Thursday, November 20, 2008 By: Vedasree

నమ్మకం: పాజిటివ్ థాట్

నమ్మకం అనేది మనిషిలోని గుణం. అది ఒక విధమైన ప్రశాంతతనూ
,సంతోషాన్నీ కలిగిస్తుంది.
చిన్నతనం నుండీ అతి జాగ్రత్తను నేర్పుతూ ఎవరినీ నమ్మకు ,
మోసగిస్తారు అని తల్లి దండ్రులు వ్యతిరేక ఆలోచనలు మనసులో నాటుతారు.
వ్యక్తిని బాగా పరిశీలించి నీ అంచనాలకు సరిపోతేనే నమ్ము. అని పదే పదే చెబుతారు కొంతమంది పెద్దలు.
ఈ రకంగా నమ్మకానికి దూరంగా మనిషిలో అపనమ్మకాన్ని ఎక్కువగా ముద్ర వేస్తారు. దాని కారణంగా చివరికి తల్లిదండ్రుల మీద కూడా సరైన నమ్మకం అలవరుచుకోరు. మనసు అయోమయ స్థితికి వెళుతుంది. కొంతమంది తమని తాము నమ్మలేని స్థాయికి దిగజారిపోతారు.
అపనమ్మకం అనుమానాన్ని ,సంఘర్షణను ,అశాంతిని ,పిరికితనాన్ని పెంచుతుంది.
ఒక మహిళ భర్తగా మారిన పరాయి మగవాడికి తన సర్వస్వం అర్పించి ,అనుసరించడానికి ఆధారం" నమ్మకం. "
"ఒక గులాబి వికసిస్తున్నప్పుడు (ఎవరు తనని ఆస్వాదిస్తారో ) అని ఆలోచించదు.వికసించడం తన సహజత్వం - వికసించింది అంతే. అది సహజ గుణం .అలాగే నమ్మకం అనేది నిశబ్ధం నుంచి ,నిజ స్వరూపం నుంచి పుట్టుకొచ్చే శాంతి పూర్వక సుగంధం.
నమ్మకం మనిషిని ఉన్నతంగా ఆలోచింపజేస్తుంది. పరిపక్వతను ,వ్యక్తిత్వ వికాశాన్ని పెంపొందిస్తుంది .ముందుగా తన మీద తనకి నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని తన చుట్టూ వున్న వ్యక్తుల మీద పెంచాలి. అందరినీ ప్రేమించాలి.
ఎవర్ని నమ్ముతున్నానని కాదు ,ఎలా నమ్ముతున్నాను :ఎంతగా నమ్ముతున్నాను అన్నవి ప్రధానాలు .
జస్ట్ ! నమ్మకంతో కూడిన హృదయాన్ని పెంచుకోండి. అది ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మన ఉనికిలోనే అద్భుతం నిండిపోతుంది.

5 comments:

లక్ష్మి said...

బాగుంది. కాకపోతే దురదృష్ట వశాత్తూ ఎవరిని ఐతే ఎక్కువగా నమ్ముతామో చాలా మటుకు వారే వెన్నుపోటు పొడవటంతో పిల్లలకి అలా అందరినీ నమ్మొద్దు అని నేర్పిస్తున్నామేమో అనిపిస్తుంది.

Unknown said...

వేద గారు, అద్భుతంగా రాశారు. చాలా మంచి విశ్లేషణ ప్లస్ జీవిత సత్యాలు. మంచి పోస్టులు చేస్తున్నారు.

నవకవిత said...

బాగుంది మీ టపా.

Vedasree said...

ప్రస్థుత పరిస్థితి అలాగే ఉంది లక్ష్మి గారు .కానీ నమ్మకమే జీవితం (.కాదంటారా ).థాంక్యూ.
శ్రీధరుగారూ ధన్యవాదాలు .
నవ కవిత గారూ థాంక్సండి .

Kottapali said...

Interesting thoughts.
నిజమే, నమ్మకం మనసులో ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తుంది. మనతో కొన్ని అద్భుతమైన పనులు చేయిస్తుంది. కానీ ఎంత ఇల్ళాజొకల్ ఐనా నమ్మకం కూడా వొట్టిగాలిలో నిలబడినది కాదని నా అనుమానం. ఒక వ్యక్తిని నమ్మడం అంటే, వారిలో మనకి మాత్రమే కనిపించే మంచి సంకేతాలు కనిపిస్తాయి, వాటిని ఇతరులు గుర్తించక పోయినా. అలాగే, లౌక్యం బొత్తిగా లేని నమ్మకమూ అంత మంచిది కాదని స్వానుభవం మీద తెలుసుకున్నాను.