Monday, July 6, 2020 0 comments By: visalakshi

మధుమాసం - కాల విశిష్ఠత....

 ఓం శ్రీ కాలాయ నమ:

"మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతూ"! 


మధుమాసం, మాధవమాసాలలో వసంత ఋతువు ఉంటుంది. మధు మాసం అంటే చైత్రం..మాధవమాసమంటే వైశాఖం.. సంవత్సరంలో ప్రధమ మాసం మధుమాసం. ఈ చైత్రమాస ప్రతిపద పాడ్యమి తోనే క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. సంవత్సర ఆరంభంలో ప్రకృతిలో ఎంతో కొత్తదనం ఉంటుంది. ఋతువులు, ఓషదులు, వస్పతులలో విశేషమైన ప్రత్యేకత కనిపిస్తుంది. పశుపక్ష్యాదులలో ప్రకృతిలోని మార్పుల కారణంగా క్రొత్తదనం వస్తుంది. లోక వ్యవహారంలోమధు మాధవాలు -చైత్ర వైశాఖాలుగా ప్రసిద్ధి చెందాయి. వసంత ఋతువులో ఎక్కువ చలిగానీ, ఎక్కువ వేడిగాని లేక వాతావరణం సమశీతోష్ణంతో సుఖదాయకంగా ఉంటుంది. ఎక్కువ పొడిగానీ, తేమగానీ లేక చక్కని స్పర్శగుణం కలిగి ఉంటుంది. అందుకే వసంతాన్ని కవులు తురాజుగా వర్ణిస్తారు. వసంత ఋతువుతోనే క్రొత్త సంవత్సరం ప్రారంభం ఈ కాలంలో చెట్ల పాత ఆకులు రాలి క్రొత్త చిగుళ్ళు చిగురిస్తాయి.ఇది వసంతఋతువుకు స్పష్టమైన లక్షణం. ఈ కాలంలో తప్ప సంవత్సరంలోని మరే ఇతర కాలంలోనూ ఓషధీ వనస్పతులలో ఇంత ఎక్కువగా విశేషమైన మార్పులు రావు.  



మాసాలన్నింటిలో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖమాసంలో, తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించినవారికి ముక్తిదాయకం. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం అయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖమాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, ధ్యానాలకు పూజలకు, దానధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి, శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది. ఈ మాధవమాసంలో వేకువజామున స్నానం చేసి ఎక్కువ జలముతో రావిచెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణలు చేస్తే  పూర్వీకులు తరిస్తారని చెపుతారు. ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం  జరిగేలా  ఏర్పాటు  చేయడం  శుభఫలితాన్నిస్తుంది. 

శ్రావణ మాస విశిష్టత...


 

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతివలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు

శ్రావణ మంగళవారం
శ్రీ కృష్ణుడు ద్రౌపదీ దేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదే వికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏస్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం
ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవి ని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది.అష్ట లక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం

శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి ,జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి.

జంధ్యాన్ని యజ్ఞోపవీతమనీ , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు

రక్షా బంధనం..
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి)దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది.

మాఘ మాసం విశిష్ఠత...



లక్ష్మీనారాయణుల కి , శివ పార్వతులకి ఎంతో ప్రీతి పాత్రమైనది మాఘ మాసం. అఘము అంటే పాపము. పాపం లేకుండా చేసే నెల మాఘము అంటారు. మాఘమాసం లో ఉదయం విష్ణువాలయం సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది. మాఘ మాసం లో చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం ఉంది. మన నిత్య జీవితం లో స్నానం ఆచరించడం ఒక భాగం. శరీరాన్ని శుద్ది పరచుకునేందుకు, స్నానానికి ఆర్ష సంప్రదాయం లో ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది. జలం, పవిత్రం చేసే వాటిల్లో ఒకటి. అటువంటి జలం తో స్నానమాచరించడం వలన రూపం, తేజస్సు, ఆరోగ్యం, మనఃస్థిమితం చేకురుతాయి. మాఘస్నానాలు చేసినంత మాత్రానా సర్వ పాపాలు తొలగుతాయి. ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాల తో సమస్త సృష్టి ని ఆరోగ్యవంతం గా చేయగల సమర్ధుడు. అందువల్లనే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. తెల్లవారుఝామున నక్షత్రాలు ఉండగా స్నానం చేస్తే ఉత్తమం, నక్షత్రాలు లేని సమయం లో చేస్తే మధ్యమం, సూర్యోదయం జరుగుతుండగా చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. సూర్యోదయం తర్వాత చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఉత్తరవాహినిగా ఉన్న నదుల్లో స్నానమాచరిస్తే ఎటువంటి పంచమహపాతకాలైన నశించి పోతాయి. ముఖ్యం గా వేగం గా ప్రవహించే నీటి లో చేసే స్నానాలు సర్వ శ్రేష్ఠమైనవి. ఈ మాసం లో ప్రయాగ లో స్నానమాచరించినా, కనీసం స్నానమాచరించెటప్పుడు ప్రయాగ ప్రయాగ అంటూ స్నానమాచరిస్తే పునర్జన్మ ఉండదు. కాశీ లో కాని, గంగాయమున సంగమం లో కాని స్నానమాచరిస్తే నూరురెట్లు అధిక పుణ్యం లభిస్తుంది.

