Tuesday, March 23, 2021 0 comments By: visalakshi

శ్రీ దీపలక్ష్మీ నమోస్తుతే...

 


#సంధ్యా దీప దర్శన శ్లోకం*

  *దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |*

*దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||*

*భగవంతుడు జ్యోతి స్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడమే కాక సర్వ శుభాలూ కలుగుతాయి.*

శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే...

జ్యోతిని పరబ్రహ్మ స్వరూపం గా, మనోవికాసానికి, ఆనందాని కి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తాం.

పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్ద నున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కి నాశనం చేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు.

దీంతో శాపగ్రస్తుడైన దేవేంద్రుడు  రాజ్యాధిపత్యం కోల్పోయి, సర్వసంపదలు పోగొ ట్టుకొని దిక్కుతోచని స్థితిలో దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. 

అప్పుడు  శ్రీ మహా విష్ణువు దేవేంద్రునికి ఒక సూచన ఇస్తాడు. ఒక జ్యోతిని వెలగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని, ప్రార్ధించమని  చెప్తాడు.

మహావిష్ణువు చెప్పిన విధంగా దేవేంద్రుడు పూజించడంతో దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. 

అప్పుడు  దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యా న్ని, సర్వసంపదలను పొందుతాడు ఆనందంతో జీవిస్తాడు .

ఆ తర్వాత ఒకసారి  లక్ష్మీదేవితో తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా ! నీ బిడ్డలు నీ  కరుణ పొందే మార్గం లేదా అని ఆ తల్లిని అడుగుతాడు. 

అప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి తనను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా...

మహర్షులకు మోక్ష లక్ష్మి రూపంగా, విజయాన్ని కోరే బిడ్డలకు విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను భక్తి తో ఆరాధిస్తే విద్యా లక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి నన్ను కొలిచేవారికి  ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా వారికి ప్రసన్నురాలనవుతానని దేవేంద్రునికి సమాధానం ఇస్తుంది. 

ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ తల్లి ప్రసన్నురాలై వారి కోర్కెలు నెరవేర్చుతుంది.

భక్తితో దేవతలను, పితృదేవతలను పూజించేవారు.. సత్యం పలికే వారు.. దాన ధర్మాలు చేసేవారు.. భార్యను గౌరవించేవారు.. బ్రాహ్మణుల పట్ల భక్తి చూపేవారు.. పగటిపూట నిద్రపోని వారు.. వృద్ధులు.. బలహీనులు.. అసహాయులైన స్త్రీలు.. పేదవారి పట్ల కరుణగల వారు.. పారిశుద్ధ్యాన్ని పాటించేవారు.. అతిథులకు పెట్టిన తర్వాతే భోజనం చేసేవారు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టులు అవుతారు.

 వారి ఇళ్లలోనే శ్రీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది.

అయితే అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్ళి ,కాళ్ళను శుభ్రం చేసుకోకుండా ఇంటిలోనికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీదేవి ఉండదని పురోహితులు అంటున్నారు.

.లక్ష్మీదేవి సకల సంపదలతోపాటు సౌభాగ్యాన్ని అందించే దేవత. అందుకే ఆ తల్లి అనుగ్రహాన్ని పొందేవిధంగా మసలుకొందాం..🙏

#రాజరాజేశ్వరీ అష్టకం* 

అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీభైరవీ

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||1|| 


అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ 

వాణీ పల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ

కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||2|| 


అంబానూపుర రత్నకంకణధర కేయూర హేరావళి

జాజీపంకజ వైజయంతి లహరీ గ్రైవేయ కైరాజితా

వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||3|| 


అంబా రౌద్రిణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా

చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||4|| 


అంబా శూలధను:శ్శరాం కుశధరీ అర్ధేందుబింబాధరీ 

వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రమాసేవితా

మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||5|| 


అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా

గాయత్రీ ప్రణవాక్ష రామృతరసః పూర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతా సుతార్చిత పదా ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||6|| 


అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా

యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ

యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళా మాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||7|| 


అంబా పాలిత భక్త రాజి రజితం అంబాష్టకం యః పఠే

అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య సంవృద్ధితా

అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||8||