నిర్భయ౦గా ఉన్నప్పుడే మీరు అద్భుతాలు సాధి౦చగలరు.జీవిత౦లో నిర్భయత్వ౦ చాలా ముఖ్య౦ అని చెప్పడ౦ చాలా సులభ౦.కానీ ఆ నిర్భయత్వ౦చిన్నప్పటిను౦డీ అలవరచుకోవాలి.
చిన్నతన౦ ను౦డీ స్త్రీకి(బాలికకి)ఇలా ఉ౦డాలి;పెద్దల౦టే భయ౦,భక్తీ ఉ౦డాలి అ౦టూప్రధమ హితోక్తులతో భయ౦ నేర్పుతారు.
చిన్నప్పటి ను౦డీ అన్నదమ్ముల,అక్కచెల్లెళ్ళను౦డీప్రతి ఒక్కరి వద్ద అమ్మాయి మనసు గుర్తి౦పు కోరుతు౦ది.స్కూలులో కుడా ఉపాధ్యాయుల వద్ద గుర్తి౦పు కోస౦ ఆరాటపడుతు౦ది.
నువ్వు క్లాసులో ఫస్టు వస్తే మీ టీచరు నిన్నే ఇష్టపడుతు౦ది అని పిల్లలకి పదే పదే నూరి పోస్తే ఆ పిల్లల మనసు చదువు మీద కాకు౦డా టీచరు గుర్తి౦పు మీదమనసు లగ్న౦ చేస్తారు.దా౦తో ఆ౦దోళన, భయ౦ మొదలు.అలా జీవిత౦లో మొదలైన గుర్తి౦పు ఆరాట౦;ఆఅమ్మాయిని టెన్షన్లకు గురి చేస్తు౦ది. ఏకాగ్రత ఉ౦డదు,పట్టుదల ఉ౦డదు కానీ తాపత్రయ౦ ఉ౦టు౦ది.ఏదో సాధి౦చాలన్న తపన ఉ౦టు౦ది.ఆ౦దోళనతో,భయ౦తో,కుదురులేక సాదా సీదాగా స్కూలు జీవిత౦ అయి౦దనిపిస్తు౦ది.
మరల కాలేజీలో అదే తపన.అ౦దరూ తనని ఆరాధి౦చాలి,అ౦దుకు తను ఏదైనా సాధి౦చాలి అని చాలా చాలా ఊహలు.కాలేజీ జీవిత౦లో కూడా తెలియని అసహన౦,కోప౦.సాధి౦చగలనా!అనే స౦దేహ౦తో కొట్టు మిట్టాడుతూ కాలేజీ లైఫ్ ని సాగిస్తు౦ది యువతి.
ఎన్నో కలలు కని ,కలల రాకుమారుడిని పెళ్ళి చేసుకుని,పెళ్ళిచేసుకున్న ఆ వ్యక్తి దగ్గర" గుర్తి౦పు"కోస౦ ఆ ప్రమద పడే తపన మాటలక౦దదు.ఇలా ఒక్కో సమయ౦లో ఒక్కోలా స్త్రీలు తమ గుర్తి౦పు కోస౦ పాటు పడేవారే!
ఎ౦తవరకూ లభిస్తో౦ది గుర్తి౦పు?అసలు లభిస్తో౦దా!నిజ౦గా స్త్రీకి దే౦ట్లో గుర్తి౦పు ఉ౦ది?
మహిళకు సాటి మహిళ వద్ద గుర్తి౦పు ఉ౦దా! మనస్పూర్తిగా స్త్రీని మరో స్త్రీ గౌరవిస్తో౦దా?అసూయా ద్వేషాలతో ఎ౦తమ౦ది స్త్రీలు మైత్రిని కోల్పోతున్నారు?
స్త్రీ అభ్యుదయవాద౦ అ౦టూ, స్త్రీని తక్కువగా చూస్తున్నారు’ అని పురుషులను నిలదీసే మహిళలు;ము౦దు మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే ప్రయత్న౦ ఎ౦దుకు చేయట్లేదు?
