్ని చేరువ చేసే ప్రస్థానమే పరలోకగమనం. అందుకే జీవితపరమావధి తెలిసిన ప్రాజ్ఞులు , అస్తమయాన్ని ఆత్మబంధువుగా అక్కున చేర్చుకునేందుకు సంసిద్ధులై ఉంటారు.

భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ.  శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు.

నా ఆగమనంలోనూ నీవే... నా నిష్క్రమణంలోనూ నీవే! నా ఆనందంలోనూ నీవే... నా ఆవేదనలోనూ నీవే! అనుక్షణం నీ అద్భుత, అదృశ్యశక్తి నన్ను ఆత్మీయపవనమై ఆలింగనం చేసుకుంటూనే ఉంటుంది. నా ప్రమేయం లేకుండానే నీ అనురాగ హస్తం నన్ను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అది జననంలోనైనా...మరణంలోనైనా!

గమనించినా గమనించకపోయినా మనం ఊపిరి పోసుకున్న క్షణం నుంచి ఊపిరి విడిచే క్షణం వరకు ఓ దివ్యశక్తి మనల్ని అనుక్షణం అనుగమిస్తూనే ఉంటుంది. అజ్ఞాతంగా అందరి ఆలనకు పాలనకు ఆధారభూతమవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా కనిపించే మమతానుబంధాలకు , కురిపించే ప్రేమానురాగాలకు పరోక్ష ప్రేరకుడు ఆ పరమాత్మే!

నిజమే!అంతర్యామి అయిన ఆ అనంతాత్ముడు ఆనుదినం మనపై అనేక రూపాల్లో తన ప్రేమవృష్టిని కురిపిస్తున్నాడు.

జీవితమంటే ఎడతెగని బంధంతో మన ఆలోచనల్లోకి మరణాన్ని రానివ్వం.అది అనివార్య పరిణామమే అని తెలిసినా దాన్ని భయంకరమైన ఆలోచనగా దూరంగా ఉంచడానికి, వీలైనంత సుదూర ప్రక్రియగా మరచిపోవటానికి ఇష్టపడతాం. కానీ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడాలి. మృత్యు భయాన్ని జయించడం కంటే తపస్సిద్ధికి మరో తార్కాణం ఏముంటుంది!నిజానికి మరణం అంటే మరో రూపంలో మాధవుడే! అందుకే 'సంహారకులలో సర్వసంహర్తయైన మృత్యువును నేనే 'అంటాడు భగవద్గీత 'విభూతియోగం'లో శ్రీ కృష్ణభగవానుడు.
ధర్మ పురిని దర్శిస్తే యమపురి ఉండదని శాస్త్ర వాక్కు .శ్రీ నృసింహ స్వామివారి మహా మృత్యుంజయ మంత్రం మహామహిమాన్వితమైన మంత్రం ప్రతీరోజూ పఠించడం వలన అపమృత్యువు, అకాల మృత్యువు, అనుకోని ఆపదలు మన దరిచేరవు. ఆదిశంకరాచార్య విరచిత నృసింహ కరావలంబ స్తోత్రం. ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం. శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు.


🙏శ్రీ నృసింహుని మహా మృత్యుంజయ మంత్రం🙏


ఉగ్రం వీరం మహావిష్ణుం 

జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం


🙏నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది.


🙏ఆదిశంకరులు చేసిన నృసింహ కరావలంబ స్తోత్రం కూడా విశేష ఫలదాయకమైనది. శ్రీ నృసింహ కరవలంబ స్తోత్రం, రుణ విమోచన నృసింహ స్తోత్రం, నృసింహ ద్వాదశనామ స్తోత్రం కూడా పఠించాలి.


ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం🙏


ప్రతీ రోజు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.


ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారు, రెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటి? స్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తే, స్వామి తత్ క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. 


 శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటే, వాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటే, ఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడి, స్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.


ఆదిశంకరులు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి  శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం...

*****                           ******                *****"నిర్భయంగా వచ్చాను; నిర్భయంగా వెళతాను

ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను ; నిశ్వసిస్తూ వెళతాను

మృత్యువు నృత్యం చూసి జడిపిస్తారెందుకని?

భయమెందుకు? నా ఇంటికి నే వెళతాను!

అంటూ ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు.... దాశరధి కృష్ణమాచార్యులు.

                       *******************

                     ఓం నమః శివాయ...


Sunday, April 10, 2022 5 comments By: visalakshi

భద్రాద్రి రాముడు...

                    భద్రాద్రి....శ్రీ సీతారామచంద్రస్వామి..శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, ఖమ్మం  జిల్లా, భద్రాచలం లో ఉంది.


 దక్షిణ_అయోధ్య గా పిలవబడే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.


17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం (1674) రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి, గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన మీర్_ఉస్మాన్_అలీ_ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నదిఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం, మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపైవెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధముంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమైయ్యాయని మళ్ళీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం, మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.


మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ.82,000 విరాళంగా ఇచ్చాడు.


#దేవాలయ ప్రత్యేకతలు

శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా * కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖునుఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.


భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.


ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.


 అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కాని ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు.


నిత్యపూజలు, ఉత్సవాలు, కళ్యాణం

ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమిరోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.

                  🙏  శ్రీ‌రామన‌వ‌మి...!!


విశ్వంలో చిన్న పెద్ద తేడాలు లేకుండా భగవంతుడిని నమ్మే ప్రతి ఒక్క భక్తుడికి అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి, పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. 


శ్రీ రాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల స‌మ‌యంలో త్రేతాయుగంలో జన్మించాడని, పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి, ఆయ‌న‌ జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకోవడమే శ్రీ రామ నవమి.


14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.


ఈ చైత్ర శుద్ధ నవమి నాడు అందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ , వాడ వాడల్లోనూ రమణీయంగా, కమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం.


ఖ‌మ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 


సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.


శ్రీ రాముని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. 


శ్రీ రాముడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. 


శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. 


భక్త రామదాసు చెరసాలలో ఉండిపోవ‌డంతో పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా తెలుస్తోంది. 


అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.


సీతారామ కల్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే.

ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని చెబుతారు.
కోదండ రామకల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట.


శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. 


శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు...


🙏ఇంట్లో ఈ పండుగ జరుపుకునే విధానము🙏


శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉద‌య‌మే లేచి, తలంటు స్నానం చేయాలి. 


శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. 

సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములనుగాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి.


నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు (నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. 


సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి.


వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్లలో గాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. 


లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి. 


శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.


🙏పూజ...🙏


వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి.


చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం, 


మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో


 సీతాలక్ష్మణాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్ర‌హానికి పూజించాలి.


వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి.

అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తోంది..


వీటితో పాటు ఏదైన ఒక ఫలం స్వామి వారికి నివేదించాలి.


ఈ రోజంతా రామ నామ స్మరణ (రామ రామ రామ సీత) లో ఉండాలి, వీలైతే నలుగురు పేద జంటలకు కొత్త బట్టలు పెట్టాలి, వారికి తృప్తిగా భోజనం పెట్టాలి, చిన్న పిల్లలకు పానకం వడపప్పు పంచాలి.


               🙏సమస్తలోకా సుఖినోభవంతు🙏


భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి పర్వదినం

వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిచెందింది.


#నిత్యపూజలు

తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విదంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.


#పర్ణశాల

ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉంది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ, పర్ణశాలకుసమీపంలో ఉన్న సీతమ్మ వాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది.సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు.శ్రీరామ నవమి రోజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.


#జటాయుపాక (యేటపాక)

ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.


#దుమ్ముగూడెం

ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది. గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.


#గుండాల

ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడుచలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.


#శ్రీరామగిరి

ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.


#పాపికొండలు

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

సేకరణ...🕉🚩🕉🚩🕉🚩🕉🚩🚩భద్రాచలం 🕉.....


శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై 

ఉన్న సుదర్శన_చక్రం ఎవరూ తయారుచేసినది కాదు.


మరి అది ఎలా వచ్చిందంటే

భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయారచేయిస్తున్నాడు.కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు.అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు.మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు.కానీ కనిపించలేదు. మళ్ల రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది.

                 🙏🏻🚩🕉🙏🏻🕉🚩🙏🏻🕉🚩

               భక్తులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు...

                                 || జై శ్రీరామ్ ||

Wednesday, March 23, 2022 4 comments By: visalakshi

"నీలోకి నీవు"

              ఓం శ్రీ సాయి నాధాయ నమో నమః

                   

శ్లో" శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః

          శృణ్వన్తో2పి బహవో యం న విద్యుః !

        ఆశ్చర్యో వక్తా కుశలో2స్య లబ్ధా

                ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః !!


భా...దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో , విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరో , ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు , వినేవాడూ అరుదు. అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.
మనం ఎలాంటి సంపదను కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, ఇక్కడ వదిలిపెట్టేదా లేక మనం వెంట తీసుకువెళ్లగలిగేదా ?

నిజమైన సంపద...

ఒక ఫకీరు రోజూ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. రోజూ అక్కడకు ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చి, కొన్ని చెక్కలను కొట్టుకుని తనతో తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతనితో ఆ ఫకీరు ఇలా అన్నాడు, "నాయనా నువ్వు రోజంతా కష్టపడి ఈ కలప కొట్టుకుని, తీసుకెళ్తావు. అది నీకు రెండు పూటలా తిండికే సరిపోదు. ఇంకొంచెం ముందు వెళ్ళావంటే అక్కడ ఒక పెద్ద గంధపు చెట్ల అడవి ఉంది. నువ్వు అక్కడ ఒక్కరోజు కలపను నరికితే, అది నీకు ఏడు రోజులకు సరిపడా సంపాదన ఇస్తుంది."


పేదవాడైన ఆ చెక్కలు కొట్టేవాడు నమ్మలేకపోయాడు, ఎందుకంటే ఈ అడవి గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అతను అనుకున్నాడు. అతను తన జీవితమంతా అడవిలో కట్టెలు కొట్టడంలోనే గడిపాడు. రోజూ కేవలం చెట్టుకింద కూర్చునే ఈ ఫకీరుకి ఏమి తెలుసు? అని అనుకుని మొదట అతను అంగీకరించడానికి ఇష్టపడలేదు, కానీ వెళ్లి చూడడం వల్ల వచ్చే నష్టమేమిటనే నిర్ణయానికి వచ్చాడు. ఏమో ఎవరికి తెలుసు, అతను చెప్పింది సరైనది కావచ్చు కదా ! పైగా, ఇతను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ?

చాలా  ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు, తన లోకంలో తాను సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. కాబట్టి అతను స్వయంగా వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాడు.

అలా ముందుకు వెళ్ళాడు. 

వెనక్కి తిరిగి వచ్చి, నమస్కరించి, ఫకీరు పాదాలపై పడి ఇలా అన్నాడు: "దయచేసి నన్ను క్షమించండి ! ఈ అడవి నా కంటే బాగా ఎవరికి తెలుసు అని అనుకునేవాడిని. కానీ చందనాన్ని ఎలా గుర్తించాలో నేను తెలుసుకున్నాను. 

నా తండ్రి కూడా కట్టెలు కొట్టేవాడు; అతని తండ్రి కూడా అంతే. కానీ మేమందరం రోజుల తరబడి ఈ కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాం, మాకు ఆ గంధం చెట్ల గురించిగాని, సరిగ్గా గంధం అంటే ఏమిటో తెలియలేదు? గంధపు చెక్క దొరికినా, దాన్ని కోసి మామూలు చెక్కలాగానే బజారులో అమ్మేసేవాళ్ళం. మీరు దాని గుర్తింపును, దాని వాసనను, దానిని ఎలా గుర్తించాలో నాకు వెల్లడించారు. నేను ఎంత దురదృష్టవంతుడిని ! నాకు ముందే ఇది తెలిసిఉంటే బాగుండేది." 


దానికి ఫకీరు "బాధపడకు నాయనా, ఇప్పుడు నీకు తెలిసింది కదా" అన్నాడు.

ఆ తర్వాత కట్టెలు కొట్టేవాడు తన రోజులను ఎంతో ఆనందంగా గడపడం ప్రారంభించాడు.

 ఒక్కరోజు అడవికి వచ్చి కట్టెలు కొట్టుకునేవాడు, ఆపై ఏడెనిమిది, లేదా పది రోజులకి కూడా రావాల్సిన అవసరం వచ్చేది కాదు.

ఒక రోజు, ఫకీరు అతనితో ఇలా అన్నాడు, " సోదరా, నీకు కొంత తెలివి వస్తుందని నేను అనుకున్నాను, ముందుకు వెళ్లకుండా నీ జీవితమంతా ఇక్కడే కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయావు. ఇప్పుడు కూడా, ఈ చందనాన్ని మించి విలువైనది ఇంకేదైనా ముందుఉందేమోనని నువ్వు అనుకోవట్లేదు."

కట్టెలు కొట్టేవాడు,"నేను అది కనీసం ఆలోచించలేదు. చందనానికి మించినది ఏదైనా ఉందా ?", అని అడిగాడు.


"గంధపు చెక్కను దాటి ముందుకు వెళ్ళు, అక్కడ ఒక వెండి గని ఉంది, ఈ కట్టెలు కొట్టుకోవడం వదిలేయ్. ఈ వెండిని ఒకసారి తెచ్చుకుంటే,  రెండు నుండి నాలుగు నెలల వరకు సరిపోతుంది", అని అన్నాడు.


