Sunday, December 21, 2008 By: visalakshi

అంతర్జాలంలో తెలుగు వెలుగు వేదికపై బ్లాగు మిత్రులు కలిసిన శుభ తరుణం

అందమైన సాయం సంధ్యా సమయం లో హైదరాబాదు మహా నగరంలో నెక్లెస్ రోడ్ యందు జంటలన్నీ సరదా సరదాగా తిరుగాడు సమయాన పుస్తక ప్రదర్సన జరుగుతున్న ప్రదేశంలో మన వేదిక ఏర్పాటు చేసారు బ్లాగరులలో ప్రముఖులు .ఔత్సాహికులైన వారిని ప్రోత్సహించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చేయాలన్న సదుద్దేశ్యంతో చదువరిగారు, తాడేపల్లి సు భ్రమణ్యం గారు, నల్లమోతు శ్రీధరు గారు, అరుణ గారు, పూర్ణిమ గారు,జ్యోతి గారు ,నేను-లక్ష్మి లక్ష్మి గారు,నా చెల్లెలు రమణి(మనలొ మాట నా మనసులో మాట ),మరియు రవి గారు ,కత్తి మహేష్ గారు,చావా కిరణ్ గారు వేద అనబడే నేను ఇంకా చాలా మంది బ్లాగరులు కలుసుకుని పరిచయ కర్యక్రమాలయ్యాక సందర్సంచినవారికి ఈ -తెలుగు వెబ్సైట్ గురించి వివరిస్తూ బ్లాగుల సమాచారాన్ని అందరికీ అందజేసి సరదా సరదాగా గడిపిన శుభ తరుణం మరువ  లేనిది

4 comments:

Shiva Bandaru said...

బాగు బాగు

శరత్ కాలమ్ said...

నాకు అసూయగా వుండండి - మిమ్మల్ని అందరినీ చూస్తుంటే - హైదరాబాదులో లేకపోతినా అనిపిస్తోంది :)

నేస్తం said...

:) మాతో కూడా మీ ఆనందం పంచినందుకు దన్యవాధాలు

Ramani Rao said...

బాగా రాశావక్కా! నాలుగు లైన్లన్నా మంచి తరుణం మించిన దొరకదని చెప్పావు. ఫొటొస్ కూడా బాగా వచ్చాయి కదా.. వీటి గురించి చదువుతుంటే మనకే మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తోంది. మరి రాని వాళ్ళూ , హైదరాబాదులో ఉన్నవాళ్ళు 28 వ తారీఖు దాకే ఈ అవకాశం సద్వినియోగ పరుకొంటారని ఆశిద్దాము.