Wednesday, June 29, 2016 By: visalakshi

మా విశాలహృదయం సమాలోచనలు..ఆధ్యాత్మికం..విదురనీతి..పేరు..

 ఆధ్యాత్మికం :---




 ఆధ్యాత్మికం అంటే ...పరమాత్ముని తెలుసుకోవడం...ఆయనను ఏ విధంగా ఉపాసించాలి, వేదాలలో ఆయన లక్ష్యమేమిటి, ఆత్మ పరమాత్మతత్వం తెలుసుకొనే ప్రయత్నంలో సాధన, అధ్యయనం, అభ్యాసం, ధ్యానం మొదలైన అంశాలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ సాధకులు ఆ పరమాత్మ లీలానుగ్రహాలను అనుభవిస్తూ తాదాత్మ్యం చెందుతూ అంతర్యామి అయిన పరమాత్మను తన హృదయమనే కోవెలలో కొలుస్తూ....జ్ఞానాన్ని విస్తరింపజేయడమే ఆధ్యాత్మికం.      ....    విశాలాక్షి...


 ఆధ్యాత్మికత ఆత్మకు సంభందించినది. పరమాత్మకు సంభందించినది. ఆత్మను తెలుసుకొని,పరమాత్మలో కలిసిపోయే సాధనకు సంభందించినది. పాజిటివ్ తప్ప నెగిటివ్ లేనిది. ఒక్క మానవ జన్మ పొందాలంటే ఒక అణువు ఎన్నో జన్మలు తీసుకోవాలట. పాప పుణ్యాల చిట్టాలు కరిగి పోవాలట. శూన్య స్థితికి చేరుకున్ననాడు కేవలం ఆ పరమాత్మను ధ్యానిస్తూ ....వెదుకుతూ... తపన చెందుతూ....మెల్ల మెల్లగా ఆ పరమాత్మను చేరుకునే దిశగా సాధనాభ్యాసాలను పట్టుకోవాలట...రుక్మిణీ దేవి...

మీరు బాగా చెప్పారు విశాలాక్షి గారూ ..మీరు కనబడక పోయేసరికి అనుకున్నాను సోధనా దిశలో ఉండి వుంటారని....రుక్మిణీ దేవి..      



 విదురనీతి:--

 మనిషికి కోపం ఉండకూడదు...ఉన్నట్లు నటించవచ్చు.....దురహంకారం పనికిరాదు.

పరాయి స్త్రీని తల్లిలా చూడాలి. ఆమె ఎదురవగానే తలవంచుకొని వెళ్ళిపోవాలి అని విదురనీతి.                 .....రుక్మిణీ దేవి.....



 ధర్మార్ధాలను అనుసరిస్తూ; లోక వ్యవహారం గ్రహిస్తూ; భోగచింత లేకుండా పురుషార్ధాలను సేవిస్తూ, అప్రస్థుత ప్రసంగాలు చేయకుండా, దుర్లభాలు వాంచించకుండా, పోయినవాటి కోసం శోకించకుండా ఎటువంటి విపత్తులు వచ్చినా, ధైర్యం కోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయనిదే విడువకుండా, సోమరితనాన్ని దరిజేరనివ్వకుండా మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు.



 ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరణకి ఆగ్రహం పొందడం విద్వాంసుల లక్షణం కాదు. వారి హృదయం గంభీరంగా గంగానదీ సదృశంగా ఉంటుంది.

ఒంటరిగా భోజనం చేయకూడదు...సహనం, క్షమ, సమర్ధత కలిగి ఉండాలి.

కుటుంబంలోని వృద్ధులను, బీద కుటుంబీకులను, సంతాన విహీనులు అయి, భర్తను కోల్పోయిన సోదరినీ ఆదరించి, ఆశ్రయమిచ్చి పోషించాలి.                    ..విశాలాక్షి.....


 పేరు.:---

 పాప, బాబు ఎవరు జన్మించినా, రాముడంతటి వారవ్వాలనో, దేశం గర్వింప దగ్గ వారవ్వాలి అంటూ...భగవంతుని, దేవతల, నేతల పేర్లు పెడతారు....సార్ధక నామధేయులవ్వాలని దీవిస్తారు తల్లిదండ్రులు..

ఒక వ్యక్తిని గుర్తించాలంటే పేరు ద్వారా రూపం మనసులో మెదులుతుంటుంది....ఆ వారి అబ్బాయి...అమ్మాయి వగైరా!.. 



 వ్యక్తి ఉండకపోయినా, పేరుని బట్టి వారి చరిత్రను బట్టి, కీర్తిని బట్టి ఆ వ్యక్తిని తెలుసుకోగలం.

  పేరుప్రతిష్టలు, వంశగౌరవం నిలబెట్టాలని, తండ్రి పేరు నిలబెట్టాలని, ఫలానా వారి అబ్బాయి,లేక అమ్మాయి అనగానే ఆ వ్యక్తికి గర్వంతో ఆనందంతో తనువు పులకిస్తుంది..

  రూపం చూడకపోయినా మనసులో ఆ వ్యక్తి పేరుతో మానసికంగా ఇష్టపడగలం.

 పేరుని నిలబెట్టుకోవాలని, పేరు కోసం  చేయరాని పనులు, ఇతరులను నిరసించడం, అవమానించడం, ఏ నీచ త్వానికైనా  దిగజారే మనుషులూ ఈ లోకంలో ఉన్నారు. 



 ఆధ్యాత్మికంగా, దేశభక్తితో పరుల శ్రేయమును కోరి, పేరుకై కాక దేశాభివృద్ధికై పాటుపడిన వారెందరో మహానుభావులు..అందరికీ వందనాలు....             visalakshi................. 






0 comments: