Saturday, November 27, 2021 1 comments By: visalakshi

నాడీ వ్యవస్థ...

 #కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది ? ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలుపెట్టండి... అద్బుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయి.

కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది?


ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రానా లేదా శ్వాస ఆడనంత మాత్రాన అంటే ప్రాణవాయువు సంచరించనంత మాత్రాన శ్వాసకోశ వ్యవస్థ పనిచేయనంత మాత్రాన చనిపోయినట్లు కాదు.


నాడి పరీక్షించాలి. 


నాడి ఆడుతున్నట్లయితే కొన ఊపిరితో ఉన్నట్లు.


ఈ నాడీ వ్యవస్థ కు ఉదానవాయువు ప్రధాన ఆధారం. 


ఈ వాయువు కు అత్యవసర ద్వారాలు కళ్ళు. 


కళ్ళ ద్వారా సరైన ఔషధం తో ప్రాణవాయువు ను అందించగలిగితే అది నాడీమండలం ను చైతన్యపరచును.


నాడీ మండలము శరీరమంతా వ్యాపించి యుండును కావున శరీరమంతటా వ్యాపించి యున్న వ్యాన వాయువును చైతన్యపరచును. 


ఈ వ్యాన వాయువు స్తంభించిన అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచును.


 అపాన వాయువు చైతన్యం వల్ల విసర్జక వ్యవస్థ,సమానవాయువు చైతన్యం వల్ల జీర్ణవ్యవస్థ, ప్రాణవాయువు చైతన్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థ చైతన్యం పొందుతాయి. 


ఈ విధంగా ఊపిరితిత్తులకు మళ్ళీ చలనం వస్తుంది. 


పంచప్రాణాలు పంచేంద్రియాలనబడు అత్యవసర ద్వారాలతో అనుసంధానించబడి ఉంటాయి

1.ప్రాణవాయువు - ముక్కు


2.సమాన వాయువు - నాలుక


3.అపాన వాయువు - చెవులు


4.వ్యాన వాయువు - చర్మం


5.ఉదాన వాయువు - కళ్ళు


అలాగే పంచప్రాణాలు వాటి కేంద్ర స్థానాలు


1.ప్రాణవాయువు - గుండె


2.సమానవాయువు - నాభి


3.అపానవాయువు - పాయువు


4.వ్యాపనవాయువు - శరీరమంతటా


5.ఉదానవాయువు - కంఠం

ఉదానవాయువు అనబడు పంచమప్రాణం గాలిలో కలవనంతవరకు పంచప్రాణాలు ఉన్నట్లే.


దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు "నా కంఠంలో ప్రాణమున్నంత వరకు" అని ఎందుకు అంటారో మరియు మరణశిక్షను ఉరిశిక్ష తో ఎందుకు అమలు చేస్తారో.


ఇది సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే సంక్షిప్త సంగ్రహణ వివరణ మాత్రమే.


ఇందులో మళ్ళీ పంచ ఉప ప్రాణవాయువులు వాటి స్థానాలు,విధులు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు, షడ్చక్రాలు,షడ్రసాలు,త్రిగుణాలు, త్రిదోషాలు,ద్వైతము,అద్వైతము 


ఇలా ప్రతీ ఆధ్యాత్మిక అంశం కూడా ఆరోగ్య సంబంధమే.


అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం.


ఆయుర్వేదం ఆయుః ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనంద రస మొదలగు సకలశాస్త్ర విజ్ఞానం.


కళ్ళతో శ్వాసక్రియ ఎలా అనే సందేహం కలగవచ్చు కొంతమంది విజ్ఞానులకు. 


దానికి సమాధానం విజ్ఞానం లో కూడా ఉంది.


అది ఏమిటంటే కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది కదా? 


అలాగే అత్యవసర పరిస్థితుల్లో మనిషికి పంచేంద్రియాలు శ్వాసేంద్రియాలు/ventilators అవుతాయి.


ఈతరాక నీటిలో మునిగిపోయిన వారిని రక్షించిన తరువాత వారి పొట్ట పై నొక్కుతారు.


నోటిలో నుండి నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దుతారు.


తలను గుడ్డ తో తుడిచి బట్టలు మార్చి చలిమంట దగ్గర కూర్చోబెడతారు.


ఈ ప్రథమ చికిత్స ఇంగ్లీష్ వైద్యం రాక ముందు లేదా? మరి దాన్ని నాటు చికిత్స అందామా ? 


దాని శాస్త్రీయత కూడా ఇదే. 


శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీమండల వ్యవస్థ ను చైతన్య పరచడం ద్వారా వ్యాన వాయువును తద్వారా అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచడం.


ఇక్కడ ventilator గా చర్మం (అరికాళ్ళు, అరిచేతులు, తల, ఒళ్ళు రుద్దడం తుడవడం) ద్వారా చికిత్స చేస్తాం.


పాము కరచినప్పుడు కొంతమంది ఆయుర్వేద వైద్యులు రావి ఆకుల కొనలను రెండు చెవుల్లో ఉంచడం ద్వారా బ్రతికిస్తారు. 


ఎలాగంటే పైన చెప్పినట్లు అపానవాయువు/విసర్జక వ్యవస్థ(విషాన్ని బయటకు విసర్జింపచేయడం) పనిచేయనప్పుడు చెవులు అత్యవసర ద్వారాలు.


చెవుల ద్వారా శ్వాసక్రియ జరిపించి పాము విష ప్రభావమును వికటింపచేసి మనిషిని కాపాడుతారు. 


ఇప్పుడు ఆ నైపుణ్యం కల వైద్యులు లేనంత మాత్రాన ఇది అసత్యం కాదు. 


ఉపయోగాలు ఆయుర్వేదం లో ఉన్నాయి.


కానీ ప్రయోగాలు అల్లోపతి లో చేస్తున్నారు.


మరి సత్యం ఎలా ఆవిష్కరించబడుతుంది? 


అందుకే ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలుపెట్టండి.


అద్భుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయి.


అవి ఉచిత పథకాలకు కూడా ఉపయోగపడి సామాన్యులకు ఉపయోగపడతాయి.

సేకరణ.....

Friday, November 26, 2021 2 comments By: visalakshi

తండ్రి ఆశీర్వాద శక్తి....

 #తండ్రి ఆశీర్వాదం* 


 అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. 


కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. 


ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. 


తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.


ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై  చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.

క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.  


త్వరలోనే  నగరంలోని సంపన్నులలో , ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. 


తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ,  ప్రామాణ్యతను కానీ  కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. 

ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.


ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” 


ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." 


ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.


సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. 


నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్  కుతూహలపడ్డాడు. 


ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.  


ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని  చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,  ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . 


భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు.


ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.  


తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 


నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.


జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు.


ఎవరని వాకబు చేయగా ఆయన  స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. 


వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. 


అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." 


సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.


సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా  కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా,వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. 


అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది.  వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని  అడిగాడు.


సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.


ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. 


అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం.


ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్  చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.


 అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.

" లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. 

అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.

“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక  మీరు ఏం సంపాదిస్తారు? ”

ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”


సుల్తాన్ ఇలా అడిగాడు,  “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" 


అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, “మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు",  అని ఆ మాటలు మాట్లాడుతూ , ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.


ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి,  ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 


ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.


సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. 


“ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” .


అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. 

అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. 


ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."


సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.

కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.


తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం. 


వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.


ఈ  ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.

సేకరణ...... From FB...

Saturday, November 13, 2021 1 comments By: visalakshi

కుండలినీ శక్తి..

 #కుండలినీ శక్తి - శ్రీ సుబ్రహ్మణ్య స్వామి*


కుండలినీ = పాము వంటి ఆకారము గలది,

కుండలినీ = మూడున్నర చుట్లు చుట్టుకొని సర్పాకారమున నిద్రించునది.


 చెవులకు పెట్టుకునే ఆభరణాల్లో కుండలాలు ప్రధానమైనవి. అవి చూడటానికి మండలాకారంలో పాము చుట్ట వలె వుంటుంది.


 కాబట్టి - "కుండలము అంటారు. జీవశక్తి - మూలాధార చక్రం దగ్గర  మూడున్నర చుట్లు చుట్టుకొన్న పాములాగా, తోకచేత ముఖాన్ని కప్పుకొని ఉన్నట్టు వుంటుంది కుండలిని అందువలన ఈ జీవశక్తిని గూడా “కుండలినీ శక్తి” అన్నారు.


అమ్మవారు కుండలినీ అనే శక్తిరూపంలో మన శరీరంలో ఉంటుంది.కుండలాలు కలది కుండలిని. కుండలం అనగా చుట్ట.అమ్మవారు మూలాధారచక్రంలో గుండ్రంగా ఉండి,మూడున్నర చుట్టలు చుట్టుకొని, తోకను నోట కరిచిపట్టుకొని పడుకొని మంచి గాఢనిద్రపోతున్న పాములాగా ఉండే శక్తిస్వరూపిణి.


బాలా మంత్రంలోని మూడు బీజాక్షరాలే ముక్కోణాలనీ, అవి కలిస్తే కుండలిని అనీ, లేదా జ్ఞాన, ఇచ్ఛా, క్రియా శక్తుల కలయికే కుండలిని అని యోగినీ హృదయంలో చెప్పారు.


ఇడా,పింగళా మధ్యలో సుషుమ్నా అనబడే నాడి ఉంటుంది.ఈ నాడికి మధ్యలో ఉన్న శక్తిని కుండలినీ అంటారని యోగశాస్త్ర నిర్వచనం.


జీవశక్తిః కుండలాఖ్యా-అనగా జీవశక్తిని కుండలినీ అంటారు.మనస్సుని జీవింపజేస్తూ పుర్యష్టకం అనే పేరుతో చక్కని సంపంగి పూలవాసనతో ఉండే దివ్యశక్తి కుండలిని అని చెప్పబడింది.


ఈ కుండలినీ శక్తి సమస్త జ్ఞానానికి, సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రము. దీని వినియోగము తెలియనంత కాలం - ఆది మూడున్నర చుట్లు చుట్టుకొని మూలాధారం దగ్గర  నిద్రావస్థలో వుంటుంది.


 వినియోగం తెలిసి, సాధన జరుగుచున్నపుడు - ఇది మేల్కాంచి, సుషుమ్నా మార్గం ద్వారా, ఊర్ద్వ గతిని చరించి, అన్నింటికన్న పైన వున్న సహస్రార కమలాన్ని చేరి, అక్కడ వున్న సదాశివునితో జేరి, సాధకునికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది.


వ్యక్తిలోని కుండలినీ శక్తిని 'వృష్టి కుండలినీ' అంటారు. ఈ వ్యష్టి కుండలినికి - సర్వదేవత అయిన 'సుబ్రహ్మణ్యస్వామి' లేదా 'కుమారస్వామి'ని అధిపతిగా చెబుతారు.


 వలయాకారంలో వుండే ఈ కుండలినికి అధిపతి కాబట్టి వల్లీనాధునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు.


కుండలినీ శక్తి బుద్దికి జ్ఞానంకి కేంద్రం కుమారస్వామి జ్ఞానానికి అధిపది అలాగే ఏదైనా పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి అనుకూలించడం లేదు అని అనుకున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్యం స్వామినే ఆరాధించమని చెప్తారు.


ఎందుకంటే ఈ కుమార స్వామి బుద్దిని తేజోవంతము చేసే కుండలినికి అధిపతి కనుక మనలో కుండలినీ శక్తిని మనకు ఉపయోగ పడేలా చేయమని వేడుకోవడం 

అలాగే సంతానం కోసం గర్భం నిలవడం కోసం కూడా కుండలినికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యం స్వామినే ఆరాధిస్తారు.


 అందరూ గురు ముఖంగా చక్రాలు చేదించి ఉపయోగం పొందలేరు అటువంటి వారికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన పద్ధతుల ద్వారా ఆ పదాల ఉచ్చారణ ద్వారా కుండలినీ లో కదలికలు మొదలై మూలాధారంలో జీవుడికి శక్తి ప్రసరిస్తుంది.


 మంత్రం అనేది మనలోని నాడులు మనలోని కుండలినీలో చలనం స్పందన కలిగించే విధంగా అమార్చబడి ఉంటాయి అందుకే ఏది ఎందుకోసమో తెలుసుకొని ఉచ్చారణ చేయాలి.


ఇక బ్రహ్మాండానికి వుండే కుండలినీ శక్తిని సమిష్టి కుండలినీ' అంటారు. ఈ సమిష్టి కుండలినికి 'అనంతుడు' లేదా 'ఆదిశేషువు'ను అధిపతిగా చెబుతారు.


మనలో కుండలినీ శక్తిని ఎలా కుమారస్వామి అధిపతిగా ఉండి రక్షిస్తున్నాడో అలాగే సృష్టి యొక్క సమిష్టి కుండలినీని ఆదిశేషుడు రక్షణగా ఉంటూ కాపాడతాడు అంటే ఆయనకు అధిపతి అయిన మహా విష్ణువు రక్షణకుడిగా ఉంది కపాడుతుంటాడు సృష్టికి ఆపద వాటిల్లి నప్పుడు మహావిష్ణువు రక్షిస్తాడు.


కుండలినీ శక్తి సహజంగా వేడిగా అగ్నితత్వం కలిగినది. ఇడానాడి - చంద్రతత్త్వం, పింగళా నాడి  సూర్యతత్త్వం, సుషుమ్నానాడి అగ్నితత్వం కలిగినవి. ఈ మూడింటిని వరుసగా గంగ, యమున, సరస్వతీ నదులతో సమన్వయిస్తారు.


