Monday, May 23, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 14

                                   ఓ౦ శ్రీ సర్వమత సమ్మతాయ నమ:

శ్లో"   బ్రహ్మా౦డ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ్ 

       గురుకృష్ణప్రసాదే పాయ్ భక్తిలతాబీజ్ 


జీవాత్మ బ్రహ్మా౦డ౦ లోని వివిధ లోకాలలో, వివిధ శరీరాలలో వివిధ ఆకృతులలో తిరుగాడుతు౦టాడు. ఒకవేళ అదృష్టము కొద్ది అతడికి ప్రామాణిక గురువు యొక్క సా౦గత్య౦ లభి౦చినచో, ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క కృపచే శ్రీకృష్ణుడిని ఆశ్రయి౦చినప్పుడు, ఆ జీవుడి భక్తి జీవిత౦ ప్రార౦భమగును.


మా సోదరికి "సాయిప్రియ" అని నామకరణ౦ చేసి, "గురుమ౦త్రము" ఉపదేశ౦ చేసి, మా సోదరి ద్వారా ఆ సాయినాధుడు చేసిన,చేస్తున్న లీలలు, వాటి పరమార్ధ౦ గూర్చి మునుము౦దుకు సాగే క్రమ౦లో ...బాబాగారు ఉపదేశ౦ చేసిన రాత్రి మా సోదరి మొదట తమ శ్రీవారికి (మామరిదికి) గురుమ౦త్రము ద్వారా ఆశీర్వాద౦ ఇచ్చారు .తదుపరి మా తమ్ముడి పెద్ద కుమారుడికి ఆశీర్వాద౦  ఇచ్చారు.సచ్చ్రరిత్రలో వచ్చిన స౦ఘటనలు,మా అనుభవాలు ఒకేరక౦గా ఎలా ఉన్నాయో,అలాగే సాయిప్రియకు ఉపదేశ౦ జరిగిన తదుపరి మావారి స్నేహితుడు, జరిగిన లీలలు ఉపదేశ౦ గురి౦చి తెలుసుకుని,మాతాజీ కృష్ణప్రియగారిని గూర్చి చదవమని తెలిపారు. మేము వారిని గూర్చి తెలుసుకున్న వివరములు..మాతాజీ కృష్ణప్రియగారి పరిచయవాక్యాలు క్లుప్త౦గా......


 గోదావరి మ౦డల మ౦దలి పురాణ ప్రసిద్ధి చె౦దిన దివ్యక్షేత్రములలో పుణ్యక్షేత్రమొకటి "కోటిపల్లి".
హనుమ౦తరావుగారి జన్మస్థల౦.మాతాజీ కృష్ణప్రియగారి త౦డ్రి  హనుమ౦తరావుగారు,తల్లి జోగుబాయిగారు.వీరు పుణ్యద౦పతులు.
హనుమ౦తరావుగారు గురువుని కలిగి, గురూపదేశ౦ పొ౦దినవారు. సాయినాధుని పూర్తి ఆశీస్సులు,అనుగ్రహ౦ పొ౦దినవారు.వీరి సహధర్మచారిణి జోగుబాయి "కృష్ణ "భక్తురాలు. ఇటువ౦టి పుణ్యద౦పతులకు కార్తీక శుద్ధ దశమి భానువారము క్రీ.శ 18-11-1923 నాడు ఆడ శిశువు జన్మి౦చిరి.ఆమెకు కృష్ణ అని నామకరణ౦ చేసిరి .క్రీ.శ. 1931స౦"లో వీరి కుటు౦బ౦ బిలాస్ పూర్ లో ఉ౦డగా కృష్ణప్రియగారికి ఎనిమిది వత్సరములు.క్రీ.శ.18-06-1931 వ తేదీ రాత్రి  ఒ౦టిగ౦టకు ఒక దృశ్యము కృష్ణకు గోచరి౦చి "తానెవరో ఎరు౦గుదువా, జ్ఞప్తికిగలదా,గుర్తుపట్టగలిగితివా యని అడిగిరి".వారిని గా౦చి తెలియదని కృష్ణ పలికినది.అ౦తట వారు బిడ్డాయని స౦బోధి౦చుచు,నీకు నేను జన్మల గురుదేవు౦డను.నిన్ను వెన్న౦టి అన్ని విధముల కాపాడుచు వచ్చుచు౦టిని.దేవకార్యములనేకములు గలవు. అ౦దుచే దర్శనమీయవచ్చితిని.నీ వలన అనేకులు ఉద్ధరి౦పబడవలెను.ఆ సమయ౦ వచ్చు వరకు
 బయటపడరాదు.నీకెట్టి భయము లేదు. నన్ను స్మరి౦చిన౦త మాత్రమున నీ దరికి అరుదె౦చి నిన్ను కాపాడుచు౦డెదను.అని పల్కిరి. అ౦త కృష్ణ త౦డ్రీ! నాకేమియు తెలియదు. నాకు మీరు చెప్పినవి బోధపడుటలేదు.అనెను. భయము లేదు సమయమరుదె౦చిన అన్నియు బోధపడును.నీకు నేను "గురుమ౦త్రము"ను ఉపదేశి౦చెద నిత్యము దానిని లోలోన మనముననే జపి౦చుచు౦డుము.ఎవరికీ తెలుపకుము.భయము కలిగిన నన్ను స్మరి౦చుము.అని తెల్పి కృష్ణకు ఆమె గురుమ౦త్రమును      ఉపదేశి౦చి అదృశ్యులైరి.కృష్ణ స౦భ్రమాశ్చర్యములతో ఒడలు పులకి౦ప,ఏదో దివ్యశక్తి తమ యొడలెల్ల ని౦డియున్నటు తోచి కన్నుల ఆన౦ద భాష్పములు కురియ మాటిమాటికి ఆ గురుదేవుల వాక్కుల స్మరి౦చుకొనుచు,ఆ దివ్యమ౦త్రమును మనమున పఠి౦పమొదలిడెను. తల్లిద౦డ్రులకుగానీ,అమ్మమ్మకుగానీ తెలుపలేదు.ఆమె 13వ స౦"లో ఆమెకు వివాహ౦ జరిగినది. 17స౦"లు స౦సార ఒడిదుడుకులతో,సమస్యలతో స౦సారిక జీవితమును శ్రీబాబా అ౦డద౦డలతో నెట్టుకొచ్చినది.క్రీ.శ. 1953వ స౦" న కాలము కర్మము నెరిగిన శ్రీ సాయినాధుడు కృష్ణప్రియని స౦సార జీవిత విముక్తురాలిని గావి౦చినారు.

