Thursday, September 3, 2015 1 comments By: visalakshi

శ్రీకృష్ణుని వాగ్ధానము

 ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ: 

 ప్రతి ఒక్కరు ఈ భౌతిక ప్రపంచములో దు:ఖములను కలిగి ఉందురు. అది భౌతిక ప్రకృతి యొక్క స్వభావము. 

ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది.అందుకే భగవద్గీతలో సర్వ శక్తివంతుడైన దేవాదిదేవుడు,యోగీశ్వరుడు,సర్వసిద్ధులకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు  అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి: "నా పై ఆధార పడుము.మీ అన్ని సమస్యల యొక్క పరిష్కారముల కోసము ప్రయత్నములను విడిచి,నన్నే శరణువేడుము.మీ బాధ్యతను నేను వహిస్తాను మరియు మీ సమస్త పాపకర్మల యొక్క ఫలితములను నిర్మూలిస్తాను."అని వాగ్ధానం చేశాడు.


 శ్రీకృష్ణుడు మన బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆయన క్రమముగా మనకు వెలుపల నుండి బయటనుండి జ్ఞానమును ప్రసాదించుట వలన మనము బహుశా: భగవద్ధామమును చేరుకోవచ్చు.ఐశ్వర్యము,విద్య,సౌందర్యము,ఉన్నత జన్మ   మొదలగు వాటిని పొందుట అన్నది శుభప్రదమని భౌతిక దృష్టి అనుసారముగా భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా అనేక దు:ఖాలతో కూడుకున్నట్టివి.అవి నిజముగా శుభప్రదమైనవి కావు. నిజమైన శుభమంటే భగవద్ధామమును చేరుట.అనగా శాశ్వత జీవితము, శాశ్వత ఆనందము,శాశ్వత జ్ఞానమును పొందుట.దానిని మనము పొందవలెనంటే భౌతికమైనటువంటి ఎటువంటి కోరికలు లేకుండా, మనము దివ్యమైన భక్తియుక్త సేవలో నిమగ్నమగుటయే సర్వ శుభములకు ఆరంభము.ప్రతిరోజు శ్రీకృష్ణ మహామంత్ర జపమును చేయుచు భగవంతుని సేవలో ఎల్లప్పుడు నిమగ్నమై ఉందాము. 


 భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ప్రదర్శించినపుడు అర్జనుడు ఆయనతో ఇట్లనెను:" నా ప్రియమైన కృష్ణా! నిన్ను కేవలము నా మేనబావగా తలచి నేను నీ పట్ల ఎన్నియో అపరాధములను చేసితిని. నిన్ను కృష్ణా!, మిత్రమా! అని సంబోధించితిని. కాని నా ఊహకందనంతటి అపరి మేయుడవు నీవు" అది పాండవుల పరిస్థితి. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అయినను సర్వాధికుడు అయినను ఆయన ఆ రాచబిడ్డల భక్తికి, సఖ్యతకు, ప్రేమకు మురిసి వారితో కలిసి జీవించెను.శుద్ధభక్తి సేవ మహత్యమునకు ఇది ఒక నిదర్శనము.భగవానుడు గొప్పవాడు. కాని ఆయనను ఆకర్షించే 'భక్తి ' భగవానుని కంటే కూడా గొప్పది.

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

కుటుంబ భ్రాంతి

  ఓం శ్రీ నారాయణాయ నమో నమ:


 5 సం"లు వయసు గల ప్రహ్లాద మహారాజు తన స్నేహితులకు "మీరు తక్షణమే నారాయణభక్తిని ప్రారంభించాలి" అని చెబుతున్నాడు.అదృష్టవశాత్తు వారికి భగవత్ భక్తుడైన ప్రహ్లాదుని యొక్క సాంగత్యం లభించింది.

 ఎప్పుడు అవకాశం దొరికినను గురువుగారు తరగతిలో లేనప్పుడు ప్రహ్లాదుడు తన స్నేహితులతో 'నారాయణ ' మహామంత్ర కీర్తనలను గానం చేసేవాడు. 


  ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ తృప్తి అనే మాయాజాలంలో చిక్కుకుంటామో దాని నుండి బయటపడటం చాలా కష్టం.అందుకే వైదిక సంస్కృతి ప్రకారం మగపిల్లవానికి 5 సం"ల వయస్సు నుండే ఆధ్యాత్మిక విద్యను బోధిస్తారు.దీనినే బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచారి తన జీవితాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందటమే లక్ష్యంగా ఉంచుకుంటాడు.

