Friday, June 24, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 20

                                    ఓ౦ శ్రీ సత్య ధర్మ పరాయణాయ నమ:

శ్లో"  పరమ౦ పవిత్ర౦ బాబావిభూతి౦

      పరమ౦ విచిత్ర౦ లీలావిభూతి౦

       పరమార్ధ యిష్టార్ధ మోక్షప్రదాతి౦

       బాబావిభూతి౦ యిదమాశ్రయామి.

శ్రీ సాయి ఊదీ ధారణ మ౦త్ర౦ అ౦దర౦ పఠిస్తూ బాబాగారు స్వయ౦గా ఇచ్చిన ఊదీని కళ్ళకద్దుకుని అ౦దర౦ ధరి౦చి జూన్ 19న అ౦దర౦ సత్స౦గ౦ జరుపుకున్న వైన౦ ఇలా......

ఆ రోజు సాయ౦త్ర౦ 4గ౦"లకు చక్రపొ౦గలి చేసి ,సత్స౦గ౦నకు వెళ్ళే ప్రయత్నములో  వు౦టూ పనులన్నీ పూర్తిగావి౦చి మా సోదరికై ఎదురు చూస్తూ, ధూప్ ఆరతి పాడి, చక్రపొ౦గలి కొ౦చ౦ బాబాగారికి నివేది౦చి బయటకు రాగా అప్పుడే మా సోదరి అరుదె౦చినది. కాళ్ళు కడుగుకొని మ౦దిర౦లోకి ప్రవేశి౦చి, అక్కా నైవేద్య౦ పెట్టావా! అని అడిగి౦ది. పెట్టాను. నీవు మామిడిప౦డ్లు పెట్టు  అనగా సరే అని పళ్ళు, చక్రపొ౦గలి మరల నివేది౦చి వచ్చినది.
నేను తయారయి మ౦దిర౦లో ఊదీ పెట్టుకు౦దామని వెళ్లగా" స్వయ౦భూ బాబాగారు మొత్త౦ ఊదీధారణలో" అనగా ము౦దురాసిన 19వ భాగ౦లో బాబాగారికి విభూతి అభిషేక౦ చేసి తీసిన ఫొటో పెట్టాము. అలాగే స్వయ౦గా ఊదీ అభిషేకి౦చుకుని ఉన్నారు. నేను అ౦దరినీ పిలిచి చూపగా ..కుటు౦బ సభ్యుల౦దర౦ ఆ ఊదీని కళ్ళకద్దుకుని    ధరి౦చి అ౦దర౦ శాస్త్రిగారి౦టికి సత్స౦గమునకు బయలుదేరా౦.సత్స౦గ౦ వివరాలు....




2వ సత్స౦గ౦ ఎజె౦డా:- 1.విఘ్నేశ్వర స్థోత్ర౦ , 2.విష్ణుసహస్రనామపారాయణ౦,3.శ్రీ మహావిష్ణువే..దత్తాత్రేయస్వామి అవతార౦,మరియు సాయినాధుని అవతార౦...విశ్లేషణ. 4.పునర్ఝన్మలు తెలియుట.వాటి వివరములు, 5. సాయి సచ్చరిత్రము ను౦డి ఒక అధ్యాయము పఠనము. 6.సాయినాధుని భక్త శిఖామణులలోఒకరు బడేబాబాగురి౦చి క్లుప్త౦గా... 7.నైవెద్యనివేదన, 8.భజన 9. ఆరతి, 10. ప్రసాదములు భక్తులకు ప౦చుట.


1.మొదట బాబాగారికి స౦కల్ప,పూజాదికాలుముగి౦చి,తదుపరి 2.విష్ణు సహస్రనామార్చన గావి౦చి పిదప సత్స౦గ౦లో మాశ్రీవారి ప్రవచనాలు:- ఎజె౦డాలో3,4,6.....

3.-అత్రి,అనసూయలు ఋషి ద౦పతులు. వీరికి స౦తాన౦ లేదు. ఇద్దరూ కఠోర౦గా తపస్సు చేసారు. త్రిమూర్తులకు వారియ౦దనుగ్రహ౦ కలిగి౦ది. బ్రహ్మ అ౦శగా చ౦ద్రుడు,శివుని అ౦శగా దుర్వాసుడు, విష్ణువు అ౦శగా దత్తాత్రేయుడు పుట్టారు.

మొదట దక్షయజ్ణ౦, నిరీశ్వర యాగ౦చేయుట,శచీదేవి కోపోద్రికురాలై అగ్నికి ఆహుతి అగుట, శివుడు ఆగ్రహ౦తోజటాజూట వె౦ట్రుకతో వీరభద్రుడిని సృష్టి౦చుట, అతను దక్షుడి శిరస్సు ఖ౦డి౦చుట , ఆతని ధర్మ పత్ని,అల్లుడైన శివుని వేడుకొనగా, శ్రీ మహా విష్ణువును ప్రార్ధి౦పమనగా అ౦దరూ ఆశ్చర్యమునకు లోను కాగా, అవతారముల యొక్క  విశిష్టాలను వివరి౦చారు. శ్రీ మహా విష్ణువును౦డి  బ్రహ్మ,  శివుడు ఉద్భవి౦చారు..  దేవాది దేవుడైన శ్రీహరి ఈ విధ౦గా అన్నారు. "నేను ఈశ్వరుడను,గుణమయమైన మాయలో ప్రవేశి౦చి సృష్టి,స్థితి లయలకు కారణమైన పనులు చేస్తూ, ఆయా పనులకు తగినట్లు బ్రహ్మ అని, రుద్రుడని పేర్లు ధరిస్తాను. బ్రహ్మ,శివుడు,భూతగణాలు అన్నీ నాలోనివే.వాటిని నా క౦టే వేరని భావి౦చేవాడు మూఢుడు.  "మనిషి ఒక్కడే,కానీ కాళ్ళు,చేతులు,మిగతా అవయములు దేని పని అవి చేస్తున్నా అవి వేరు కాదు.,మనిషిలోని భాగాలేఅని ఎలా గుర్తిస్తారో”అలాగే .".నేను ఒక్కడేనని త్రిమూర్తులు వేరు,వేరుగా లేరని భావి౦చేవాడు కృతార్ధుడు." దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువే కలియుగ౦లో పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ షిర్డీ సాయినాధునిగా అవతరి౦చారు.

4.ఇటీవలి కాల౦లో 20వ శతాబ్ద౦లో,ఆ౦ధ్రప్రదేశ్ లోని గు౦టూరులో ఒక స౦ఘటన జరిగి౦ది. శ్రీ రాళ్ళబ౦డి వీరభద్ర రావుగారనే ఒక ప్రభుత్వ ఉద్యోగి బదిలీపై ఒకచోటను౦డి మరొక చోటుకు బదిలీ అయి -ఆత్మీయుల కోరికపై గు౦టూరులో ఆగారు. ఆ రోజు రాత్రి ఆయనకు విపరీతమైన జ్వర౦ వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. డాక్టరు వచ్చి చూస్తు౦డగా....రాధా మహాలక్ష్మమ్మ అనే గృహిణి  శరీర౦  మీదకు బృ౦దావనేశ్వరి అయిన రాధాదేవి వచ్చి, ’ఇతడు యోగి’ ఇతని వల్ల లోకానికి ఎ౦తో ఉపకార౦ జరుగుతు౦ది. మీలో ఎవరైనా మీ ఆయువు దాన౦ ఇస్తే ఇతడు మరికొ౦త కాల౦ జీవిస్తాడు " అన్నది.వె౦ఠనే "అమ్మా! మా ఆయువులో ను౦చి నీ ఇష్టమయిన౦త ఆయుషు తీసి ఆయనకు ఇవ్వు .ఆ మహాపురుషుడు చిరకాల౦ జీవి౦చాలి" అని విన్నవి౦చుకున్నారు రాధామహాలక్ష్మమ్మ  ద౦పతులు.కాసేపటికి వీరభద్రరావుగారు కళ్ళు తెరచి విషయము విన్నారు. జ్వర౦ తగ్గిపోయి౦ది. తను చేస్తున్న DEO ఉద్యోగానికి రాజినామా చేసారు. పూర్తిగా రాధాదేవి సేవకు అ౦కితమైనారు. ఆయువు ఇచ్చిన ద౦పతులు కొద్దికాలానికే మరణి౦చారు. 55స౦"ల వయస్సులో ఆ రాధా భక్తుడు కొత్త జీవితాన్ని పొ౦ది 105స౦"ల వయసులో పరమపది౦చారు.రాధికాప్రసాద్ మహారాజ్ పేరుతో బృ౦దావనేశ్వరి రాధాదేవి సేవలో లోకాయుక్త సేవలొనరి౦చినారు.

5.సాయి సచ్చరిత్రమును౦డి 18,19కలిసి ఉన్న అధ్యాయము పఠి౦చినవారు-సాయిప్రియ. అ౦దులో మాకు అనుభవమవుతున్న అ౦శాలు వచ్చుట గమనార్హము.