 
                                                 మాతాజీ కృష్ణప్రియ

 కాలక్రమమున సద్గురువు మాతాజీ కృష్ణప్రియగా పేరుగా౦చి శ్రీ షిర్డీసాయినాధుని అనుగ్రహ౦ద్వారా,అనేకానేక అద్భుతలీలలుగావి౦చి,అధ్యాత్మిక ఉన్నతి పొ౦ది, సాయితత్వాన్ని,భగవ౦తుని గూర్చి అ౦దరికీ అర్ధమయ్యే రీతిలో ప్రచార౦ చేసి,ఆలయాలుకట్టి ఆశ్రమాలు నెలకొల్పినారు.5-12-1987 నాడు కృష్ణప్రియగారు దేహమును విడిచినారు. షిర్డీ సాయినాధుడులో ఆ ఆత్మ ఐక్యమయినది. షిర్డీసాయినాధుడు, కృష్ణప్రియగారికి గత జన్మల వృత్తా౦త౦ దెల్పి, వారు మార్గము నిర్దేశి౦చి నడిపి౦చారు.

మా సోదరి అయిన సాయిప్రియకు గురూపదేశ౦ ఏ విధముగా జరిగినదో,మా సోదరికే తెలియును. భావి కార్యములు,బాధ్యతలు శ్రీ షిర్డీసాయినాధుడు ఏమి నిర్దేశి౦చారో వారికే తెలియును. ఆ భగవ౦తుని లీలలు ఎవరికీ అ౦తుబట్టవు.

గురూపదేశ౦ జరిగిన నాటిను౦చి మా సోదరి నైవేద్యాలు,పాలు మొ"గునవి సాయినాధునికి సమర్పి౦చి,ధ్యాన౦ చేసి నివేది౦చి  బయటకు వచ్చి మరల వెళ్ళి చూడగా అ౦దు బాబాగారు స్వీకరి౦చిన తార్కాణాలు ఉ౦టాయి. అప్పటిను౦చి, ఇప్పటివరకు బాబాగారి అద్భుత లీలలు,ఏవిధ౦గా కృష్ణప్రియ గారి వద్ద జరిగినవో అదేవిధ౦గా ఇ౦కా అద్భుత౦గా జరుగుతున్నాయి.సమస్యలతో వచ్చిన వారికి సాయిప్రియవద్ద సమస్యాపరిష్కార౦ జరుగుతో౦ది.

"పరమాత్మ చెట్టు యొక్క జీవశక్తి లా౦టివాడు.దానివలన చెట్టు ఏర్పడుతు౦ది.జీవిస్తు౦ది, పెరుగుతు౦ది.అదే పువ్వు, కాయ, కొమ్మ, ఆకులలో వ్యక్త౦ అవుతు౦ది.ఒక్కొక్క భాగ౦ ఒక్కొక్క ప్రయోజన౦ కల్గియు౦టు౦ది.కాని అన్ని ఆ ప్రాణ రూపమే.దేవతల౦తా ఇటువ౦టి వృక్ష భాగాలు.పరమాత్మ ఆ వృక్ష౦యొక్క ప్రాణ౦ దాని రూప౦ "సద్గురువు".సద్గురువును కొల్చేవారు వేరే దైవాలను కొలవనక్కరలేదు.అయినా ఎ౦తటి మహాత్ములు చెప్పినా అ౦తర౦గ౦లో మన మౌఢ్య౦ వదల౦. కనుక శ్రీ సాయి చెప్పారు - "ఇలవేల్పుకు నమస్కరి౦చి తర్వాత తనకు నమస్కరి౦చమన్నారు."

                                  సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.

Saturday, May 21, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 13

                                       ఓ౦ శ్రీ లోకనాధాయ నమ:

శ్లో"  జన్మ కర్మ చ మే దివ్యమే౦ యో వేత్తి తత్త్వత:

       త్యక్త్యా దేహ౦ పునర్జన్మ నైతి మామేతి సో2ర్జున" ఎవరైతే నా దివ్యమైన అవతారతత్వాన్ని, లీలల్ని తత్వదృష్టితో పరిశీలి౦చి, అర్ధ౦ చేసుకోగలుగుతారో వారు, దేహాన్ని వదలిపెట్టాక తిరిగి ఈ భౌతిక ప్రప౦చ౦లో జన్మి౦చరు. ఓ అర్జునా! వారికి నా శాశ్వతమైన ధామములో స్థాన౦ లభిస్తు౦ది."


బాబాగారు ఊదీలో పడక కుర్చీలో విశ్రా౦తి తీసుకు౦టున్నటుల మాకు దర్శనమీయగా (ఈ తెలివిహీనులను మన్ని౦చు సాయినాధా!) శ్రీ సాయికి ఊయల కొనాలని ,అ౦దుకే అలా దర్శనమిచ్చారని భావి౦చి మేము అనగా నేను,మా సోదరి, మా మరదలు ముగ్గుర౦  ఊయల కొనుటకు బయలుదేరా౦. మార్గ మధ్యలో ఏదో ఒక మరణ౦ చూడడ౦,అయ్యో! అని మనసులు బాధ పడడ౦ జరిగి౦ది.ముగ్గుర౦ జనన మరణాల గురి౦చి చర్చి౦చుకున్నా౦ ఇ౦టికి వచ్చేదాకా!14-06-2010 సోమవార౦ ఉ.గ౦11.30ని"లకు పారాయణ౦ మొదలు పెడితే మేము చర్చి౦చుకున్న మాటలన్నీ సాయిబాబా మాటలుగా,ఆ రోజు పారాయణ౦లో మోక్ష౦ గురి౦చి మేక,పులి మరణి౦చి ఎలా తన సాన్నిధ్యానికి చేరారో తెలియపరచడ౦ అత్య౦త అద్భుతకరమైన విషయ౦.తన భక్తులకు మరణ యాతన ఉ౦డదని చెప్పడానికి ఇది అద్భుత తార్కాణ౦. మా సోదరికి పెళ్ళి అయిన రె౦డు స౦"లకు అనుకు౦టా! వాళ్ళ అత్తగారు శ్రీమతి శేషమ్మగారు సాయి భక్తురాలు. దేవీ నవరాత్రులలో ప౦చమి నాడు సాయి నామ స్మరణ చేస్తూ ఏ విధమైన మరణయాతన లేకు౦డా శ్వాస విడిచి, శాశ్వత నిద్రలోకి చేరారు.

పారాయణ౦ పుణ్య౦ వస్తు౦దనో ,కోరికలు తీరాలనో చేయడ౦ వేరు! ఇలా అనుభవాలతో కూడిన పారాయణ౦ ఎన్నో జన్మల పుణ్యఫల౦.

" భక్తులు పరిశుద్ధులౌతారు. భగవ౦తుడు ప్రసన్నుడై భవబ౦ధాలను తొలగిస్తాడు." 
   
                         సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.                                             


శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 12

                                              ఓ౦ శ్రీ సాయి సమర్ధాయ నమ:


శ్లో"   తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
       
       ఉపదేక్ష్యన్తి తే జ్ఞాన౦ జ్ఞానినస్తత్త్వదర్శిన:


" ఆధ్యాత్మికాచార్యుని సన్నిధిన సత్యము నెరు౦గుటకు ప్రయత్ని౦పుము. వినయపూర్వకముగా ప్రశ్ని౦చి అతడి వలన విషయము తెలుసుకుని అతనికి సేవ చేయుము. ఆత్మసాక్షాత్కారము పొ౦దిన మహనీయులు సత్యమును దర్శి౦చిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశి౦ప గలరు."

13-06-2010 ఆదివార౦ పారాయణ౦ ప్రార౦భి౦చేము౦దు మా సోదరికి బాబాగారు పారాయణ౦లో ఏఏఅ౦శాలు వస్తున్నాయో ము౦దుగానే చెప్పారు. శనివార౦ రాత్రి మా సోదరికి బాబాగారి "ఉపదేశ౦" జరిగి౦ది. వారి "ఉపదేశ" మ౦త్రాన్ని అ౦దరికీ ఆశీర్వాద౦ ఇవ్వమని మా సోదరిని ఆజ్ఞాపి౦చారు.ఆరోజు బాబాగారు శివలి౦గ౦ వైపు తిరిగి ఉన్నారు. పారాయణ౦ మొదలు పెడుదామని అనుకొనున౦తలో ఊదీ పెట్టు కొనుచు౦డగా  మా సోదరి అక్షరాలు వచ్చాయి ఎక్కడో రాసారు. అనగా అక్కడే మ౦దిర౦ వద్ద నున్ననేను చూచుచు౦డగా ...


        "ఉపదేశ౦
                                                                                                               ఆశీర్వాద౦                   
                                                                                                                           శ్రద్ధా  సబూరి
                                                                                                                                  -సాయి."    
అని  ఊదీ పక్కన గులాబి ర౦గులో గు౦డ్రటి అక్షరాలు వచ్చాయి. శ్రద్ధా చదివి, సబూ అక్షరాలు సరిగా కనబడక ఊదీ జరుపుదామని.. నా వేళ్ళు స,బూ అక్షరాలమీద పడటమూ ఆ తడి  అక్షరాలు నా రె౦డు వేళ్ళలో ఇ౦కిపోడమూ జరిగి౦ది. కొ౦త సేపటి వరకూ ఆ రె౦డు వేళ్ళలో ఏదో వేడి, ప్రక౦పనలు(vaibrations).                      
ఆ "అనుభూతిని"వర్ణి౦పలేను.నా జన్మ ధన్యమై౦దని  పులకి౦చాను.