ఇప్పుడు అతను ఫకీరును నమ్ముతున్నాడు. దాంతో ఒక్కసారిగా పరిగెత్తాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. వెండి గనిని కనిపెట్టాడు! ఇప్పుడు జీవితం విలాసవంతంగా గడుస్తోంది. ఇప్పుడు నాలుగైదు నెలలు వరకు కనిపించడం లేదు. ఒకరోజు వచ్చి, మళ్లీ కనిపించకుండా పోయేవాడు. కానీ మనిషి మనస్సు చాలా మూర్ఖంగా ఉంటుంది, ఇంతకు మించినది మరొకటి ఉంటుందని అతను గ్రహించలేదు.


మళ్ళీ ఒకరోజు ఆ ఫకీరు అతనితో ఇలా అన్నాడు, "నువ్వు అసలు ఎప్పటికైనా మేల్కొంటావా ? లేదా నేను నిన్ను మళ్ళీ లేపాలా? ఎదురుగా బంగారు గని ఉంది, మూర్ఖుడా ! నీ వైపు నుండి నీకు ఏలాంటి ప్రశ్నలూ, ఉత్సుకత, ఏమీ ఉండదా ? ముందు ఇంకేముందో  చూడాలా ? ఇప్పుడు ఆరు నెలలుగా నువ్వు స్థబ్దుగా ఉన్నావు, ఇంట్లో పనిలేదు, ఖాళీగా ఉన్నావు, అడవిలో ఇంకా ముందుకెళ్లి చూద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు..?"


దానికి కట్టెలు కొట్టేవాడు, "నేను చాలా నిదానంగా ఉన్నాను, నేను దాని గురించి కూడా ఆలోచించలేదు ! వెండే ఆఖరిది అని నేను నమ్మాను, ఇంతకు మించి ఏమి ఉంటుంది అనుకున్నాను! పేదవాడిని, నేను ఎన్నడూ బంగారం చూడలేదు, దాని గురించి కేవలం విన్నాను అంతే." 

ఫకీరు, "ఇంకా ముందుకు వెళ్తే బంగారు గని ఉంది" అని జవాబిచ్చాడు.


 కథ ఇలా సాగుతుంది. ఆపై, మరింత ముందుకి వజ్రాల గని ఉంది. ఈ కథ ఇలా చాలా సంవత్సరాలు సాగింది. 


ఒక రోజు ఫకీరు ఇలా వ్యాఖ్యానించాడు, "నువ్వు చాలా అజ్ఞానివి, ఇప్పుడు నువ్వు వజ్రాల దగ్గర ఆగిపోయావా ?" 


ఇప్పుడు కట్టెలు కొట్టేవాడు కూడా సంపన్నుడు అయ్యాడు, అతనికి స్వంతగా భవనాలు ఉన్నాయి. "ఇక వదిలెయ్, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇంక వజ్రాల తర్వాత ఏముంటుంది" అన్నాడు అహంకారంతో.


ఫకీరు ఇలా అన్నాడు, "వజ్రాలను దాటి, నేను ఉన్నాను, ఈ వ్యక్తి ఇక్కడే కూర్చుని ఉన్నాడని, ఇతనికి వజ్రాల గని గురించి తెలిసి కూడా, వజ్రాలను ఎందుకు సేకరించడం లేదని నీవు ఎప్పుడూ ఆలోచించలేదు.. అంటే అంతకన్నా విలువైనది అతనికి దొరికి ఉండాలి... అది వజ్రాలను మించి ఉండాలి కదా... అన్న ఈ ప్రశ్న నీ మనసులో ఎప్పుడూ తలెత్తలేదా?"


ఆ మనిషి ఏడవడం మొదలుపెట్టాడు. అతను ఫకీరు పాదాలపై పడి, తన తలని పాదాలకేసి కొట్టుకుంటూ, ఇలా అన్నాడు: "నేను ఎంత మూర్ఖుడిని ! ఈ ప్రశ్న ఎప్పుడూ నా మనసులోకి రాలేదు! మీరు చెప్పినప్పుడు మాత్రమే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. నా జీవితంలో వజ్రాల కంటే ఎక్కువ సంపద మీ వద్ద ఉందని నేను ఊహించలేకపోయాను. .

 దయచేసి మీ వద్ద ఉన్న నిజమైన సంపదను పొందే మార్గం చూపండి !"


ఫకీరు ఇలా అన్నాడు, "ఆ సంపదే ధ్యానం, ఇప్పుడు నీ వద్ద చాలా డబ్బు ఉంది, ఇంక నీకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడు ఇంక నీ అంతరంగంలో ఉన్న గనిని త్రవ్వు, అది అన్నింటికంటే మించినది."


ఈ ప్రశ్న మనందరికీ కూడా - 


మనం ముందుకు సాగాలి ..... అనుభవాలన్నీ నిశ్శబ్దం అయ్యే వరకు ముందుకు సాగుతూ ఉండాలి .... 


భగవంతుని అనుభూతి కొనసాగుతున్నంత వరకు, ద్వంద్వత్వం ఇంకా ఉనికిలో ఉన్నట్లుగానే సూచిస్తుంది -

దర్శించువారు - దృశ్యం రెండూ ఉన్నట్లే.


ఆ అనుభవం కూడా పోయినప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. అప్పుడు దృశ్యము లేదు, దర్శించువారు లేరు, ఏమీ ఉండదు. ఒక నిశ్శబ్దం ఉంది,  ఆ శూన్యంలో, అవగాహన యొక్క దీపం ప్రకాశిస్తుంది. అదే అంతిమ స్థితి, అదే సమాధి.
ధ్యానంలో, మనం మొదట స్వీయ-సంతృప్త స్థితికి చేరుకుంటాము, తరువాత ఆత్మతో సన్నిహితంగా రావడం ద్వారా, శాంతి యొక్క వాస్తవ అనుభవాన్ని మొదటిసారిగా పొందుతాం.

                  స్మరణం.. ధ్యానం..తపస్సు,  అంతర్గత ప్రకాశాన్ని పెంచుతాయి, ఆత్మను సుసంపన్నం చేస్థాయి. భగవత్సాక్షాత్కారం లభింంపజేస్తాయి.


‘నీలోకి’ నీ ప్రయాణం ..


వేదాంతంలో కస్తూరీ మృగం గురించిన ప్రస్తావన ఉంటుంది.


కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్‍ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవి అంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు


మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా ఇలాగే వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్ని వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.


పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణుడిని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుడిని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇస్తాడు.


‘నా ప్రతినిధిగా దీనిని తీసుకుని వెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనినీ ముంచండి’ అని కృష్ణుడు పాండవుల చేతిలో దోసకాయ పెడతాడు. వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు.


అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

‘అదేంటి బావా! ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని పాండవులు కృష్ణుడిని అడుగుతారు.

దానికి కృష్ణుడు నవ్వి, ‘బావా ఎన్ని గంగ లలో మునిగినా దీని చేదు పోలేదు చూశావా?’ అంటాడు.


ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎటువంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.


మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంతరంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా తిరిగినా చివరకు మనిషి ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.


పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.


జ్ఞానం ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు. అది మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి. దానిని గుర్తించి, కనిపెట్టి మసులుకునే వారే విజ్ఞులు.


భగవాన్‍ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇంకా ఎందరో మహా యోగులు ఉన్న చోట నుంచి కదల కుండానే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు. అరుణాచలమే తన ఆశ్రమంగా చేసుకుని రమణ మహర్షి జ్ఞానసిద్ధి పొందారు.


జ్ఞాన మార్గాన్ని చూపిన మన పూర్వికులు మంచి మార్గాన్ని ఉపదేశించారు మనకు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగుల ఉన్నారు.


ప్రయత్నం చేస్తే మనమూ అలా కాగలం. కానీ, మనపై మనకు నమ్మకం తక్కువ. ఇంకా జ్ఞానం, దేవుడు.. ఎక్కడో ఉన్నారని నమ్ముతూ దేశాలు తిరిగే అమాయకత్వం మనది.

ఆత్మ , దానిని గ్రహించడం వంటి విషయాలు అంత సులభతరం కావు. నిరంతర సాధన అనుష్ఠానాల ప్రయత్నం తక్షణమే ఫలితం కానరాని స్థితిలో ఓర్పు, పలువురు దీనిని సాధించారు కనుక నేను కూడా చేయగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి.

       సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు...Wednesday, March 9, 2022 0 comments By: visalakshi

కాళీమాత..

కాళికా దేవి అనంత శక్తి దాయిని అయిన హిందూ దేవత.కాళిక పేరుకు కాల అనగా కాలం , నలుపు ,మరణం, శివుడు మొదలైన అర్ధాలు ఉన్నాయి.శాక్తీయులు కాళీమాతను   తాంత్రిక దేవతగా బ్రహ్మ జ్ఞానం ను కలిగించే దేవతగా ఆరాధిస్తారు. కొందరు భవతారిణిగా కొలుస్తారు.


హిందూ మతంలో పూజించే అత్యంత ప్రసిద్ధ రూపాలలో కాళీ మాత ఒక్కరు. 'కాళీ’ అనే పదానికి మూల పదం 'కల్’ అంటే సమయం అని అర్ధం. కాళీని 'సమయం’ అని సూచిస్తారు.

ఎందుకంటే ఇది సృష్టించిన దేనినీ విడిచిపెట్టని అత్యంత శక్తివంతమైన విధ్వంసం. కాళీ అహం మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది మరియు ఆమె భక్తుల హృదయాల్లో జ్ఞానం యొక్క దీపాన్ని వెలిగిస్తుంది. ఆమె భీకర రూపంతో కనిపించినప్పటికీ, ఆమె తన భక్తులపై విముక్తి యొక్క అత్యున్నత విజయాన్ని అందించే అత్యంత దయగలది.


కాళీ రూపం హిందూ ఐకానోగ్రఫీలో, కాళీని చీకటి రంగులో చిత్రీకరించారు, ఆమె పొడవైన నాలుకతో భయాన్ని సృష్టించే విధంగా పొడుచుకు వచ్చింది. శరీరం, అహం మరియు అజ్ఞానంతో గుర్తింపును నాశనం చేసే చిహ్నంగా ఆమె పుర్రెలు మరియు ఎముకలు చేసిన చేతుల దండను ధరించి కనిపిస్తుంది. ఆత్మ లేదా మరణం అమరత్వం ఉన్నప్పుడు మాంసంతో తయారైన భౌతిక శరీరం నాశనం అని ఆమె మనకు గుర్తు చేస్తుంది.


ఆమె చీకటి రంగు ఆమె నిజమైన గుర్తింపును సూచిస్తుంది ఆమె చీకటి రంగు ప్రతిదీ ఉద్భవించిన మానిఫెస్ట్ విశ్వంగా ఆమె నిజమైన గుర్తింపును సూచిస్తుంది. ఆమె తన భార్య శివుడిపై నిలబడి చాలా ప్రశాంతంగా మరియు స్వరపరచినట్లు కనిపిస్తుంది. సత్ చిత్ ఆనంద యొక్క అతీంద్రియ అవగాహన ఆమెకు మద్దతు ఇస్తుందని అర్థం. 


కాళీ మాత హిందూ దేవతలలో అత్యంత పవిత్రమైన వారిగా ఆరాధించబడ్డారు. మన దేశంలో కాళీ మాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి. ఈ విశ్వంలోనే కాళీ దేవత అంటే అత్యంత శక్తివంతమైన తల్లి. కాళీ మాత రూపం అద్భుతమైనది. ఆమెను కొలిచిన వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈ దేవత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేక ఆరాధాన మరియు ఉపవాసం చేస్తారు. ఈ దేవత గురించి ఇతిహాసాలలో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను ఈరోజు తెలుసుకుందాం.


ఈ దేవత శక్తి, సామర్థ్యాల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. స్వామి వివేకానంద తన అభిమాన దేవతపై 1898లో ‘‘కాళి ది మదర్‘‘ అనే కవితను రాశారు. కాళీ దేవి గురించి చాలా మందికి భయంకరమైన రూపం గురించి మాత్రమే తెలుసు. చాలా మందికి ఆమె యొక్క గొప్ప శక్తి గురించి వాస్తవం తెలీదు. ఆమె దేవత యొక్క ప్రత్యేక రూపం.


కాళిదేవి యొక్క రూపాలను సాధారణంగా రెండు రూపాల్లో వర్ణించబడ్డాయి. ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేకమైన చేతులు కలిగి ఉంటుంది. మరో రూపంలో పది చేతులను కలిగి ఉంటుంది. ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగులో పెయింట్ చేస్తారు. కానీ ఈ దేవత కళ్లు ఎర్రగా ఉంటాయి. పూర్తిగా కోపంతో ఉన్న చిత్రంగా కనిపిస్తూ వెంట్రుకలు మచ్చగా కనిపిస్తాయి. ఈమె పళ్లు నోటి నుండి పొడుచుకుపోయి నాలుక బయట ఉండి కోపంగా ఉంటుంది

 ఆమె రాక్షసుల దుస్తులను నడుము పట్టీలో ధరించి కనిపిస్తుంది. ఆమె చాలా కోపంగా ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకోవడం కష్టం.

కాశీ శివునిపై నిలబడిన కాళీ దేవి యొక్క చిత్రం అన్ని పేర్లు మరియు రూపాలు శక్తిని సూచిస్తాయి. కాళి దేవికి కోపం వచ్చినప్పుడు లేదా కోపంగా ఉన్న రూపాన్ని భరిస్తే ఆమెకు నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆమెను శాంతబరచటానికి శివుడు తన మార్గాన్ని చాటుతాడు. ఆమె పాదాలు శివుడిని తాకినప్పుడు, కోపం నిగ్రహానికి వస్తుంది. అప్పుడు కాళిదేవి ప్రశాంతంగా ఉందని చెబుతుంటారు.