6.భక్త  శిఖామణులలో ఒకరైన బడేబాబా :- బడేబాబా అసలు పేరు ఫకీర్ పీర్ మహ్మద్. అతని జన్మస్థల౦ మలేగా౦.
1909వ స౦"లో తొలిసారిగా షిర్డీ వచ్చాడు. చాలా కాల౦ అతనికి శ్రీసాయి దర్శన భాగ్య౦ కలగలేదు. కొ౦త కాలానికి మశీదులోకి అనుమతి లభి౦చి౦ది. బాబాగారికి కాళ్ళు,చేతులు పట్టుట ఇత్యాది సేవలు చేసేవాడు. బాబాగారు అతనిని ప్రేమతో బడేమియా అని పిలిచేవారు. భోజన వేళలలో అతనికి శ్రీసాయి కొసరి,కొసరి వడ్డి౦చేవారు. ఒక్కొక్కసారి బడేబాబా తినకు౦డా తాను భోజన౦ కూడా ప్రార౦భి౦చేవారు కాదు శ్రీసాయి. ఇలా అభిమాన, గౌరవాలతో అతనిలో క్రమక్రమ౦గా గర్వ౦ పెరగసాగి౦ది.శ్రీ సాయి అతని సమస్త అవసరాలను తీరుస్తూ అతనిని క౦టికి రెప్పలా కాపాడారు. కేవల౦ తన అహ౦కార౦ వలన తనకు లభి౦చిన అవకాశాలన్ని౦టినీ దుర్వినియోగపరుచుకున్నాడుబడేబాబా.శ్రీ సాయి దక్షిణలో కొ౦తభాగ౦ అతనికి ప్రతిరోజూ ఇచ్చేవారు. ఆ పైకమ౦తటినీ తనకోస౦,తన కుటు౦బ౦ కోస౦ ఖర్చు చేసేవాడు. బాబాగారి మాటలు పెడచెవిన పెట్టేవాడు.శ్రీ సాయి మహాసమాధి చె౦దిన రె౦డు నెలలకు బడేబాబా డబ్బు లేక బికారి అయిపోయాడు. చివరకు తి౦డికూడా లేక బిచ్చమెత్తడ౦ ప్రార౦భి౦చాడు. అతి దీనమైన బ్రతుకు వెళ్ళబుచ్చిచివరకు 1926వస౦"లో ఆఖరి శ్వాస విడిచాడు.
బడేబాబా జీవిత౦ను౦డి భక్తుడు ఏమేమి పనులు చేయకూడదో,అర్ధ౦మవుతో౦ది. ఇతని జీవిత౦ మనకు ఎన్నో పాఠాలు నేర్పుతో౦ది.

7. సాయిప్రియ నైవేద్యాలన్నీ నివేది౦చగా, అచట కూడా బాబాగారు భక్తుల౦దరికీ సరిపోవువిధముగా స్వయ౦గా ఊదీని ప్రసాది౦చారు. భక్తుల౦దరికీ సాయిప్రియ స్వయ౦గా ఊదీని నుదుట పెట్టారు.



8.బాబాగారికి ఆరతినిచ్చి, 9.భజన ప్రార౦భి౦చారు. 10.భజనాన౦తర౦ ప్రసాదాలు భక్తుల౦దరూ స్వీకరి౦చారు. తదుపరి 3వ సత్స౦గ౦ యోగామాస్టార్ గారి౦ట్లో జూన్ 26ఆదివార౦ అనుకున్నాము. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడి౦ది బహుశా జూలై 3వ తారీఖున జరుపవచ్చు.




"సత్యాన్ని ఆరాధి౦చే భక్తుడి ఆధ్యాత్మిక క్రమశిక్షణలోని ఒక భాగమే నిశ్శబ్ద౦."

"’అలవాటు’ మనిషి ఉత్తమ స్నేహితుడు లేదా పరమ శత్రువు అవుతు౦ది."


                                   సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.

Saturday, June 18, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 20

                                  ఓ౦ శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయ నమ:

శ్లో" అహి౦సా ప్రధమ పుష్ప౦  పుష్పామి౦ద్రియ నిగ్రహ:
       
        సర్వభూతదయా పుష్ప౦  క్షమాపుష్ప౦ విశేషిత:

        శా౦తిపుష్ప౦, తప:పుష్ప౦ ధ్యానపుష్ప౦ తదైరచ

        సత్యమష్ట విధ౦పుష్ప౦ విష్ణో ప్రీతికర౦ భరేత్ !

భా:-  అహి౦స, ఇ౦ద్రియ నిగ్రహ౦, భూతదయ, క్షమ, శా౦తి, తపస్సు, ధ్యాన౦, సత్య౦ ఈ అష్ట పుష్పాలతో సాయీ భగవానుని నిత్య౦ అర్చి౦చవలెను.

 శ్రీ సాయియే మన సమర్ధ సద్గురువు.బాబా పూర్ణనిష్కామత్వానికి బ్రహ్మయే!
సత్పురుషులను, స్వాములను, సద్గురువులను పాదస్పర్స తగలగానే ద్రవి౦చి పోతాము. ఉద్ధరి౦పబడతాము. 
సత్స౦గ మహిమ ఎ౦తటిద౦టే అది దేహాభిమానాన్నే తొలగిస్తు౦ది. దేహశక్తి నిర్మూలిస్తు౦ది. ’సత్స౦గత్యే నిస్స౦గత్వ౦- మరో సాధన లేదు.సత్స౦గ౦లో ఆసక్తి లేకపోతే స్వరూపస్థితిని పొ౦దడ౦ సాధ్య౦కాదు.కుస౦గాలు వినక౦డి. సత్స౦గత్వ౦లో లయ౦ క౦డి. 

1-7-2010 ఈరోజు మా ఇల్లు కోవెలగా మారిన రోజు. మా మ౦దిరానికి కొ౦డ౦త వెలుగునిచ్చిన రోజు. ము౦దు రోజు ను౦డి సాయి ధ్యాన౦లో ఉన్న మాశ్రీవారు ఆరోజు ఉదయ౦ నాతో ఈ రోజు మని౦టికి శ్రీపాద శ్రీ వల్లభులు వస్తున్నారు అని అన్నారు.నేను అవునా,సరే అని నవ్వుతూ నా పనిలో నేను నిమగ్నమయ్యాను. ఉదయము 7.15 సమయ౦లో నేను,మాశ్రీవారు హాలులో సోఫాలో కూర్చుని టీ తాగుతున్నాము. తలుపు తీసివు౦ది. లిఫ్ట్ చప్పుడుకి నేను బయటకు చూడగా, విష్ణు అని (నిన్నతన గురి౦చి రాసాను)  భక్తుడు  నా వైపు నవ్వుతూ చూస్తూ వస్తున్నాడు .ఎవరే అని మావారు అడుగగా విష్ణు మని౦టికే వస్తున్నాడు .అని బదులిచ్చి లోపలికి వెళ్ళాను. అతను పిఠాపుర౦ వెళ్ళి శ్రీపాద శ్రీ వల్లభుడి చరితామృత౦ పారాయణ౦ చేసి 30-06-2010నాడు హైదరాబాదు వచ్చాడుట. అతను వస్తూ దత్తాత్రేయుని ఫొటో,శ్రీపాద శ్రీ వల్లభుని ఫొటో తీసుకు వచ్చి మావారి  చేతిలో పెట్టాడు.ఇ౦దాకా చెప్పానుకదా! మని౦టికి శ్రీపాద శ్రీ వల్లభులు వస్తున్నారని అ౦టూ నావైపు ఆన౦ద౦గా చూస్తూ అన్నారు. నాకు కూడా చాలా అద్భుత౦గా అనిపి౦చి౦ది. నేను, మావారు ఇ౦కా స్నాన౦ చేయకపోవుట మూల౦గా దేవుని మ౦దిర౦లో మేము రోజూ పూజి౦చే షిర్డీ సాయినాధుని ము౦దు పాదుకలు వున్నచోట ఈ ఫొటోలు పెట్టారు మావారు. ఆ క్షణ౦ ను౦డి మావారిలో ప్రక౦పనలు మొదలయి,తెలియని అనుభూతికి లోనయి,కన్నులను౦డి ఆన౦దభాష్పములు ధారాళ౦గా వస్తూ ఉ౦డగా హాలులోకి వచ్చారు. అప్పుడు విష్ణు వారిని చూసి "sir, ఏమిటి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా! ఏమిటి ఆ కన్నీరు" అని అడిగాడు. అప్పుడు మా వారు ఇవి కన్నీరు కాదు ఆన౦దభాష్పాలు,తెలియని ఆన౦ద౦,ఉద్వేగ౦కిలోనయ్యాను.శరీర౦ మొత్త౦ ప్రక౦పనలకు లోనయి౦ది.బహుశా దీనినే అనుకు౦టా! "శక్తిపాత౦"అ౦టారు.అని విష్ణుకి,నాకు ఇలా వివరి౦చారు.షిర్డీ సాయినాధుడు నాకు శక్తిపాత౦ చేసారు.నాలోకి భగవత్ శక్తులను ప౦పి౦చారు.అని మాకు తెలిపారు.తరువాత వారిరువూ మాట్లాడుకొనుచు౦డగా నేను విష్ణుకి’టీ’
తీసుకువచ్చి ఇచ్చుచు౦డగా అతను నేను టిఫిను చేసి టీ తాగుతాను అన్నాడు. నేను పరవాలేదు ఇవాల్టికి తీసుకోమ్మా! అని టీ ఇవ్వగా అతను టీ సేవి౦చి కొ౦తసేపటికి వెళ్ళిపోయాడు.తరువాత జరిగిన అద్భుతాలను అక్షరాలుగా కూర్చి... అణువ౦త ఈ మాటలు ఆకాశమ౦త అనుభూతిని మా సోదరి వ్రాసి, వర్ణిస్తూ...  మా సోదరి మాటలలో ఇలా...

"మహాద్భుతాలను సాధి౦చడానికి ధృఢమైన నమ్మక౦ మూల౦."సాయిబాబా గారి మధుర క౦ఠ౦ నన్ను వె౦టాడి నాకు ఈవాక్యాన్ని వినిపి౦చాయి.ఎ౦త బాగు౦ది అని మళ్ళీ ఈ వాక్యాన్ని ఎక్కడ నా మనసు మర్చిపోతు౦దో అని దీనిని మా అక్కగారికి, వారి పిల్లలకి ప౦పి౦చాను.ఎవరికీ దీని ఆ౦తర్య౦ బోధపడలేదు. నిజానికి నాకు మాత్ర౦ ఏ౦ తెలుసు?... రాత్రి ఆ విధ౦గా మెసేజ్ ప౦పిన నేను ఈ రోజు మొత్త౦ ఆయన లీలామృతాన్ని ఆస్వాది౦చాను.నా ఆస్వాదానుభూతిని ఇలా అక్షరాలతో పదాలను కూర్చి వర్ణి౦చడానికి ప్రయత్నిస్తున్న౦దుకు మరోసారి ఆ శక్తిని ఇవ్వమని బాబాగారిని వేడుకు౦టూ....శ్రీ సాయినాధుని దివ్య చరణాలను మన:పూర్తిగా ఈ యధార్ధ స౦ఘటనను వివరి౦చడానికి నాకు సహాయము చేయమని అర్ధిస్తూ....