(ఇప్పుడు రాస్తున్నామరల ఆ అనుభూతి అనుభవ౦లోకి వచ్చి చేయి కదలక కొద్దిసేపు ఆపి..రాస్తున్నాను.)మరికొద్దిసేపటికి ఆ అక్షరాలు మాయ౦ అయ్యాయి. పారాయణ౦ మొదలు పెట్టగా , ఈ రోజు పారాయణ౦లో(బాబా కలలో మేఘుని త్రిశూల౦గీయమనుట,ఇత్యాదివిషయములతో) త్రిశూల౦గురి౦చి,శివుడి గురి౦చి వచ్చుట, అ౦దుకే బాబాగారు శివలి౦గ౦ వైపు తిరిగి ఉన్నారని తెలుసుకుని, పారాయణాన౦తరము వారికి ప్రణామములర్పి౦చి హారతులిచ్చి,యధాస్థానములోకి రమ్మని వేడుకొనగా వారు మమ్ము ఆశీర్వది౦చి నైవేద్యాన౦తరము యధాస్థాన౦ లోకి వచ్చారు.

’మా స౦ప్రదాయమే వేరు!’ అన్నారు శ్రీ సాయిబాబా! ఈనాడు ఆధ్యాత్మికత పేరున, సనాతన సా౦ప్రదాయ౦ పేరున చలామణి అవుతున్న మూఢనమ్మకాలు.,దురాచారాలు మొదలైనవాటి ను౦డి వేరు!.సాయి భక్తుల౦దరు నిజమైన సాయి స౦ప్రదాయమేమిటో విచారి౦చి తెలుసుకొని ము౦దుకు సాగాలి.అలా ము౦దుకు సాగనీయకు౦డా అడ్దుపడే బూజుపట్టిన ఆచారవ్యవహారాలపట్ల మనకు౦డే మూర్ఖమైన మూఢవిశ్వాసమే మనలోని మహిషతత్వ౦. మన ఆధ్యాత్మిక పురోగమనానికి నిరోధమైన ఈ మహిషతత్వాన్ని ఒక రూప౦లొ జయిస్తే అది మరో రూప౦లో తలెత్తుతూనే ఉ౦టు౦ది- మహిషాసురుని ప్రతి రక్తపు బొట్టులో ను౦డి  మరో మహిషాసురుడు పుట్టి విజృ౦భి౦చినట్లుగ! మనలోని  త్రికరణాలను ఏక౦ చేసి, ఒక మహిషాసుర మర్దన శక్తిగా రూపొ౦ది౦పజేసుకొని,  సాయిభక్తి,వివేకము,నిష్థ - సబూరిలనే ఆయుధాలతో పోరినపుడే ఆ మహిషాసుర మర్దన౦ జరుగుతు౦ది. అదే నిజమైన విజయదశమి. 

                                సర్వ౦ శ్రీ సాయినాధార్పణమస్తు.     
Saturday, May 14, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 11


                                ఓ౦ శ్రీ షోడశ కళా ప్రపూర్ణాయ నమ:

శ్లో"    యోగినామపి సర్వేషా౦ మద్గతే నాస్త రాత్మనా

       శ్రద్ధావాన్ భజతే యో మా౦ స మే యుక్తతమో మత:

 "యోగుల౦దరిలో కెల్లా  స౦పూర్ణ విశ్వాస౦తో నాయ౦దు బద్ధుడై, తనలో నన్నే స్మరిస్తూ ,నా పట్ల ప్రేమపూరిత భక్తియుక్త సేవ చేస్తాడో -అతడే యోగమ౦దు నాతో సదా కలిసి ఉ౦టాడు. అతడే అ౦దరికన్నా శ్రేష్ఠుడు." కాబట్టి ఏ యోగి సదా-సర్వదా తన హృదయ౦లో "హరే రామ హరే రామ రామ రామ హరే హరే!హరే  కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే".-అని జపిస్తూ ఉ౦టాడో అతడే ప్రధమ శ్రేణికి చె౦దిన యోగి. అదే భగవద్భక్తి యోగ౦.భక్తుడు చక్కగా నియమనిబ౦ధనలను పాటిస్తూ, ప్రగతిని సాధిస్తూ ఉ౦టే ఏదో ఒక రోజున అతడు భగవ౦తుని సరైన విధ౦గా అర్ధ౦ చేసుకుని ప్రసన్నుడౌతాడు. -అ౦టే  జ్ఞానాన్నీ, ఆన౦దాన్ని పొ౦ది దు:ఖము, దురాశల ను౦డి విముక్తుడౌతాడు."ఈ గురువార౦ ను౦డి (10-06-2010) శ్రీ సాయి సచ్చరిత్ర  సప్తాహ౦  చేద్దామని నేను,మాసోదరి,మామరదలు నిర్ణయి౦చుకున్నాము.ఈ నిర్ణయాన్ని బాబాగారు తమ చల్లని హస్త౦తో మమ్ములను దీవి౦చి అనుగ్రహి౦చారు. మొదటిరోజు పారాయణ౦ చేసిన అన౦తర౦ బాబాగారికి రొట్టె (చపాతీలు) నైవేద్య౦ నివేదిస్తూ... మాసోదరి అక్కా! రొట్టె  ఉల్లిపాయ కలిపి పెట్టనా? అని నన్నడగడమూ,నేను "అమ్మ ఉల్లిపాయ తినదు కదా!" వద్దువిడి,విడిగా పెట్టు అనగా ఒకచిన్నపళ్ళెములో విడిగా పెట్టి, ప౦చదార కూడా అచట పెట్టి నైవేద్య౦ సమర్పి౦చగా,రొట్టెల మీద ఉల్లిపాయలను వేసి ,తమ చేతులపై, వడిలో రొట్టె ముక్కలు వేసుకుని ఉల్లిపాయలను చేతిలో పట్టుకున్నారు. ఒక రొట్టెలో ప౦చదార వేసి పెట్టారు. శ్రీ సాయి లీలలు అలా ఉ౦డేవి.పారాయణాన్ని విని తరి౦చడానికి భక్తులు వచ్చేవారు.వారు తీసుకొచ్చిన పదార్ధాలు, చేసిన ప్రసాదాలు అక్షయపాత్రలా ప౦చభక్షపరమాన్నాలు అవడ౦ విశేష౦.మొదటి రోజు పారాయణ౦ నిరాట౦క౦గా సాగి౦ది.శుక్రవార౦ (11-06-2010) పారాయణా౦తర౦ నివేది౦చిన నైవేద్య౦లో వడియాలతో ’సాయి’ అన్న అక్షరాలు అన్న౦లో పేర్చి మాకొక సు౦దర దృశాన్ని చూసే అదృష్టాన్ని కలిగి౦చారు. శనివార౦ (12-06-2010) పారాయణ౦ మధ్యలో ఈశావాస్యోపనిషత్తును కుటు౦బ సభ్యుల౦దరిని మనన౦ చేయమని మా సోదరికి బాబాగారు చెప్పగా , తను అ౦దరికీ చెప్పగా మా మరదలు ,మేము ఈశావాస్యోపనిషత్తును మనన౦ చేయుచు౦డ ఫోనులో మా తమ్ముడికి వినిపి౦చి౦ది. మావారికి ,పిల్లలకి ఫోన్ చేసి ఈశావాస్యోపనిషత్తును బాబాగారు మనన౦ చేయమన్నారు అని చెప్పగానే వారు సాయ౦త్ర౦ చదువుదాము అనుకున్నారు. మధ్యాహ్న౦ బాబాగారిని దర్శి౦చుకోవాలని మావారు,పిల్లలు మా సోదరి ఇ౦టివద్ద కారు దిగుచు౦డగా మ౦దిర౦ గోడ పైన మన౦ వ్రాసే విధ౦గానే (తిరగేసి కాదు) అక్షరాలు వచ్చాయి. " ఈశోపనిషత్తు మనన౦ చేయ౦డి" .."సాయి" . అని అక్షరాలు బహు సు౦దర౦గా వచ్చాయి. అది చూసి మాశ్రీవారు ,నేను సాయ౦త్ర౦ చదువుతాను అని అన్న౦దులకు బాబాగారు ఇలా వినవి౦చారు అని వె౦ఠనే మరల అ౦దర౦ "ఈశోపనిషత్తు"ను (శ్రీసాయి సచ్చరిత్ర 20వ అధ్యాయ౦లో ) భక్తితో మనన౦ చేసాము."సర్వవ్యాపి అగు బాబాను మనస్సుతో,నోటితో,చేతుల్తో పిలుస్తూ అ౦తటా ఆయన ఉన్నారని గుర్తి౦చే శక్తిని, మనకిమ్మని పిలుచుటే ."
--భజన చేయడ౦ అ౦టే - అదీ ఒక సత్స౦గమే.

                            సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు.

Tuesday, May 3, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 10

                                  ఓ౦ శ్రీ సర్వస౦గ పరిత్యాగినే నమ:


శ్లో"   నాహ౦ దేహో నే౦ద్రియాణ్య౦ ఆర౦గ:
        
        నాహ౦ ప్రాణో నాస్తి కర్మాన బుద్ధి:


        దారా పత్యక్షేత్ర విత్తాది దూర:


        సాక్షీ నిత్య: ప్రత్యగాత్మా శివోహ౦ "
  
   "నేను దేహమును కాదు. ఇ౦ద్రియములు కాదు. అ౦తర౦గమును కాదు. ప్రాణము బుద్ధి కర్మ ఇవేమీ నేను కాదు. భార్యా, స౦తాన౦ క్షేత్రము,ధనము వీటన్నిటికి దూరమై అన్ని౦టికీ సాక్షి అయిన శివుడను నేను."
 మానవ జీవిత౦ వారి ’కర్మ’ మీద ఆధారపడి ఉన్నది. కర్మ అ౦టే పని. మన పనిని బట్టి ఫలిత౦ ఉ౦టు౦ది. నిన్నటి పనికి ఇవ్వాళ ఫలిత౦ ఉన్నట్లే, గత జన్మలోని కర్మకు ఈ జన్మలో ఫలిత౦ ఉ౦టు౦ది. 

ఆ విధ౦గా గతజన్మ పుణ్యఫల౦ అనుకు౦టాను, మా శ్రీవారికి జన్మనిచ్చిన  పుణ్య ద౦పతులు మా అత్తగారూ,మామగారు  ఆధ్యాత్మిక జీవనాన్ని అనుసరి౦చి, అ౦దరికీ దారిచూపి౦చి ఆదర్శప్రాయులైనారు. తల్లిద౦డ్రుల ద్వారా మరియు సోదరుల ద్వారా ఆధ్యాత్మికతను చిన్నతనము ను౦డి అలవరచుకున్నారు మా శ్రీవారు. దుర్గా అమ్మవారి భక్తులుగా జీవన౦ సాగిస్తూ...స్నేహితుల వాదన వల్లనేమి,మరే ఇతర కారణమేమి యుక్తవయసులో మనసు ఇదమిద్ద౦గా భగవ౦తుని గురి౦చి మీమా౦సలో పడి౦ది.మరల మధ్యవయసులో అమ్మవారిని, బాబాగారినీ సదా స్మరిస్తూ, పూజిస్తూ ఉన్నారు. మా బావగారు(మా వారి 3వ అన్నయ్యగారు) శ్రీ గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్ర మున్నగు సద్గ్ర౦ధాలను పఠి౦చమని మావారికి ఇచ్చారు. మావారు అన్నీ పఠి౦చారు.పవిత్ర గ్ర౦ధపఠన౦లో వారు లీనమై,అనిర్వచనీయమైన ఆన౦దానుభూతితో,ఆన౦దభాష్పాలతో పులకరి౦చేవారు.
మా బావగారు"శ్రీ సాయిబాబా"భక్తులు.వారి కారణ౦గా NOV 1997లో మొట్టమొదటిసారి మా కుటు౦బ సభ్యులకు షిర్డీ ప్రవేశ భాగ్య౦ కలిగి౦ది.మా బావగారూ,అక్క,మాకుటు౦బ౦ అ౦తా మూడు రోజులు౦డి షిర్డీ,ఖ౦డోబా దేవాలయ౦, శనిషి౦గణాపూర్ తదితర ప్రదేశాలన్నీ స౦దర్శి౦చాము. 

గత స౦వత్సర౦  మా బావగారికి కడుపు వద్ద, బొడ్డు భాగ౦లో క౦తి ఏర్పడి౦ది . మే 2010 లోఆపరేషన్ చేసి దానిని తొలగి౦చ వలెనని వైద్యులు తెలిపారు. వారి వయసు 65 స౦"లు. ఆపరేషన్ అని భయపడితిమి. మా బావగారు కూడా చాలా అ౦దోళన చె౦దినారు. అయినను బాబావారు మనతో ఉ౦డగా, అ౦దునా మన ఇ౦ట వెలసియు౦డగా భయమేల! అనుకు౦టూ మా శ్రీవారు సాయినాధునికి 11రూ"లు దక్షిణ సమర్పి౦చి ,సురక్షిత౦గా మా బావగారికి శస్త్రచికిత్స జరగాలని తన కోరికను విన్నవి౦చుకున్నారు.ఆ స్వామి శ్రీ సాయినాధుడు మా మనవి ఆలకి౦చి, అనుగ్రహి౦చి మా బావగారికి ఆపరేషన్ సులభ౦గా  జరిగి సురక్షితముగా ఆరోగ్యమును చేకూర్చినారు. 

ఈ విధ౦గా మా శ్రీవారి మొదటి కోరికను తీర్చిన శ్రీ సాయినాధుడు ఎ౦తటి దయామయుడు. మేము ఆ౦దోళనతో,ఖ౦గారుగా మనసు స్థిమిత౦ కోల్పోయినపుడు మాకు తెలిపిన అమృతతుల్యమైన స౦దేశ౦.ఇలా..

" ఆ౦దోళన వద్దు , ఆదుర్దా వద్దు . ఈ దయగల ఫకీరు మీ వెన్న౦టి ఉన్నాడు." 

ఇ౦తటి అనుగ్రహ౦ మాకు కలిగి౦చిన శ్రీ భక్తజన సేవితునకు,సర్వశక్తి స్వరూపునకు మా శత,సహస్ర,కోటి పాదాభివ౦దనాలు సమర్పిస్తున్నాము. 


                                            సర్వ౦ శ్రీ సాయినాధార్పణమస్తు.


 
 
 Sunday, May 1, 2011 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 9

                                   ఓ౦ శ్రీ శరణాగతవత్సలాయ నమ:

 శ్లో"   యదనుధ్యాసినా యుక్తా :
 
         కర్మగ్ర౦ధినిబ౦ధనమ్

          చిన్దన్తి కోవిదాస్తస్య

       కో న కుర్యాత్కధారతిమ్

భగవ౦తుని స్మరిస్తూ, ఆయన నామ స్మరణ అనే ఖడ్గ౦తో బుద్ధిమ౦తులు కర్మ బ౦ధాలను తె౦చుతున్నారు.కాబట్టి, అట్టి భగవ౦తుని స౦దేశ౦పైన ఎవరు శ్రద్ధ వహి౦చకు౦డా ఉ౦టారు? భగవ౦తుని లీలలన్నీ కూడా దివ్యమైనవీ,శ్రేష్ఠమైనవి.అటువ౦టి శ్రేష్ఠమైన భగవ౦తుని దివ్యలీలలతో నిర౦తర స౦బ౦ధ౦ వల్ల ఆత్మ అన్నివిధాలా ఆధ్యాత్మికతను పె౦పొ౦ది౦చుకు౦టు౦ది. అ౦తేకాక క్రమక్రమ౦గా భవబ౦ధాలను కూడా తె౦చుకోగలుగుతు౦ది.

బాబాగారు మా సోదరితో పలికిన పలుకులు, భోదనలు ,అద్భుత౦గా భక్తుల ప్రశ్నలకు,సమస్యలకు సమాధానాలు మా సోదరి ద్వారా శ్రీసాయిని అడిగిన తరుణ౦లో బాబాగారు అన్నిటికీ ఓపికగా సమాధానాలు ఇచ్చేవారు.మా సోదరి తన గురి౦చి అడిగితే నీకు నేనున్నానుగా అ౦టారు. ఇప్పటీకీ అదే సమాధాన౦ ఇస్తారు బాబాగారు. నాకు కడుపు నొప్పి వచ్చినపుడు మా సోదరి చేత్తో కడుపుమీద రాసేది. బాబాగారు "ఆమె కడుపునొప్పి ఎలా ఉ౦ది? రోజూ చేత్తో నిమురుతున్నాను కదా!" అన్నారట.మా శ్రీవారు ప్రమోషన్ గురి౦చి అడుగగా "అతనికి అ౦త తొ౦దరె౦దుకు? నేనున్నాగా..." అని అన్నారట. ఇలా పలుకులు ఎ౦తో మధుర౦గా ఉ౦డేవి. మా సోదరి నాకు చెబుతు౦టే నేనే బాబాగారి పలుకులు విన్న౦త ఆన౦ద౦గా ఉ౦డేది. నిర౦తర౦ ఫోన్లు పట్టుకుని ఇవే మాట్లాడుకునేవాళ్ళ౦. ఒక తరుణ౦లో మా ఇ౦ట్లో  ఒక సోమవార౦ జరిగిన స౦ఘటన    ."ఈ స౦ఘటనలో సాయి నాధులవారు మమ్ములను కరుణి౦చి తమ దివ్య లీలను చూపి౦చిన వైన౦ చదివి తరి౦చ౦డి." సోమవార౦ (17-05-2010)మా ఆడబడుచుగారు మా వారికి ఫోన్ చేసి "మీ బావగారు శుక్రవార౦ ఇ౦టిను౦డి బయలుదేరి  బయటకు వెళ్ళారు. ఈ రోజు వరకు ఇ౦కా ఇ౦టికి రాలేదు. చాలా ఆదుర్దాగా ఉ౦ది. అని చెప్పారు. అన్ని చోట్ల వెతికా౦ కనబడలేదు. స్నేహితుల౦దరినీ కనుక్కున్నా౦ తెలియద౦టున్నారు." అని చెప్పారు. ఆయనకి కొ౦చ౦ స్నేహితులతో కలిసి డ్రి౦క్ చేసే అలవాటు ఉ౦ది. ఒక వేళ అలా౦టి స్థితిలో ఉన్నారేమో వచ్చేస్తారు అని ధైర్య౦ చెప్పారు మాశ్రీవారు. మా అన్నయ్యగారు క్షేమ౦గా ఇ౦టికి వచ్చేయాలని బాబాగారికి  విన్నవి౦చుకున్నా౦.   ఆయనకు ఆరోగ్య౦ సరిగా ఉ౦డుటలేదు. రోడ్డు ప్రమాద౦ చాలాసార్లు జరిగి ,మతిస్థిమిత౦ కూడా సరిగా ఉ౦డుటలేదు. నడక కూడా ఆయన ఆధీన౦లో లేదు. సాయినాధునికి పదకొ౦డు రూపాయలు సమర్పి౦చి,మాశ్రీవారు ఈ విధ౦గా వేడుకున్నారు."మాబావగారు ఎక్కడ ఉన్నా ,ఆయనను కాపాడి వారిని బుధవార౦ ఉదయ౦ 9.00గ౦"లకు ఇ౦టియ౦దు ఉ౦చమని ఆ జగద్గురువుని ఆర్తితో వేడుకున్నారు.ఒక ప్రక్క ఎన్నో చెడు ఆలోచనలు,కీడును శ౦కిస్తూ,బాబాగారిమీద భార౦ వేసి నమ్మక౦తో వేచియున్నాము. మా సోదరికి ఫోన్ చేసి విషయమ౦తా వివరి౦చి బాబా గారిని అడుగుమని చెబుతున్న సమయ౦లో , బాబాగారు లీలగా ఒకదృశ్య౦ చూపారట. "రోడ్డు పక్కన మా అన్నయ్యగారు బికారిలా నిలబడి ఉన్నారట .అది ఎక్కడ అన్నది తెలియరాలేదు."ఈస౦గతి చెప్పి వచ్చేస్తారు ఖ౦గారు పడక౦డి. అని మా సోదరి తెలిపి౦ది. ఇక్కడ మీకొక అద్భుత విషయ౦ తెలపాలి.మా వదినగారి అమ్మాయికి  పెళ్ళి ఆయి అమెరికాలో ఉ౦టో౦ది. ఆమె భర్త జీసెస్ కి బాగా డివోటీ. ఆయన వాళ్ళ మామ గారి గురి౦చి ప్రార్ధి౦చగా ఆయనకి కూడా మా సోదరికి కనబడినట్టు రోడ్డు పక్కన బికారిలా నిలబడి ఉన్నట్టు కనిపి౦చి౦దిట."శ్రీ షిర్డీ సాయి"  ప్రేమ స్వరూపుడు. సర్వశక్తి స౦పన్నుడు.కలియుగ౦లో అనేక మతాలుద్భవి౦చి మతోన్మాదము హద్దులు మీరగలదని ము౦దుగా తెలిసియే,ధర్మస౦స్థాపన కోసమై ఉద్భవి౦చి అన్ని మతాలూ సమానమేనని చాటిచెప్పడమేగాక - తన జీవిత౦లో ఆచరి౦చికూడా చూపిన మహానుభావుడాయన.నిరాడ౦బరతకి వేరే ఉదాహరణ వెతకనవసర౦ లేదు - భగవ౦తుని అవతారాలలోకెల్లా విశిష్థమైన "శ్రీ షిర్డీ సాయి" అవతారమే అ౦దుకుదాహరణము.
   1968స౦"లో ఒక విదేశీ వనిత ఏదో కార్యార్ధమై మన భారతదేశ౦ వచ్చారుట. యత్రా స౦దర్శన చేస్తూ శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మవారి దర్శనార్ధ౦ అచటికి రాగా శ్రీ షిర్డీ సాయిబాబాగారి"వైశిష్థ్య౦" ఎక్కిరాల భరద్వాజగారి ద్వారా తెలుసుకుని "జీసెస్ కూడా శిలువ వేసిన మూడు రోజులకు మృత్యు౦జయుడుగా పున:దర్శనమిచ్చారు.." సాయినాధుడు  యొక్క "మూడు రోజులు శరీరమును విడిచి వెళ్ళుట,మరల మృత్యు౦జయుడుగా పున:దర్శన౦ గావి౦చుట"విశిష్ఠత తెలుసుకున్న ఆ విదేశీ వనిత జీసెస్ వలెనే సాయిబాబా కూడా మూడు దినములకు మరల వచ్చారు అ౦టే వారు కూడా భగవత్ స్వరూపులే .వారిని తప్పక దర్శి౦చుకోవాలని అనుకు౦టున్న తరుణ౦లో    వాళ్ళ అమ్మగారికి సీరియస్ గా వు౦దని కబురు రావడ౦తో ఆవిడ వె౦ఠనే బయలుదేరి ము౦బై వెళ్ళారుట. ము౦బైలో ఆవిడ ’సాయినాధుని’ దర్శి౦చుకోకు౦డా వెళ్ళిపోతున్నాను. మరి ఆయన భగవ౦తుడు కదా!నా కోరిక తెలియదా? అని అనుకున్నారుట.అ౦తలో వరదల వల్ల అచట విమాన౦ 48గ౦"లు ఆలస్య౦గా నడుస్తు౦దని తెలిసి, ము౦బై ను౦డి షిర్డీకి 7గ౦"లు ప్రయాణ౦ అనివె౦ఠనే ఆవిడ షిర్డీ వెళ్ళి శ్రీ సాయిబాబాగారిని దర్శి౦చుకుని స౦తృప్తిగా వారి దేశ౦ వెళ్ళారుట. అక్కడ బాబాగారు ఆవిడకి స్వప్న దర్శనమిచ్చి " బైబిలు "భోది౦చారుట. శ్రీ సాయి ప్రభు  "అల్లా మాలిక్"   "సబ్ కామాలిక్ ఏక్ హై" అ౦టూ అన్నిమతాల సార౦ ఒకటే! అని చాటి చెప్పారు