మాఘమాసం లో చేసే దానాలకి అత్యంత ప్రాధాన్యమున్నది.  ఈ మాసం లో చెరుకు రసం, ఉసిరి దానాలు కుడా ఎంతో ఫలదాయకం. మాఘ మాసం లో     సాలగ్రామ దానం చేసినవారికి తీసుకొన్నవారికి కుడా శుభం కలుగుతుంది. ఈ మాసం లో చేసే అన్న దానం వలన సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసం లో ప్రతి దినం అన్నదానం చేయలేని వారు, మాఘ మాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో కాని కంచు పాత్రలో కాని నువ్వులు పోసి యధాశక్తి   దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు సువర్ణం కలిపి దానం చేస్తే ఎటువంటి పాపాలైన నశిస్తాయి ముఖ్యం గా త్రివిధ పాపాలు తొలగుతాయి.

మాఘమాసం లో ఆదివారాలు విశిష్ఠమైనవి. ఆదివారం నాడు సూర్యుడిని భక్తి శ్రద్దలతో పూజించి, ఆయనకిష్టమై గోధుమతో చేసిన పదార్ధాన్నికాని తీపి పొంగలి కాని పాయసాన్నికాని నైవేద్యం గా సమర్పిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.

మాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించవలసిన విధులు...

ఈ మాసం లో శ్రవణా నక్షత్రం రోజున తులసి దళాలతో విష్ణు పూజ చేస్తే సకల పాపాలు తొలగుతాయి.
మాఘ తదియ రోజున బెల్లం, ఉప్పు దానం చేస్తే ఎంతటి కష్టాల నుండి అయినా విముక్తి లభిస్తుంది.
మాఘ శుద్ద చతుర్ధిని తిల చతుర్ధి అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి గణపతి ని పూజించి జాగరణ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. ఈ రోజున నువ్వులను బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం ఇస్తే సర్వ పీడలు తొలగి బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది. ఈ చతుర్ధి ని కుంద చతుర్ధి అని కూడా అంటారు. కుంద చతుర్ధి రోజున శివున్ని మొల్లలు తో పూజించి ఒంటిపూట భుజిస్తే ఐశ్వర్య ప్రాప్తి ,సిరిసంపదలు కలుగుతాయి.
సంకటహర చతుర్థి నాడు సాయంత్రం వరకు ఉపవసించి సంధ్యా సమయం లో గణపతి ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

శ్రీ పంచిమి రోజున సరస్వతి దేవి ని పూజిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది. ముఖ్యం గా విద్యలకు అధిపతి అయిన సరస్వతి దేవి ని విధి విధానం గా విద్యార్దులు పూజిస్తే సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి దేవి కి ప్రీతికరమైన తెల్లని పుష్పాలతో పూజించి, క్షీరాన్నం, నారికేళం, చెరుకు వంటి పదార్దాలను నివేదన చేస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

రథసప్తమి రోజున వేకువ ఝామున నిద్రలేచి జిల్లేడు ఆకులు, ఎర్రటి అక్షితలు తలపైన, భుజాల పైన ఉంచి స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున సూర్యనారయణుడి ప్రసన్నం కొరకు తూర్పు దిక్కుగా పొయ్యి మీద పాలు పొంగించాలి. చిక్కుడుకాయలతో చేసిన రథం పై సూర్య భగవానుణ్ణి ఉంచి పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి. రథసప్తమి వ్రతం ఆచరించిన వారికి దారిద్ర్య బాధలు తొలగుతాయి. ప్రయాగ లో ఈ వ్రతం ఆచరిస్తే కోటి సూర్య గ్రహణాల పుణ్య ఫలం లభిస్తుంది.

రాగి పాత్రలో సూర్య బింబ ప్రతిమ ఉంచి ఎర్రటి పూలతో అర్చించి బ్రాహ్మణునికి ప్రతిమ సహితం గా దానం ఇస్తే, జాతకరీత్య సూర్య గ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రోజున అరుణ పారాయణం చేస్తే హృదయ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాదులు తొలగుతాయి. ఈ రోజున శివ సన్నిధి లో మృత్యుంజయ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు భయాలు తొలగుతాయి.

భీష్మాష్టమి రోజున భీష్మాచార్యులకు ఆర్ఘ్యం ఇచ్చి పూజిస్తే వంశం వర్ధిల్లుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుశ, తిల, జలము తర్పణ చేస్తారో వారి కి సుందర సుగుణవంతులైన సంతానము ప్రాప్తిస్తుంది. ఈ విధి నిర్వహించిన వారికి ఆ సంవత్సరం లో చేసిన పాపాలు తొలగుతాయి.

కృత్తిక నక్షత్రం ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామి కి పాలాభిషేకం చేస్తే సర్ప గ్రహ బాధలు, రాహు కేతు బాధలు తొలగుతాయి. సంతాన లేని వారు పుట్టలో పాలు పోసి సర్పాకారం లో సుబ్రమణ్య స్వామి ని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుసహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది.

తిల ద్వాదశి నాడు నువ్వుల తో చేసిన పదార్ధాలను తినడం, నువ్వుల నూనె తో అభ్యంగన స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానమివ్వడం చేస్తే కష్టాలు తొలగుతాయి.

శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, దక్షిణ తో సహా బ్రాహ్మణునికి దానం ఇచ్చి, శివలింగానికి తైలాభిషేకం చేయించడం వలన శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యం గా ఏలిన నాటి శని, అర్దాష్టమ శని, శనిమహర్దశ అంతర్దశ జరుగుతున్నా వారు వీటిని ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

మాఘ పౌర్ణమి రోజున మాఘ మాసం లో ప్రతి నిత్యం స్నానమాచరించలేని వారు ఈ ఒక్క రోజు మాఘ స్నానం ఆచరిస్తే శుభం కలుగుతుంది. దైవ శక్తి సంపూర్ణం గా విలసిల్లే దివ్యమైన రోజున చేసే జపాలు, పూజలు, దానాలు, హోమాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. ఈ రోజున చేసే సముద్ర స్నానం చెప్పలేనంత పుణ్యాన్ని కలిగిస్తుంది. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. శివాలయం లో ఆవు పాలతో అభిషేకం చేస్తే అన్ని గ్రహాల బాధలు తొలగుతాయి. పంచామృతాలతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. 

విశాఖ నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి ని భస్మం తో పూజిస్తే పాపక్షయం కలుగుతుంది, బిల్వపత్రాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. స్వామి వారికి వస్త్రాలు సమర్పించి పూజించి ఉపవాసం చేస్తే ఉద్యోగ మార్గాలు లభిస్తాయి.

విజయ ఏకాదశి - శ్రీ రామచంద్రుడు లంకను చేరుకోవడానికి సేతువు నిర్మించడం పూర్తైన రోజు కావున విజయ ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే విజయాలు ప్రాప్తిస్తాయి.

మహా శివరాత్రి పర్వదినాన శివారాధన, రుద్రాభిషేకం, జాగరణ, ఉపవాసం ఏది చేసిన పుణ్యం లభిస్తుంది. విభూది, రుద్రాక్ష ధారణ వలన మంచి ఫలితాలు పొందుతారు. శివ పార్వతుల కల్యాణం చేస్తే భార్య భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ దోషాలు ఉన్న వారికి దోషాలు తొలగి వివాహం జరుగుతుంది.
 సర్వే జనా సుఖినోభవంతు....

















 

Thursday, July 2, 2020 0 comments By: visalakshi

శ్రీ సాయినామ స్మరణ...

*సాయినామ స్మరణ.....బతుకెంతో తీయన !



శ్రీ సాయితత్వం మానవ జన్మకు ఈ భూమిపైనే చరితార్థం చేయగల శక్తిపాతం. 'సాయి' నామం పావన మంత్రం. అదొక అమృత గుళిక. సాయిలీలామృతాన్ని ఒడిసిపట్టి తాగిన వారు ధన్యులు.

సాయి సచ్చరిత్ర సముద్రమంత లోతైనది. ఆకాశమంత విశాలమైనది. భక్తి, జ్ఞానమనే మణులు అందులో దాగి ఉన్నాయి.

ఎవరెంత లోతుకు వెళ్ళగలిగితే అన్ని మణులను, రత్నాలను పొందవచ్చు. వీటిని పొందాలంటే మనలోని అహంకారాన్ని తీసి బాబా పాదాలపై పెట్టాలి.

శ్రద్ధ, సహనం....దక్షిణగా సమర్పించాలి.
సాయి సచ్చరిత్రలోని ఒక్కో సత్కథ ఒక్కో సద్గతి కలిగిస్తుంది. బాబా చాటిన నీతి, ఉపదేశాలు జీవనరీతుల్ని నేర్పుతాయి.

బాబా లీలలు ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. అవి చదివినంతనే మనో విచారాలు ఎగిరిపోయి శాంతి ఆవరిస్తుంది. బాబా జీవన విధానం మనకు బుద్ధిని, జ్ఞానాన్ని అలవరుస్తుంది. ఇక, బాబా చెబుతున్నదేమిటో ఆలకిద్దాం.

"అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టండి. వారికి నేను మిక్కిలి సాయపడతాను. వారి జీవిత చర్యల్లోను, గృహకృత్యాల్లోనూ తోడునీడగా ఉంటాను.

అహంకారం మీ మనస్సులో మచ్చుకైనా లేని రోజున మీ హృదయాల్లోనే శాశ్వతంగా కొలువుండిపోతాను. నా లీలలు, బోధలు విన్న, ఆచరించిన భక్తులకు భక్తి, విశ్వాసాలు కుదురుతాయి. వారు

ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతారు. నా నామాన్ని ప్రేమతో స్మరించే వారి కోరికల్ని తీరుస్తాను. వారిలో, భక్తి, జ్ఞాన వికాసాన్ని కలిగిస్తాను.

ఎవరైతే మనఃపూర్వకంగా నా బోధనల్లోని విషయాలను గ్రహిస్తారో వారు సంతోషగ్రస్తులవుతారు. నన్నే స్మరించి, ధ్యానించి, పూజించే వారిని జనన మరణ బంధాల నుంచి బయట పడవేస్తాను.

భక్తి శ్రద్ధలతో నా లీలల్ని చదవండి. మనసులో నిలుపుకోండి. ఉపదేశాలను ఆచరించండి. అప్పుడు గర్వం, అహంకారం నశిస్తాయి.

ఆనందానికి, తృప్తికి ఇదే మార్గం. 'సాయి...సాయి' అనే నామ స్మరణ వల్ల చెడు వినుట, చెడు పలుకుత వలన కలిగే పాపాలు పటాపంచలైపోతాయి.

నా మాటలపై నమ్మకం ఉంచిన వారు తరిస్తారు. మనసు చెదిరిపోనీయకండి. దేనికీ భయపడకండి. చలించకండి. స్థిరంగా, విశ్వాసంతో ఉండండి. నా లీలలు చదవటం కాదు, వాటిలోని నీతిని, మంచిని గ్రహించి ఆచరించటం ముఖ్యం."


"నిరాడంబరత - సాయి సందేశం*"..!!

ఎన్నోజన్మల పుణ్యఫలం వల్ల సాయి మన జీవితంలో ప్రవేశించారు. సాయి తన భక్తులను జాగ్రత్తగా కాపాడుతు ఆధ్యాత్మిక పధంలో నడిపిస్తారు. సాయి పట్ల అత్యంత భక్తిశ్రద్ధలు ఉంటే చాలు మనం ఈ భవసాగరాన్ని దాట వచ్చు. సాయి భక్తులు ఎన్నడు నిరాశకు లోనవ్వరు. వారి జీవితంలో సుఖశాంతులికి కొదవ ఉండదు. సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు. ఒక్కోసారి మనం దైవసేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతాము.

సాయి సమర్ధుని కృపతో దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందారు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేసారు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించారు. దాసగణు షిర్డీకి రావడానికి కారణం నానాచందోర్కర్. నానా వల్ల సాయి భక్తి నలుదిశలా వ్యాపించింది. ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు.

బాబా ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు. వాహ్వా పెళ్ళికొడుకు లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు. కీర్తన చెప్పడానికి ఇవన్నీ అవసరమా! వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు. అప్పటినుంచి దాసగణు మహారాజ్ ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ చెప్పేవారు. ఇదే ప్రసిద్ధమైన నారదీయ పద్దతి. బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు. ఇక్కడ మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత.

మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు.

దేవుడికి ఎంత చేసినా తక్కువే, కాని బాబా ఎందుకు నిరాడంబరతకు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఆధ్యాత్మిక సాధనలో నిరాడంబరత అవసరం ఎంతో ఉంటుంది. లేక పోతే ఈ ఆడంబర పూజలే వాసనలై చివరికి మనలను వేధిస్తాయి. ఆత్మ సాక్షాత్కారానికి నేను, నాది అనే అహంకారమే అడ్డుగా నిలుస్తుంది.

*ఓం  సాయిరాం*..

బిల్వదళం...మోక్షఫలం..

బిల్వ దళం – మోక్ష ఫలం



మహాత్ముల అవతార ఉద్దేశం ఏమైనప్పటికీ వేలాది మంది తరించడం దానికి అవాంతర ప్రయోజనమై ఉంటుంది. గంగ భగీరథుని పితరులను తరింపచేయడనికి వచ్చినా ఇప్పటికి ఎన్ని తరాలుగా ఎంతమందిని తరింపంజేస్తొంది?!

మహాస్వామి వారు 1935 ప్రాంతాలలో కాశీ యాత్రకు వెళుతున్నప్పటి సంఘటన ఇది...