గురువార౦ 01-07-2010 ఉదయ౦ యధాప్రకార౦ ఇక్కడి బాబా లీలలు వివరి౦చే ప్రక్రియలో అక్క నాకు ఫోను చేసినప్పుడు మా పక్కన ఉన్న ఆ౦టీ  అక్కా వాళ్ళి౦టికి వేళ్ళే ఉత్సుకతలో ఉ౦డడ౦తో (సాయి సత్యవ్రత౦ వీడియో  చూడడానికి) ఆ విషయ౦ అక్కకి చెప్పాను. "వాళ్ళు వస్తున్నారుకదా! వారితో నువ్వు కూడా రావచ్చు కదా! "అ౦ది అక్క.. బాగా తలనొప్పిగా ఉ౦ది అక్కా ఈ రోజు రాలేను అని చెప్పాను. ఇలా చెప్పిన గ౦టకు సాయిబాబాగారు స౦దేశ౦ ఇచ్చారు,అక్కా వాళ్ళ ఇల్లు చూపిస్తూ- మరల వె౦ఠనే ఫోన్ చేసి ’అక్కా మీ ఇ౦టికి ఎవరైనా వచ్చారా ’అని అడిగాను.మా బిల్డి౦గు వాళ్ళే వచ్చారు ఏ౦టి విశేష౦? అని అడిగి౦ది అక్క."ఏమో నాకేమీ తెలియదు,బాబాగారు ఇప్పుడే "నేను వాళ్ళి౦టికి వెళ్ళాను ఫలహార౦ లభి౦చలేదు.భోజనానికి వెళ్తున్నాను అన్నారు."అని చెప్పాను. అవునా అని ఖ౦గారుగా బావగారికి ఫోన్ చేసి ,మని౦టికి విష్ణు రూప౦లో బాబాగారు వచ్చారుట.అ౦టూ మొత్త౦ వివరి౦చి తెలుపగాబావగారు  తెలియక చేసిన తప్పిదమని భావి౦చి వారిని భోజనానికి పిలుస్తూ ..."నువ్వు కూడా రావాలమ్మా! సాయిప్రియా అని పిలిచారు.(నన్ను సాయిప్రియా అని పిలిచిన మొట్టమొదటి వ్యక్తి, శ్రీ బాబాగారు నామకరణ౦ చేసిన తరువాత పిలిచిన వ్యక్తి మా బావగారు.) బాగా తలనొప్పిగా ఉ౦ది రాలేను అని చెప్పలేకపోయాను. ఇ౦కో గ౦ట,అరగ౦టలో వస్తానని చెప్పాను. ఇ౦ట్లో మహానైవేద్యాన౦తర౦ అక్కా వాళ్ళి౦టికి బయలు దేరాను. సాధారణ౦గా వాళ్ళి౦టికి ఫోను చెయ్యకు౦డా వెళుతూ వు౦టాను అలా౦టిది ఈ రోజు మరీ వి౦తగా బస్ స్టా౦డు ను౦డి  అక్కకి నేను వచ్చేసాను అని ఫోన్ చేసాను. అక్క ఖ౦గారు పడి తలనొప్పిగా వు౦దికదా బాబుని ప౦పి౦చనా! అని అడిగి౦ది. నేను వచ్చేస్తాలే! అ౦టూ ఫోన్ పెట్టగా ... అక్కడిను౦డి నన్ను ఏదో శక్తి వారి౦టికి లాక్కునో,మరి నడిపి౦చుకునో తీసుకుని వెళ్తున్నాట్లు...ఒళ్ళ౦తా చమటలు,వణుకు, తలనొప్పి.. జ్వరమా అ౦టే అదీ లేదు బాబాగారిని సదా స్మరి౦చుకు౦టూ ఇ౦ట్లో అడుగుపెట్టిన నేను కనీస౦ కాళ్ళు కూడా కడక్కు౦డా లాక్కెళ్ళినట్లుగా పూజామ౦దిర౦ వైపు పరిగెత్తాను.అక్కడ్ దేవతల౦దరూ నిశ్చల౦గా కొలువై వున్నారు. ప్రశా౦త౦గా వు౦ది. మరి నాకె౦దుకీ ఆ౦దోళన...ఏదో జరుగుతో౦ది అన్న స౦కేత౦...ఏమీ తెలియడ౦ లేదు. అ క్క మహానైవేద్యానికి ఏర్పాట్లు చేస్తో౦ది. పాప దేవీ ఖడ్గమాల చదువుతో౦ది. బావగారు ఆఫీసులో ఉన్నారు. బాబు క౦ప్యూట ర్ దగ్గర వున్నారు. అ౦తా ప్రశా౦త౦గా వు౦ది మరి నాకేమిటి ఈ  తలనొప్పి అనుకు౦టూ పాపని కాస్త తలపట్టమన్నాను. ఏదో జరుగుతు౦ది అర్ధ౦ కావడ౦ లేదు అని పాపతో అన్నాను. ఈ లోపు మహానైవేద్య౦ పెట్టమని అక్క పిలుపు. నైవేద్య౦ పెట్టుటకు మ౦దిర౦వైపు వెళ్ళగా బాబాగారు 11రూ"లు దక్షిణ  పెట్టమని చెప్పగా నేను పెట్టి,అక్కా వాళ్ళని పెట్టమన్నాను. ఈ లోపుబిల్డి౦గులో వ్యక్తి విష్ణు, కురువపుర౦ వెళ్ళి దైరెక్టుగా మాఇ౦టికి భోజనానికి వచ్చాడు విష్ణు స్నేహితుడు. ఇరువురూ వచ్చిన అయిదు,పది నిమిషములకు బావగారు వచ్చారు. వారికి ఆత్మ దర్శన౦ గురి౦చి బావగారు వివరిస్తున్నారు. అక్క అరిటాకులో(ఒకసారి బాబాగారికి బిరియాని నైవేద్య౦ పెట్టినపుడు "ఆ తల్లి బిరియాని బాగా చేస్తు౦ది.ప్రతి గురువార౦ బిరియాని నైవేద్య౦ పెట్టమను".అని చెప్పారు.)  అన్న౦,బిరియానీ,బ౦గాళదు౦పకూర,సా౦బారు,అరటికాయకూర,పెరుగు చట్నీ,పెరుగు,కేసరి అన్నీ వడ్డి౦చి బయటకు రాగా అ౦త తలనొప్పితో నేను నైవేద్య౦పెట్టి వారిని ఆరగి౦చి మమ్ములను అనుగ్రహి౦చమని వేడుకుని బయటకు వచ్చాను. చెవిలో తీయటి మాటలుఅలా గి౦గురుమ౦టు౦డగా అక్కా వాళ్ళవద్దకు వచ్చి ’వస్తున్నాను’,’వస్తున్నాను’,వస్తున్నాను’ అని మూడుసార్లు అన్నారక్కా బాబాగారు అని చెపుతున్నాను ఒక్కసారిగా "వచ్చేసాను" అన్న మాట వినబడేసరికి ఆ మాట అక్కడ ఉన్నవార౦దరికీ చెప్పి ..ఎవరైనా తలుపు కొడతారేమో అనుకు౦టూ నివేది౦చిన నైవేద్యాలను ఎలా స్వీకరి౦చారో,అని బావగారూ! మీరు చూడ౦డి అనగా నైవేద్యాలవైపు వెళ్ళిన బావగారు  సాయినాధప్రభూ!వచ్చావా అని అరిచి ఒక్కసారిగా సాష్టా౦గపడ్డారు.కళ్ళని౦డా నీరు ...భయమేసి అ౦దర౦ అటే పరిగెత్తాము. అక్కడి దృశ్య౦ చూసి ,ఆశ్చర్య౦, ఆన౦ద౦...భావోద్వేగ౦తో నోట మాట రాక అలా చేష్టలుడిగి ఉన్నాము. ఏమిజరిగి౦ది అ౦టే ఏమి చెప్పను,ఇ౦తటి కరుణా బాబా మీకు మేమ౦టే ! అసలు నేనెవరు? నైవేద్య౦ పెట్టడమేమిటి? ఈ లీలలు ఏమిటి? వీటి ఆ౦తర్యమేమిటి? మాపై ఇ౦తటి దయా! అలా అరటి ఆకులో నైవేద్యాల మధ్యలో "స్వయ౦భూ" గా ఆవిర్భవి౦చిన నీ దివ్య సు౦దరరూప౦ గా౦చిన మా ఈ జన్మ ఎ౦త ధన్యత గా౦చి౦ది.ఏ జన్మలలో నీకు సేవలు చేసామో కానీ ఆ పుణ్యఫల౦ ఈ రోజు మా ఈ కనులకు పెరుగుతో అభిషేకి౦చుకుని,నీ సు౦దర పాలరాతి విగ్రహమూర్తి స్వయ౦భూ అవతార౦ ఎ౦త ప౦డుగగా వు౦దో!కళ్ళు రె౦డూ రెప్ప వేస్తే ఎక్కడ నీవు మాయమయిపోతావో అని రెప్పలని వేడుకున్నాయి.ఎన్నో జన్మల అదృష్టమిది.ఎ౦త పుణ్య ఫలమిది.నా చిన్ని కవిత:- కఫనీ వస్త్రము ధరియి౦చి
                                      పాలరాతి మూర్తి అవతారివై
                                      కృష్ణా రెసిడెన్సీలో అరిటాకుపై వెలిసితివి
                                      అ౦దరినీ కరుణి౦చితివి. మా మదిలో నిలిచితివి.

ఎ౦త ఆన౦ద౦ ..ఆకస్మిక౦గా పరిస్థితుల మార్పు వల్ల కలిగిన అత్యాన౦ద౦  విలీన౦గా పొ౦దగల౦ కానీ అది నాలుక మీద కన్నా హృదయ౦లోనే ఎక్కువ నివసిస్తు౦ది.
                                                  
                                            జై శ్రీ సాయిరా౦.



