Saturday, June 25, 2016 By: visalakshi

స్నేహం-మైత్రి-చెలిమి..

  ఓం శ్రీ ఫరమాత్మనే నమో నమ:
 ఈ భూమిమీదకు తెచ్చి నేను, నాది అనే ఉనికిని,జ్ఞానాన్ని కలగజేసిన నా మాతృమూర్తికి వందనం..అభివందనం....అలా జీవితం ఇచ్చిన అమ్మ నా మొదటి స్నేహితురాలు...అడుగులు నేర్పుతూనే ఆసరాగా ఉండాల్సిన నాన్నగారు నా రెండవ స్నేహితుడు...అర్ధాంతరంగా..దైవ సన్నిధికి చేరుకున్నారు...బాల్య మిత్రులు..మా బడిలో (సెయింట్ థెరిసాస్ స్కూల్)అందరం స్నేహితులమే! నిష్కల్మషంగా ఎటువంటి తరతమ భేదాలు లేకుండా మైత్రీ భావనతో ఉండేవారము. ఉపాధ్యాయులు,విధ్యార్ధులు కుడా క్రమశిక్షణతో పాటు..స్నేహభావంతో ఉండేవారు..విభిన్న స్వభావాలతో ఏకత్వం...ఒక్క క్రిస్మస్ పండగ రోజు జీసెస్ జననం గురించి నాటకం వేయించేవారు తప్ప ఎపుడూ మత ప్రస్తావన లేని స్కూల్ మాది.. ఆ టైములోనే అలెలూయా అని పాటలు నేర్చుకొని ఇంట్లో సరదాగా పాడితే అమ్మ చంపేస్తాను.. అవి స్కూలు వరకే అని చెప్పింది...ఇక అనుకరణలు అద్భుతంగా ఉంటాయి కదా.. బాల్యంలో నా స్నేహితురాలు ఎడం చేత్తో రాస్తోందని నేను కూడా నేర్చుకుందామని రాయబోతే అమ్మ వారించి, కుడి చేత్తో రాయాలి అని కఠినంగా చెప్పి నన్ను సరిదిద్దిన స్నేహమయి..అదే స్నేహితురాలితో జండా వందనం జరిగే ప్రతి స్కూల్ కి వెళ్ళి ఇద్దరం దేశభక్తి గీతాలు పాడే వారం..ఇపుడు తను హోమియో డాక్టర్..10వ తరగతి   వరకు ఆ స్కూల్ లో చదివిన మేము కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము.. ఇంటికొచ్చి మధ్యాహ్నం భోజనం చేసేటపుడు నా స్నేహితులు అమ్మ వంటను ఆస్వాదిస్తుంటే అదో మధురానుభూతి.. అలకలు, కోపాలు కలహాలు...కలిసిపోవడాలు.. చెలిమిలో అన్నీ అపురూపమే కదా! 


























 16 సం"ల ప్రాయంలో కళాశాలలో స్నేహితులు...కొత్త స్నేహాలు.. ఆ జీవితం వేరు ...అప్పటివరకు తెలుగుమీడియం చదివి..తడబడుతూ ఇంగ్లీష్ మాట్లాడడం స్నేహితుల ఎగతాళితో చిన్నబుచ్చుకోవడం.. ఆడవాళ్ళం కాబట్టి మాలో మాకు అందం గురించి చర్చలు... సినిమా హీరోయిన్లతో పోల్చడాలు ..మా ఎం.పి.సి గ్రూప్ లో ఒక ముస్లిం అమ్మాయి ఉండేది ..అద్భుత సౌందర్య రాశి... మేమందరం ఆమె ఎప్పుడు వస్తుందా! అని ఎదురు చూసేవారము. తను నేరుగా వచ్చి నా పక్కన కూర్చునేది.. నేను సంభ్రమాశ్చర్యాలతో తనని చూస్తుంటే నాతో మాట్లాడి నా వివరాలు అడుగుతుంటే ..నా సంతోషం చూడాలి..అలా మేము స్నేహితురాళ్ళమయ్యాము. ఒక రోజు తన ఫొటో నాకు ఇచ్చి, నేను స్టేట్స్ వెళిపోతున్నాను అని చెప్పి ఖుదా అఫీస్ అని చెప్పింది...కళాశాల స్నేహాలు కొన్ని మాత్రమే జ్ఞాపకాలుగా మిగిలాయి.. కానీ పాఠశాల స్నేహితులు ఇప్పటికీ కలుసుకుంటున్నాము..మైత్రిని పెంపొందించుకొంటున్నాము...

 నా స్కూల్ డేస్ లోనే పరిచయమైన నా అన్నగారి స్నేహితుడు..నా ప్రేమికుడు ..నా అంతరంగ స్నేహితుడు...మరెవరో కాదు..మా శ్రీవారు..13 ఏళ్ళ ప్రాయం నుండి తెలిసిన స్నేహితుడు,నా మది దోచుకున్న నా హితుడు, సఖుడు, అన్నీ తానే అయి ఇప్పటికీ ,ఎప్పటికీ  నా అంతరంగిక మిత్రుడు.. బాబాగారి దీవెనలతో మాది జన్మ జన్మల బంధం అని తెలిసినా...ఈ జన్మ బంధం స్నేహం, ప్రేమ కలగలిపి అద్వితీయమైన అనుభూతినిచ్చిన బంధం..



















 బ్లాగు మిత్రులు...కొత్తగా బ్లాగు రాయడం మొదలు పెట్టినపుడు.. ఒక పది మంది బ్లాగు మిత్రులుండేవారు.. కాలక్రమేణా రాయడం కొన్నాళ్ళు మానేసాను. ఆ తరువాత మరల బాబాగారి లీలలను రాయడం మొదలు పెట్టాను.. అప్పటికి అంతర్జాలంలో చాలా మార్పులు ..ఎందరో బ్లాగర్లు...ఎన్నో మంచి రచనలను చూసాను.  అద్భుతమైన శైలితో ఎన్నో స్పూర్తిదాయక రచనలను అందిస్తున్న బ్లాగరులందరికీ వందనములు... 





బ్లాగు రాయడానికి శ్రీకారం చుట్టించిన ఘనత మా పాపది..తను నాకు మనోస్నేహితురాలు..అన్నీ షేర్ చేసుకుంటాము. ఇక బాబాగారి లీలలను రాయుట మొదలు పెట్టినపుడు ...కొన్ని బ్లాగులను చదవడం జరిగింది. అదీ తన ఒక వ్యాక్య ద్వారా,...నేను ఒక బ్లాగరు బ్లాగు చదివి, స్పందించి..వారి స్నేహం కోరి, వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం గాఢ ఆత్మీయ బంధంగా మారింది. (తనద్వారా మరొక బ్లాగరు పరిచయమయ్యారు.ఆ పరిచయం స్నేహ బంధమయింది.) మూడు సంవత్సరాలుగా మా ఆత్మీయ బంధం మరింత బలపడి అప్పుడప్పుడు చిరు కలహాలతో, అలకలతో, ఆధ్యాత్మిక అనుభూతులతో, అప్పుడప్పుడు వాదోపవాదాలతో...అల్లరి ఆట పట్టింపులతో... అన్ని విధాల మా అపురూప బంధం ఏకాత్మ భావనతో కొనసాగుతోంది..మేమిరువురం ఒకరినొకరు చూసుకోలేదు... ఉద్దేశ్యపూర్వకంగా మనం కలవకూడదు...మనల్ని ఎప్పుడో భగవంతుడే కలుపుతాడు.. అన్న తన ఆలోచనకు నేను అంగీకరించాను.మా ముగ్గురు స్నేహితురాళ్ళము అణువంత తెలిసిన ఆధ్యాత్మిక అవగాహనను ఒకరికొకరు పంచుకొంటాము..అలా పంచుకొన్న కొన్ని వ్యాసాలను, భావనలను...తరువాతి టపాలో వివరిస్తాను... 