అంటే సరస్వతి  అగ్నితత్వం కలిగినదన్నమాట! దీనిని బట్టి సరస్వతి (వాగ్దేవత), కుండలినీశక్తి - ఒకే తత్వం కలిగినవి. కాబట్టి, కుండలినీ శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి ఔతుంది.


ఈ వాక్కు కూడా జ్ఞానానికి సంబందించినది కుండలినీ సాధకులు యొక్క వాక్కు ఆమోగం వారి మాట వరంగా శాపంగా కూడా మారుతుంది ఎందుకంటే వాగ్దేవత వారికి సాధన ద్వారా వాకేసుద్ది ని ప్రసాధిస్తుంది.


 నిత్యం సంస్కృత శ్లోకాలు పఠించే వారికి కూడా వాకేసుద్ది లభిస్తుంది సంస్కృతం లోని ప్రతి అక్షరం బీజమే వాటికి అధిపది సరస్వతి రూపం లో ఉన్న అమ్మవారు ఈ సరస్వతి అగ్నితత్వం తో కుండలినిలో నివసిస్తుంది.


ఈ సంస్కృత శ్లోకాలు పఠనం వల్ల ఆ శక్తి మనలోని మలినాన్ని తొలగించి పాసిటివ్ ఎనర్జీ ని కాస్మిక్ ఎనర్జీ ని ఆకర్షిస్తుంది దానివల్ల పఠించే వారికి వాక్ శుద్ది పుష్కలంగా లభిస్తుంది.


*ఓం నమః శివాయ*:

ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరం “ఐం', దీన్ని 'వాగ్భవబీజం' అంటారు. ఈ బీజాక్షరంలో వున్న అక్షరాలను విడదీస్తే 'ఐం=అ+ఏ+మ్' అవుతుంది. 'ఏ' అనే అచ్బును మళ్ళీ విడదీస్తే 'ఏ=అ+ఇ' అవుతుంది.


కాబట్టి 'ఐం' లో 'అ,ఇ,ఆ,మ్' అక్షరాలు వుంటాయి. వీటిలో మూడు అక్షరాలు పూర్తిగా వున్నాయి కాబట్టి - మూడు పూర్తి చుట్లను, చివరిదైన 'మ్' (మవర్ణము) సగమే వుంది కాబట్టి - సగం చుట్టును సూచిస్తుంది.


 'ఐం' అనే కుండలినీ శక్తిలో మూడున్నర చుట్లు వున్నాయి అనడంలో ఔచిత్యం ఇదే! ఇది మంత్ర శాస్త్రపరమైన సమన్వయం.

ఇట్లు మూడున్నర చుట్లు గలది "కుండలినీ" అగును. ఈ కుండలినీ శక్తికి, కుటిలాంగీ - భుజంగీ - శక్తి - ఈశ్వరీ - అరుంధతీ - కుండలీ అనే నామాంతరాలు కలవు.


జీవి మానవ జన్మను పొందకపూర్వం- ఖనిజస్థితి (Mineral state), వృక్షస్థితి (Plant state), జంతుస్థితి (Animal state)కి సంబంధించిన కక్ష్యలను - దాటడం జరిగింది.


 కాబట్టి మూడు పూర్తి కక్ష్యలు పూర్తయినట్లు లెక్క ఇక మానవ జన్మను పొందినందుకు మాత్రం సగం చుట్టు గూడా పూర్తవుతుంది. మానవ జన్మను పొందినంత మాత్రాన పూర్తి చుట్టు పూర్తవదు.


ఆ జన్మను పొంది, తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును గూడా పూర్తి చేసుకుంటే - నాలుగు రకాల కక్ష్యలను దాటి జీవన్ముక్తుడౌతాడు. అంటే పూర్తికావలసిన సగం చుట్టు - యోగ సాధన ద్వారా పూర్తి కావాలి.


ఈ విషయాన్ని తెలియచెయ్యడం కోసమే జీవశక్తి అయిన కుండలిని - మానవులందరిలో ‘మూడున్నర చుట్లు చుట్టుకొని వుంటుంది' అనడం. ఇది జీవపరిణామ శాస్త్రసమన్వయం. 


కుండలినీ కి మరో పేర్లు

1. కుటిలాంగి

2. శక్తి

3. కుండలిని

4. కుండలి

5. భుజంగి

6. ఈశ్వరి

7. అరుంధతి.

ఈ ఏడు పేర్లు కుండలినికి నామాంతరాలు.


వివిధ పురాణాలలో కుండలినీ గురించి..


తంత్రరాజంలో కుండలిని గురించి ఈ విధంగా ఉంది.


మూలాధారంలో అగ్ని తేజస్సు మధ్యన ఉన్నదై జీవశక్తి తేజోరూపమైన ప్రాణాకారము కలది, సర్పాకారంలో మూడు చుట్టలు చుట్టుకుని నిద్రిస్తూ ఉంటుంది.


సుషుమ్న మధ్యలో మాయాశీర్షముపై నుండి బుసకొడుతూ ఉంటుంది. చెవులు మూసుకుని ఎవరు ఆ ధ్వనిని వినలేడో, అతడికి త్వరలో మృత్యువు ప్రాప్తిస్తుంది, అని ఉన్నది. 


దేవీపురాణంలో కుండలినీ శక్తిని గురించి చెబుతూ


యత శృృంగాటకాకారా కుండలి న్యుచ్యతే తతః


అన్నారు అంటే - కుండలినీ శక్తి శృంగాటకాకారము గలది. శృంగాటకము అంటే త్రికోణము అని అర్ధం. ఇచ్చా జ్ఞానక్రియాశక్తులే శృంగాటకము అని యోగినీ

హృదయం చెబుతోంది.


మూలాధారంలో భుజంగాకారంలో చుట్టలు చుట్టుకుని తేజోరూపంలో ప్రకాశించేదే కుండలిని. పంచదశీ మంత్రానికి వాగ్బీజమే కుండలిని.


మేరుదండానికి చివర

మూలాధారానికి దగ్గరగా యోనికమునందు అగ్ని తేజస్సుతో ప్రకాశించే జీవశక్తికి కుండలిని అని పేరు. ఇది సర్వశక్తులకు, సమస్త జ్ఞానాలకు మూలమైనది. అజ్ఞానదశలో ఈ శక్తి నిద్రాణమై ఉంటుంది. జ్ఞానదశలో అది జాగృతమై సాధకుడికి సర్వశక్తులు ప్రసాదిస్తుంది.

సాధన ద్వారా ఈ శక్తిని సహస్రారానికి చేర్చాలి. 


