Friday, December 5, 2008 By: visalakshi

జీవితం--విలువలు:

మన జీవితం ఎలాంటి ఆందోళనలు లేకుండా నిర్భయంగా సాగిపోవాలంటె విలువల ఆధారంగా పయనించాలి.
జీవితంలో తమని తాము ప్రేమించుకోని వారు లోకంలో ఎవరినీ ప్రేమించలేరు.
ప్రతి వ్యక్తికీ జీవితంలో స్వార్ధం అవసరం.కానీ అది మితి మీర కూడదు.
జీవితం ముందుకు సాగిన తరువాత ,వెనక్కి గతం చుసి దిగులు పడడం అనేది వ్యర్ధమైన వేదన.
ప్రస్థుతపు నాగరికతలో తాను చేసే పనిలో తప్ప ఇతరులు చేసే పనిలో అర్ధం కనబడుటలేదు.ఈనాటి బుద్ధి మంతులకు .
ఒక బిచ్చగత్తెకి ఈ రోజు నేను ఇచ్చిన 2రూ"లు గొప్ప సంతోషాన్నిచ్చింది. కానీ నేనువారం రోజులు వరుసగా 2రూ"లు ఆమెకి ఇస్తే ,అటు తరవాత ఆ 2రూ"లు ఆమెకి ఏ సంతోషాన్ని ఇవ్వదు. 2రూ"లు దొరక నప్పుడు విచారాన్ని తప్ప .
సుఖము, బాధా ఈ రెండే జీవితపు విలువలు. ఏదైనా సరే ,ఏయత్నమైనా అన్నీ విడదీసి చూస్తే చివరికి మిగిలే అసలు విలువలు, బాధ నించి తప్పించుకోవడమూ ,సుఖాన్ని అనుభవించడమూ .
విలువల్ని మనసే కల్పిస్తుంది. మనకి కావాలనే కోర్కె పుట్టేదాకా ఎంత విలువైన పదార్ధమైనా మనకేం గొప్ప?
ఏది నిజం? ఏది న్యాయం? ఏది సుందరం?ఏది గొప్ప? ఎక్కడ వున్నాయి ఈ విలువలు ,ఎప్పుడూ మనుషులలో మారే మనసులలో తప్ప .
మన సౌఖ్యానికి ధనము ,ఆస్థి ముఖ్యమనుకున్నంత కాలమూ ఇంక ఏ విలువలకీ స్థానముండదు మన మనస్సుల్లో .
ఈ రోజుల్లో సాధారణ వ్యక్తులు ఎంతో నిజాయితీగా విలువలతో నడుచుకోవడం చూస్తుంటాము .కొందరు లక్షల్లో సంపాదిస్తూ ఉన్నత హోదా లో ఉండి కూడా చౌక బారుగా ప్రవర్తించడాన్ని గమనిస్తుంటాం .అందుకే స్థాయిని బట్టి కాకుండా సంస్కారాన్ని బట్టి ,విలువల ఆచరణను బట్టి మనిషికి ఆదరణ లభిస్తుంది.

5 comments:

Bolloju Baba said...

మంచి విలువైన వ్యాసం

అందుకే స్థాయిని బట్టి కాకుండా సంస్కారాన్ని బట్టి ,విలువల ఆచరణను బట్టి మనిషికి ఆదరణ లభిస్తుంది.

పై విషయం అన్ని సందర్భాలలోనూ రుజువు అవ్వటం లేదండి. డాబు దర్పం ఉన్న వారికే సమాజంలో రెడ్ కార్పెట్. ఇది భయం వల్లా, అభద్రతవల్ల, అవకాశంకోసమా, ఆత్మన్యూనతా పైవన్నీనా అనేది ఒకోసారి అర్ధం కాదు. కదూ?

బొల్లోజు బాబా

visalakshi said...

అవును నిజమే బాబా గారూ. సమాజంలో జీవితపు విలువలు తెలియని వారు అలాగే ప్రవర్తిస్తారు. ఏసంధర్భం లోనైనా విలువ కోసం దేన్నైనా ఫణంగా.పెట్టచ్చు కానీ జీవితం కోసం విలువల్ని ఫణంగా పెట్టకూదదు.

రాధిక said...

బాగా చెప్పారు.బాబా గారు చెప్పింది నిజమే.విలువలని బ్రతికించుకోవాలనుకునేవారికి దక్కుతున్నది అవమానమే.

Ramani Rao said...

"ఏ సంధర్భం లోనైనా విలువ కోసం దేన్నైనా ఫణంగా.పెట్టచ్చు కానీ జీవితం కోసం విలువల్ని ఫణంగా పెట్టకూడదు."

బాగుంది.

పరిస్థితుల్ని మనకనుగుణంగా మరల్చుకోగలగాలి కాని మనం పరిస్థితులకి అనుగుణంగా సర్ధుకుపోకూడదు అంటారు.

ఇప్పుడున్న ఈ విలువలులేని జీవిత ప్రయాణంలో ప్రస్థుత పరిస్థితులకి సర్ధుకుపోడం తప్ప మార్చుకొందామన్నా మార్చుకోలెనిదీ ఈ మనిషి జీవితం. ఎందుకంటే బాబా గారన్నట్లు.....

"ఇది భయం వల్లా, అభద్రతవల్ల, అవకాశంకోసమా, ఆత్మన్యూనతా పైవన్నీనా అనేది ఒకోసారి అర్ధం కాదు."

rukmini devi said...

nice post.............