విశ్వం ముగిసినప్పటికీ, కాళి దేవత యొక్క ఉనికి సాధారణంగా నగ్నంగా చిత్రీకరించబడుతుంది. అద్భుత శక్తికి మించినదని ఇది సూచిస్తుంది. ఆమె స్వచ్ఛమైన మరియు ఆనందకరమైనది. విశ్వం ముగిసిన తరువాత కూడా కాళి దేవి ఉనికిలో ఉందని నమ్ముతారు. కాబట్టి రంగు, కాంతి, మంచి లేదా చెడు అనే భావనలు ఆమెకు సంబంధించినవి కావు. ఆమెను స్వచ్ఛమైన, కల్తీ లేని ఆది శక్తిగా భావిస్తారు.

కాళి దేవికి మరో భయంకరమైన రూపం ఉంది. కాళీ దేవి ఎడమ కాలి కింద రాక్షసుడిని, కుడి చేతిలో కత్తిని పట్టుకున్న రూపం. ఈ దేవిని అంత్యక్రియల మైదానంలో పూజిస్తారు. రామకృష్ణ పరమహంసుల భార్య శారదాదేవి దక్షిణేశ్వర్ వద్ద కాశీ స్మశానవాటికను పూజించారు

సాయుధ కాళిగా పిలవబడే మహా కాళి పది చేతుల్లో పది చేతులు పట్టుకొని ఉంటుంది. ఆమెకు పది ముఖాలు, పది అడుగులు ఉన్నాయి. మూడు కళ్ళతో ఉన్న తల్లి అన్ని అవయవాలపై ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ రూపానికి శివుడితో సంబంధం లేదు.

కాళి దేవత ప్రకాశవంతమై రంగు కలిగి అందమైన మహిళలాగా దర్శనమిస్తుంది. ఈ దేవత సింహం మీద కూర్చుని స్వారీ చేస్తుంది. ఆమె నాలుగు చేతుల్లో చేతులు నీలం కమలం కలిగి ఉంది. ఆమె జుట్టు దట్టమైనది, దట్టమైనది. దేవత యొక్క స్వరూపం బలమైన మరియు నిశ్శబ్ద చిత్రం.


ఈ కాళి మాతకు భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఈ దేవత అత్యంత దయగలది. ఆమె తన భక్తులను ఎంతో ఆప్యాయతతో పలకరిస్తుంది. భక్తులు కాళి దేవిని విశ్వ తల్లి అని పిలుస్తారు. కాంగీ దేవిని ఎందుకు ఆరాధిస్తారో బెంగాలీ సాధువు రామకృష్ణ భక్తుడి వద్ద అడిగారు. అప్పుడు అతను, "పౌరులు బాధలో ఉన్నప్పుడు, వారు ఆమె పాలకుడి వద్దకు వస్తారు. భక్తులు బాధలో ఉన్నప్పుడు, వారు ఆమె తల్లి / దేవత వద్దకు వస్తారు. నా తల్లి కాళి ". అని అన్నారు.


కాళీ దేవి యొక్క ఆయుధాలు ఆమె ప్రతి చేతిలో ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ప్రత్యేక ఆయుధాన్ని పట్టుకొని చూడవచ్చు. ఆమె కత్తి, త్రిశూలం, కత్తిరించిన తల, గిన్నె/కపాలం పట్టుకుంది. కత్తి దైవిక జ్ఞానాన్ని సూచిస్తుంది. మోక్షానికి దైవిక జ్ఞానం పొందాలి. మిగతా రెండు చేతులు అభయ్ ముద్ర మరియు ఆశీర్వాదం సూచిస్తాయి.

కాళి దేవి యొక్క హారాన్ని కాళి దేవి మెడలో చూడవచ్చు. అందులో 108 లేదా 51 సంఖ్యలు ఉన్నాయి. హిందూ మతంలో 108 మంచి సంఖ్య. 108 సార్లు జపించడం. దేవదూతల 108 వేర్వేరు పేర్లు కూడా ఉన్నాయి. 51 సంఖ్య వర్ణమాలను సూచిస్తుంది. సంస్కృత వర్ణమాలలో, దేవనాగరికి 51 అక్షరాలు ఉన్నాయి. సంస్కృతాన్ని హిందువులు చైతన్య భాష అని పిలుస్తారు. ఈ అక్షరాలు ప్రతి ఒక్కటి శక్తి లేదా కాశీ అని నమ్ముతారు. అందువల్ల కాళి దేవిని మంత్రాల భాష మరియు రూపం అంటారు.

దక్షిణ భారతదేశంలోని కొన్ని సంప్రదాయాలను, శివ, కాశీ నృత్యాలను వివరించాడు. సుమాభా మరియు నిసుంబ రాక్షసులను ఓడించిన తరువాత, కాళి దేవత తిరువలంకాడు లేదా తిరువలంకాడు అనే అడవికి వెళ్ళింది. మరుసటి రోజు ఆమె అక్కడ నివసించిన ఒక కథ ఉంది.


                        "కలకత్తా కాలిఘట్ కాళీమాత"


                    " మహా కాళి మంత్రం "

'ఓం శ్రీ మహా కాళికాయై నమ:' 

కాళి మంత్రం యొక్క అర్థం: - 

నేను దైవ స్వరూపిణి అయిన కాళిమాతని నమస్కరిస్తున్నాను.


దశ మహా విద్యలలో మొదటిది కాళి.సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక. కాలాన్ని నడిపించేది , అత్యంత కఠినతరమైన ఆమె ఉపాసనతో సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టి అనంత శుభ ఫలాలు అందించడమే అమ్మ అనుగ్రహం.🙏🙏🙏...


జేషోరేశ్వరి కాళీ దేవాలయం బంగ్లాదేశ్ లోని ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇక్కడి ప్రధాన ఆరాధ్యదైవం మహంకాళి మాత. ఈ ఆలయం సత్ఖిరాలోని శ్యామ్ నగర్ ఉపజిల్లాలోని ఈశ్వరీపూర్ అనే గ్రామంలో ఉంది. జేషోరేశ్వరి అనే పేరుకు జేషోర్ దేవత అని అర్థం.

           || ఓం శ్రీ మహా కాళికాయై నమః ||

సేకరణ....

Saturday, February 26, 2022 0 comments By: visalakshi

"నిజమైన యజమాని"

 *ఈలోకంలో మనకు నిజమైన ' యజమాని* ' *ఎవరు.??* శ్లో" నగురోరధికః కశ్చోత్రిషు లోకేషు విద్యతే !
    గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవోః సదాచ్యుతః !!