మూలాధారమందు ఆత్మ తేజస్సు వహ్నిరూపమై ఉండును.  ఆ తేజోమధ్యమందు కుండలమను జీవశక్తి గలదు. అది తేజోమయము, ప్రాణాధారము అయినది. మూడున్నర చుట్టలు చుట్టుకొని పరుండిన పామువలె ఉండి, మిక్కిలి కాంతిగలదై యుండును. దానికి మాయయే శిరస్సు. అది ఎల్లప్పుడు ధ్వనించుచుండును.కుండలినీ శక్తి సుషుమ్నా నాడీ మధ్యప్రదేశమందు  ఉండును. 


రుద్రయామళంలో కుండలినీ స్తుతి చేస్తూ...


జన్మోద్ధార విరక్షిణీ హ తరుణీ వేదాది బీజాదిమా

నిత్యం చేతసి భావ్యతే భువి కదా సద్వాక్య సంచారిణీ

మాంపాతు ప్రియదాస భావకపదం సంఘాతయే శ్రీధరే

ధాత్రి ! త్వం స్వయ మాదిదేవవనితా దీనాతిదీనం పశుమ్‌ ॥


ఓ పరత్పరీ ! శివుని అర్థాంగి అయిన ఓ పార్వతీ ! నువ్వు సర్వకాల సర్వావస్థల యందు ఉపనిషద్వాక్యముల యందు సంచరిస్తుంటావు. నీవు నిత్యయవ్వనవు. మమ్ములను ఉద్ధరించటానికి సదా మెలకువతో ఉంటావు. అట్టి నిన్నునేను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాను.

 


కుండలిని వ్యక్తిలోనిది కావడం చేత "వ్యష్టికుండలిని" అంటారు. ఈ వ్యష్టికుండలినికి అధిదేవత జగన్మాత.   

బ్రహ్మాండానికి ఉండే కుండలినీ శక్తిని "సమిష్టికుండలిని" అంటారు. దీనికి అధిదేవత ఆదిశేషువు లేదా అనంతుడు.


కుండలిని (సుబ్రహ్మణ్యేశ్వరుని స్వరూపం) సర్పాకారంలో మూలాధారంన ఉంటుంది. పృథ్వీతత్వము గలది. అధిదేవత గణపతి.


అమ్మ (కుండలినీ శక్తి) అక్కడకు వెళుతుంది. అయ్యవారితో ఉంటుంది, తన అగ్నితత్వంతో అక్కడ చల్లదనానికి ఘనీభవించిన సుధా ధారలను కరిగించి సాధకునిపై కురిపించి, సాధకుని జన్మచరితార్థము చేయుచున్నది.


 అంతటితో ఆ సాధకుడు తనకు కావలసింది తనకు లభించిందని అన్ని ఆనందములకూ పరాకాష్ఠ అయిన బ్రహ్మానందాన్ని పొందుతాడు.


సిద్దార్థీ నిజదోషవిత్‌ స్థలగతి ర్వ్యాయీయతే విద్యయా

కుండల్యా కులమార్గ ముక్తనగరీ మాయా కుమార్గా శ్రియా

య ద్యేవం భజతి ప్రభాతసమయే మధ్యాహ్నకాలే థవా

నిత్యం యః కులకుండలీ జప పదాంభోజం స సిద్ధో భవేత్‌ ॥


దేవీ ! కుండలినీ శక్తిగా ఉన్న నీ పాదాలను త్రిసంధ్యలయందు ధ్యానించేవారు సిద్దులవుతారు.


పాము ఆకారము గలది. వాగ్భవ బీజ స్వరూపురాలు - అని ఈ నామానికి అర్ధాలు చెప్పుకోవచ్చును.


ఈ కుండలినియే ప్రాణశక్తి రూపిణియై సర్పాకారంగా సహస్రారం నుండి మూలాధారం వరకు అనగా యోని కందం వరకు తలక్రిందులుగా మూడున్నర మెలికలి తిరిగి ఉన్నది అనియు, సుబ్ధావస్థలో ఉన్నది అనియు, మేరు దండమును (వెన్నెముక) ఆశ్రయించి ఉన్నది అనియు మొదలైన విషయాలు వెనుక వివరింప బడినవి. "కుండలినీ” సిద్దులై శ్రీదేవి కరుణను పొంది తరింతురు గాక!


బిందువు కాంతితో ప్రకాశ అంశగా , సదాశివుడుగా,  కాంతి నాద అస్తిత్వమై , మిశ్రమ అవ్యక్త బిందువు వ్యక్త ప్రకృతిగా ప్రకటమైన ఆ తల్లి తిరిగి ఊర్ధ్వ ప్రయాణంలో సదాశివుడిని ఐక్యం చేసుకొని బిందువు గా మారుతున్నది. జీవితం అంతా శక్తి రూపాంతరమే అనే సత్యం తెలుసుకోకపోతే అంతా మాయగానే కనపడుతుంది. 


ఆ తల్లి ఈ శరీరంలో జీవ శక్తిగా కుండలిని రూపంగా నాడు లలో ప్రవహిస్తూ నిత్యం మనను శాసిస్తూ ఉంది. 


ఆ తల్లి ఒడిలో చేరితే సమస్త శక్తులు మన అధీనం లోనికి వస్తాయి. లేకపోతె అవే శక్తులు మనలను సాధిస్తాయి. 


ఈ అంతర్యాగం లేకపోతె సదాశివునితో మొదలైన ఆమె ప్రకృతి వికృతిగా మారి విశ్వ పదార్థ పరిణామ చక్రంలో ప్రవేశిస్తుంది. ఇదే జీవికి మరణం. అది వచ్చే లోపు మనం సాధనతో ఆ తల్లి ఒడిలో చేరాలి. 


మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కనుక మనం ఎప్పుడూ ఆ  తల్లి ఆరాధనలోనే ఉండాలి!


గోళాకారముగా సృష్టి నిర్మాణము గావించి, అందుండి అండాకారములుగా బ్రహ్మాండము నుండి పిండాండము వరకు సృష్టి నిర్మాణము చేయునది శ్రీలలిత అని అర్థము. మూలాధారమందలి అగ్ని తేజస్సు యందు ఉన్న జీవశక్తి కుండలినే.


తేజోరూపమైన ప్రాణాకారము కలిగి సర్పమువలె మూలమున స్థితిగొని యుండి, సుషుమ్న మార్గమున సహస్రారము వరకు వ్యాపింపగల తేజస్విని కుండలిని. ప్రాణుల యందలి జీవచైతన్యమే కుండలిని. ఈ కుండలినీ మార్గము సృష్టియందు సత్యలోకము నుండి భూలోకము వరకు తీగవలె చుట్టలు చుట్టలుగా వ్యాపించి యుండును. 


భూమండలము, సూర్యమండలము, సవితృ మండలము, భర్గోదేవ మండలము వ్యాపించి సర్వమును నిర్వర్తించుచు నుండును. వాక్కు రూపమున ఉద్భవించునది కనుక వాగ్భవ అని కూడ కుండలినీ చైతన్యమును పిలుతురు. జీవ చైతన్యము ఏ లోకమున స్థితి గొనినదో ఆ లోకము వరకు వ్యాపించి కుండలిని యుండును. 


మానవునియందు భౌతిక, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వ్యాపించి, విజ్ఞానమయపు అంచుల వరకు కుండలినీ చైతన్యమున్నదని తెలుపుదురు. కారణము ఏమనగా మానవునికి భౌతికము, ప్రాణమయము, మనోమయము అగు లోకములు అవగతమై ఉండుటయే. 


కొంత బుద్ధికూడ ప్రతిమానవునియందును ఉండుటచే, మూడున్నర చుట్టలుగా కుండలినీ చైతన్యమున్నదని అందురు. బుద్ధిలోకమున ప్రవేశించిన వారికి కుండలిని నాలుగు చుట్టలుగా ఉండును.


అట్లే ఆనందమయ లోకమున ఐదుగను, అనుపాదక లోకమున ఆరుగను, ఆదిలోకమున ఏడుగను చుట్టలు గలిగి యుండును. ఏడు చుట్టల కుండలినీ చైతన్యము వ్యాపించినపుడు, సహస్రారమందలి శివతత్త్వముతో చేరినప్పుడు, సుస్థిరురాలై యుండును. కుండలినీ చైతన్యము ఊర్ధ్వగతి చెందుట యనగా జీవుడు పరిణతి చెందుటయే.


#కుండలినీ పూర్తి సంపూర్ణ వివరణ:-


కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. 


మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ.


 కుండలినీ యోగలో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.


శక్తి రెండు రకాలుగా ఉంటుంది....


 ఒకటి స్థితి శక్తి (Potential Energy), 


రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy).


 శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. 


యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవచ్చును.


కామ, 

క్రోధ, 

లోభ, 

మోహ, 

మద, 

మాత్సర్యాలనే  " అరిషడ్వర్గాలను " జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. 


కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు ....


దేహ శుద్ధి (purification of body), 


నాడీ శుద్ధి (purification of nadis/nervous system),


 మనో శుద్ధి (purification of mind), 


బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.


 నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. 


ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.


#చక్రాలు 


వెన్నెముక లో ఉండే చక్రాలు

ప్రధాన వ్యాసము : సప్తచక్రాలు

షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.


1)మూలాధార చక్రము (Mooladhara) :-


గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం "లం".


 మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.


2)స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) :-


 లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం "వం".


3)మణిపూరక చక్రము (Manipura) :-


 నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.


4) అనాహత చక్రము (Anahatha) :-


హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం "యం".


5) విశుద్ధి చక్రము (Vishuddha) :-


కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం "హం".


6)ఆజ్ఞా చక్రము (Ajna) :-


భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.


7) సహస్రార చక్రము (Sahasrara) :-


 బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. బీజాక్షరం "ఓం".


సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది.

దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.


#సప్తచక్రాలు 


శ్రీ విద్య లోను, వివిధ తంత్రముల లోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రము లుండును.


 మూలాధార చక్రము :-

********


పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. 


నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది.


 ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.


మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. 


ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. 


514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ”ను వర్ణిస్తాయి. 


 నామములు :-

""'''''"'''''''''''''''''''''''''""

 మూలాధారామ్భుజారూఢ,

 పంచవక్తాృయ,

 ఆస్ధిసంసితాయ, 

అంకుశాది ప్రహరణాయ,

 వరదాది నిషేవితాయ,

 ముద్గౌదనాసక్తాయ.

 మూలాధారస్ధపద్మే, 

 శృతి దళలసితే, 

 పంచవక్త్రాం త్రినేత్రాం,

 ధూమ్రాభా, 

 మస్ది సంస్దాం 

  సృణి మపి 

 కమలం పుస్తకం 

 జ్ఞానముద్రాం

 బిభ్రాణం   బాహుదండైస్సులలిత వరదా

 పూర్వ శక్త్యన్వితాoతం

ముద్గాన్నాసక్త చిత్తాం

 మధుమదముదితాం 

సాకినీ భావయామి.


మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. 


ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది.


 ఈమెకు ఐదు ముఖములు....

 శబ్దము, 

 స్పర్శ, 

 రూపము, 

 రసము, 

 గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. 


గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. 


ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. 


 వజ్రేశ్వరి :-

""""""""""""""

ఈ దేవతకి నాలుగు చేతులు...

 అంకుశము, 

 కమలం, 

 పుస్తకము, 

 జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.


సాకిన్యాంబ వరదాది దేవతలు  :-


 1. వరద 

 2. శ్రియ 

 3. షండా 

 4. సరస్వతి 


(  వo, శo, షo, సo అను మూలాక్షరాల ) దేవతలచే కొలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.


 స్వాధిష్ఠాన చక్రము :-

*********


లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.


ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః 


ఈ స్వాధిష్ఠాన కమలం ఆరు దళాలుగల జలతత్త్వం కలది. అధిదేవత "కాకిని".


    ఈమె బం, భం, మం, యం, రం, లం అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి.


'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా  దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ  మేధో దాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  

స్వాధిష్టానం

 (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవమునకు తీసుకొచ్చే చక్రమిది. 


జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే.  జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది. 


ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం.


 జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కి సహాయకారి. 


    దీనిలోశక్తి  చైతన్య రూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది.


  మణిపూరక చక్రము :-

*********


నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.


  లాకిన్యంబాస్వరూపిణి :-

"""""""""""""""""""""""""""

6 నామాములు / 3 వ చక్రము . 


(495) నుండి (502) వరకూ నామములు :-


 మణిపూరాబ్జనిలయ,

 వదనత్రయసంయుతా,

 వజ్రాధికాయుధోపేతాయ,

 డామర్యాదిభిరావృతాయ,

 రక్తవర్ణాయ, 

 మాంసనిష్టాయ,

 గుడాన్నప్రీతాయ, 

 సమస్తభక్త సుఖదాయ ,

 దిక్పత్రే, 

 నాభిపద్మే, 

 త్రివదన విలస ద్దంష్ట్రిణీం,

 రక్తవర్ణాం,

 శక్తిం ,

 దంభోళి ,

 దండావ భయమపి,

 భుజైర్దారయంతీo ,

 మహోగ్రాం ,

 డామర్యాద్త్యై: ,

 పరీతాం ,

 పశుజన భయదాం,

 మాంసధాత్వేక నిష్టాం,

 గౌడన్నసక్త చిత్తాం ,

 సకల సుఖకరీం ,

 లాకినీమ్ ,

 భావయామి:


నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది. 


పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు. 


గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును. 


మూడు ముఖములు కలది....

 గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. 


నాలుగు చేతులు కలది.....

వజ్రం,

శక్తి, 

దండము, 

అభయ ముద్రలు ధరించింది.