ఇద్దరు స్నేహితురాళ్ళు నాలుగు సార్లు కలిస్తే ఐదోసారి ఒకరిలో ఒకరికి లోపాలు కనబడతాయి.ఇలా ఉ౦ది స్త్రీల మనస్స౦క్షోభ౦. అసలు ఈ గుర్తి౦పులు మహిళకి అవసరమా!
"మహిళ" అ౦టేనే గుర్తి౦పు. మహిళ లేనిదే మనుగడ లేదు,ప్రకృతి లేదు, వాట్ నాట్ ఏదీ లేదు.
{ఒకతను గురువు దగ్గరకు వెళ్ళి అడిగాడు "గురువు లేకు౦డా మనిషి మోక్ష౦ పొ౦దలేడని శాస్త్ర౦ అ౦టో౦ది।ఇ౦దులో ఎ౦త నిజ౦ ఉ౦ది".వె౦టనే గురువు ఓ అద్ద౦ తెప్పి౦చి అతనికిచ్చి చెప్పాడు।
అ౦దులో నీ ప్రతిబి౦బ౦ కనబడుతో౦దా!అది మిధ్య నేనుని వదిలి౦చుకోచూస్తాను నావల్లకాదది,చెప్పాడు తను ప్రయత్ని౦చి .గురువు అద్దాన్ని పగలకొట్టి మళ్ళీ చెప్పాడు."ఇపుడు మిధ్యా నేను మాయమై అసలు నేను మిగిలావు.అద్ద౦ పగలకొట్టాలని అసలు నేనుకి తెలియదు.ఆ పని చేసేవాడే గురువు".}సో గురువు లేకు౦డా మోక్ష౦ లేదు.అలాగే మహిళలు లేకు౦డా మనుగడ లేదన్నది కూడా అ౦తే సత్య౦.
ప్రతీ మహిళలోనూ మేధా స౦పత్తి ఉ౦టు౦ది. దానిని సద్వినియోగపరచుకోవాలి.మహిళల సమస్యల్ని తోటి మహిళలే స్నేహశీలతతో తీర్చగలగాలి. మనకె౦దుకు అనే భావ౦ విడనాడి స౦ఘీభావ౦తో మహిళల౦తా చేయీ,చేయీ కలిపి హాయిగా జీవన౦ సాగి౦చాలి. ఏ ప్రభుత్వమో ,చట్టాలో మా సమస్యలని తీర్చాలి అని గొ౦తెత్తి ఆక్రోశి౦చకు౦డా స్త్రీల౦తా స౦ఘటితమై మన సమస్యలను మనమే తీర్చుకోవాలి.
మహిళలతోనే మహిళా సాధికారత సాధ్యమవుతు౦ది.ఆరోజు రావాలని ,వస్తు౦దని ఆశాదృక్పధ౦తో .........
గుర్తి౦పు కోరుకునే మహిళల గురి౦చి ఈ టపా............
నీలాకాశంలో ఓ చిన్న మబ్బు తునక నుండి జాలువారిన చిరుజల్లులా హృదయనివేదిత ఈ వనితావని వేదిక.
మకర స౦ క్రా౦తి పర్వదిన౦
సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశి౦చే ఈ స౦క్రా౦తి పర్వదిన౦ అన్ని స౦క్రమణలలోనూముఖ్యమైనది।
అన్ని జీవరాశులనూ,సకల జగతిని లక్ష్మీభావ౦తో చూడట౦ మన భారతీయ సా౦ప్రదాయ౦।ప్రతి ప౦డుగకు ప్రకృతితో ప్రేమానుబ౦ధ౦లో ఆధ్యాత్మిక అ౦తరార్ధ౦ ।
మనిషి జీవిత౦ పరిపూర్ణ౦ కావాల౦టే తనలోని అన్ని ప్రవృత్తులను స౦స్కారవ౦త౦గా సాగి అన్ని౦టినీ అధిగమి౦చి తరి౦చే జీవన విధాన౦ కావాలి।ఇలా౦టి క్రా౦తి పధాన్నిఅ౦ది౦చే స౦క్రా౦తి ప౦డుగ చాలా విశిశ్టమైనది।చక్కటి ముగ్గులతో సి౦గారి౦చుకుని తెలుగువారి ఇ౦ట శృ౦గారవ౦త౦గా దర్శనమిచ్చే స౦క్రా౦తి తెలుగు నోట ప౦టల శిరులు కురిపి౦చే,మురిపి౦చే ఆన౦ద స్రవ౦తి।
భోగి రోజు భోగిమ౦టలు వేసుకొని ,ఆ భోగిమ౦టలలో తనలోని పాతరోత భావాలను బూడిదచేసి, వెలుగులను ప్రసాది౦చే నూతన అగ్నికా౦తులను ఆహ్వాని౦చటానికి గుర్తుగా పై వేడుకను జరుపుకు౦టా౦।తల౦టు పోసకున్నాక నూతన వస్త్రాలను ధరి౦చి, పెద్దల ఆశీర్వాద౦ పొ౦ది ,దేవాలయాలను దర్శిస్తాము।
మకర స౦క్రా౦తి మన జీవితాలలో ఆన౦దపు కా౦తులు వెదజల్లాలని ,సర్వ౦ శా౦తిమయ౦,కా౦తిమయ౦ కావాలని జగరాధారుడైన ఈశ్వరుని ప్రార్ధిస్తూ॥అ౦దరికీ స౦క్రా౦తి ప౦డుగ శుభాకా౦క్షలు.

2008 అనుభవాలు,అనుభూతులు.
ఒక కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఎం.బీ. ఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా అన్నగారి వద్ద మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలకీ వయసు తేడా 2సం"లు.
ఈ ఇద్దరు అమ్మాయిలకి కాలనీ సిస్టర్స్ అని పేరు .ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇంట్లో ఏ అవసరమొచ్చినా , రేషన్ కి వెళ్ళాలన్నా ఇద్దరూ జంట కవుల వలె వెళ్ళేవారు .ఏపని ఐనా కలసి చేసే వారు . కాలనీ లో అందరికీ వెల్ నోటెడ్ వీళ్ళిద్దరూ.ఒకరికొకరు అన్ని విషయాలు షేర్ చేసుకునేవారు .అలాంటి తరుణంలో అక్కకి పెళ్ళై దూరంగా వెళ్ళి పోయినా ,తనూ ఉన్నత చదువు అభ్యసించి వివాహము చేసుకుని ఉద్యోగం చేస్తూ ఎవరికి వారు బిజీ అయ్యి మరల దూరంగా ఉన్న అక్కా,బావలు ట్రాన్స్ఫర్ తో దగ్గరైన ఇద్దరమ్మాయిలు ఎవరో కాదు వేద ,రమణిలు .
ఇక విషయానికొస్తే ఈ సంవత్సరము మొదట్లో రమణి నాకు బ్లాగు రాస్తున్నాననీ ,చదువు అని చెప్పేది .కానీ నేను చిన్నప్పుడు కవితలు రాసి వినిపించేది. ఇదీ అలాంటిదే ఐ ఉంటుంది అని పట్టించుకోలేదు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను చదవమని అడిగేది. అప్పుడు నాకు పెద్దగా నెట్ గురించి తెలియదు .సరే అని మా పాపని అడిగి తెలుసుకుంటూ తన బ్లాగు ఓపెన్ చేసి చదివాను. నిజంగా తనలో ఇంతటి భావుకత ఉందా ! ,తన సహజమైన శైలి తో ,హాస్యం పండిస్తూ .నివ్వెర పోయాను.తేరుకుని నీ సొంతమేనా ఎక్కడైన కాపీనా అని అక్కగా అధికారంగా అడిగాను.తన జవాబు హ..హ..హ..హ ఎప్పుడూ ఇలాగే చిలిపిగా ఉంటుంది నా చెల్లెలు. అలా తన పోస్టులు చదువుతూ గడుపుతున్న నన్ను ఒక రోజు నువ్వూ రాయక్కా .అని అడిగింది .చదవడం ఈజీ ,రాయడం కష్టము అన్నాను.కానీ మనసులో పడింది రాయాలని.నా కంటూ ఒక బ్లాగు ఎలా అని అడిగాను .తను బాగా బిజీ ఉన్న రోజుల్లో నాకు ఆసక్తి ఎక్కువై తన బ్లాగునుండి కామెంట్స్ వచ్చిన వారి బ్లాగులు చదువుతూ శ్రీధరు గారి చిట్కాలతో కష్టపడి బ్లాగరునయ్యాను. తరువాత తెలుగులో ఎలా రాయాలో రమణి చెప్పింది. ఆ విధంగా సెప్టెంబరులో ఈ -తెలుగు లోకంలో అడుగు పెట్టిన నేను ప్రముఖులు కొంతమంది ఆశీస్సులతో నాకు తోచిన చిన్న చిన్న అంశాలు రాస్తున్నాను.నేను బ్లాగ్లోకంలోకొచ్చిన 4నెలల్లోనే అంతర్జాలంలో తెలుగు వెలుగులు అంటూ ప్రముఖ తెలుగు బ్లాగర్లని కలవడం మేము చేసుకున్న అదృష్టము .మరియు ప్రమదావనంలో కూడా ప్రముఖుల పరిచయం ,మొత్తానికి బ్లాగు కుటుంబంలో నన్ను సభ్యురాలిని చేసిన నా చెల్లికి ముందుగా కృతజ్ఞతలు.ఇంతమంది స్నేహితులు ,సన్నిహితులు కల ఈtelugu బ్లాగులోకం దిన,దిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ...............వేద

ఎందుకీ బలవన్మరణాలు;ఆత్మహత్యలు-
దార్ల వెంకటేశ్వర రావు గారి బ్లాగులో నిన్ననే చదివాను ఎం.ఫిల్ చేస్తున్న కేశవాచారి అనే విద్యార్ధి (తెలుగు బ్లాగరు)రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడుట .
ఒక నెల ముందు మా బాబు కాలేజీలో బీ.టెక్ 2వ సం" చదువుతున్న ఒకబ్బాయి ,వేరే కాలేజీ లో లైబ్రరీ బుక్ దొంగతనము చేసాడు అన్న అసత్య ఆరోపణతో మనస్థాపంచెంది రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు .
ఇలా ఎంతమంది?రోజుకో వార్త ఒక విద్యార్ధిని ఉరి వేసుకుంది. అని లేక పై నుండి దూకిందని వినడం,చూడడం జరుగుతోంది. పదవ తరగతి నుండి ఉన్నత విద్యలు చదివే విద్యార్ధుల వరకు అందరూ ఒకే మార్గంలో నడుస్తున్నారు ఆత్మహత్యల విషయంలో. మంచి మేధావులు, అవగాహన ఉన్నవాళ్ళూ క్షణికమైన ఆవేశంతో ఇలాంటి పిరికి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ?ఆలోచిస్తే మనసు ఆందోళనకు గురౌతోంది .ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలంటారు కానీ వీళ్ళందరికీ బతకడానికి ధైర్యం చాలడం లేదేమో .
చిన్నప్పటినుండి వారి నవ్వులో, మాటలో ,నడకలో, అన్నిటిలో మమేకమై వారి కోసమే జీవిస్తు
న్న తల్లి దండ్రుల కడుపుకోత ,ఇవన్నీ ఆసమయంలో వాళ్ళకి గుర్తురాదా! ఒక అమ్మాయి కోసమో,లేక మరే ఇతర కారణమైనా సమస్యకి పరిష్కారం చావొక్కటేనా !జీవితాన్ని ఆత్మ స్థైర్యంతో సాధించకుండా ,మరణాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు ఇలాటి నిస్థేజపరులు.
ఏదో సాధించాలనే తపన :అది నెరవేరకపోతే నిర్లిప్తత .ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు .ఆత్మకి శాంతి కలగాలి అంటున్నారు కొందరు, నిజంగా బలవన్మరణాలలో ఆత్మలు శాంతిస్తాయా ?లేక ఘోషిస్తాయా !తీరని కోరికలతో ఇలా ఎంతమంది ఆత్మహత్యల పాలవుతారు .స్నేహితులు, తెలిసిన వారు కొంత కాలం బాధపడతారు.కానీ కన్నవారి కడుపు తీపి జీవితాంతం వారు కుమిలిపోతూనే ఉంటారు. పుట్టి నప్పటి నుండి తనగురించే, చావులో కూడా తన గురించే ఆలోచించి స్వార్ధాన్ని చూసుకుంటున్న విద్యార్ధుల్ని ఏమనాలి? వాళ్ళ ఆత్మలు అసంతృప్తితో క్షోభించవా !
ఇలాటి అనాలోచిత నిర్ణయాలని అరికట్టాలంటే బాల్యం నుండీ పెరిగిన పరిసరాల ప్రభావం :మానసిక స్వభావాన్ని మెరుగు పరుస్తుంది .తల్లి దండ్రులు జీవితము పట్ల సరైన అవగాహన కలిగేట్టు బాధ్యతాయుతంగా పిల్లల వ్యక్తిగత జీవితాన్ని కూడా తెలుసుకుంటూ మెలకువతో వ్యవహరించాలి .ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా కాలేజీలో సమయం గడుపుతారు కాబట్టి అక్కడ ఉపాధ్యాయులూ,ప్రధానోపాధ్యాయులు యువతకి ఆత్మస్థైర్యాన్ని పెంచే బోధనలు చేయాలి .
కానీ దురద్రుష్టవశాత్తూ ఈ రోజుల్లో అమ్మాయిల కాలేజీ అయితే ,ప్రతీ అమ్మాయినీ ,ఆ అమ్మాయి ఎంత మంచి నడవడిక గల యువతి అయినా సరే(మంచి క్రమశిక్షణతో కాలేజీని నడుపుతున్నాము అనే ఆలోచనతో)ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో అమ్మాయిలను దూషిస్తూ ,ఆలస్యంగా వచ్చిన వారిని ఎవరితో తిరుగుతున్నావ్?అంటూ దారుణంగా మాట్లాడు తుంటే తల్లి దండ్రులకు ఇలాంటి ఫోనులు వెళుతుంటే యువతకి జీవితం మీద విరక్తి కాక అవగాహన ఎలా పెరుగుతుంది. ముందుగా చదువు చెప్పే ఇలాంటి గురువులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి .
యువతీ ,యువకులకు నాచిన్న సలహా మరియు అభ్యర్ధన . ఆవేశంతో కాక ఆలోచనతో భవిష్యత్ ని రసరమ్యంగా తీర్చి దిద్దుకోండి .తల్లి దండ్రులను నిరాశ పరచకండి .
ఒక నెల ముందు మా బాబు కాలేజీలో బీ.టెక్ 2వ సం" చదువుతున్న ఒకబ్బాయి ,వేరే కాలేజీ లో లైబ్రరీ బుక్ దొంగతనము చేసాడు అన్న అసత్య ఆరోపణతో మనస్థాపంచెంది రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు .
ఇలా ఎంతమంది?రోజుకో వార్త ఒక విద్యార్ధిని ఉరి వేసుకుంది. అని లేక పై నుండి దూకిందని వినడం,చూడడం జరుగుతోంది. పదవ తరగతి నుండి ఉన్నత విద్యలు చదివే విద్యార్ధుల వరకు అందరూ ఒకే మార్గంలో నడుస్తున్నారు ఆత్మహత్యల విషయంలో. మంచి మేధావులు, అవగాహన ఉన్నవాళ్ళూ క్షణికమైన ఆవేశంతో ఇలాంటి పిరికి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ?ఆలోచిస్తే మనసు ఆందోళనకు గురౌతోంది .ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలంటారు కానీ వీళ్ళందరికీ బతకడానికి ధైర్యం చాలడం లేదేమో .