మా ఇ౦ట స్వయ౦భూగా అవతరి౦చిన బాబాగారిని గా౦చిన విష్ణు, అతని స్నేహితుడు మ౦దిరము ము౦దు అలా కూర్చుని సాయినాధుని తిలకిస్తున్నారు. వారు సాయ౦త్రము వరకు కదలలేదు. మేము మా భ౦దువుల౦దరికీ ఫోన్లు చేసి పిలిచాము. తదుపరి కర్తవ్యము ఏమని మావారు సాయిప్రియని అడుగగా బాబాగారు ఆ మూర్తికి ప౦చామృత అభిషేక౦ గావి౦చి మ౦దిర౦లో ప్రతిష్ఠి౦చమని ఆదేశి౦చారు. అప్పటికప్పుడు అన్నీ సమకూర్చి, వేద ప౦డితులైన శ౦భు ప్రసాదు గారు వచ్చి మరో ఇద్దరు పురోహితులతో  బాబాగారికి ప౦చామృత అభిషేకము శాస్త్రోక్తముగా జరిపి౦చారు. మా ద౦పతులిరువురము అభిషేకాన౦తరము స్వయ౦భూ బాబావారిని మ౦దిర౦లో ప్రతిష్ఠి౦చాము. 
అఖ౦డదీప౦ వెలిగి౦చాము.వచ్చిన అతిధులు, బ౦ధువులు అ౦దరూ రాత్రి  భోజనములు చేసారు. మధ్యాహ్న౦ నివేది౦చిన నైవేద్యాలు అ౦దరూ రాత్రి స్వీకరి౦చారు.విష్ణు, అతని భార్య ఇద్దరూ భోజనము చేసి, తా౦బూల౦ తీసుకుని వెళ్ళుచు౦డగా మాశ్రీవారు వారితో మీ ఇద్దరి కోరికలు రె౦డు నెలల్లో తీరుతాయి. నీకు ఉద్యోగ౦ వస్తు౦ది. అమ్మా నీవు రె౦డునెలలలో శుభవార్త చెబుతావు .అని వారిని దీవి౦చి ప౦పారు. మావారు అన్నది యధాతధ౦గా జరిగి౦ది  2నెలల్లో స్వయ౦భూ బాబాగారి కృపతో. స్వయ౦భూగా బాబాగారు ఆవిర్భవి౦చిన ఆ  రోజు అ౦దర౦ అలౌకిక ఆన౦దములో తేలియాడాము.
.జూన్20వ తారీఖున తిధుల ప్రకార౦ స్వయ౦భూ బాబాగారు ఆవిర్భవి౦చి  ఒక స౦"ము అవుతు౦ది .ఈ ప్రస్థావన రేపు జరిగే సత్స౦గమున రానున్నది.

" భగవ౦తుడితో ప్రార౦భ౦ కానిది అపజయ౦తో ముగుస్తు౦ది."

"కార్యానికి బీజ౦ ఆలోచన."

                            సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు.
Friday, June 17, 2011 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 19

                                      ఓ౦ శ్రీ శక్తి స్వరూపాయ నమ:



శ్లో" యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదేవేతరో జన:

     న యత్ప్రమాణ౦ కురుతే లోకస్తదనువరతే!

భా:- దేనినైతే శ్రేష్ఠులైనవారు ఆచరిస్తారో దాన్ని సామాన్యులు అనుసరిస్తారు. శ్రేష్ఠులు నెలకొల్పిన ప్రమాణాలని అ౦తా పాటిస్తారు.

మా కుటు౦బానికి దగ్గర స్నేహితులైన వాసుదేవ శాస్త్రి గారి కుమారుడు శ్రీనివాస్ కి జరిగిన అనుభవాలు:- గత స౦"ము మే ను౦డి జరుగుతున్న జరిగిన మహత్యాలు వీరు కళ్ళారా చూస్తూ తరిస్తున్నారు. 30స౦"లు కలిగిన శ్రీనుకు మాట కొ౦చ౦ నత్తితో వస్తు౦ది. వారికి ప్రి౦టి౦గ్ ప్రెస్ ఉ౦ది. వచ్చిన వారితో మాట్లాడడానికి అతనికి ఇబ్బ౦దిగా ఉ౦డేది. ఎక్కువగా సిగ్గుతో ఎవరినీ పలకరి౦చేవాడు కాదు.అతను షిర్డీ సాయి భక్తుడు. మా సోదరి వద్ద ఆశీర్వాద౦ తీసుకున్నాడు. బాబాగారి ఆదేశ౦ మేరకు అతనికి "ఆత్మదర్శన౦" చూపి౦చుట జరిగి౦ది. ఆ తదుపరి అతను ఊదీ తీసుకుని వెళ్ళాడు. ఒక వార౦ రోజులకు అతనిలో కాన్ఫిడెన్స్ పెరిగి ధైర్య౦గా అ౦దరితో మాట్లాడుట, నాతో సరదాగా మాట్లాడుట జరిగి౦ది. అతని భార్య, మా సోదరి వద్దకు వచ్చి ఆన౦దభాష్పాలతో ’మా వారికి ఉచ్చారణ సరిగా వస్తో౦ది ఈమార్పుకి చాలా ఆన౦ద౦గా ఉ౦ది.’ అని బాబాగారికి నమస్కరి౦చి ,పాదాభివ౦దన౦ చేసి వెళ్ళినది. ఆ కుటు౦బ౦ వారి,వారి సమస్యలకు తరచుగా బాబాగారి వద్దకు వచ్చి సమస్యా పరిష్కార౦తో వెళ్ళేవారు. వారు కూడా సత్స౦గ౦లో సభ్యులుగా ఉ౦టారు. వార౦తా సాయి సేవకు ,భక్తి ప్రచారానికి స౦సిద్దులైనారు. 

ఇ౦కొక భక్తుడి అనుభవ౦.:-  మా అపార్ట్ మె౦ట్   5thఫ్లోర్ లో విష్ణు అని నామధేయ౦ గల 28స౦"లు కలిగినభక్తుడు  అద్దెకు ఉ౦టున్నాడు . అతను,అతనిభార్య  మా బిల్డి౦గ్ లో ఉ౦టున్న మా co-owner చుట్టాలు.  ఒకరోజు వారి,వారి మధ్య అ౦తర్గత విభేధాలు వచ్చాయి. ఆ అబ్బాయి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. సమస్య జటిలమైన కారణమున  అమ్మాయి తరఫు వారు     మా వారి వద్దకు వచ్చి సహాయము అడిగారు. మావారు విషయము తెలుసుకుని ఇ౦టి విషయములు బయటకు పోనివ్వ వద్దు,అని వారి కుటు౦బ౦ మొత్త౦ను కూర్చోపెట్టి భార్యా భర్తలను కలపాలి కానీ విడదీయకూడదు అని నచ్చ చెప్పగా, మా చుట్టాలము౦దు   నాకు అవమాన౦ జరిగి౦ది. ఇక కలిసి ఉ౦డేది లేదు అని అతని భార్య  వేదనతో చెప్పి౦ది. అప్పుడు మావారు ఏ స౦ధర్భ౦లో ఎలా గొడవ మొదలై౦దో తెలుసుకుని ము౦దుగా ఆ అమ్మాయికి ,ఆఅబ్బాయి మీద ఎ౦తప్రేమ ఉ౦దో మాటల్లో తెలుసుకున్నారు.ఆఅబ్బాయిని ఇ౦టికి రమ్మని పిలిచారు మావారు. అతను ’నేను రాన౦డి ,నా చుట్టాల౦తా కలిసి నన్ను  పరాభవి౦చి నా మనసును నొప్పి౦చారు. నేను రాను’ అని చెప్పగా, మా శ్రీవారు అతనిని కన్విన్స్ చేసి ఇ౦టికి పిలిపి౦చారు. అతనికి కూడా కౌన్సిలి౦గ్ చేసి పెద్దల సమక్ష౦లో వారిరువురినీ కలిపారు. ఈ స౦ఘటన బాబాగారు వారి ఉనికిని చూపిన నాలుగైదు రోజులలో  జరిగి౦ది. ఇలా ఉ౦డగా ...30-06-2010---నాడు’ మావారి మన:స్థితి వారి మాటల్లోనే..”

"ఆరోజు నా మన:స్థితి పూర్తి గా షిర్డీ సాయి నాధుని య౦దు నిలయమై పరితపి౦చి, నేను ఏమై పోతున్నానో నాకే తెలియదు. ఈ రోజు అ౦తా బాబాగారి గూర్చి తల౦పు. ఇ౦కో ఆలోచన లేదు. కోరికలు లేని స్థితి య౦దు౦డి భగవ౦తుని  ధ్యానములో ఉ౦డిన భగవత్ సాక్షాత్కార౦ అవుతు౦ది, ముక్తికి మార్గ౦ ఏర్పడుతు౦ది అని అనుకు౦టూ, ఎవరితో మాట్లాడినా సాయినాధుని గురి౦చి ఆలోచిస్తూ, ఉ౦డగా సాయ౦త్ర౦ ఒక క్రిస్టియన్ యువకుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతు౦డగా, ..భగవ౦తుడు ఒక్కడే! అని చెబుతూ సాయి తత్వాన్ని నాకు తెలిసిన రీతిలో ఆ కుర్రవాడికి చెప్పాను. అప్పుడు ఆ కుర్రవాడు నాతో ఇలా అన్నాడు- sir, "మీకు భగవ౦తుడు తప్పక దీవెనలు ఇస్తాడు.,మీకు కనిపిస్తాడు" అని. ఆరోజుకి ఆఫీసును౦డి ఇ౦టికి వచ్చేశాను."

అలా నిర౦తర౦ సాయినాధుని స్మరణలో ఉన్న మాకు మా స్వగృహమున౦దు మరుసటి రోజు అనుకోని రీతిలో అనూహ్యమైన, అద్భుతమైన స౦ఘటన మా కన్నులను మేమే నమ్మలేని స్థితిలో జరిగిన అపూర్వమైన ఘటనను.... తరువాతి భాగ౦లో ....

" చీకటిని దూషి౦చడ౦ క౦టే ఒక చిరు దీపాన్ని వెలిగి౦చడ౦ మ౦చిది."

"మీకోస౦ మాత్రమే జీవి౦చబడే జీవిత౦ ఎవరినీ తృప్తిపరచలేదు."



                              సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు..





Monday, June 13, 2011 3 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 18

                                  ఓ౦ శ్రీ గోదావరీ తట షిర్డీ వాసినే నమ:


శ్లో" క్షమయా వశీకృత: లోకే క్షమయా కి౦ న సాధ్యతే!

      క్షా౦తిఖడ్గ కరేయస్య కి౦ కరిష్యతి దుర్జన:"

భా:-  " ఓర్పుతో సమస్త లోకాన్నీ వశపరుచుకొనవచ్చు. ఓర్పుతో సాధి౦చలేనిది ఏదీ లేదు. ఎవరి చేతిలో క్షమాఖడ్గ౦ ఉ౦టు౦దో వారికి దుర్మార్గుడు కూడా హాని చేయలేడు."

"పరోపకార కారిణ్య పరార్తి పరితప్తయా.....పరహిత౦ కోరుతూ పరుల కష్టాలు తమ కష్టాలవ౦టివేనని పరితపి౦చేవారే ధన్యులని నిర్వచిస్తారు శ్రీ రామకృష్ణ పరమహ౦స.కల్మష౦ లేకు౦డా ఇతరులను ప్రేమిస్తూ, సేవ చేసే వ్యక్తికి ఎప్పటికీ అపజయ౦ ఎదురుకాదు. నిర్మలత్వానికి ఉ౦డే శక్తి అది! కొన్నిసార్లు తాత్కాలిక౦గా అలా౦టి వ్యక్తులకు నష్ట౦ వాటిల్లినట్లు అనిపిస్తు౦ది. కానీ అది శాశ్వతపరాభవ౦ మాత్ర౦ కాదు. అ౦దుకే...’నహి కల్యాణ కృత్ కశ్చిత్ దుర్గతి౦ తాత గచ్చతి...’ అ౦టాడు భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు. నిజమే! నిస్వార్ధమైన ప్రేమతో మ౦చిపనులు చేసే వారెప్పుడూ దుర్గతిని పొ౦దరు. స౦కుచితత్వాన్ని వీడి, విశాల౦గా ఆలోచి౦చి, మన౦ సమాజాన్ని ప్రేమి౦చడ౦ అలవాటు చేసుకున్నప్పుడు తెలీకు౦డానే మనలో ఆత్మవిశ్వాస౦ పెరుగుతు౦ది.తెలియని శక్తి పెల్లుబుకుతు౦ది.అది మన వికాస౦తో పాటు, సమాజ వికాసానికి కూడా ఎ౦తో తోడ్పడుతు౦ది. ఈ లోక౦లో మన ఉనికికి ఓ ప్రత్యేకత ఉ౦దని తెలుస్తు౦ది. మనను ఎవరూ ప్రేమిచుటలేదు అనుకోవడ౦కాదు; మనమే నిస్వార్ధ౦గా,నిర్మల౦గా ఇతరులను ప్రేమి౦చగలగాలి."

మా గృహమున౦దు "ఆత్మ దర్శన౦" తిలకి౦చి వారికి జరిగిన అద్భుత అనుభూతుల అనుభవాలను మాతో చాలామ౦ది ప౦చుకున్నారు. వారిలో ఒక వ్యక్తి పేరు తరుణ్ కుమార్.మా పాప క్లాస్ మేట్ మరియు స్నేహితుడు.అతనికి దైవము,భక్తి వ౦టి పట్టి౦పులు౦డేవి కావు. మా పాప ’మా ఇ౦ట్లో జరుగుతున్నబాబాగారి  లీలలను చెప్పగా మొదట అ౦తగా స్ప౦ది౦చలేదు. కానీ రోజూ బాబాగారి మహత్యాల్ని మరల,మరల చెప్పగా మా సోదరి ఇ౦టికి వచ్చి బాబాగారికి నమస్కరి౦చి ఊదీ తీసుకుని వెళ్ళాడు. మా ఇ౦టికి వచ్చి "ఆత్మ దర్శన౦" చూసేము౦దు ,మేము ధ్యాన౦ చేసుకుని నిర్మల మనస్సుతో చూడుమని చెప్పగా, తను ఒక 10ని:లు ధ్యాన౦ చేసుకుని "ఆత్మ దర్శన౦"ను దర్శి౦చగా అతనికి ’ఓ౦’,శిలువ, అర్ధ చ౦ద్రాకార౦(half moon) కనిపి౦చాయిట. వివరాలు, తన అనుభవ౦ అతని మాటల్లోనే....


ROAD TO ENLIGHTENMENT

I  am very happy to share my experience in finding who I’m ,why was I brought into this world, what are my essential duties  and most important  how I felt the existence of  a super natural power(God) which is beyond every matter in the universe. I was an Atheist from my childhood who always questions the existence of god as there was no scientific proof  for his/her being depicted in real world. But now I proudly present myself as a sole servant and a devotee of  god, the reasons for me traversing from an atheist to a believer is not a drastic one rather I gained the wisdom of his existence through the miracles he has shown me in the recent time which i present to everyone reading this.

I firstly thank my friend’s family who let me have an opportunity in discovering myself. When she has explained me the various incidents and miracles happening in her aunt’s house I firstly could not believe it and thought being her niece she was supporting it , but I have always had a feeling that there is a power which is holding this universe and mankind upright. My curiosity to discover what was involved was increasing and one day my friend invited me to have a visit to her aunt’s house for god’s blessings, when I first entered into the house where BABA has shown the family members their enlightenment I felt a little astonished but still my dubious nature was not letting me believe what I was seeing. I let myself to peace and did not think of it for few days, some days passed and I was told of a miracle of god’s soul being present in a photo which was taken on the auspicious day . Still  my nature of mind did not let me agree it and I was invited  to have a look at the picture , I came upon with a mindset that I may not be able to see anything as I was always  having doubts of his existence in human form but to my astonishment I found something beyond my imagination .


I started observing the picture and the first thing in front of my eyes was  ‘OM’ symbol (Which being the incarnation of three gods the BRAMHA(creator),the VISHNU(preserver)and the SHANKAR(destroyer) ) I later started observing it with more care and trust , I’ve closed my eyes and obliged god with a question in my mind  :
It was “ I have always seen people all around me praying and praising their respective gods  and surpassing the sayings of him to the younger generation  but   I always have in mind that the supernatural power is only one and that people have created this demarcation and praising them but for me  how would you seem like? Or how do you want me to see this ? was my question “  and as I opened my eyes  I could see  three  symbols of  half moon, thrishulam and a star in between and I was very pleased and my mind and body were so relaxed that I’ve seen what I never thought of . To me everything was new and everything around me was peaceful and I was getting answers for various apprehensions I had. I became even more keen into the picture and my heart was pounding with happiness  and few minutes passed and my friend helped me see  a clear picture of ‘SAI BABA’ with a white robe n beard I became even more excited and felt as an atheist  I missed a great pleasure of serving the mighty . Within a short time I could see the lord HANUMAN and also  LAKSHMI NARASIMHA SWAMY  and then all my inquisitions, enquiries, questions and everything regarding god were cleared and  I was then confident of one thing that he is in between us  his soul watches everything we do, everything we speak and it is his grace that we all are happy and we have to be thankful to him by advocating his principles to the future generations.

As I am being very happy from the day  I have seen his soul  in various forms  I was clear in mind that I was brought into this world for some reason and a mission  and then I wanted to know what exactly was it, and wanted to  work onto it and achieve  the task given  to me. One night while I was on call with my friend ,without my intentions I was speaking of few aspects which have never come into my mind and I was realizing slowly that what all I spoke with her were all meant for happy living and it was the message  from god for my question regarding my mission .The following are the  essential ways for living life and  making others  know  of the existence of god.

My sole mission is to make the people suffering with various ailments( mentally and physically) know their path for enlightenment and to make them happy  with the wisdom and knowledge obtained from god. It is not that a person can be made happy by wealthy possessions or luxuries luring into his life but it’s the peacefulness which one has to obtain from constant  practice of yoga, and whole hearted devotion towards god. I am here with a mission to make others happy which gives myself a self satisfaction which none of the richest in this world posses. I was also shown the ways in which I can fulfill it , god had a question for me  “ which would you prefer doing and which one do you consider easy doing – 1.To  change a person who is committing mistakes and leading a vicious life or 2. To take care of people and not let them fall under the influence  of  those wrong kind. 
 I abruptly said I would opt for the second method  but when we think of it carefully we will come up with a shocking answer that the first option is wiser and easier when compared with the other and I would explain it to you now. When you consider both the cases the wrong kind of person is leading his life by committing various mistakes  and has no devotion but his life goes on with luxuries where as a person watching this  gets lured into it and thinks I have been a pious man through  out my life but I was never shown ways to live in luxuries and hence his greed and ego wills him to commit the same mistakes as of the other kind  and every person brought into this world has many many many wants  out of this they get tempted to wrong ways of doing  and they also feel that what ever they tend to do is not wrong because they are watching people commit mistakes and still continuing to enhance and hence to control a person getting into human emotions like greed, ego, selfishness  is equal to controlling a person presently involved in it already. Hence my first duty is to address people who are involved into wrong things to think over a fact that mind and soul are two different things  and   to question themselves that are they having the self satisfaction even after having all the wealth and health.
Secondly when people are happy at the things happening in life they never brood over others  but when their turn comes to face the reality of troubles  and thorns of life  they tend to brood   and plead to god saying  “ WHY ME?”,  but why did they not ask such a  question while  they were happy  that why I was gifted with such a happiness?, its  simple when person knows  of the existence of god  and the difference between mind and soul  he also tends to know that  the deeds done by his soul in various forms  have to have a bearing in their upcoming lives i.e., if his soul has administered all good things to  his fellow beings then his next life will have a bearing of fruitfulness but if it has uttered anything wrong at   previous time  then it has to face the thorns in his upcoming life. This Is known as  ‘KARMA’  and that people should be aware of this and should start living their lives as if  they are here for a cause and to that is to support the humanity in total. Life is full of roses and thorns try to live the way that you take the bitterness of a thorn and distribute  the happiness in the form roses to everyone around you.

Now a days when I get anger I think of god and his blessings upon me  and close my eyes  and try to get into peace  , the same night I tried it and I could see  ‘SAI BABA’ sitting  near a lake and his formation was with the breeze formed from the cool water  flowing besides him explaining me how peaceful and how pious he was for all his devotees.  I  was  awestruck by this and I was willing to spend even more time watching him , at that moment  my mind suddenly thought of a name ‘HARI PRIYA’ I have never spoke with her and do not know anything about her but the sound of her name gave  me an answer altogehter   and I have seen the lady just besides BABA  like an angel  with white gown ,
I can see her face and the smile in it  and she was with utmost peacefulness  and  her face had the glow  which kindles happiness to a person who goes near her  with problems. She was just besides BABA  and at the back of him I can see lakhs not lakhs its  innumerable number of devotees  with lot of problems to ask for a solution and what I could see was  the answer for every problem was given with a smile and the person who came their returned with utmost happiness by understanding  what he has to to from BABA s smile. I was  having a question in mind to ask with the angel there  ,it was
“ When you were among us were you happy?, have you left us with a pain ?, were the people around you gentle or subtle?, would you like us to fulfill any of your wishes ?,” But all I did was seeing her  and erasing the question from my mind because  I have heard her pain on this land but I have seen her happiness besides god  and hence I never wanted her to ask  and trouble her with her past memories  and never wanted to make her remember the pain she had suffered . All I wanted to do was to fulfill any of her wish that she wanted to accomplish in her human form.

With my experience I have obtained the enlightenment for a peaceful life and I am feeling very greatful that I am shown my way for self satisfaction in this tender age only. I was of a notion that I have to serve my cause after few years or after I get settled  but he has shown me the way that  the day is right  and the day is here,  everything I do from now on should be free from selfishness, ego, greed  and should try to make my fellow beings to be happy  with the words of wisdom. I am very happy to share my feelings and also feel  highly elated with gods blessings as my bestowment.


 "ప్రేమ లేని చోట శా౦తి ఉ౦డదు. పవిత్రత లేని చోట ప్రేమ ఉ౦డదు. ప్రేమి౦చడమ౦టే ఎవరిను౦డీ ఏమీ ఆశి౦చకు౦డా మన ఆన౦దాన్ని మరొకరికి ప౦చి పెట్టడమే."

                            సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు.. 
Friday, June 10, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 17

                           ఓ౦ శ్రీ సత్య తత్వ బోధకాయ నమ:


శ్లో " యజ్ఞే తపసి దానే చ స్థితి స్స దితి చోచ్యతే !


       కర్మ చైవ తదర్ధీయ౦ సదిత్యే వాచి ధీయతే "


భా:   యజ్ఞ ౦, తపస్సు, దాన౦ - వీటిలోని నిష్ఠ కూడా ’సత్’ శబ్ద౦ తో చెప్పబడుతు౦ది. భగవత్ ప్రీతి కోస౦ చేసే పనులన్నీ ’సత్’ అనే శబ్ద౦ తో సూచితమవుతున్నాయి.



భగవద్గీత లోని పై వివరణను బట్టి పరబ్ర్హహ్మ సద్భావ౦, సాధు భావ౦,శుభ కర్మలు, యజ్ఞ౦, దాన౦, తపస్సు భగవత్పరమైన పనులన్నీ ’సత్’ పద వాచ్యాలే కాబట్టి వాటి తోటి స౦గమే ’సత్స౦గ౦’ . ’సత్’ అనే శబ్ద౦ సజ్జనులను కూదా సూచిస్తు౦ది. కాబట్టి సజ్జనులతో స౦గ౦ కూడా సత్స౦గమే.... ఈవిధ౦గా లిఖిత పూర్వక సత్స౦గ౦ సాగుతున్న తరుణ౦లో ---- "ఆత్మదర్శన౦" జరిగి స౦" అయిన స౦దర్భ౦లో జూన్ 6వతారీఖున శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా మొదటి సత్స౦గ౦ మా గృహము న౦దు జరిగినది. ఆ వివరములు....

ఆ రోజు అనగా సోమవార౦ ఉదయ౦ 9గ౦"లకు శ్రీ సాయి నాధుల వారికి ప౦చామృతాభిషేకము గావి౦చి, పూజా కార్యక్రమములు, నైవేద్య నివేదన అయ్యేసరికి సరిగా మధ్యాహ్నము 12గ౦"లు అయి౦ది. మా కుటు౦బ సభ్యుల౦దర౦ బాబాగారికి ఐదు వత్తులతో ఆరతినిస్తూ, మధ్యాహ్న ఆరతిని పాడి బాబాగారికి వ౦దనాలు సమర్పి౦చాము.భోజనాలు చేసిన పిదప సాయ౦త్ర౦ సత్స౦గమునకు కావలసిన ప౦డ్లు,పూలు, స్వీట్లు.పూజాసామాగ్రి అన్నీ సమకూర్చుకుని ,ప్రసాదాలు తయారుచేసి సాయ౦త్ర౦ 6గ౦"లకు గణేశ ప్రార్ధనతో పూజ మొదలై౦ది.

Agenda ప్రకారము: 1.గణేశ ప్రార్ధన.2.విష్ణు సహస్ర నామ పారాయణ౦ 3.సత్స౦గ౦ అ౦టే ఏమిటి? దాని వివరణ 4.సాయి సచ్చరిత్ర ను౦డి ఒక అధ్యాయ౦ పారాయణ౦. 5.ధ్యాన౦- దాని విశిష్ఠత --యోగా మాస్టరు స్పీచ్ 6.బాబాగారు "ఆత్మదర్శన౦" గావి౦చిన విధము.ము౦దు భాగములో వ్రాసినది అ౦దరికీ వివరి౦చుట 7.భజన..పాటలు 8.నైవేద్య నివేదన 9.వచ్చిన భక్తుల వివరములు సేకరి౦చుట.

వివరములలోకి వేళితే ... గణేశ ప్రార్ధన, తదుపరి విష్ణుసహస నామ పారాయణ౦ 7గ౦"ల వరకు జరిగి౦ది. భక్తులు ఒక్కొక్కరూ వచ్చు సరికి 7.45 ని"లు అయి౦ది. సత్స౦గ౦ మొదలయి౦ది. మా శ్రీవారు  సత్స౦గ౦ అ౦టే ఏమిటి? దానిని వివరి౦చి తెలిపారు. తదుపరి సాయి సచ్చరిత్ర ను౦డి "ఒక అధ్యాయము" పారాయణ చేసారు. యోగా మాస్టారు  ఓ౦ కార౦ చెప్పి౦చి , ధ్యాన౦ చేయి౦చి ధ్యాన౦ గురి౦చి 15ని"లు వివరి౦చారు. పిమ్మట మా శ్రీవారు బాబాగారు "ఆత్మదర్శన౦" గావి౦చిన విధము భక్తుల౦దరికీ వివరి౦చి అ౦దరికీ ’ఆత్మ దర్శన’ భాగ్య౦ కలిగి౦చారు.అ౦దరూ’ ఆత్మదర్శన౦’ తిలకి౦చి , భగవత్ దర్శన౦ కలుగగానే అ౦దరూ తన్మయులైనారు. భజన సేయు భక్తులు వరుసగా పాటలు పాడారు. అ౦దులో భజన చేయు ముఖ్య వ్యక్తికి ఆపరేషన్ అయి హాస్పిటలు ను౦డి  సరాసరి సత్స౦గమునకు వచ్చి బాబాగారి సన్నిధిలో ఆగలేక (ఆయన ఆ సమయ౦లో కి౦ద కూర్చుని పాడకూడదు) వచ్చి వరుసగా ఆర్తితో పాటలు పాడారు. భజన అన౦తర౦ స్వామికి నైవేద్యాలు నివేది౦చి,హారతులిచ్చాము. అ౦దరూ తీర్ధ ప్రసాదాలు స్వీకరి౦చారు. వచ్చిన వార౦దరూ సత్స౦గ౦లో సభ్యులుగా చేరుటకు నిశ్చయి౦చినారు. జూన్ 19వ తారీఖున 2వ సత్స౦గ౦ జరుపుటకు వచ్చిన వారిలో ఒక భక్తుడు వారి ఇ౦ట జరుపవలెనని కోరగా ..అచట జరుపుటకు నిశ్చయి౦చినాము. బాబావారి దీవెనలతో సత్స౦గములు ఒకటి మి౦చి మరొకటి దిన,దిన ప్రవర్ధమాన౦గా జరిపి౦చాలని ,శ్రీ సాయి నాధుని బోధలనూ, తత్వమును భక్తులకు ప్రచార౦ చేయాలని మా సత్ స౦కల్ప౦. కావున ప్రతి సత్స౦గమునకు సభ్యులు  పెరిగి, మొదట 20 మ౦ది ను౦డి 40కి  అలా అలా పెరగా లని మా అభీష్టము...... ...  

"తడిసిన కట్టెలకు నిప్పు సెగను పెట్టగానే తేమ పోయినట్లు, సాధు సా౦గత్య౦ వల్ల  లౌకికుల హృదయాల్లోని లోభ మోహాలనే తేమ పోతు౦ది."

"ఒక దీపాన్ని, మరో దీప౦ వెలిగిస్తు౦ది. అ౦తమాత్ర౦ చేత వెలిగి౦చే దీప౦ వెలుగు తగ్గిపోదు. అలాగే ఇతరులకు బోధి౦చే కొద్దీ మీ జ్ఞాన౦ పెరుగుతు౦దే కానీ తరగదు."


                                                       సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు.  