 డామరము ఆది దేవతలచే పరివేష్టించబడింది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు. 


ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లంతో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది. 


అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.


  మణిపూరక చక్రం మంత్రం :-

"""""""""""""""""""""""""""

 ‘ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”


  మణిపూరకచక్రం :-

"""'"""""""""""""""""""""""


ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత "లాకిని". 


ఈమె .....

డo, ఢo, ణo, తo, థo, దo, ధo, నo, పo, ఫo అను యోగినులచే ఆరాధింపబడుచున్నది.


 వాహనం పొట్టేలు.


 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.


బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.


ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. 


ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. 


శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. 


పుట్టుట, 

జీవించుట, 

మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. 


అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. 


ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. 


ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే ...

 అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది. 


నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి.


 

తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం.


 తెరుచుకుంటే .....

 లక్ష్యసాధన, 

 ఆశయసిద్ధి, 

 వ్యవహార దక్షత, 

 ఉత్సాహం, 

 ధనాపేక్ష, 

 తన్ను తాను గౌరవించుకోవడం,

 ఆత్మవిశ్వాసం కల్గివుండడం,

 జీవితంలో అన్నింటా ముందడుగు. 


ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి  చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. 


మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.


లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. 


ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.


మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం? 


ఈ చక్రమునకు "లాకిని" దేవత.


 సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. 


ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 


ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే అనుభూతులను  ( ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. 


దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి.


 సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. 


అదే మాదిరిగా నవగ్రహాలలో ....


 గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.


శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది.


తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా!

స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్! 

తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్!

నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం!!


మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది.


 నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.


  

అనాహత చక్రము  :-

********


హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.


రాకిన్యాంబస్వరూపిణి

- (494) (9 నామములు) (4 వ చక్రము)

అనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు)


హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్

చక్రం, శూలం, కపాలం, డమరుపి – భుజైర్ధారయంతీ త్రినేత్రాం

రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం 

శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః


ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు ఉన్నాయి. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడింది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.


క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు "ద్వాదశ శక్తులు". అవి...

కo,ఖo,గo, ఘo,ఙo, చo,ఛo,జం'ఝం'ఞం'టo,ఠo.


1. కాళరాత్రి

2. ఖాతీత,

3. గాయత్రి

4. ఘంటాధారిణి

5. జామిని

6. చంద్రా

7. ఛాయా

8. జయా

9. ఝుంకారి

10. జ్ఞానరూప

11. టంకహస్తా

12. ఠంకారిణి


   విశుద్ధి చక్రము :-

*****


కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.


  డాకినేశ్వరి :-

""""""""""""""""""

 (5 వ చక్రము) విశుద్ధి చక్ర అధిష్టానదేవత “డాకిని”. 


(475 నుండి 483 వరకూ డాకిని దేవత లక్షణాలు వర్ణించబడినవి.)


 ఆరక్తవర్ణాయ,

 త్రిలోచనాయ,

 ఖట్వాంగాది ప్రహరణాయ,

 వదనైకసమన్వితాయ,

 పాయసాన్నప్రియాయ, 

 త్వక్ స్ధాయ,

 పశులోకభయంకరాయ,

 అమృతాధి , 

మహాశక్తిసంవృతాయ. 

(8 నామములు)


గ్రీవాకూపే, 

విశుద్దే, 

నృపదళకమలే, 

శ్వేతరక్తాం, 

త్రినేత్రాం


హస్తే :-

"""""""""

ఖట్వాంగ, 

ఖడ్గౌ, 

త్రిశిఖమపి, 

మహాచర్మ 

సంధారయంతీమ్

వక్త్రేణేకేనయుక్తాం,

 పశుజనభయదాం,

 పాయసాన్యైక సక్తాం

త్వక్ద్సా వందేహమృతాద్యై:

 పరివృతవపుషాం, 

డాకినీo, 

వీరవంద్యామ్.


డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు అన్నీ “డ” కార సంభందమైనవి.


 డాకినీ వర్ణము ఎఱుపు.ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు.


జీవి పిండ దశలో ‘శుక్ల + రక్త “ సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. 


ఈ పిండ స్థితి డాకినీ స్థితి. ఈమె త్రిలోచన .....

భూత, 

భవిష్యత్, 

వర్తమానాలు చూడగలది.


 ఖట్వాంగము, 

ఖడ్గము, 

త్రిశూలము, 

చర్మము ఆయుధములుగా గల దేవత. 


  బీజాక్షరములు :-

"""""""""""""""""""""""

అం,ఆం,ఇం,ఈం,ఉం,ఊం,ఋం,ౠం,ఎం,ఏం,ఐం,ఒం,ఓం,ఔం,అం,అఃం....


  హాకినీరూపధారిణి :-

""""""""""""""""""""""""""""

 6 నామములు / 6 వ చక్రము...


 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.


 ఆజ్ఞాచక్రాబ్జనిలయా, 

శుక్లవర్ణా, 

షడాననా, 

మజ్జాసంస్దాయ, 

హంసవతీ 

ముఖ్యశక్తి 

సమన్విత, 

హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే 

బిందుపద్మే 

దళయుగ కలితే, 

శుక్లవర్ణాం, 

కరాబ్జైమ్

విభ్రాణాo 

జ్ఞానముద్రాం, 

డమరుకమలా, 

మక్షమాలాం, 

కపాలం 

షట్చక్రాధారమధ్యామ్,

 త్రినయన లసితాం, 

 హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం,

 సకలశుభకరీం, 

 హాకినీం భావయామః


  ఆజ్ఞా చక్రము :-

***


 భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. 


దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని.


 ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. 


ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. 


    ఆజ్ఞా చక్రము  :-

"""""""""""""""""""""""""


భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.


హాకినీరూపధారిణి :- 

""'""""""""""""""""""""""""""""

6 నామములు / 6 వ చక్రము....


521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.


 ఆజ్ఞాచక్రాబ్జనిలయా, 

శుక్లవర్ణా, 

షడాననా, 

మజ్జాసంస్దాయ, 

హంసవతీ 

ముఖ్యశక్తి 

సమన్విత, 

హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, 

శుక్లవర్ణాం, 

కరాబ్జైమ్ ,

విభ్రాణాo జ్ఞానముద్రాం,

 డమరుకమలా, 

మక్షమాలాం, 

కపాలం 

షట్చక్రాధారమధ్యామ్,

 త్రినయన లసితాం, 

హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం,

 సకలశుభకరీం, 

హాకినీం భావయామః


ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. 


ఇది రెండు దళముల పద్మము.


   బీజాక్షరములు :-

"""""""""""""""'""""""""""

 ‘హo’ ‘క్షo’ .


 హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మము ని ఆశ్రయించారు. 

పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.


 సహస్రార చక్రము :-

*******


బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. బీజాక్షరం "ఓం ".


సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు.


 ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.


  యాకిన్యంబస్వరూపిణి :-

"""""""""""""""""""""""""""""""""""""


 6 నామములు / 7 వ చక్రము ...


528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. 


(సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)


ముండవ్యోమస్ధ పద్మే దశశతదళకే కర్ణికా చంద్రసంస్దామ్

రేతో నిష్టాం, సమస్తాయుధ కలితకరాం, సర్వతోవక్త్రపద్మాం

ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం

సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః!!


శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది.


 యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. 


ఈ 7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల....

 వర్ణములు, 

 రంగులు,

 అక్షరములు, 

 విద్యలు,

 ధ్వనులు,

 బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది.


 ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది.


 ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.


ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు.

ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. 


ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే "అద్వైతస్థితి".


ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ..., 


అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ...,


 స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును... వ్యక్తం చేయును.


తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.


రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. 


సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. 


ఈ మూడును మూడు లోకములుగా అంటే .....

భూలోకం (తమస్సు),

భువర్లోకం (రజస్సు),

సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.


  సహస్రారచక్రం :-

"""""""""""""""""""""""


సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ!!


ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది.

అధిదేవత యాకిని. 


అ కారాది క్ష కారంత వర్ణమాల యోగినీ గణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.


మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం "విశ్వాత్మ" నివాస స్థానం. "పరమాత్మ స్థానం". 


ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. 


ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.


ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. 

గ్రహణశక్తి లోపిస్తుంది. 

భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు.

 కష్టదుఃఖాలు పొందుతుంటారు. 

పునర్జన్మలు తప్పవు. 


  ఈ చక్ర మానసిక స్వభావం :-

"""""""""""""""""""""""""""

 ఈ చక్రం జాగృతయితే....


సాధకుడు అమరుడౌతాడు.

పరమాత్మగా వ్యక్తమౌతాడు.

తనను తాను తెలుసుకుంటాడు.

ఇది ఈశ్వరీయత స్థితి. "ఈశ్వరత్వం" పొందుతారు. 


ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే :-


తలపు, 

మాట, 

చేత యోగ్యంగా త్రికరణ శుద్ధి వుండాలి.


క్రమశిక్షణ, 

ఆచరణ, 

విశ్వాసం కలిగియుండాలి.


ధ్యానం, 

బ్రహ్మతత్త్వజ్ఞానం, 

స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) 

ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి. 


ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.


ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి.


 అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్ని చక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. 


క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం.


 కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి.


ప్రార్థన అంటే... దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును "ఇహం" నుండి "పరం" వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధం చేసుకొని, "దేహమే దేవాలయమని", "అంతరాన్నే అంతర్యామి" కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన, సాధనలు చేయాలి. 


ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించు కోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.


ఈ కుండలిని సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు "'అహంబ్రహ్మాస్మి'" అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. 


అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా సరైన రీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేస్తే సాధనతో... స్థలం నుండి సూక్ష్మము, ప్రజ్ఞామయం వరకు పయనించి '"అహం బ్రహ్మస్మి"' అన్న స్థితిని పొందడమే మానవ జీవన పరమావధి.

సేకరణ.... 

Friday, November 12, 2021 1 comments By: visalakshi

అయ్యప్పస్వామి దీక్ష..

 
#అయ్యప్పదీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు*


⚜️ అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్ర ధారణ, మాల ధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నింటిలోను అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంత పరమైన రహస్యాలున్నాయి. 


⚜️ ఒంటిమీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భాసిస్తుంటే, నుదుటపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని నుతించేలా చేస్తుంది. 


 ⚜️ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్పపూజ విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది.

 

⚜️అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. ఈ పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ ఒక్కో దేవత వుంటుంది. మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం. ఈ సోపానాలపై పద్దెనిమిదిమంది దేవతలను ఆవాహన చేశారు. "ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం" అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ వున్నాయి. వీటన్నింటిని దాటుకొని వెళితేనే జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది.

 

⚜️ ఈ ఆలయంలో స్వామి ప్రతిష్టుడైన సందర్భంగా, మృదంగ, భేరీ, కాహళ, దుంధుబి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే పద్దెనిమిది వాద్యాలు మోగించారు. ఇదీ ఈ మెట్లకున్న నియమ ప్రాముఖ్యం. 


⚜️ నలభై రోజులు దీక్ష చేసినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి. అప్పుడే ఆ ఆనందరూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల క్రింద ఎంతో మహిమాన్వితమైన, పవిత్రమైన యంత్రస్థాపన జరిగింది. యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతమూ, శక్తిమంతమూ కాబట్టే వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమ నిష్టలతో దాటాలి.


⚜️ అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాల దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి.


⚜️ ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్ష మాలలను ధరిస్తారు. రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవధ్యానానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షల లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి.

 

⚜️ దీక్షా సమయంలో పాటించే ఆహారనియమం శరీరాన్ని అదుపులో ఉంచి, చెడు కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు వుంటుంది. అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం. నల్లరాళ్ళను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ ముఖ్యోద్దేశం.

 

⚜️ అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం, విభూతి ధరిస్తారు. అయ్యప్ప విభూతి అన్నిటినీ మించిన దివ్యఔషధం. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైన విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి. అంతేకాక వాత, పిత్త, కఫం వంటి రోగాలు దరిచేరవు.

 

⚜️ 40 రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకొన్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడిలో బయలుదేరతారు. ఇరుముడిలో రెండు భాగాలు వుంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణ గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమగుండంలో వేయాలి. 

 

 ⚜️కామ క్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్ళను త్రోసి, జ్ఞానమనే నెయ్యిని పోసి, భక్తి నిష్ఠలనే ఇరుముడులను వేసి నలభై ఒక్క రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్ధం.* 


⚜️ వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్దకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకొనేసరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధకర్మను వదిలివేయాలని అర్ధం.


⚜️‌ ఆవునెయ్యి శక్తికి సంకేతం. స్వామి వారికి అభిషేకించిన నేతిని సర్వరోగ నివారిణిగా సేవిస్తే తప్పనిసరిగా సత్ఫలితం చేకూరుతుంది. ఆవునెయ్యి సహజంగానే చాల పవిత్రమైంది, ఆరోగ్యమైంది. ఆవునేతిని కొబ్బరికాయలో నింపి స్వామివారిని అభిషేకించగానే దానికి ఎనలేని మహిమ వస్తుందని భక్తుల నమ్మకం.