ముల్లోకములందును గురువుకు మించిన వస్తువు లేదు.బ్రహ్మ, విష్ణు, అవ్యయుడైన పరమాత్మ గురువే అయి ఉన్నాడు అని యోగ శిఖోపనిషత్తు తెలుపుతుంది.

మహాత్ముల మహిమ వర్ణనకు అందదు.వారితో పోల్చదగినదేది ఈ ప్రపంచంలో లేదు. వీరు అసమానులు. వీరికి  పేరు ప్రతిష్టలపై ఆశలుండవు. దేనినైనా సాధించగల అలౌకిక ప్రజ్ఞావంతులు. సమస్త ప్రాణకోటి ఆనందమే తమ ఆనందంగా భావించే మహాత్ములను పొందిన ఈ భరతభూమి ధన్యత చెందింది. మహాత్ములైన సద్గురు వల్లనే ఈ జగత్తు కొంతవరకు నిలదొక్కుకుంటోంది.


శ్లో" జీవన్ముక్తస్తు తద్విద్వా న్పూర్వోపాధిగుణాన్ త్యజేత్ !
      సచ్చిదానంద రూపత్వాత్ భవేద్భ్రమర కీటవత్ !!

ఉపాధులను , గుణాలను విస్మరించిన ఆత్మజ్ఞాని జీవన్ముక్తుండగుచున్నాడు.  తుమ్మెద యొక్క శబ్ధ సంసర్గముచే కీటకము తుమ్మెదగా మారునట్లు , జీవుడు నిరంతర బ్రహ్మ చింతనచే బ్రహ్మముగా మారుచున్నాడు. 


"***పరమాత్మ మన నిజమైన యజమాని."***

 

*ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.* 


 *ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.* 


 *దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది.అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.* 


 *అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది.* *ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.* 


 *ఈ స్థితిలో ఉన్న ఆ* *"ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.* 


 *కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,* 

 *" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,* 


 *నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..* 

 *అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం,* *నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది* 


 *అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.* 


 *అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,* 


 *"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు,* *సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను* *వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ* *బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి* *తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు* *లాగుతారు .?? అంది.* 


 *ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా* *చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని..* *వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ* *అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.* 


 *ఈ కథలో...* 


 *ఆవు* -  *సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo* .


 *పులి* -  *అహంకారం నిండిఉన్న మనస్సు.* 


 *యజమాని* - *సద్గురువు/పరమాత్మ.* 


 *బురదగుంట* - *ఈ సంసారం/ప్రపంచం* 


 *మరియు,* 


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : *నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడమo కోసం చేసే జీవన పోరాటం.* 


 *నీతి :* 


 *ఎవరిమీదా ఆధార పడకుండా జీచించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,* 


 *" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.* 


 *దీనినే* ' *అహంకారము* ' *అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.* 


 *ఈ జగత్తులో* *'సద్గురువు'*( *పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన* *మంచిని కోరుకునే వారు వేరే* *ఎవరుంటారు.?? ఉండరు.* 


 *ఎందుకంటే.??* *వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.* 


 *పరమాత్మా నీవే ఉన్నావు...!* 

 *అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!*


              ***సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..***

Thursday, February 17, 2022 3 comments By: visalakshi

కృష్ణ తత్వం.. మహత్యం

                    సర్వవ్యాపినమీశ్వరం....
ధ్యానం.... భగవధ్యానం చేసుకోడానికి ఏకాంతంగానూ ,పవిత్రంగానూ ఉండే ప్రదేశం కావాలి. అక్కడ ఎట్టి విఘ్నాలు ఉండకూడదు. ఏ కోలాహలం ఉండరాదు. ప్రశాంత స్థానం కావాలి. ఆసనంగా దర్భాసనం , తివాచీ వంటి దానిని కానీ ఉపయోగించుకోవాలి.సుఖంగా పద్మాసనం కానీ స్వస్తికాసనం గానీ వేసుకుని కుదురుగా కూర్చోవాలి. స్థిరంగా సుఖంగా అచంచలంగా ఎక్కువ సేపు కూర్చునే విధంగా ఉండాలి. శరీరము నిట్టనిలువుగా ఉండు విధముగా కూర్చోవాలి.
సంసారం క్షణభంగురం అని గుర్తించి ఆసక్తి ని పరిత్యజించి ధ్యానం చేయాలి. భగవానుడు నిర్గుణ నిరాకార రూపంలో సర్వదా , సర్వత్రా ఉన్నాడు. భగవానుడు సగుణ నిరాకారూపంలోనూ ,తరువాత సగుణ సాకారూపంలోనూ ప్రకటం అవుతూ ఉంటాడు. సగుణము ,నిర్గుణము ,సాకారము ,నిరాకారము అన్నీ ఒకే భగవానుని విభిన్నరూపాలు.
సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ భక్తులకు  సగుణ సాకారూపంలో ప్రకటమౌతాడు...భక్తుల ప్రేమ కారణంగా ఈ లీలను ప్రదర్శిస్తాడు భగవానుడు.

భగవంతుని గూర్చి తెలుసుకోవాలనుకొని అన్వేషిస్తూ ఉంటే భగవంతుని సృష్టిలోని ప్రతి లీలలోనూ పరమార్థం కనిపిస్తుంది.

గాలి వీచడంలోను, నదీజలాలు పారడంలోను ఎన్నో నిగూఢార్థాలు కలిగిఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టిలో ఏవస్తువు కూడా పనికిరానిది అంటూ ఏదీ లేదు. ఏ కారణం లేకుండా ఏ జీవి పుట్టదు. వస్తువైనా, అ వస్తువైనా దానికోసం ఏదో ఒక కారణంగా అది ఏర్పడుతోంది.

ఎపుడైతే కారణం అయిపోతుందో అపుడు ఆ ప్రాణి అదృశ్యవౌతుంది. అంటే అవి వచ్చిన లేక చేయవలసి పని అయిపోతే చాలు అవి కనిపించకుండా కాలగర్భంలో కలసిపోతాయి

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసిన ఎన్నో అద్భుత లీలలున్నాయి. శ్రీకృష్ణుడు చేసిన ఏ పనికైనా సరే అంతరార్థం మరొకటి ఉంటుంది. అవి తెలుసుకొంటే భగవంతుని తత్వమేమిటో కొద్దిగా తెలిసే అవకాశం ఉంది అనిపిస్తుంది.

అమ్మ దగ్గరపాలు తాగే వయస్సులో తనకు పాలిచ్చినట్లుగానే ఇచ్చి ప్రాణాలు తీద్దామని వచ్చిన పూతనను సంహరించాడు. అంటే - ‘పూతము’ అనగా పవిత్రము. పవిత్రము కానిది పూతన. అనగా అజ్ఞానము, అవిద్య, పవిత్రమైనది జ్ఞానము. అజ్ఞానమువలన వాసనలు బయలుదేరుతాయి. పూతన వాసనా స్వరూపమే.

పూతన రాక్షసి చిన్ని కృష్ణుడిని చంపడానికొచ్చింది. కంసుడే ఆ ఆడబూచిని పంపాడు. రవిక ఒదులు చేసుకుని, ‘రారా కృష్ణా!’ అని పిలవగానే బిరబిరా వెళ్లాడా బిడ్డడు. ‘పాలకుండలనుకుని ఆబగా జుర్రుకుంటున్నాడు. కాలకూట భాండాలని తెలియదు కాబోలు’ అనుకుంది పూతన. దేవతలకే అమృతాన్ని పంచి ఇచ్చినవాడికి, పచ్చి విషపు ఆలోచనలు తెలియకుండా ఉంటాయా? నవ్వుకుని ఉంటాడు! ఎంత రాకాసి అయినా అమ్మే కదా! చనుబాలిస్తూ రెప్పపాటు సమయం మాతృత్వ తన్మయత్వాన్ని అనుభవించింది. చాల్చాలు. ఆ కాస్త ప్రేమ చాలు. మహామహా యోగీంద్రులు యజ్ఞయాగాలు చేసి ‘కృష్ణార్పణం’ అన్నంత ఫలం ఆమె ఖాతాలో జమైపోయింది. కృష్ణప్రేమలోని గొప్పదనమే అది. పూతన ఒంట్లోని విషాన్నంతా సర్రున జుర్రుకున్నాడు. రాక్షసి అంటేనే నిలువెల్లా పాషాణం. కృష్ణయ్య చేదునంతా మింగేశాక...పూతనతోపాటే పూతనలోని రాక్షసత్వమూ చచ్చిపోయింది. శవాన్ని వూరవతల తగులబెడుతుంటే, అద్భుత పరిమళాలు! కృష్ణ ప్రేమ తాలూకు సువాసనలవి.

ఈ వాసన మన దేహంలో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రిములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను పదు నాలుగు స్థానములలో తిష్ఠవేసి ఉంటుంది. మాయ త్రిగుణాత్మకం. 

మనం సంసారం అనే బండిలో భగవంతుణ్ణి మన రథసారథిగా చేసుకుంటే ఇంద్రియములు అనే గుఱ్ఱాలు సక్రమంగా నడుస్తాయి.

శకటాసుర భంజనంలో అంతరార్థం ఇదే.

ఒకసారి శ్రీకృష్ణుడు యశోదను తనకు పాలివ్వమని అల్లరిచేస్తూండసాగాడు.

అదే సమయంలో పొయ్యిమీద పెట్టిన పాలు పొంగితే యశోద అటు పరిగెడుతుంది. ఇక్కడ సామాన్య జీవికి భగవంతుని యందు భక్తికంటే ఇహముపై అనురక్తి ఎక్కువ అని తెలుసుకోవాలి. 

శ్రీకృష్ణుడు రాతితో పెరుగు కుండ పగులగొడతాడు. యశోద కోపముగా కఱ్ఱ తీసుకొని అతని వెంటబడుతుంది. ఇక్కడ కఱ్ఱ అభిమానానికి, గర్వానికి ప్రతీక.

యశోద అలసిపోయి నిస్సహాయత ప్రకటించగానే శ్రీకృష్ణుడు ఆమెకి దొరికిపోతాడు. అహంకారం, అభిమానం, గర్వం విడిచిపెట్టి తనను సేవిస్తే తాను బంధీనవుతానని పరమాత్మ చెప్పకయే చెపుతాడు.

ఒకసారి శ్రీకృష్ణుడు అల్లరి మితి మీరుతోందని భావించిన యశోద త్రాటితో బంధించటానికి ప్రయత్నిస్తుంది. కాని త్రాడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది.అంటే ఆ రెండు అంగుళముల త్రాడే అహంకార, మమకారములు. అహంకార, మమకారములు కలవారు తన దరి చేరజాలరని కేవలము ప్రేమ అనే రజ్జువుకే తాను బందీనవుతానని భగవానుని చెప్పాడన్నమాట.

గోపికా వస్త్రాపహరణలో కూడా ‘లౌకిక సంస్కార శూన్యులై ఉన్న మీరు మాయ అనే తెరను (వస్తమ్రులను) తొలగించి నా దగ్గరకు రండి. మీ మోహమనే తెరను నేను తొలగిస్తాను’ అని భగవంతుడు చెబుతున్నాడన్నమాట

ఓ ఉప్పు బొమ్మకు సముద్రం లోతులు చూడాలన్న కోరిక కలిగింది. ఆత్రుత కొద్దీ దూకేసింది. నీళ్లలోకి వెళ్లగానే తానెవరో మరచిపోయింది. తనెందుకొచ్చిందీ మరచిపోయింది. కరిగి కరిగి సముద్రంలో భాగమైపోయింది. కృష్ణ ప్రేమా అలాంటిదే. ఎవరు ఏ రూపంలో ఆయనకు తారసపడినా.... చివరికంతా కృష్ణప్రేమాంబుధిలో కలసిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. కృష్ణ...అన్న మాటకు ఆకర్షించేవాడన్న అర్థమూ ఉంది. గోపికలు వలపు భావనతో దగ్గరయ్యారు. మహర్షులు తపస్సుతో దగ్గరయ్యారు. కంసాది రాక్షసులు శతృత్వంతో దగ్గరయ్యారు. పాండవులు భక్తితో దగ్గరయ్యారు. ఎవరిదారులు వారివే. గమ్యం మాత్రం ఒకటే - కృష్ణుడే.

మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికీ అధిపతి. పద్నాలుగేళ్ల పసివాడు...అన్న బలరాముడితో కలసి కంసమామ చేపట్టిన ధనుర్యాగానికి బయల్దేరాడు. రథం దిగి వీధుల్లో నడుస్తుంటే, మధురానగరమంతా ‘అధరం మధురం, వదనం మధురం...’ అంటూ కృష్ణ సౌందర్యాన్ని కీర్తించింది. ఓ నిరుపేద నేత కళాకారుడిచ్చిన బట్టల్ని ప్రేమగా అందుకున్నాడు. తానే వెళ్లి మాలలు కట్టుకుని బతికే సుధాముడి తలుపుతట్టాడు. కుబ్జ పూసిన మంచిగంధాలకు మురిసిపోయాడు. భక్తి, ముక్తి, అనురక్తి...ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చాడు. ఎవర్నుంచి అందుకోవాల్సిన ప్రేమను వాళ్ల నుంచి అందుకున్నాడు.

పరమ రాక్షసుడైన కంసుడు కూడా తనకు తెలియకుండానే కృష్ణప్రేమలో పడిపోయాడు. కృష్ణుడు మధురలో కాలుపెట్టాడని తెలిసిన మరుక్షణమే.భయంతో సగం చచ్చిపోయాడు. అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు, కృష్ణుడొస్తున్నట్టు అనిపించేది. పూల సువాసనలు నాసికాన్ని తాకగానే...వైజయంతీమాల పరిమళమేమో అన్న భ్రమ కలిగేది. ఎవర్ని ఎవరు పిలిచినా, ‘కృష్ణా’ అన్నట్టు చెవినపడేంత చిత్త చాంచల్యం. బాలకృష్ణుడు రానేవచ్చాడు. ముద్దుగారే బాలుడు గుండెల మీద కూర్చుని పిడిగుద్దులు గుద్దుతుంటే, ‘చంపొద్దు కృష్ణా..వదిలిపెట్టు కృష్ణా...’ అంటూ మృత్యుభయంతో మెలికలు తిరిగిపోయాడు. కలవర పాటులో అయితేనేం, తలుచుకున్నాడు కదా! ఆ కాస్త స్మరణకే పొంగిపోయి, మేనమామకు ముక్తినిచ్చేశాడు కృష్ణస్వామి.

ఇన్ని విధాలుగా చెబుతూ మనలను భగవంతుని గూర్చి తెలుసుకోమని భగవంతుడే చెబుతున్నాడు. 

కాని భగవంతుని మాయ లో చిక్కిన మనం మాత్రం మాయామోహితులయ దుర్లభమైన మానవ జన్మను వృథాచేసుకొంటున్నాం.

కనుక ఇక నుంచైనా భగవంతుని చింతన చేద్దాం..🙏


                     కృష్ణం వందే జగద్గురుమ్🙏
               *** జయ జనార్ధన కృష్ణా రాధికా పతే ....***


జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…

నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే… మదన కోమలా కృష్ణా మాధవా హరే

వసుమతీ పతే కృష్ణా వాసవానుజా… వరగుణాకర కృష్ణా వైష్ణవాక్రుతే…

సురుచిరానన కృష్ణా శౌర్యవారిదే… మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా

విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణా కామ్యదాయకా…

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

విమల గాత్రనే కృష్ణా భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణా కరుణ కోమలం

కువల ఏక్షణా కృష్ణా కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణా శరణామాశ్రయే…

భువన నాయకా కృష్ణా పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణా నళినలోచనా

ప్రణయ వారిధే కృష్ణా గుణగణాకరా… దామసోదర కృష్ణా దీన వత్సలా

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

కామసుందరా కృష్ణా పాహి సర్వదా… నరక నాశనా కృష్ణా నరసహాయకా

దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…

పావనాత్మక కృష్ణా దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణా శ్యామ కోమలం

భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణా శ్రీహరి నమో

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

భక్తదాసనా కృష్ణా హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణా శలహెయ విభో

గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…

 జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…

నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే…

జన విమోచనా కృష్ణ జన్మ మోచనా...


          *** ....సర్వం శ్రీ సాయి కృష్ణార్పణ మస్తు...***


Tuesday, February 15, 2022 1 comments By: visalakshi

సంకల్పశక్తి...

               ఓం శ్రీ నారాయణాయ నమో నమః


శ్లోకం:  కిం నామ రోదిషి సఖే త్వయి సర్వ శక్తిః

           ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపం!

           త్రైలోక్యమేతదఖిలం తవపాదమూలే

            ఆత్మైవ హి ప్రభవతి న జఢః కదాచిత్ !!

భావం:-" ఓ స్నేహితుడా! ఎందుకు ఏడుస్తున్నావు? శక్తి అంతా నీలోనే ఉంది. నీ సహజ స్వభావమైన దివ్యత్వాన్ని ఎలుగెత్తి పిలువు. ముల్లోకాలూ నీ పాదాల ముందు సాగిలపడతాయి.

ఎందుకంటే ఆత్మ అన్నదే శాశ్వతంగా నిలబడుతుంది కానీ జడపదార్ధమైన ఈ శరీరం కాదు సుమా!"


సంకల్పశక్తి అనేది ఆత్మ, మనస్సుల కలయికతో ఏర్పడిన సమ్మేళనం. పని చేయడానికి క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ సంకల్పశక్తి ని పెంచుతుంది. ఆత్మ శక్తే సంకల్పశక్తి. అభ్యాసం ద్వారా సంకల్పశక్తి ని పెంచుకోవడం సాధ్యపడుతుంది. మన అపజయాలు భౌతిక స్థాయి లో ఉండేవే! అవి తాత్కాలికమైనవి.
ఆత్మయొక్క స్థాయిలో దివ్యత్వం ఎల్లవేళలా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది.

                 ***సంకల్ప బలం....***

సంకల్పబలం జ్ఞాన శుధ్ధతతో వచ్చేది. మనం అనుకున్నవి సాధించాలి అంటే సంకల్పబలం అనివార్యం.

ఈ సంకల్పశక్తిని  దేవాలయ నిర్మాణంకై జ్ఞాన శుధ్ధతతో ఆత్మ విశ్వాసంతో 2010నుండి అనేక విధాలుగా ప్రయత్నించాం...అనివార్య కారణాల రీత్యా ప్రయత్నం విరమించాం.ఎందుకంటే వికల్పశక్తి ఆపేసింది..అంటే అనుమానం... సందిగ్దత గల వ్యక్తిత్వం...గల శక్తులు మా..మా అహంభావాలు.. ఇత్యాది కారణాలు...

మన సంకల్పశక్తి పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్పబలం ఉన్నవారితో మన సాంగత్యం పెరగాలి. ఆత్మ శక్తిని వినియోగించుకోమని పలు సందర్భాలలో బాబాగారు చెప్పారు.

యాంత్రిక జీవితానికి సంబంధించిన విషయాలు లో లీనమై సంకల్పం ను పక్కన పెట్టాము.మా సంకల్పం నెరవేరాలంటే దాని తీరు తెన్నులను ఆకళింపు చేసుకుని.కారణ...కార్య సిధ్ధాంత అనుభవాన్ని సంపాదించుకోవాలి.

అచిర కాలంలో సంకల్పసిధ్ధి కై పూనుకోవాలి.అవరోధాలను సంకల్పబలం తో అధిగమించడానికి బాబా దివ్య ఆశీస్సులు కూడా మాకు ఉండాలి అని వారికి నమస్సులతో విన్నవించుకుంటున్నాను.*"కల్పించుకునే ఆనంద దుఃఖాల కన్నా..పరమాత్మ సన్నిధిలో ఆత్మమయ సంతృప్తి తో లీలాగానముతో మైమరిచి తానైక్యమవడం..అద్భుతంగా ఉంటుంది.."**

                    **ఓం శ్రీ సాయి నాధాయ నమః**

రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.


ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.


తర్వాతి రోజుల్లో‌ ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో‌ బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.


కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. 

కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చాడు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.


తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.


ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీ‌బుద్ధునికి-అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!


వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.


ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం‌ నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.


'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.


దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.


ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.


తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలో‌ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.


మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!

ఈ పై కధ FB నుండి సేకరణ...

                 #ఓం నమో నారాయణాయ🙏