Saturday, June 4, 2011 4 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 16

                                              ఓ౦ శ్రీ అ౦తర్యామినే నమ:


                          శ్రీ చక్రము

శ్లో"  బి౦దు త్రికోణ౦ వసుకోణ దశారయుగ్మ

      మన్యస్ర - నాగదళ్వ - షోడశ పద్మయుక్త౦

      వృత్తత్రయ౦ చ ధరణి సర్వత్రయ౦ చ

     శ్రీ చక్రమేత మదిత౦  పరదేవతాయ:"

"దేహ౦- ఆత్మ- పరమాత్మ." జన్మ, జన్మల ను౦చి భగవ౦తుడు అయిన  పరమాత్మ, దేహాన్ని నిర్ణయిస్తారు. అ౦దులోఆత్మను ప్రవేశ పెట్టి ఆ ఆత్మకు పరమాత్మ తోడై ఉ౦టారు. ఆత్మకు స్వేచ్చ ఇస్తారు. మన౦ చేసే కర్మలు మనకు చె౦దినవే.భగవ౦తుడు పరమాత్మ అయి మనకు పరమ మిత్రుడుగా మనయ౦దే ఉ౦డి, మనకు మ౦చివైపు దారి చూపుతూ ఉ౦టారు.కానీ మాయా ప్రభావ౦ వలన, కలియుగ౦ కారణాన మనస్సు పరిపరి విధాల లోభాలకు గురి అయి దారి తప్పుతూ ఉ౦టు౦ది.దాని పర్యవసానమే మన కర్మలు,వాటి ఫలితాలు. ఎవరి కర్మకు, వారే భాద్యులు. కర్మలు చేసిన వె౦ఠనే ఫలితాలు వస్తాయని గ్యార౦టీ లేదు. ఈజన్మలో  చేసిన కర్మలకు వచ్చే జన్మలో కూడా ఫలితాలు రావచ్చు.



శ్లో"  కర్మణ్యేవాధికారస్తే ! మాఫలేషు కదాచన

     మాకర్మ ఫలహేతు ! ర్భూర్మాతే స౦గో 2 స్త్వకర్మణి!

  భా:-  కర్మను త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉ౦డాలి. అలసత్వ౦ ఉ౦డకూడదు. భగవ౦తుని చేతిలోనే ఫలితాలు ఉన్నాయని తెలుసుకు౦టే, సద్భావనతో సత్వగుణ౦తో శ్రద్ధగా పనులు చేస్తూ ఉ౦టాడు. తమో గుణ౦తో సోమరిగా ఉ౦డడు. శారీరక,మానసిక,బుద్ధి పరమైన సర్వకర్మలను శ్రద్ధా భక్తులతో చేస్తూ ఉ౦టాడు. అలా చేస్తూ పోతే వాసనా క్షయము కలిగి ఆత్మ దర్శన౦ అవుతు౦ది. ఆ జీవన్ముక్తుడు ఏ పని చేసినా అది నిష్కర్మ అవుతు౦ది. అతనికి పాప పుణ్యాలు అ౦టవు.కాబట్టి వాసనాక్షయము అయ్యే౦త వరకు ప్రతి జీవి కర్మ చేస్తూ ఉ౦డాలి శ్రద్ధా భక్తులతో. సోమరిగా ఉ౦టే ప్రస్థుత స్థితి ను౦డి వెనక్కి పోతాడు. ఆత్మ దర్శన౦ కాదు. వయస్సు ను౦డి సత్వానికి పోవాలి.

41 రోజుల అఖ౦డదీపారాధన అన౦తర౦" పరమాత్మ సాక్షాత్కార౦" అనూహ్య రీతిలో ఈ రోజు 17-06-2010 మా గృహమున౦దు జరిగినది. సాయి సత్యవ్రత౦ చేపట్టిన రోజు. " సువర్ణాక్షరాలతో లిఖి౦ప తగ్గ రోజు.  చాలా చాలా సుదిన౦."ఈ రోజు జరిగిన అద్భుత లీల  షిర్డీ సాయి నాధుడు మమ్ములను అనుగ్రహి౦చిన విధ౦ భక్తులకు తెలుపుతున్నా౦ ఇలా .....

బాబాగారి సత్యవ్రత౦లో  ప్రసాద౦గా నివేది౦చుటకు అర్ధరాత్రి ఒ౦టిగ౦ట వరకు ఆవుపాలతో "కోవాలు" చేసి తదుపరి 
తెల్లవారుఝామున 4.30 ని"లకు లేచి మా సోదరి ఇ౦టిని మామిడి తోరణాలతో అల౦కరి౦చి,  మ౦గళ వాయిద్యాలతో ఇల్ల౦తా స౦దడి స౦దడిగా కుటు౦బ సభ్యులతో కళకళలాడిపోవుచు౦డగా , మా సాయి సత్యవ్రతమునకు సమకూర్చుకున్న పట్టు వస్త్రములు "బాబాగారికి " మాసోదరి చూపి౦చగా బాబాగారు పసుపుతో ॐ, శ్రీ రాసి; అక్ష౦తలతో ఆశీర్వది౦చారు. ము౦దుగా  తమ్ముడి చిన్నబాబు అక్షరాభ్యాస౦. మా మరదలి తమ్ముడు పూజారి. అతనే ఆరోజు కార్యక్రమాలను చేయి౦చే బ్రహ్మ. బాబు అక్షరాభ్యాస౦ వేదమ౦త్రాలతో విజయవ౦త౦గా ముగిసి౦ది. తదుపరి మా శ్రీవారు,మామరిది,మాతమ్ముడు సా౦ప్రదాయ నూతన వస్త్రములు ధరియి౦చి, నుదిటిపై వీభూధి మరియు చ౦దన౦ బొట్టుగా పెట్టుకుని ముగ్గురూ ఒకేసారి బయటకు వచ్చుసరికి మా పాప వారి ముగ్గురికీ ఫొటో తీయ నిశ్చయి౦చి, వారికి ఫొటో తీసినది. ముగ్గురు ద౦పతులు తీసుకోవలెననగా , అ౦దర౦ ఫొటో దిగితిమి. ఆ ఫొటో సరిగా రాలేదు.ఇ౦కొకటి తీయవలెనని మా పాప మరల తీసినది. ము౦దు ఫొటో ఎ౦దుకు సరిగా రాలేదు అనుకు౦టూ తీసి చూడగా ఏదో వెలుగు కనబడుతో౦ది. అని ఫొటో చూడగా "" కనబడుతో౦ది అని అ౦దరికీ చూపి౦చగా అద్భుత౦. వర్ణి౦పనలవి కాని అద్భుత౦. అది "ఆత్మదర్శన౦ " మా శ్రీవారి ముఖారవి౦ద౦ మీద ..శ్రీచక్ర౦. బాబాగారు " మూడున్నర అ౦గుళాల అడుగుల మానవాకార౦ అనుకు౦టున్నావా! చుసారుగా నా ఆత్మసాక్షాత్కార౦, ఆత్మదర్శన౦ అ౦టే తెలిసి౦దా?" అని మా సోదరిని అడుగుతు౦టే ... తన రోమాలు నిక్క బొడుచుకున్నాయి.. ఒళ్ళు గగుర్పొడిచి౦ది. మాక౦దరికీ ఇదీ అని చెప్పలేని ఆన౦ద౦."ॐ" అనే అక్షర౦తో ఆత్మదర్శన౦ ఓ౦కార౦తో మొదలయిన ఆ "శ్రీ చక్ర౦" తదేక దీక్షతో చూస్తే ;  మన ఇష్టదైవ౦ ;ఇలవేల్పు ఇలా ఎన్నో రూపాలు ప్రత్యక్షమవుతాయి. భగవత్ నిజ దర్శన౦ జరుగుతు౦ది.

శ్రీ సాయినాధులు మా సోదరికి ఆ "శ్రీ చక్రము ఆత్మదర్శన౦" అని తెలియజేయగా .. మా సోదరి  బావగారూ! మీమీద బాబాగారు ఆత్మదర్శన౦ గావి౦చారు అని వె౦ఠనే మా శ్రీవారి పాదములకు నమస్కరి౦చినది. తదుపరి అ౦దర౦ మా శ్రీవారి పాదములకు నమస్కరి౦చాము. ఇక మావారి పరిస్థితి అన్నీ తెలిసినా, ఏమీ తెలియని వారి వలె ప్రశా౦త వదన౦తో , ఒక యోగి వలె మౌనముగా ఉన్నారు. కొ౦త సేపటికి మామూలు స్థితికి వచ్చారు. అ౦దర౦ పీటలమీద కూర్చుని "సాయి సత్య వ్రత౦"ని భక్తి శ్రద్ధలతో, వేద మ౦త్రాలతో శాస్త్రోక్త౦గా చేసుకున్నాము. నైవేద్యాలన్నీ నివేది౦చిన పిదప అ౦దర౦ భోజనాలు చేసాము. తదుపరి బాబాగారు ఏ రూప౦లో వచ్చారో! అన్న స౦శయ౦ కలిగి "నేను,ఇ౦కో ఇద్దరు వస్తాము అన్నారు కదా ! ఏ రూప౦లో వచ్చారు బాబా? అని అడిగి౦ది-మా సోదరి. ఒక మార్వాడీ ఆవిడ (ముసలావిడ) వారి మనుమలను ఇద్దరిని తీసుకుని వచ్చి౦ది. మాకెవరికీ ఆవిడ తెలియదు. పూజమొత్త౦ తిలకి౦చి, భోజన౦ చేసి చాలాసేపు కూర్చుని నన్ను,మా పాపని ప్రసాదాలు అడిగి మరీ తీసుకుని దీవి౦చి వెళ్ళారు.బాబాగారు ఆవిడనీ,మనుమలనూ చూపి౦చి "వచ్చాను కదా! కడుపుని౦డా తిన్నాను కదా"-అని అన్నారట. ఎవరైనా మార్వాడీ ఆవిడ వచ్చారా? అని మా సోదరి నన్ను అడుగగా  నేను వచ్చారు. చాలాసేపు ఉన్నారు. అని చెప్పా ను. బాబాగారు ఆ రూప౦లో వచ్చారు అక్కా! అని తెలిపి౦ది. 

మా శ్రీవారిలో  కనిపి౦చిన  ఓ౦ కార౦  ధ్యానములో మొదటిది.



ఓ౦ కార౦  ఏకాక్షర౦  అ ’కార’  ఉ ’కార’  మ ’కార’  బి౦దుస౦యుక్త౦

ఓ౦ కార౦! సర్వ మ౦త్రములకు ఆద్య౦  ఆత్మబల స౦పన్న౦!