 

⚜️శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండి హాని కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేసి, వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్పలకు కవచంగా తోడ్పడుతుంది. శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు. వీరి నియమనిష్ఠలే వారిని సర్వరోగాల నుండి రక్షించి కాపాడుతాయి. ఎరుమేలి నుండి ఒంటిమీద ఆచ్చాదన లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళుతుంటే అక్కడ వుండే ఎన్నో రకాల ఔషధవృక్షాల నుంచి వచ్చే మలయ మారుతాలు శరీరాన్ని తాకి రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అక్కడ పారే సెలయేళ్ళు, అళుదానది, పంబానది కూడా ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగుతాయి.

 

⚜️ యోగపట్టం ధరించిన దివ్యాసనాలతో వుంటాడు అయ్యప్ప స్వామి. అన్ని యోగరహస్యాలు స్వామి మూర్తిలోను, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫుటమవుతాయి. 


⚜️పూర్ణ సంఖ్య అయిన 18, పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం.మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు రెండు పూటలా స్వామిని అర్చించి, నలభై ఒక్క రోజులు అయ్యప్ప వ్రతదీక్షాపరులై  నియమనిష్ఠలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమలై చేరుకొని అష్టాదశ సోపానాలు అధిరోహించి, హరిహర పుత్రుని దర్శించి సాయుజ్యాన్ని పొందుతారు.


#శబరిమలలో స్వామికి జరిగే నిత్య కైంకర్యాలు*


హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

 

హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా నిర్వహించే పూజాదికాలతో పాటూ పంప, ఎరుమేలిల్లోని ఉత్సవాలూ భక్తులకు కనువిందు చేస్తాయి. మండలం, మకర విలక్కు సందర్భాల్లో ఉదయం 7.30 గంటలకు నిర్వహించేది ఉషపూజ. ఈ పూజను మేల్‌సంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ‘ఉష పాయసాన్ని’ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో తంత్రి ఆధ్వర్యంలో జరిగే పూజ ఉచపూజ. ఈ పూజలో ప్రత్యేకంగా తయారు చేసిన 25 కలశాలను ఉంచి, ఎలనైవేద్యం, ఆరవణ పాయసాలను స్వామివారికి నివేదిస్తారు. రాత్రిపూట అదాజ పూజను మేల్‌సంతి చేస్తారు. ఈ సమయంలో ఎలనైవేద్యం, అప్పంలను నైవేద్యంగా సమర్పిస్తారు.


సన్నిధానానికి దీక్షతీసుకున్న భక్తుల్ని చేర్చే పద్దెనిమిది మెట్లకు పడి పూజ చేస్తారు. మండలం, మకర విలక్కు సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి పూజను చేసేదీ లేనిదీ నిర్ణయిస్తారు. అయితే మలయాళ మాసాల్లో ఆలయాన్ని తెరిచిన ప్రతి సందర్భంలోనూ పడి పూజ చేస్తారు. ఈ పూజ తంత్రి ఆధ్వర్యంలో, మేల్‌సంతి సహకారంతో జరుగుతుంది. మకరజ్యోతి దర్శనం తర్వాత, ఆలయాన్ని మూసివేసే ముందు పడిపూజ నిర్వహిస్తుంటారు.


మండల పూజ సమయంలో పదిరోజులపాటు ‘ఉల్సవం’ పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందు తంత్రి ఆధ్వర్యంలో ‘కొడిమరం’ అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలూ, అభిషేకాలూ ఉంటాయి. చివరి రోజున ఉత్సవమూర్తిని గజారోహణంపై ఊరేగించి, పంపకు తీసుకొస్తారు. అక్కడ పవిత్ర స్నానం చేయించి ‘ఆరాట్టు’ వేడుక జరుపుతారు. ఈ కార్యక్రమానికి మేల్‌సంతి ఆధ్వర్యం వహిస్తారు.


మాలికాపురత్తమ్మ శబరిమల నుంచి శరంగుత్తి వరకూ గజారోహం ద్వారా సాగించే యాత్రే ఎజున్నెలిప్పు. అలంకరించిన ఏనుగు మీద అమ్మవారి ప్రతిమను ఉంచి, స్వామి సన్నిధి మీదుగా శరంగుత్తికి తోడ్కొనివస్తారు. అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరాలను చూసి వెనుదిరిగి పదునెట్టాంబడి మీదుగా మాలికాపురత్తమ్మ ఆలయానికి ఈ ఊరేగింపు సాగుతుంది. శరాలను చూసిన ఏనుగు విషణ్ణవదనంతో వెనక్కి వస్తుందని భక్తులు చెబుతారు.


మకర విలక్కు తర్వాత సన్నిధానాన్ని మూసే ముందు రోజు అమ్మవారి ఆలయంలో పందళరాజు నిర్వహించే కార్యక్రమమే గురుథి. ఆ రోజు రాత్రంతా రాజు ఆలయంలోనే ఉంటారు. ఈ సందర్భంలో అక్కడ ఎవరికీ ప్రవేశం ఉండదు.


జ్యోతి దర్శనానికి ముందు రోజు పంపానది తీరంలో భారీ ఎత్తున జరిగే అన్నదాన కార్యక్రమమే పంప సద్య. ఇతిహాసాల ప్రకారం వేటకు వెళ్లిన అయ్యప్ప ఇక్కడే తన సన్నిహితులకు అన్నదానం చేశారనీ, దానికి సంబంధించిందే ఈ కార్యక్రమమనీ అంటారు. అనంతరం పంప విలక్కు పేరుతో దీపాలు వెలిగించిన ఓ పడవను నదిలో వదులుతారు.


ఎరుమేలిలోని వావర్‌ మసీదు దగ్గర ముస్లింలు చేసే వేడుక చందనకుడం. మకర విలక్కు సమయంలోనే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలంకరించిన ఏనుగుల మీద చందన కలశాలు ఉంచి మేళతాళాలతో మసీదుకు వచ్చి అయ్యప్ప స్నేహితుడైన వావర్‌కు నైవేద్యంగా ఇస్తారు.


అంబళ్‌పుజ-అలంగత్‌ పేటతుల్లాల్‌ : సందళ్‌పేట తరువాత అంబళ్‌పుజ, అలంగత్‌ అనే ప్రాంతాల ప్రజలు ఎరుమేలిలో భారీయెత్తున పేటతుల్లాల్‌ అనే వేడుకను జరుపుతారు. వీరంతా వావర్‌ దర్శనం చేసుకుని ఎరుమేలిలో స్నానం చేసే సమయంలో ఓ గరుడ పక్షి వచ్చి అక్కడ తిరుగుతుంది. వీటితోపాటు ఆలయం తెరిచిన సమయంలో నిత్యం సుప్రభాత సేవ, ఘృతాభిషేకాలు, చందనాభిషేకం, పుష్పాభిషేకం, కలశభిషేకం, భస్మాభిషేకం, గణపతి హోమం, హరిహరాసనం లాంటి ధార్మిక విధులను తప్పకుండా నిర్వర్తిస్తారు.


             #స్వామియే శరణమయ్యప్పా🙏🏻🙏🏻

సేకరణ.....