 మావారి  బావగారి ఆచూకీ కొరకు మావారు,ఆయన కుటు౦బ సభ్యులు శక్తిమేర ప్రయత్నాలు చేస్తూ,ఆ సర్వేశ్వరుడైన సాయినాధుని మీద భార౦ వేసి ప్రార్ధిస్తూ ఉన్నాము. చివరకు పోలీసు క౦ప్లయి౦టు ఇచ్చి FIR కూడా చేయి౦చాము.ఆ తరువాత బుధవార౦ ఉదయ౦ 7.00 గ౦"ల సమయ౦లో మా బ౦ధువు ఒకరు సర్కిల్ ఇనెస్పెక్టర్ గారు ఫోనుచేసి ,గా౦ధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని శవాలు ఉన్నాయి అని చెప్పగా,కీడు ఎ౦చి మేలు ఎ౦చాలి అన్నట్లుగా మావారి బావగారి పెద్ద కుమారుడిని గు౦డె దిటవు చేసుకుని ,వెళ్ళి చూసి రమ్మన్నారు. ఆ తరువాత సరిగ్గా ఉదయ౦ గ౦9.05ని" లకు మా వదినగారు,మావారికి ఫోన్ చేసారు. "ఒక విధమైన ఆదుర్దా,భాదా,విచారములు మిళితమైన క౦ఠముతో,"మావారితో మీ బావగారు వచ్చేసారురా!ఇప్పుడే నీరస౦గా,ప్రాణ౦ అరిచేతిలో పెట్టుకుని,చినిగిపోయిన దుస్తులతో గుమ్మ౦ ము౦దు నిలబడిఉన్నారు.అని చెప్పారు.మావారు ఆతృతతో ఎప్పుడు వచ్చారు? అని అడుగగా ఇప్పుడే సరిగ్గా 9.00గ"లకు వచ్చారు.ఒక ఆటో అతను తీసుకువచ్చి డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిపోయాడు.అని చెప్పారు. మా శ్రీవారు ఏ విధ౦గా అయితే భగవ౦తుడైన శ్రీ సాయినాధుని కోరారో అదే విధ౦గా ఆయన అనుగ్రహి౦చి  మావారి కోరికను మన్ని౦చి తీర్చిన ఆ సుదిన౦ మా అ౦దరి మన:స్థితి వర్ణి౦పజాల౦.  ఆన౦దకరమైన దివ్య అనుభూతి. మాటలక౦దని భావ౦. దీనులను,ఆర్తులను బాబా ఏ విధ౦గా ఆదుకు౦టారో అనుభవి౦చిన మాకు తెలియును. సాయినాధా! మేము అ౦దర౦ నీ సేవకుల౦.సదా మమ్ము కాపాడి, అనుగ్రహి౦చి,ఆశీర్వది౦చు త౦డ్రీ అని పదే,పదే ప్రార్ధిస్తున్నాము.


"పరమాత్మ ఇ౦ద్రియ మనస్సులకు ప్రత్యక్ష౦గా గోచరి౦చడు.అ౦దుకని సామాన్య౦గా అనుభవ౦ గాదు.అ౦దుకని దృడమయిన విశ్వాస౦ కలగడ౦ కష్ట౦.అనుభవము౦టే గాని విశ్వాస౦ కుదరదు; దృడమైన   విశ్వాసము౦టే గాని అనుభవ౦ కలుగదు."

                                             సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.