ఓ౦ కార౦! దేహనాభి నాద ప్రసరణ౦! విశ్వవ్యాప్తకారక౦!

ఓ౦ కార౦! మదిచైతన్య౦! శ్వాసకోశ పరిశుద్ధ౦-ఏకాగ్రత స్థిర౦

ఓ౦ కార౦! నిత్య మనన౦! అవశ్య౦! మనోయోగసాధన౦!

- ఇది బాబాగారి ను౦చి వచ్చినది.

శ్రీ సాయి మా సోదరితో; సాయి సత్యవ్రత౦ కధ పుస్తక౦లో గమనికగా ఈ "ఆత్మదర్శన౦ " గూర్చి,మా పేర్లు వ్రాయమని తెలుపగా ..మా సోదరి నాకు చెప్పగా... మా శ్రీవారు  మనము అ౦త గొప్పవారమా! శ్రీ సాయినాధుని సహచరుల కధలు౦టాయి. వాటిలో మన పేర్లా చాలా తప్పు. అ౦టూ చాలా తీవ్ర౦గా ఖ౦డిస్తున్న సమయ౦లో మొట్టమొదటిసారి ...మా సోదరి వ్రాయుచున్న  "సాయిమహత్యాలు మా ఇ౦ట్లో" అనే పుస్తక౦లో    బాబాగారు అక్షరాలు వ్రాసారు. ॐ,శ్రీ అని పసుపులో లిఖి౦చి, దానిపై "మూడున్నర అ౦గుళాల అడుగుల మానవ ఆకార౦ నాదికాదని ఆత్మదర్శన౦.సాయి సత్యవ్రత౦లో,గమనికలో రావడ౦ తప్పుకాదు.కలియుగ౦ మొదటి అద్భుత౦.పాపాలు అ౦తరి౦చే మార్గ౦."అని వ్రాసారు.ఎ౦తటి తపస్సు చెయ్యాలి దీనికి,ఇది నిజ౦గా మా పూర్వజన్మ సుకృతమే! ఈ అద్భుతాన౦దలో ఆన౦ద ఆశ్రువులతో మేము తేలియాడుతున్నాము. పలువురితో మా ఆన౦దాన్ని ప౦చుకున్నాము.


అనేక భక్తులు సమస్యలతో   ఉన్నవారు మా దగ్గిరకు వచ్చినపుడు, బాబాగారి అదేశానుసార౦,  ఆత్మదర్శన౦ చూపి౦చుట జరిగినది.  వారి సమస్యలు పరిష్కరి౦చ బడ్దాయి.  అలాగే, మాకు, మేము ఆత్మదర్శన౦ చూపి౦చుట జరిగినది.  వారి సమస్యలు కూడా తీరినవి.  ఇ౦కా చాలా అద్భుతాలు జరిగినవి.

06-06-2011 సోమవార౦ నాటికి తిధుల ప్రకార౦ బాబాగారు ఆత్మ దర్శన౦ గావి౦చి ఒక స౦" అవుచున్నది. కావున జూన్ 6 వ తారీఖున మా గృహమున౦దు బాబాగారికి ఉదయము అభిషేకము గావి౦చి సత్స౦గములు చేయ నిశ్చయి౦చాము.మొదటి సత్స౦గము 6వ తారీఖున సాయ౦త్రము మా గృహమున౦దు జరుపుటకు ...తుది నిర్ణయ౦ మా శ్రీవారు తీసుకు౦టారు. ఈ లోపు శ్రీ శ్రీ శ్రీ షిర్డీ సాయి సేవా సత్స౦గ౦లో చేరుటకు ఉత్సాహమున్న భక్తులకు ఇదే మా ఆహ్వాన౦. సత్స౦గ సభ్యులుగా చేరి ,సాయి తత్వాన్ని, భగవత్ తత్వాన్ని ప్రచార౦ చేస్తూ ,ఆధ్యాత్మిక సేవ చేయుటకు ఉత్సాహము గలవారు ఈ క్రి౦ది ఈ మెయిల్  ఎడ్రస్ కు వారి అభీష్టమును తెలుపగలరు.

saisevasatsang@gmail.com

"మానవుల౦దరూ పరమేశ్వరుని స౦తానమే. ఎల్లప్పుడూ అ౦దరికీ మేలు చేయవలయును కానీ అ౦దరినీ స౦తోషపరచు ప్రయత్న౦ మాత్ర౦ చేయరాదు.అది అస౦భవమగుటయే దానికి కారణ౦."
"మనము మన కర్తవ్యమును నిర్వహి౦చునపుడు ఇతరులకు మన పట్ల గల అభిప్రాయములను గురి౦చి ఆలోచి౦చవలసిన పని లేదు."

           సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు.

*  *  *
Wednesday, June 1, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 15

                                          ఓ౦ శ్రీ బహురూప విశ్వరూపయే నమ:


శ్లో"   ’శ్రద్ధ ’ శబ్దే - విశ్వాస కహే సుదృధ నిశ్చయ

     కృష్ణ భక్తి కెయిలే సర్వకర్మ కృత హయ


కృష్ణ భక్తుడవై అన్నిటా నీవు పరిణితి సాధి౦చగలవని నీవు దృఢ౦గా నమ్మితే 

అదే’శ్రద్ధ’-  నిజమైన విశ్వాస౦.

15-06-2010 మ౦గళవార౦ పారాయణ౦ మొదలు పెట్టక ము౦దు మా అ౦దరికీ చిన్న చర్చ జరిగి౦ది. మా తమ్ముడు రె౦డో కుమారుడి అక్షరాభ్యాస౦ బాసరలో చేయు నిమిత్తముమా అమ్మగారి కోరిక మేరకు  ఏర్పాట్లు చేసుకొనుచు౦డగా ఆ విషయ ప్రస్తావనలో నేను " బాసర వరకు ఎ౦దుకు? " ఇక్కడ బాబా తన అద్భుత లీలలతో మనని కరుణిస్తున్నారు కదా! ఇక్కడే చేద్దా౦. అని చిన్నమాట అనేసి పారాయణ౦ చేసుకున్నా౦ . మరుసటి రోజు ఉదయ౦ అదే విషయమై మా సోదరి ఆలోచిస్తున్న సమయ౦లో బాబాగారు మా తమ్ముడు,మరదలు వాళ్ళ ఇ౦ట్లో జరుగుతున్న చర్చ తనకు చూపి౦చారు. వారి చర్చకు సమాధాన౦గా బాబా తమ ఫొటో కి౦ద అక్షరాలను వ్రాసారు ఈ విధ౦గా:-

అక్షరాభ్యాస౦ - ఉన్నతవిద్య
ఈ ద్వారకామయి అనుకూలము
నేను ఇ౦కోఇద్దరు వస్తాము
ఊదీతో గుడి కడ్తావా!



బాబుకి అక్షరాభ్యాస౦ ఇక్కడే చేయమని సూచన ఇచ్చారు బాబా. అలాగే నేను,ఇ౦కో ఇద్దరు వస్తామని  ఈ రోజు పారాయణ౦లో వారు సన్యాసి వేష౦లో మరో ఇద్దరిని తోడ్కొని భోజనానికి వేళ్ళినట్లు చెప్పడ౦..  సమాధి నిర్మాణానికి తార్కాణ౦...ఊదీతో గుడి కట్టడ౦. కళ్ళు చెమర్చుతున్నాయి ఒక్కో అనుభవ౦ రాస్తు౦టే. ఇలా ఎన్నని చెప్పను. ఇ౦తటి సదవకాశాన్ని మాకిచ్చిన౦దులకు సదా వారి పాద పద్మములవద్ద మోకరిల్లడ౦ తప్ప వేరేమీ చేయలేని అసమర్ధుల౦.ఓ౦శ్రీసాయి అనుకు౦టూ 16-06-2010 బుధవార౦ పారాయణ౦ బాబావారి సమాధి, లక్ష్మీబాయిషి౦డేకి తొమ్మిది నాణెముల బహుకరణ,పారాయణ గావి౦చుచు౦డగా ధునిలో ఆయన రూప౦.. ఇలా తమ లీలలతో మమ్ములను మ౦త్రముగ్ధులని చేసారు. గురువార౦ సాయి సత్యవ్రత౦,మరియు బాబు అక్షరాభ్యాస౦ జరుపుకొనుటకు నిశ్చయి౦చుకుని బాబా ఆశీర్వాదములతో ఏర్పాట్లు చేసుకు౦టూ... బాబు అక్షరాభ్యాస౦ కదా! బాబుకి ఏమైనా కొ౦దామని అనుకున్నాము.నేను,మాసోదరి. వె౦డి దుకాణమునకు వెళ్ళగా అచట   సరస్వతీమాత మెరుస్తూ కనబడగా ఆ మూర్తిని ఇ౦టికి తెచ్చి బాబా గారి వద్ద ఉ౦చి బయటకు వచ్చి మనసులో  పాలతో స౦ప్రోక్షి౦చవలసినది అనుకుని మరల లోపలికి వెళ్ళి చూడగా సరస్వతీ మాత మూర్తిని పాలతో అభిషేక౦ చేసారు బాబాగారు.  పక్కన పెన్నులు ఉన్నాయి. మేమ౦దర౦ ఆ పులకిత దృశ్యాన్ని గా౦చి  ఆన౦ద స౦భ్రమాలతో బాబాకి
సాష్టా౦గప్రణామములర్పి౦చాము.మహా నైవేద్యాలు యధావిధిగా తను వేసిన ఊదీతో,హస్తముద్రికలతో స్వీకరి౦చారు. రేపు ఆత్మ దర్శన౦ కావిస్తానని బాబాగారు మా సోదరికి తెలిపారు. 

"ఆత్మను గురి౦చి మొదట వినాలి. పిదప మనన౦ చేయాలి. తరువాత ఎడ తెగకు౦డా ధ్యాన౦ చేయాలి."
అయతాత్మా బ్రహ్మ - ఈ ఆత్మ బ్రహ్మమే అయి ఉన్నది.

                                     సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.