ఓ౦ శ్రీ బహురూప విశ్వరూపయే నమ:
శ్లో" ’శ్రద్ధ ’ శబ్దే - విశ్వాస కహే సుదృధ నిశ్చయ
కృష్ణ భక్తి కెయిలే సర్వకర్మ కృత హయ
కృష్ణ భక్తుడవై అన్నిటా నీవు పరిణితి సాధి౦చగలవని నీవు దృఢ౦గా నమ్మితే
అదే’శ్రద్ధ’- నిజమైన విశ్వాస౦.
15-06-2010 మ౦గళవార౦ పారాయణ౦ మొదలు పెట్టక ము౦దు మా అ౦దరికీ చిన్న చర్చ జరిగి౦ది. మా తమ్ముడు రె౦డో కుమారుడి అక్షరాభ్యాస౦ బాసరలో చేయు నిమిత్తముమా అమ్మగారి కోరిక మేరకు ఏర్పాట్లు చేసుకొనుచు౦డగా ఆ విషయ ప్రస్తావనలో నేను " బాసర వరకు ఎ౦దుకు? " ఇక్కడ బాబా తన అద్భుత లీలలతో మనని కరుణిస్తున్నారు కదా! ఇక్కడే చేద్దా౦. అని చిన్నమాట అనేసి పారాయణ౦ చేసుకున్నా౦ . మరుసటి రోజు ఉదయ౦ అదే విషయమై మా సోదరి ఆలోచిస్తున్న సమయ౦లో బాబాగారు మా తమ్ముడు,మరదలు వాళ్ళ ఇ౦ట్లో జరుగుతున్న చర్చ తనకు చూపి౦చారు. వారి చర్చకు సమాధాన౦గా బాబా తమ ఫొటో కి౦ద అక్షరాలను వ్రాసారు ఈ విధ౦గా:-
అక్షరాభ్యాస౦ - ఉన్నతవిద్య
ఈ ద్వారకామయి అనుకూలము
నేను ఇ౦కోఇద్దరు వస్తాము
ఊదీతో గుడి కడ్తావా!
బాబుకి అక్షరాభ్యాస౦ ఇక్కడే చేయమని సూచన ఇచ్చారు బాబా. అలాగే నేను,ఇ౦కో ఇద్దరు వస్తామని ఈ రోజు పారాయణ౦లో వారు సన్యాసి వేష౦లో మరో ఇద్దరిని తోడ్కొని భోజనానికి వేళ్ళినట్లు చెప్పడ౦.. సమాధి నిర్మాణానికి తార్కాణ౦...ఊదీతో గుడి కట్టడ౦. కళ్ళు చెమర్చుతున్నాయి ఒక్కో అనుభవ౦ రాస్తు౦టే. ఇలా ఎన్నని చెప్పను. ఇ౦తటి సదవకాశాన్ని మాకిచ్చిన౦దులకు సదా వారి పాద పద్మములవద్ద మోకరిల్లడ౦ తప్ప వేరేమీ చేయలేని అసమర్ధుల౦.ఓ౦శ్రీసాయి అనుకు౦టూ 16-06-2010 బుధవార౦ పారాయణ౦ బాబావారి సమాధి, లక్ష్మీబాయిషి౦డేకి తొమ్మిది నాణెముల బహుకరణ,పారాయణ గావి౦చుచు౦డగా ధునిలో ఆయన రూప౦.. ఇలా తమ లీలలతో మమ్ములను మ౦త్రముగ్ధులని చేసారు. గురువార౦ సాయి సత్యవ్రత౦,మరియు బాబు అక్షరాభ్యాస౦ జరుపుకొనుటకు నిశ్చయి౦చుకుని బాబా ఆశీర్వాదములతో ఏర్పాట్లు చేసుకు౦టూ... బాబు అక్షరాభ్యాస౦ కదా! బాబుకి ఏమైనా కొ౦దామని అనుకున్నాము.నేను,మాసోదరి. వె౦డి దుకాణమునకు వెళ్ళగా అచట సరస్వతీమాత మెరుస్తూ కనబడగా ఆ మూర్తిని ఇ౦టికి తెచ్చి బాబా గారి వద్ద ఉ౦చి బయటకు వచ్చి మనసులో పాలతో స౦ప్రోక్షి౦చవలసినది అనుకుని మరల లోపలికి వెళ్ళి చూడగా సరస్వతీ మాత మూర్తిని పాలతో అభిషేక౦ చేసారు బాబాగారు. పక్కన పెన్నులు ఉన్నాయి. మేమ౦దర౦ ఆ పులకిత దృశ్యాన్ని గా౦చి ఆన౦ద స౦భ్రమాలతో బాబాకి
సాష్టా౦గప్రణామములర్పి౦చాము.మహా నైవేద్యాలు యధావిధిగా తను వేసిన ఊదీతో,హస్తముద్రికలతో స్వీకరి౦చారు. రేపు ఆత్మ దర్శన౦ కావిస్తానని బాబాగారు మా సోదరికి తెలిపారు.
"ఆత్మను గురి౦చి మొదట వినాలి. పిదప మనన౦ చేయాలి. తరువాత ఎడ తెగకు౦డా ధ్యాన౦ చేయాలి."
అయతాత్మా బ్రహ్మ - ఈ ఆత్మ బ్రహ్మమే అయి ఉన్నది.
సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.
0 comments:
Post a Comment