 ప్రతి ఒక్కరు కుటుంబ మమకారంలో చిక్కుకొని ఉన్నారు.ఎవరైతే కుటుంబ వ్యవహారాలలో మునిగి ఉన్నారో వారికి ఇంద్రియాలను నియంత్రంచటం సాధ్యం కాదని ప్రహ్లాద మహారాజు తెలుపుతున్నాడు. 

  అందరు భౌతిక ప్రేమ బంధాలలో ఉన్నారు. ప్రేమపాశం చాలా బలమైనందు వలన భౌతిక ప్రేమలో ఉన్నవారు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించటం చాలా కష్టం.అందుకే ప్రతి బాలుడికి ఐదు నుండి పదిహేను సం"లమధ్యకాలంలో శిక్షణను ఇవ్వడం వలన వారు సంపూర్ణులు కాగలరు.అని ప్రహ్లాద మహారాజు ప్రతిపాదిస్తున్నాడు.

   మనమందరం ఆత్మస్వరూపులం అయినప్పటికిని ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఎలాగైనా సరే ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటాము.ఇదే భౌతికం అంటే!

" ఈ భౌతిక తృప్తి కేవలం స్త్రీ - పురుషుల యొక్క కలయిక పైన ఆధారపడి ఉంటుంది. మొదట ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ' చాలా బాగుంది ' అనుకుంటాడు. అలాగే అమ్మాయి అబ్బాయిని చూసి అలాగే అనుకుంటుంది.ఎప్పుడైతే వారు ఒకరినొకరు కలుసుకుంటారో వారి భౌతిక సంబంధం బలంగా ఏర్పడి అది కామానికి దారి తీసి దాని వలన వారు ఆ ఆకర్షణలో పూర్తిగా బంధింపబడుతారు.తరువాత వివాహం,సంతానం,సమాజంలో గుర్తింపు,ప్రేమ,స్నేహితులు ఈవిధంగా భౌతికమైన ఆకర్షణ పెరుగుతూ పోతుంది.వీటన్నిటికీ డబ్బు అవసరం. వారికి తెలుసు ఇవన్నీ శాశ్వతం కావని..ఆకర్షణ బలమైనది కుటుంబాన్ని పోషించడానికి తన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు.ఇదే మాయ. ఈ భవబంధంలో చిక్కుకొని తమను తామే మరచిపోతారు. "


 తన ఆధ్యాత్మిక ఆచార్యుడైన నారదముని ద్వారా జ్ఞానాన్ని పొంది ఉండటం వలన కేవలం ఐదు సంవత్సరముల వయసు గల ప్రహ్లాదుడు ఒక గొప్ప అనుభవజ్ఞుడైన వాని వలె బోధిస్తున్నాడు. "జ్ఞానం ద్వారా మనిషి ఎదుగుతాడు కానీ వయసు ద్వారా కాదు" అని నానుడి.ప్రతి జీవి వృద్ధాప్యం వరకు జీవిస్తారని ఖచ్చితమైన హామీ లేదు. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని వాయిదా వేయటం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి అందరూ నారాయణ చైతన్యాన్ని అలవర్చుకొని భక్తిలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి."స్థిరచరాలైన వృక్షాలు,మొక్కల నుండి బ్రహ్మ వరకు అన్నింటా అందరి హృదయాలలోనూ శ్రీ మహా విష్ణువు పరమాత్మ రూపంలో ఉంటాడు " అని ప్రహ్లాద మహారాజు బోధిస్తున్నాడు. 

 " స్వయంగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉండటం వలన మనం అతని అంశలమై ఉన్నందు వలన సర్వ జీవరాసులపై దయను కలిగి ఉండటం మన యొక్క బాధ్యత"


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Tuesday, September 1, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 82 ఊదీ మహిమ 2

 ఓం శ్రీ సర్వ వ్యాపక సాయినాధాయ నమ:

                                                                                                     
                  
శ్రీ సద్గురు సాయినాధ ఆశీర్వాద సాఫల్యత

 బాబా విభూతికి రెండు గుణాలు ప్రాపంచికము, పారమార్ధికము. ప్రాపంచిక గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధినైనా సమూలంగా నయం చేయటం. అందుకు శ్రద్ధ, సహనం కావాలి.

 "శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమౌతాయన్న దృఢ విశ్వాసం, సహనం అంటే వ్యాధి నయమయేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనీయకుండా ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉండటం."

  అఖండంగా జ్వలించే బాబా ధునిలోని విభూతి వెనుక బాబా దైవశక్తి ఉంది.కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకుండే దృధమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తుల వల్ల, దార్లోని మట్టిలో నుంఛి కూడా ఉత్పన్నమగును.దాని వెనుక విభూతినిచ్చే వారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చ, కృప ఉంటాయి. పారమార్ధిక గుణం అంటే....  ఈశ్వర ప్రాప్తి గురించి  చేసే సాధనా
మార్గంలో  అన్నిట్లోకి మొదటి అవసరం శారీరక, మానసిక శుద్ధి.

విభూతిని దేహానికి పూసుకోవటమంటే,పూజకోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకొన్నట్లే.  శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి.  

 అలా చేయటం వల్ల మనసు శాంతంగా,పవిత్రంగా వుంటుంది.విభూతి స్పర్శతో భయంకర మహా పాతకాలు, ఉప పాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తి కాంత వచ్చి భక్తుల ముంగిట వాల్తుంది. పారమార్ధిక మార్గం యొక్క గుహ్యార్ధం వారికి స్పష్టమై భక్తులకు పారమార్ధికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్ధులవుతారు.

 బాబాగారి సమాధి తరువాత కూడా ఈ గడచిన సంవత్సరాలలో , అఖండంగా ప్రజ్వలించే ధునితో బాబా ఎన్ని విభూతి బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో! విభూతి ధన్యం! భక్తవాత్సల్యామృత వర్షిణి అయిన సాయిజనని ధన్యం!


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 
                                          

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 82 ఊదీ మహిమ

 ఓం శ్రీ సద్గురు సాయినాధాయ నమో నమ: 

" పరమం పవిత్రం బాబా విభూదిం
  పరమం విచిత్రం లీలా విభూదిం
 పరమార్ధ మిష్టార్ధ మోక్ష ప్రదాతం
 బాబా విభూదిం ఇదమాశ్రయామి "
" బాబాగారి పాదాల వద్దనున్న ఊదీ  ప్రసాదం 2011 గురుపౌర్ణమి రోజు  
 మా ఇంట బాబాగారు మాకునొసంగిన అపురూపమైన,వెలకట్టలేని సంపద."

ఆ ఊదీని సమస్యలతో వచ్చిన భక్తులకు ఇచ్చి,అందరికీ నుదుట పెట్టి,  అందరికీ ఇవ్వగా మిగిలిన   ఊదీ ఒక కవరులో వేసి బీరువాలో ఉంచాము.  

  ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు భక్తుల నమ్మకము అపారముగా నుండవలెను. 

జరిగే మహత్యాలను ఆక్షేపణ చేయుచు, సద్గురువును సిద్ధులను విమర్శించుచు నమ్మకమున్నవారిని ఖండించి వట్టి భ్రమ అని బాబాగారి మహత్యాలను అప్పుడూ,ఇప్పుడూ పరీక్షించే (మహానుభావులం మనం). కొంతమంది భక్తులు .

  మా వారి ఆఫీసులో చాలామందికి ఊదీ ద్వారా వ్యాధులు నయమయ్యాయి. ఒక వ్యక్తి తన పాపాకు తరచుగా జ్వరం వస్తుందని,చాలాసార్లు చెప్పగా మావారు పూర్తినమ్మకంతో బాబాగారిని స్మరిస్తూ ఊదీని రోజూ నీళ్ళలో కలిపి త్రాగింపమని చెప్పారు. రెండు రోజులలో అతను సంతోషముతో పాప చలాకీగా ఆడుకుంటోందని చెప్పాడు.

2010 నుండి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మా ఇంట్లో ఎవరికి అనారోగ్యము చేసినా ఊదీ నీళ్ళలో వేసుకొని మనస్పూర్తిగా బాబాని స్మరించుకొని తాగుతాము. 


  ఊదీ ని గూర్చి బాబా బోధ: -

"  ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమై బూడిద యగును.ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు,ప్రపంచములో గల బంధువులు,కొడుకుగాని,తండ్రిగాని,తల్లిగాని,మనవారు కారనియు బాబా బోధించెను.ఈ ప్రపంచములోకి మనము ఒంటరిగా వచ్చితిమి,ఒంటరిగానే పోయెదము. ఊదీ అనేక విధముల శారీరకమానసికరోగములను బాగుచేయుచుండెను. "
 భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమానరాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను.మొదటిది (ఊదీ) వివేకమును, రెండవది (దక్షిణ) వైరాగ్యమును బోధించుచుండెను.ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము.అందుచే బాబా అడిగి దక్షిణ తీసికొనుచుండెను.శిరిడీనుంచి ఇంటికి పోవునపుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును   వారి శిరస్సుపై నుంచుచుండెను.ఇదంతయు ఊదీయొక్కఆధ్యాత్మికప్రాముఖ్యము.

దానికి భౌతికప్రాధాన్యము కూడాకలదు. అదిఆరోగ్యమును,ఐశ్వర్యమును,
ఆతురతుల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను.


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు