Sunday, September 25, 2016 By: visalakshi

మా విశాలహృదయంలో సమాలోచనలు..ఏకాంతం - ఒంటరితనం

 ఏకాంతం - ఒంటరితనం





 ఒంటరితనం both physical and mind  కి సంబంధించినది. ఎవరితోనూ కలవలేకపోవడం , తను తన opinions ; కలవాలని కోరిక ఉన్నా మనస్తత్వ రీత్యా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. 




 ఏకాంతం అన్నది పూర్తిగా మానసికమైనది.వందమందిలో ఉన్నా తమ దు:ఖాన్ని గానీ, ఆనందాన్ని గానీ తామే లోలోపల అనుభవిస్తూ ఉంటారు. తమతో తాము, చుట్టూ ఉన్నవారితో కూడా మనసులో సంభాషణలు జరిగిపోతూ ఉంటాయి. అదొక అలౌకిక స్థితి. చాలా అద్భుతమైన స్థితి. ఏకాంతవాసం అంటే అదే! చాలా ప్రశాంతతను అనుభవిస్తారు. అంతరాలలో దాగిఉన్న ఆనందాన్ని తమలోని శక్తిని గుర్తించగలరు వీరు...అద్వితీయమైన ఆనందాన్ని చిద్విలాసంగా అనుభవిస్తారు...ఏకాంతం అన్నది ఒకరకమైన ధ్యానస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ......Rukmini Devi......




 చక్కగా చెప్పారు రుక్మిణీజీ!..వీలున్నంత వరకు అందరితో కలిసిమెలిసి ఉండు; వారిని ప్రేమించు.ఆ పిదప నీ అంతరంగములో ప్రవేశించి శాంత్యానందములు అనుభవించు అన్నారు శ్రీరామకృష్ణపరమహంస....
                                                                               Bharati....





  చాలా బాగా వివరించారు..ఒంటరితనం - ఏకాంతం గురించి రుక్మిణిగారూ! నేను కూడా రెండు మాటలు చెప్తాను...

తనపై తనకు విశ్వాసం కొరవడి ఆత్మనూనతా భావంతో కుంగిపోతూ ఒక్కరిగా మిగిలిపోవడం ' ఒంటరితనం '.



విశ్వవిజేతగా నిలవాలన్న సంకల్పంతో సర్వ సన్నద్ధమవుతూ తనని తాను సిద్ధం చేసుకోవడం ' ఏకాంతం '... ఏకాంతాన్ని అనుభూతి చెందడం అంటే తెలియకుండానే ఒక గంభీరమైన వ్యక్తిత్వం, నిర్ణయాలలో స్పష్ఠత అలవడుతాయి. 




ఎవరైతే తమయందే శాంతిసు:ఖాలను అనుభవిస్తారో, ఎవరికి తమయందే జ్ఞానప్రకాశం ఉదయిస్తుందో వారు అత్యున్నత స్థితికి చేరుతారు.......శ్రీకృష్ణుడు.

                                                        .......Visalakshi.....

1 comments:

భారతి said...

మన ముగ్గురి మధ్య సంభాషణలను చక్కగా పదిలపరుస్తున్నావు. చాలా ఉపయుక్తమైన ప్రయత్నం నీది. అభినందనలు...