స్వామివారు కర్నూలు దాటి చిన్న చిన్న గ్రామాల గుండా శ్రీశైలం వైపు తమ పరివారంతో ప్రయాణం చేస్తున్నారు. రోడ్డునకు కొంచం లోపలగా ఉన్న గ్రామపు జమీందారు, తమ గ్రామస్థులందరితో కూడి పూర్ణకుంభంతో నుంచుని ఉన్నాడు. ముందు మఠ నిర్వహణ వారు ఎర్పాటు చేసినట్లు స్వామివారు మరికొంచం దూరం వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న గ్రామంలో బస చేయవలసి ఉన్నది. కానీ జమిందారుతో కూడిన గ్రామాస్తులందరూ శ్రీవారు తమ గ్రామాన్ని పావనం చేసి అక్కడ బస చేయాలని ప్రార్ధించారు.

జమిందారు గారు ఊరిలో ఒక చెరువు, దాని వడ్డున సత్రం ఉన్నాయని, శ్రీవారి బసకు, పుజకు, పరిచారికులకు సౌకర్యంగా ఉంటుందనీ వివరించాడు. ఎదో ఒకటి రెండు రోజులు ఉండి పోదాము అనుకున్న స్వామివారు రమణీయమైన పరిసరాల మధ్యనున్న గ్రామం, ఆ గ్రామస్థుల భక్తి చూసి అక్కడ కొంత కాలం ఉండటానికి ఒప్పుకున్నారు. అంతే!! గ్రామస్తులందరూ కలిసి కావలసిన పందిళ్ళు, పాకలు వేయించడంలోను, సంబారములు సమకూర్చడంలోనూ నిమగ్నమైనారు. మరునాటి ఉదయం చంద్రమౌళీశ్వర పుజకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చబడినాయి. కాని చంద్రమౌళీశ్వర పుజకి కావలసిన బిళ్వదళాలు మాత్రం రాలేదు. ఆ గ్రామస్తులకు మారేడు దళాలు అంటే ఎమిటో తెలియలేదు. ఉన్న ఒకటి రెండు బ్రహ్మణ కుటుంబాల వారు కూడా బిళ్వదళాలు ఈ చుట్టుపక్కల లేవు అని తేల్చి చెప్పారు.

పూజకు సంబంధించిన సంబారాలు చూచే మఠొద్యోగులకు ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో స్వామివారు స్నానం చేసి వచ్చి అనుస్టానం ఆచరించబోతూ "బిళ్వదళాలేవి?" అని అడగనే అడిగారు. పరిచారకులు "ఇక్కడ బిళ్వదాళలు ఎరిగినవారే లేరట" అని చేప్పారు. స్వామివారు చిరునవ్వు నవ్వి గోశాల వెనకనున్న బండరాయి పైన కూర్చుని అనుస్టానం ఆరంభించారు. పరిచారకులు నిర్మాల్యంలో ఉన్న బిళ్వదళాలను చూపి ఊరి యువకులని వాటిని వెతుక్కుని రమ్మని పంపారు.

స్వామిమివారి ఒక గంట జపం ముగిసి కనులు తెరిచారు. జనం కుడా ఆత్రుతగా బ్రహ్మానుభవంలో ఓలలాడే ఆ పరమాత్మ వంక చూస్తున్నారు. స్వామివారు బిళ్వదళాల లేమికై ఎమి చెప్పబోతారో? తాము ఉందామనుకొన్నని రోజులు ఉండకుండానే వెళిపోతారేమోనని కలత పడుతున్నారు. ఇంతలో శ్రీమఠ పరిచారకులలో ఒకరు ఎంతో ఆనందంతో బిళ్వదళాలు పట్టుకుపస్తూ పందిరి వద్ద కనిపించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

స్వామివారు బిళ్వదళాలు చేతిలొకి తీసుకుని పరీక్షించారు. "ఈ చుట్టుపక్కల మారేడు చెట్లే లేవన్నారే? ఈ దళాలు ఎక్కడ నుంచి వచ్చాయి. అన్నీ నవనవలాడుతూ కోమలంగా మూడు మూడు ఆకులతో ఉత్తమంగా ఉన్నాయి. ఎవరు కోశారు? ఎక్కడ నుండి వచ్చాయి?" అని అడిగారు. బుట్ట తీసుకువచ్చిన పరిచారికుడు నేను యాదృచ్చికంగా అటుపక్క వెళ్ళినపుడు పందిరి గుంజ పక్కన ఈ బుట్ట పెట్టి ఉన్నది స్వామి. ఎవరు తెచ్చారో చుడలేదన్నాడు. "ఎవరు ఇక్కడ పెట్టరు అని నీవడగలేదా?" అన్నారు స్వామివారు.

"అడిగాను కానీ ఎవరూ తమకు తెలియదంటున్నారు" అన్నాడు పరిచారికుడు.