 నాలో ఉండి నన్ను నడిపిస్తున్న శ్రీ సాయినాధునికి సర్వదా కృతజ్ఞతాంజలి ఘటిస్తూ....వేద.....

5 comments:

రుక్మిణిదేవి said...

బాగుందండి .. సరళ శైలి , ఎంచుకున్న సబ్జెక్టు,అద్భుత వ్యక్తీకరణ ,ఒక ఆత్మ కధకు నాంది వేశారు .. రచయత(త్రి) లు ఎందరో ఉండవచ్చు .కానీ ప్రతి ఒక్కరి జీవనశైలీ, జీవితానుభవాలు అద్భుతంగా ఉంటాయి .. ఆద్భుతంలో ఒక అణువు నేను కూడా అయినందుకు సంతోషం .. మీ బాబా లీలలు మాకు దగ్గరగా తెచ్చినందుకు , ఇప్పుడు మీ మనోభావనలు మాతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషకరం .. please continue ...

భారతి said...
This comment has been removed by the author.
visalakshi said...

రుక్మిణి గారూ!ధన్యవాదాలు..హ హ హ అది నా ఆత్మకధ కాదండీ..సరదాగా నా విషయాలు అందరితో పంచుకోవాలని రాసాను.రచయిత్రిని అసలు కాదు.నా అద్భుత జీవనంలో మీరు ఒక అణువు కాదు.. మనందరం ఒక్కటే రుక్మిణిజీ..ఆత్మీయ స్నేహబంధంలో ఉన్నాము.. ఇపుడు మనోభావనలలో మన ముగ్గురం చర్చించుకొన్న ప్రధానాంశాలే రాయబోతున్నాను...మీ ఇరువురి సహకార అభినందనలతో...

visalakshi said...

థాంక్స్ రా! తప్పకుండా మన విశాలహృదయంలో చర్చించుకొన్న ప్రధానాంశాలన్నీ రాస్తాను..అధ్యాత్మిక అవగాహనను ఒకరికొకరం పంచుకున్నాము రా.. ఇందులో నేర్పే గురువులెవరూ లేరు.. నీకు తెలిసింది నీవు చెప్పావు..నాకు తెలిసినది, చదివినవి నేను చెప్పాను..అలాగే రుక్మిణిగారు కూడా వారికి తెలిసిన విషయాలు చెప్పారు..అవన్నీ బ్లాగులో పొందుపరచడానికి సహకరించండి...

visalakshi said...


చిన్ననాటి స్నేహస్మృతులు బాగున్నాయి విశాల.

నాకు స్నేహం క్రొత్త కాదు. మంచి మిత్రులున్నారు. కానీ, స్నేహానికి పరిపూర్ణ అర్ధం, ఔన్నత్యం మాధుర్యం నీ చెలిమి నొందిన తర్వాతే తెలిసింది. నిజమే, నీవన్నట్లు మనది ఏకాత్మభావనతో కూడిన ఆత్మీయ బంధం...స్నేహాతీత బంధం.
వాట్స్ అప్ ద్వారా మన మువ్వురము "విశాల హృదయం" గ్రూప్ గా ఏర్పడి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం. నాదైన చిన్ని ప్రపంచం నుండి విశాల ప్రపంచంలోనికి అడుగిడిన అనుభూతిని, ఆనందాన్ని, అమూల్య ఆధ్యాత్మిక విషయావగాహనను ఇచ్చారు మీరిరువురు. ఆ విషయాలన్నీ నీ బ్లాగ్ ద్వారా మరల స్మరించుకునేటట్లు తెలుపుతానన్న నీ సంకల్పం సంతోషదాయకం. తదుపరి పోస్ట్స్ కై వేచి చూస్తున్నా...
ఈ వ్యాక్య భారతి రాసిన వ్యాక్య.పొరపాటున డిలీట్ అయింది.కావున మరల ప్రచురిస్తున్నాను..