ఓం శ్రీ సాయినాధాయ నమో నమ:
శ్రీ సాయి మా గృహమునందు వెలసి మమ్ములను ధన్యులను చేసిన మరో లీల....
స్వయంభూ గా ఇంట్లో పూజలందుకుంటున్న శ్రీ సాయి...గుడి కట్టడానికి మంచి సంకల్పంతో...అందరూ సమిష్టిగా ప్రారంభించాలి అనుకున్న తరుణంలో అనుకోని అవాంతరం...అపుడు వేదనతో నా కుటుంబం బాబాను ప్రార్ధించగా...బాబా ఇచ్చిన సందేశం...
మహర్దశ రావాలన్నా,సాయి అనుగ్రహం పొందాలి...దేనికైనా ఫూర్తి నమ్మకం ముఖ్యం. ప్రయత్నాలన్నీ పరీక్షలే...విజయం తప్పక వస్తుంది..
18 నవంబరు మంచి ముహుర్తం.ఉదయం వర్జ్యం లేని సమయంలో శంఖుస్థాపన...మీతో పాటే నేనూ ఉన్నాను .
అజ్ఞానంతో ఆంతర్యం తెలుసుకోలేకపోతున్నారు. తర్కం చేస్తున్నారు సందేహాలతో తల్లక్రిందులవ్వద్దు. ప్రశాంత చిత్తంతో కార్యం ప్రారంభించండి...కార్యసిద్ధికై పాటుపడండి..మన సంకల్పం గొప్పది. దారి మళ్ళించే అడ్డంకులు చాలా ఉంటాయి."లీలలు కేవలం మీ నమ్మకాన్ని బలపరచడానికి మాత్రమే"! గుడి కట్టడం అనేది దృఢమైన సంకల్పంతో, నమ్మకంతో పూర్తి చేయడానికి భక్తిని, భక్తితత్వాన్ని ప్రచారం చేయండి.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
0 comments:
Post a Comment