“మరెవరు తెచ్చి ఉంటారు? చంద్రమౌళీశ్వరుడే తన పుజకు తానే బిల్వములను తెప్పించుకున్నాడ” ని నవ్వుతూ పూజకు వెళ్ళారు స్వామివారు. ఆరోజు కార్యక్రమాల వత్తిడిలో బిల్వదళాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచించలేదు.

మరుసటిరోజు పూజా సమయానికి పూజకట్టు పర్యవేక్షించే అధికారి క్రితపు రోజు బిల్వదళాలు తేచ్చిన పరిచారికునితో ఈ రోజు కూడా బిల్వదళాలు ఏర్పాటు చేయలేదు. నిన్న ఉన్న చోట మళ్ళీ ఉన్నాయేమో చూసిరా అన్నారు.

ఆశ్చర్యంగా ఆ రోజుకుడా అక్కడ బిల్వదళముల బుట్ట పెట్టి ఉన్నది. పూజకి వచ్చిన స్వామివారు సాభిప్రాయముగా అధికారి వంకకు చూసారు.

"అవును స్వామి ఈ రోజు కూడా అక్కడ బిల్వదళముల బుట్ట పెట్టి ఉన్నది“ అన్నాడాయన. మూడవరోజు కుడా ఇదే తంతు.

నాల్గవరోజు స్వామివారి ఆజ్ఞమేరకు పరిచారకుడు పొద్దున్నుండీ ఎవరికీ కనిపించని చోటు నుండి రోజూ బిల్వదళాముల బుట్ట పెట్టబడే స్థానాన్ని పరిశీలిస్తూ కుర్చున్నాడు.

సుమారు 8 - 8:30 గంటలకు తూర్పు పక్కనున్న మామిడి తోపు నుండి ఒక యువకుడు తలపై బుట్ట పెట్టుకుని వస్తున్నాడు. సరిగా దువ్వి ముడిపెట్టని పెద్ద శిఖ, మోకాళ్ళ పైదాక కట్టిన నీరుగావి పంచతో శుద్ధ గ్రామీణునిలా కనిపిస్తున్నాడు. అతను అటూ, ఇటూ తేరిపార చూసి తాను రోజూ పెట్టే స్థానంలో బుట్ట పెట్టి వెళ్ళబోతున్నాడు.

పరిచారకులు పరుగెత్తుకుని వెళ్ళి శ్రీకార్యం వద్ద ప్రవేశపెట్టారు.

అతను భయముతో వణుకుతూ సాష్టాంగం చేసి నమస్కరించాడు. "భయపడకు నీవేనా రోజూ ఈ దళాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేది? అన్నారు శ్రీకార్యం. అవునన్నాడు ఆ కుర్రవాడు.

"మంచిది సాయంకాలం స్నానం చేసి, తల సరిగా దువ్వుకుని శిఖముడి వేసుకుని, మంచి బట్టలు కట్టుకుని రా!" స్వామివారి దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఆశీస్సులు పొందవచ్చు" అన్నారు శ్రీకార్యం. మూడు గంటలకు ఆ యువకుడు ఆజ్ఞాపించిన విధంగా వచ్చాడు.

దూరం నుండి ఆ యువకుని చూపించి ఎదో చెప్పారు శ్రీకార్యం. స్వామివారు దగ్గరకు పిలిచారు. భయపడుతూ ఎంతో వినయంగా నమస్కరించాడు ఆగంతకుడు.

పేరేమిటి! అని తెలుగులో ప్రశ్నించారు స్వామివారు.

"పురంధర కేశవులు" అని స్వచ్చమైన తమిళంలో బదులిచ్చాడు.

"తమిళుడివలే ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు?" అన్నారు స్వామివారు.

"నా స్వగ్రామం ఉసిలంపట్టి, మధురై దగ్గరండి. నే పుట్టిన రెండు సంవత్సరాలకే నా తల్లి గతించింది. మా నాన్నే నన్ను పెంచాడు. ఆరు ఏళ్ళ క్రితం నాతో బ్రతుకుతెరువుకై ఈ దేసం వచ్చాడు ఆయన. ఈ జమీన్ గ్రామంలో ఆవులు మేపే పనిదొరికింది. నేను చిన్నప్పటి నుండీ ఈ పనే చేస్తున్నాను. చదువుకోలేదు. మా నాన్నే నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఆయనకు సంగీతంపై మక్కువ. పురంధరదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వినికిడి జ్ఞానం వల్ల పాడేవాడు. అందుకే నాకు పురంధరకేసవులని పేరు పెట్టాడు. రెండేళ్ళ క్రితం ఆయన మోక్షానికి చేరుకున్నాడు. నాకిప్పుడు పన్నెండేళ్ళు స్వామి! ఆవుల్ని మేపుతూ ఉంటాను. జమీన్ లో భోజనం పెట్టి జీతం ఇస్తారు" అన్నాడు.

"ఈ చుట్టుపక్కలెక్కడా మారేడు చెట్లే లేవంటున్నారు. మరి నీవెలా తెస్తున్నావు?" ప్రశ్నించారు స్వామివారు.

"ఇక్కడికి మూడు నాలుగు మైళ్ళ దూరంలో పర్వతం మొదట్లో దట్టమైన పచ్చిక, చెట్లూ ఉన్నాయి. మేము ఆవులని మేపడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మూడు పెద్ద బిల్వ వృక్షాలున్నయి. మానాన్న ఆ ఆకులను చూపి "ఒరే పురంధరా! ఈ మూడు ఆకులు కలిసిన దానిని బిల్వదళం అంటారురా! దీంతో శివునికి పూజ చేస్తే మహా విశేషం" అని చెప్పేవాడు.

మూడు రోజుల ముందు పూజ దగ్గర ఉండే అయ్యావారు ఇటువంటి ఆకులు కావాలని ఈ ఊరివాళకు చెబుతున్నారు. నాకు వెంటనే ఈ చెట్లు గుర్తుకువచ్చాయి. పరిగెత్తికెళ్ళి కోసుకుని వచ్చాను. అయితే గొల్లవాడు తెచ్చిన దళాలతో మీరు పూజ చేస్తారో లేదో అని ఎవరూ చూడకుండా అక్కడ పెట్టి వెళ్ళాను ఇది సత్యం స్వామి" అన్నాడు.

స్వామివారు ఎంతో ప్రీతిచెందారు.

పురంధరా నీకు ఏమి కావలో చెప్పు ఇప్పిస్తాను అన్నారు స్వామివారు. వాడు రెండు చెంపలు వేసుకున్నాడు. "స్వామీ! మీ వద్ద లౌకికమైన విషయాలు కోరడమా! మా నాన్న ఇవన్నీ క్షణ భంగురాలని చెప్పేవాడు. అయితే నాకు రెండు కోరికలు ఉన్నాయ్ స్వామి! మీరు అనుగ్రహిస్తే ఒకటి ఇప్పుడు అడుగుతాను, రెండవది మీరు ఈ ఊరినుండి వెళ్ళేప్పుడు అడుగుతాను" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సాస్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. స్వామి వారు వాడిని బుజ్జగించి చెప్పు నీ కొరికేమిటో అన్నారు.

"ఎం లేదు స్వామి మా నాన్న నాకు పురంధరదాసు కృతులు, త్యాగరాజ కృతులు నేర్పాడు, నేను ఆవుల దగ్గర పని చేస్తూ ఒంటరిగా పాడుకుంటూంటాను. ఒక్కసారి మీ ఎదురుగా పాడలని ఉంది స్వామి" అన్నాడు. స్వామివారికి ఆ కోరిక విని చాలా ఆనందం వేసింది.

"తప్పకుండా! నేనే కాదు అందరమూ వింటాము. నేనున్నన్ని రోజులూ సాయంత్రం మూడు గంటలకి ఇక్కడకి వచ్చి పాడు. అమ్మవారు అయ్యవారు (త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు) కుడా విని నిన్ను అనుగ్రహిస్తారు" అన్నారు.

పురంధరకేశవుల ఆనందానికి అంతే లేదు. "సరి నీ రెండో కొరిక ఏమి?" అన్నారు స్వామివారు.

నవ్వుతూ "అది మీరు వెళ్ళిపొయేటప్పుడు కోరతాను" అన్నాడు అతను.

స్వామి వారు తమ మెడలో ఉన్న తులసి మాలను అనుగ్రహించారు. ఎంతో అపురుపంగా కనులకు అద్దుకుని గంతులేసాడు పురంధరకేశవులు. ఆ ఊళ్ళో స్వామి వారు ఇరవైఒక్క రోజులు ఉన్నారు. వెళ్ళిపొయే రోజు వచ్చింది. ఊరు ఊరంతా విరిగిపడినట్లు వచ్చారు జనాలు. అందరినీ ఆశీర్వదించి నిదానంగా ముందుకు సాగారు స్వామివారు. గ్రామప్రజలందరి కళ్ళలో నీరు. ఏదో కోల్పోతున్న భావన. అంతలో ఏదో జ్ఞాపకం వచినట్లుగా వెనక్కి తిరిగి చూసారు మహాస్వామి. దూరంగా పందిరి గుంజకు చుట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పురంధరకేశవులు ఉన్నాడు.

"పురంధరా! నీకు ఉన్న భక్తి విశ్వాసాలకు నీకు తప్పక ఉన్నతి లభిస్తుంది. ఇంకో కోరిక వెళ్ళేటఫ్ఫుడు చెబుతానన్నావే! అదేమిటి?" అన్నారు.

వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ, వచ్చే వేక్కిళను ఆపుకుంటూ అన్నాడు. “స్వామి! మా నాన్న దేముడిని లౌకికమైన చిన్న చిన్న విషయాలు గురించి అడగకూడదు. జన్మ అంటేనే దు:ఖం. మరుజన్మ లేని మోక్షాన్ని కోరుకోవాలి. దానికోసం మనం సత్యమే చెప్పాలి. ధర్మంగా జీవించాలి. మహాత్ములను మనం కోరవలసినది మోక్షమే అని చెప్పేవాడు. స్వామీ! నువ్వే మానాన్న చెప్పిన మహాత్ముడివి. నాకు మోక్షం ప్రసాదించు స్వామి!” అంటూ బావురుమన్నాడు.

కదిలిపోయారు స్వామివారు. పన్నెండేళ్ళ పసివాడు మాట్లాడే మాటలా ఇవి. ఆశ్చర్యపోయారు. అబ్బురపాటు చెందారు.

ఎంతో ప్రేమతో కరుణగా చూచి నవ్వుతూ "తగిన సమయంలో భగవంతుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు" అంటూ దూరంగా ఉన్న జమిందారుని పిలిచి "పురంధరుని విషయంలో ఏమి జరిగినా మఠానికి టెలిగ్రాం పంపు" అన్నారు.

చాలాకాలం గడిచిపోయింది. స్వామివారు కాశీ యాత్ర ముగించి తిరిగివచ్చారు. అప్పుడు కంచిలో ఉన్నారు. ఒక మధ్యాహ్నం హఠాత్తుగా మఠం నుండి బయల్దేరి కామాక్షీ గుడిలోని కొలనుకి వచ్చారు. స్నానం చేసి ఒక గంట సేపు జపం చేశారు. మళ్ళి స్నానం చేసి మళ్ళీ జపం చేస్తున్నారు. సాయంకాలం ఆరుగంటలదాక ఈ విధంగా ఎనిమిది సార్లు చేసారు. స్వామివారు ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అవగతం కాలేదు. చివరిసారిగా స్నానం చేసి మెట్లు ఎక్కుతున్నప్పుడు మఠం నుండి టెలిగ్రాం పట్టుకుని "కర్నూలు నుండి టెలిగ్రాం వచ్చింది స్వామి! పురంధరకేశవుల ఆరోగ్య పరిస్థితి ఎంతో ఆందోళన కరంగా ఉన్నదట. మరి ఈ పురంధరకేశవులేవరో ఎవరికీ తెలియడం లేదు స్వామి" అన్నారు.

"పురంధరకేశవులు కొద్దిసేపటి ముందే కాలం చేసాడు. వాని గ్రామం వెళ్ళినపుడు నన్ను మోక్షంకై ప్రార్ధించాడు. మంచి జీవి అతడు. చంద్రమౌళీశ్వరుని అనుగ్రహము వలన మోక్షం లభిస్తుందని చెప్పాను. కొద్ది కాలంగా అతనికి విషజ్వరం వచ్చింది. శరీర బాధ గురించి పట్టించుకోకుండా మొక్షేచ్చతో పరితపించిపోతున్నాడు. అతనికింకో ఆరు జన్మలు పొందాల్సిన కర్మ ఉన్నది. ఎలాగోలా మొక్షం కలగాలని ప్రార్ధిస్తూ ఇలా జపం చేస్తున్నా. "పురంధరకేశవులు శుద్ధాత్మ" అంటూ మఠం వైపుకు దారి తీసారు.

స్వామివారు అతనికి మొక్షం లభించిందనే విషయం స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆ పురంధరునికి మోక్షం వచ్చి ఉంటుందనడంలో మరి సందేహం ఏముంటుంది.

అయితే అద్వైత శాస్త్రం ‘ఙ్ఞానాదేవహి కైవల్యం’ అని చెబుతున్నది కదా! ఇంకొకరికి మొక్షం ప్రసాదించడం ఎలా అన్న ప్రశ్న పుస్తక జ్ఞానం కలవారికి తోచవచ్చు. మహస్వామి వారి తపస్సు చేత అతని కర్మలను దహించడం వల్ల శుద్ధమైన జీవునికి జ్ఞానం కలిగి ఉండవచ్చు.

అయినా దీనిగురించి విచారం అనవసరమేమో! శ్రీ రమణభగవానులు తమ తల్లిగారితో సహ అనేక మందికి మోక్షాన్ని అనుగ్రహించారు.

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

బిల్వ పత్రాలు....:




#ఏక బిల్వం శివార్పణం*

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము. 

ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచ్చింది. 

ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. 

ఇలాగ ఈ మూడింటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.

ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికీ, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థితి ,లయ కారకుడైన ఆ మహదేవుడు మారేడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయనే సర్వాంతర్యామి!

బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయంటారు. 

అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది. 

పూజకుడవు నీవే, పూజింబడేది నీవే - అనే భావంతో శివుని పూజించుటయే ఉత్తమమైన భావం. 

ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.

పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటఒ చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణలో , ఈశాన్య భాగం లో మారేడు చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!