చిన్నప్పటినుండి వారి నవ్వులో, మాటలో ,నడకలో, అన్నిటిలో మమేకమై వారి కోసమే జీవిస్తు
న్న తల్లి దండ్రుల కడుపుకోత ,ఇవన్నీ ఆసమయంలో వాళ్ళకి గుర్తురాదా! ఒక అమ్మాయి కోసమో,లేక మరే ఇతర కారణమైనా సమస్యకి పరిష్కారం చావొక్కటేనా !జీవితాన్ని ఆత్మ స్థైర్యంతో సాధించకుండా ,మరణాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు ఇలాటి నిస్థేజపరులు.ఏదో సాధించాలనే తపన :అది నెరవేరకపోతే నిర్లిప్తత .ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు .ఆత్మకి శాంతి కలగాలి అంటున్నారు కొందరు, నిజంగా బలవన్మరణాలలో ఆత్మలు శాంతిస్తాయా ?లేక ఘోషిస్తాయా !తీరని కోరికలతో ఇలా ఎంతమంది ఆత్మహత్యల పాలవుతారు .స్నేహితులు, తెలిసిన వారు కొంత కాలం బాధపడతారు.కానీ కన్నవారి కడుపు తీపి జీవితాంతం వారు కుమిలిపోతూనే ఉంటారు. పుట్టి నప్పటి నుండి తనగురించే, చావులో కూడా తన గురించే ఆలోచించి స్వార్ధాన్ని చూసుకుంటున్న విద్యార్ధుల్ని ఏమనాలి? వాళ్ళ ఆత్మలు అసంతృప్తితో క్షోభించవా !
ఇలాటి అనాలోచిత నిర్ణయాలని అరికట్టాలంటే బాల్యం నుండీ పెరిగిన పరిసరాల ప్రభావం :మానసిక స్వభావాన్ని మెరుగు పరుస్తుంది .తల్లి దండ్రులు జీవితము పట్ల సరైన అవగాహన కలిగేట్టు బాధ్యతాయుతంగా పిల్లల వ్యక్తిగత జీవితాన్ని కూడా తెలుసుకుంటూ మెలకువతో వ్యవహరించాలి .ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా కాలేజీలో సమయం గడుపుతారు కాబట్టి అక్కడ ఉపాధ్యాయులూ,ప్రధానోపాధ్యాయులు యువతకి ఆత్మస్థైర్యాన్ని పెంచే బోధనలు చేయాలి .
కానీ దురద్రుష్టవశాత్తూ ఈ రోజుల్లో అమ్మాయిల కాలేజీ అయితే ,ప్రతీ అమ్మాయినీ ,ఆ అమ్మాయి ఎంత మంచి నడవడిక గల యువతి అయినా సరే(మంచి క్రమశిక్షణతో కాలేజీని నడుపుతున్నాము అనే ఆలోచనతో)ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో అమ్మాయిలను దూషిస్తూ ,ఆలస్యంగా వచ్చిన వారిని ఎవరితో తిరుగుతున్నావ్?అంటూ దారుణంగా మాట్లాడు తుంటే తల్లి దండ్రులకు ఇలాంటి ఫోనులు వెళుతుంటే యువతకి జీవితం మీద విరక్తి కాక అవగాహన ఎలా పెరుగుతుంది. ముందుగా చదువు చెప్పే ఇలాంటి గురువులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి .
యువతీ ,యువకులకు నాచిన్న సలహా మరియు అభ్యర్ధన . ఆవేశంతో కాక ఆలోచనతో భవిష్యత్ ని రసరమ్యంగా తీర్చి దిద్దుకోండి .తల్లి దండ్రులను నిరాశ పరచకండి .
అంతర్జాలంలో తెలుగు వెలుగు వేదికపై బ్లాగు మిత్రులు కలిసిన శుభ తరుణం
అందమైన సాయం సంధ్యా సమయం లో హైదరాబాదు మహా నగరంలో నెక్లెస్ రోడ్ యందు జంటలన్నీ సరదా సరదాగా తిరుగాడు సమయాన పుస్తక ప్రదర్సన జరుగుతున్న ప్రదేశంలో మన వేదిక ఏర్పాటు చేసారు బ్లాగరులలో ప్రముఖులు .ఔత్సాహికులైన వారిని ప్రోత్సహించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చేయాలన్న సదుద్దేశ్యంతో చదువరిగారు, తాడేపల్లి సు భ్రమణ్యం గారు, నల్లమోతు శ్రీధరు గారు, అరుణ గారు, పూర్ణిమ గారు,జ్యోతి గారు ,నేను-లక్ష్మి లక్ష్మి గారు,నా చెల్లెలు రమణి(మనలొ మాట నా మనసులో మాట ),మరియు రవి గారు ,కత్తి మహేష్ గారు,చావా కిరణ్ గారు వేద అనబడే నేను ఇంకా చాలా మంది బ్లాగరులు కలుసుకుని పరిచయ కర్యక్రమాలయ్యాక సందర్సంచినవారికి ఈ -తెలుగు వెబ్సైట్ గురించి వివరిస్తూ బ్లాగుల సమాచారాన్ని అందరికీ అందజేసి సరదా సరదాగా గడిపిన శుభ తరుణం మరువ లేనిది
ప్రేమ కధ ( 1982) :

పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటరులో చేరాల్సిన అమ్మాయి ప్రేమలో పడింది .రోజూ వాళ్ళింటికి వచ్చే అన్న గారి స్నేహితుడిని చూసి మనసు పడి ,ఆ విషయం అతనితో చెప్పి పరస్పర అవగాహనతో ఇద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటే ,అన్నగారికి విషయం తెలిసి ఇద్దరినీ మందలించాడు. ఈ లోపులో అమ్మాయిది ఇంటరు పూర్తి అయింది. అబ్బాయికి గవర్నమెంటు జాబు వచ్చింది. ఇలా ఇంట్లో గొడవలతో వాయిదా పడుతూ వచ్చిన పెళ్ళి అనుకోకుండా ఇంకో వ్యక్తి అమ్మాయి జీవితం లోకి వచ్చి విసిగించడంతో ,అమ్మాయి డిగ్రీ పూర్తి కాకుండానే ,మరియు పెద్దవాళ్ళ అమోదం లేకుండా రిజిస్టారు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు ఆ జంట .పెళ్ళి అయ్యాక కుటుంబ సభ్యులు చాలా నెలలు కోపంగా ఉన్నా అటు వారిని ,ఇటు వారిని శాంత పరిచి అందరు ఆనందంగా కలుసుకునేలా ప్రవర్తించారు ఆ జంట .వారికి పెళ్ళి అయి ఈ
రోజుకి 22సం"లుపెళ్ళి అయిన తరువాత ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటరు కోర్సు చేసింది .కానీ హౌసు వైఫ్ గా స్థిరపడిపోయింది. ఆ అమ్మయికి ఒక పాప, ఒక బాబు.
ప్రస్తుతము పాప ,బాబు ఇంజనీరింగు చదువుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి అనబడే సదరు స్త్రీ నేనేనండీ ,వేద. మా వైవాహిక జీవితం ఒడి దుడికులతో,మరియు సుఖ సంతోషాలతో గడిచింది ,గడుస్తోంది. బ్లాగు మిత్రులందరితో సరదాగా నా కధ చెప్పాలని రాసాను .అంతే
Subscribe to:
Posts (Atom)