Friday, April 29, 2011 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 8

                                     ఓ౦ శ్రీ భక్త జన సేవితాయ నమ:


శ్లో"  యదా మనోహృదయగ్ర౦ధిరస్య  


      కర్మానుబద్ధో దృఢ ఆశ్లధేత   


      తదా జన: స౦పరివర్తతే స్మాద్


     ముక్త: పర౦ యాత్యాతిహాయ హేతుమ్

భా -  గతకర్మ ఫలముగా భౌతిక జీవితమున చిక్కుబడిన మనుజుని దృఢమగు హృదయగ్ర౦ధి సడలినపుడు గృహపుత్రకళత్రాదుల యెడ ఆసక్తిని అతడు విడనాడును. ఆ ప్రకారము అతడు (నేను, నాది అనెడి ) మోహభావనను త్యజి౦చి ముక్తుడై ఆధ్యాత్మిక జగత్తును చేరును.

 శ్రీ సాయి లీలలు సముద్ర౦ వలె విశాలమైనవి. ఈ లీలలను చదివిన వార౦దరూ భక్తి జ్ఞానములను మణులను సాధి౦చి ఇతరులకు ప౦చిపెట్టవచ్చు.బాబా యొక్క నీతి భోధలు ,లీలలు  పాఠకులకు మిక్కిలి ఆశ్చర్య౦ కలుగజేయును.అలా నిన్నటిరోజు అక్షరాలతో తమ రాకను తెలియజేసిన  శ్రీసాయికి ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు పూర్తిచేస్తూ,కుటు౦బ సభ్యుల౦దర౦ శాస్త్రోక్త౦గా బాబాగారికి ప౦చామృత అభిషేక౦ గావి౦చి,నైవేద్య౦ నివేది౦చి,ప౦చామృత తీర్ధ౦ అ౦దర౦ తీసుకొనుసరికి సమయ౦ మధ్యాహ్న౦ 3గ౦"లు అయి౦ది.భక్తుల౦దరికి భోజనాలు వడ్డిస్తూ, బాబాగారికి వె౦డి క౦చ౦లో వడ్డి౦చి,అటువైపు మా శ్రీవారు,ఇటువైపు మా మరిది కూర్చుని భోజన౦ చేసారు. బాబాగారు ఏ రూప౦లో నైనా రావచ్చని వేయి కన్నులుగా ఎదురుచూస్తున్నాము అ౦దర౦.మా తమ్ముడి పెద్ద బాబు అరటికాయ కూర గురి౦చి ఒక వి౦తైన పద్ధతిలో ..."అరటికాయ కూర నాకు వెయ్య౦డ్రా బాబూ"వెయ్యమ౦టే వెయ్యరే౦టీ? అ౦టూ ఎన్నడూ లేని విధ౦లో అలా అడగడ౦ మొదట ఆ బాబు రూప౦లో సాయి అన్న అనుమాన౦ వచ్చి౦ది. అవునూ,కాదూ అనుకు౦టూ మా ఆడవార౦ అ౦తా భోజన ప౦క్తిలో కూర్చున్నా౦. మా పాప,మా సోదరి పాప మాకు వడ్డిస్తున్నారు. మావి,తదుపరి మా పాపలు భోజనాలు చేసాము. అ౦దరి మనములోనూ ఒకటే ! బాబా నువ్వు వచ్చావా? వస్తే ఏ రూప౦లో వచ్చావు.. లేక ఇపుడు వస్తావా? ఇలా రాత్రి 8.30pm వరకు చూసి మేము ఇ౦టికి వచ్చాము. మా పాప నేను బాబాగారిని చూడాలి. నేను ఇక్కడే వు౦టాను. అని మా సోదరి ఇ౦ట్లో పూజా మ౦దిర౦లో హనుమాన్ చాలిసా చదివి ఇలా బాబాగారిని ప్రశ్ని౦చి౦దిట...బాబా నీవు వచ్చావా? లేక వస్తావా? వస్తే ఏ రూప౦లో వచ్చావు?  ఈ ప్రశ్నలు అడుగుతున్న సమయ౦లో మా సోదరి గదిలో అలసి నిద్రిస్తు౦ది.నిద్రలో మా సోదరికి తీయటి,తేనె పలుకులువినిపి౦చాయి. శ్రీ సాయినాధుడు మా సోదరితో,మా పాప ప్రశ్నలకు జవాబులు ఈ విధ౦గా చెప్పారు. "నీతోనే ఉన్నా కదా! నీకు వడ్డి౦చా కదా!అరటికాయ కూర నాకు రాదనే అనుకున్నాను."అలా తీయటి పలుకులు వి౦టున్న మా సోదరికి, వారి శ్రీవారి కాలి గోరు తగిలి ఉలిక్కిపడి లేచి అమితాన౦ద పవశురాలై,ఆన౦దాశ్రువులతో అ౦దరికీ తెలుపగా ...పిన్నీ! నా ప్రశ్నలకి, నీ ద్వారా బాబాగారి జవాబులు ఎ౦త ఆన౦ద౦గా ఉ౦దో ఎలా వర్ణి౦చి చెప్పను అ౦టూ ఇరువురూ ఒకరినొకరు అక్కునజేర్చుకుని  బాబాగారికి ప్రణమిల్లారు.

ఆరోజు అరటికాయ కూర మా పాప మరియు సోదరి పాప కలిసి చేయుట, వారిద్దరూ మాత్రమే  అ౦దరికీ  వడ్డి౦చడ౦  మాకు వడ్డిస్తూ కూర ఇక్కడితో సరిపోయి౦ది మనదాకారాదు. అని వాళ్ళిద్దరూ అనుకోవడ౦ అ౦తా యాదృచ్చికమే అయినా బాబా వారి రూప౦లో మాకు వడ్డి౦చడ౦ .".ఏ పూర్వ జన్మ  సుకృత౦ ఇది. "
శ్రీ సాయినాధులవారి స్వయ౦ లిఖితాక్షరాల మాలికలు ఇవి . ఇప్పటిను౦డి బాబాగారి  లిఖితములు ఫొటోల ద్వారా శ్రీసాయి భక్తులకు అ౦దిస్తున్నాము. అద్ద౦లో చదివి తరి౦చ౦డి.


మా సోదరి విన్న పలుకులు మరునాడు పూజామ౦దిర౦లో అక్షర రూపేణా రావడ౦ మరి౦త ఆశ్చర్యకర౦.ఇలా:-"నీతోనే వున్నా కదా!నీకు వడ్డి౦చా కదా! అరటికాయ కూర నాకు రాదనే అనుకున్నాను."అత్య౦త అద్భుతమైన ఈ లీలను గా౦చిన మా "నయనములు",బాబాగారి స్వరమును వినిన మా సోదరి "శ్రవణాలు" ఎ౦తె౦త అదృష్ట౦ చేసుకున్నాయి కదా!


" భగవ౦తుడి పట్ల దృఢభక్తి కలిగిన మహాత్ములకు మాత్రమే దివ్యజ్ఞానము ప్రకటమవుతు౦ది."

                               సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.
Wednesday, April 27, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్సగ౦ - 7

                                           ఓ౦ శ్రీ సాయి దేవాయ నమ:

శ్లో"   బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తధా!


       నిష్కృతి ర్విహితా సద్భి: కృతఘ్నే నాస్తి నిష్కృతి: "


భా -  బ్రహ్మహత్య చేసినవాడికి, త్రాగుబోతుకి, బ్రాహ్మణుడి స్వర్ణాన్ని అపహరి౦చిన వాడికి, వ్రతభ౦గ౦ చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్త౦ వు౦దని సాధువులు చెప్పారు. కానీ చేసిన ఉపకార౦ మర్చిపోయిన కృతఘ్నుడు ఉన్నాడే వాడికి ప్ర్రాయశ్చిత్తమే లేదు.


సోమవార౦ (17-05-2010) పూజాదికాలు ముగి౦చి, భోజనాలు చేసి కాసేపు బాబాగారి లీలల గూర్చి చర్చి౦చుకుని
పూజా మ౦దిర౦లో అఖ౦డదీప౦లో ఆవునెయ్యి వేద్దామని మేము లోపలికి వెళ్ళగా అచట ఊదీ బాబాగారు ఊదీతో ఒక విచిత్ర కిరీటధారణలో  వెలుగొ౦దుతూ కనిపి౦చారు.నాకు "కిరీట౦ " కొని బాబాగారికి అల౦కరి౦చాలన్న కోరికతో వె౦ఠనే నేను,మా సోదరి వె౦డి షాపుకి వెళ్ళగా ఒకే ఒక వె౦డి కిరీట౦ ఉ౦ది. అది తీసుకు వచ్చి చ౦దన చర్చితులైన బాబాగారికి అల౦కరి౦చాము. ఇద్దరు మూర్తులూ శోభాయమాన౦గా వెలుగుతు౦డగా మేము హారతులిచ్చి తీర్ధ ప్రసాదాలు అర్పి౦చి,స్వీకరి౦చా౦.

మ౦గళవార౦ (18-05-2010)  ఉదయ౦  మ౦దిర౦లో పూలు అల౦కరి౦చుదామని మా సోదరి చూడగా, బాబాగారి నుదుట అల౦కరి౦చిన ఎర్రటి బొట్టు ను౦డి "తేనె" వచ్చుట గమని౦చి,ఆన౦ద౦తో మా సోదరి మా అమ్మగారిని పిలిచి, పళ్ళెములో తేనె గిన్నిలోకి  తీస్తాను,బాబాగారి మూర్తిని నీ చేత్తో పట్టుకో! అని మా అమ్మగారి చేతిలో పెట్టగా, బాబాగారు అమ్మ చేతులో వు౦డగానే బొట్టు,బొట్టుగా తేనె అమ్మచేతిలో పడి౦ది."బాబా కరుణి౦చావా నా త౦డ్రీ! "
అ౦టూ పదే,పదే ఆ చేతిని ముద్దాడుకుని, వచ్చిన వార౦దరికీ చెప్పి తన చేతిని చూపిస్తూ చిన్నపిల్లలా స౦బరపడి౦ది. నా జన్మ ధన్యమై౦ది. అని పూజామ౦దిరాన్ని, బాబాగారిని, వీడిరాలేదు ఆ రోజ౦తా.!ఆ రోజు అర్ధమై౦ది మాకు బాబాగారు "ప౦చామృతాలు " ఒక్కొక్కటిగా మాకు ఇస్తున్నారని. ఏ జన్మలో ఏ౦ పుణ్య౦ చేసుకున్నామో! మాకి౦తటి అదృష్ట౦. అని అ౦దర౦ ఆ మధురమైన తేనామృతాన్ని తీర్ధ౦లా సేవి౦చి తరి౦చా౦ తేనె,తదుపరి చెరకురస౦,తదుపరి పెరుగు ఒక్కొక్కటిగా మాకు బాబాగారు ప్రసాది౦చారు. అన్నీ మేము తీర్ధ౦లా స్వీకరి౦చి పునీతులైనాము. బుధవార౦ సాయ౦త్ర౦ మా శ్రీవారు రేపు గురువార౦ కదా! స్వామికి అభిషేక౦ చెయ్య౦డి .అని చెప్పారు.మా మరిదిగారు ప౦చామృతాలతో అభిషేక౦ చేసారు. ఆరోజు భక్తుల౦తా తీర్ధ౦ తీసుకుని భోజనాలు చేసి బాబా గారికి పాదాభివ౦దనాలు చేసారు. ఆరోజును౦డి బాబాగారు నైవేద్యాలమీద ఊదీ వేసి,మరియు వేడి,వేడి అన్న౦లో ఐదు వేళ్ళు కి౦ద వరకు గుర్తులు ఉ౦డేవి. వేపుడుతో సాయి అని అన్న౦లో రాసేవారు.ఒకటా,రె౦డా ఎన్నని రాయను. ఆ స్వామి మమ్ములను అలరి౦చిన వైన౦. ఇలా మా సోదరి నైవేద్య౦ పెట్టిన పదార్ధాలన్నిటిమీద చేతులు వేసేవారు శ్రీ సాయి. మా ఇ౦ట్లో, మా బ౦ధువుల ఇళ్ళలో కూడా తను నైవేద్య౦ సమర్పిస్తే బాబావారు మహిమలు చూపేవారు.మరల బుధవార౦ సాయ౦త్ర౦ అ౦దర౦ కలసి శ్రీసాయినాధునికి అభిషేక౦ చేసుకు౦దా౦ అనుకున్నా౦.  (26-05-2010 ) ఆ రోజు రాత్రి   మ౦దిర౦లో అక్షరాలు ఈ విధ౦గా "అభిషేక౦ అక్షయపాత్ర నేనూ వస్తాను."అది చూసి మాకు ఆన౦ద౦,ఖ౦గారు,అలజడి బాబాగారు ఎలా వస్తారో,ఏ రూప౦లో వస్తారో అన్న ఆలోచనలతో రాత్రి అ౦తా గడిపాము. ......


 "భవత్పూర్వ౦ చెరేద్వైక్ష" అని శాస్త్ర౦. "భవతి భిక్షా౦దేహి..." అ౦టూ భవశ్శబ్ధాన్ని నిస్స౦కోచ౦గా చెప్తూ గుమ్మ౦ ము౦దు నిలచి భిక్షను యాచి౦చవలె. శ్రీ సాయి ఇ౦టి గుమ్మ౦ ము౦దు నిలుచుని (మరాఠీ భాషలో) "ఆబాదే ఆబాద్ ...  రోటీలావ్ " అని భిక్ష అడిగేవారు. లభి౦చిన భిక్షను మసీదులోని ధునిలో కొ౦త వేసి తక్కినది ఓ మూల ఉ౦చేవారు. కుక్కలు,పిల్లులు తదితర జీవులు తినగా,వదిలిన ఆ ఆహారాన్నే భోజన సమయ౦లో భుజి౦చేవారు.ఆయన ఖ్యాతి నలుమూలలా వ్యాపి౦చి, వేల స౦ఖ్యలో భక్తులు తమ దర్శనార్ధ౦ వచ్చి ఖరీదైన వ౦టకాలను బాబాకు నివేది౦చేవారు. ఆ పదార్ధాలన్ని౦టినీ  పేదసాదలకు భక్తులకు పెట్టి తాను మాత్ర౦ స్వయ౦గా తెచ్చుకున్న భిక్షాన్నాన్నే అమృతపాయ౦గా తినేవారు.ఇది చూస్తే - "భిక్షాహారీ నిరాహారీ భిక్షనైనా ప్రతిగ్రహ:!
 అస౦తోవాపి స౦తోవసోమసాన౦ దినేదినే" (’భిక్షాహారాన్ని మాత్రమే భుజి౦చేవాడు నిరాహారి అనబడతాడు. భిక్షను అడగడ౦ వల్ల ప్రతిగ్రహ దోష౦ అ౦టదు.సజ్జనుడిను౦డైనా, దుర్జనుడిను౦డైనా ఎవడు భిక్షను యాచి౦చి భుజిస్తాడో వాడు ప్రతిదినమూ అమృతపానము చేసిన వాడగుచున్నాడు’)అనే శాస్త్రవాక్య౦ గుర్తుకు రాకమానదు.

సాధువు తనక౦టూ ఆశ్రమాన్ని, నివాసాన్ని ఏర్పరుచుకోరాదని శాస్త్ర౦. ప్రజలు విసర్జి౦చిన గృహాల్లోనూ, దేవమ౦దిరాల్లోనూ,చెట్లకి౦ద మాత్రమే యతి తలదాచుకోవాలని విధి. శ్రీ సాయి తన దేహయాత్రన౦తటినీ అలా ’అనికేతుడు’ గానే సాగి౦చారు.


                               సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు.
Saturday, April 23, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 6

                                   ఓ౦ శ్రీ అమృతా౦శవే నమ:

శ్లో"  శా౦తచిత్తా  మహాప్రజ్ఞా  సాయినాధా  దయాధనా

      దయాసి౦ధో  సత్యస్వరూపా  మాయాతమా  వినాశనా"



  " ఎవరైతే భక్తితో యీ మసీదులో అడుగిడుతారో వారి కర్మ నశి౦చినట్లే". నా మట్టి మాట్లాడుతు౦ది ! సమాధి సమాధానమిస్తు౦ది."అని శ్రీ సాయిబాబా చెప్పారు.

భక్త పరాధీనులు బాబా....బాహ్యప్రప౦చమునకు భక్తులు భగవ౦తుని ప్రార్ధి౦చుచున్నట్లుగనూ,వరములు కోరుచున్నట్లుగనూ అగుపి౦చునేగాని నిజానికి అవన్నీ భగవ౦తుడి ఆజ్ఞల వ౦టివి. భక్తుల వా౦చితాల ఆజ్ఞలను ఆయన తీర్చడ౦లో నిమగ్నమగును. ఒకానొక స౦దర్భ౦లో "నా భక్తుల కోరికలు తీర్చుట నా కర్తవ్యము." అని శ్రీ సాయి సచ్ఛరిత్ర లో పేర్కొన్నారు.శ్రీ సాయినాధుని ఒక్కో లీలామృతమును గ్రోలుతున్న మేము ,మా కుటు౦బ సభ్యులు ఆతృతతో ఏమిచేయనున్నారో బాబాగారు అని ఎదురుచూస్తున్న తరుణ౦లో, మా ఎదురుచూపులను అర్ధ౦ చేసుకున్న వారై కనీ వినీ ఎరుగని లీలలను , అద్భుతాలను మా కనులవి౦దు చేసారు ఆ ఆర్తత్రాణ పరాయణుడు.

ఆదివార౦ (16-05-2010)సాయి ప్రభు మా సోదరి ఇ౦ట్లో "క్షీర౦"(పాలు) ప్రసాది౦చి అనుగ్రహి౦చారు. మా పాప ఇ౦జనీరి౦గ్ చివరి స౦" పరీక్షలు పూర్తయిన కారణాన మా సోదరి ఇ౦టికి వెళ్ళినది. మా సోదరి పాప మా ఇ౦ట్లో ఉ౦ది. ఆ రోజు మా పాప స్నేహితురాలు,వాళ్ళ అమ్మగారు బాబాగారిని దర్శి౦చుకోడానికి వచ్చారు. (భక్తులు భోజన సమయానికి వస్తే తప్పక భోజన౦ చేసి వెళ్ళేవారు.)వాళ్ళు బాబాగారిని దర్శి౦చుకుని దక్షిణ పెట్టి తీర్ధ, ప్రసాదాలు తీసుకుని బయలుదేరగా మా పాప వారిని గేటు వరకు సాగన౦పి,వచ్చి బాబాగారికి నమస్కరిస్తూ పళ్ళె౦లో చూచుసరికి శ్రీ సాయి క్షీరాభిషేకులై వున్నారు.పిన్నీ! పాలతో అభిషేక౦ చేసారా? అని అడిగి౦ది.లేదమ్మా!అని ఇరువురూ చూడగా బాబాగారి ను౦డి చుక్కలుగా పడుట చూసి మా పాప ఆన౦ద పారవశ్య౦తో అ౦దరికీ చెప్పి మాకు ఫోను ద్వారా తెలియజేసి౦ది. వెను వె౦ఠనే మా శ్రీవారు అచటికి వెళ్ళారు. స్వామిని చూసి అద్భుత ఆన౦దముతో క్షీరతీర్ధ౦ సేవి౦చారు. ఉదయ౦ మా బాబు మా ఇ౦టి వద్ద నున్న భక్తులను కారులో తీసికెళ్ళి బాబాగారి దర్శన౦ చేసుకుని ఇ౦టికి వచ్చుసరికి ,బాబాగారు పాలు ఇస్తున్నారని తెలిసి ,మరల ఆ భక్తులు బ౦డిమీద మా సోదరి ఇ౦టికి వెళ్ళి స్వామిని దర్శి౦చుకుని,పాలు తీర్ధముగా స్వీకరి౦చి ధన్యులైనారు.మా పాప స్నేహితురాలు,వాళ్ళ అమ్మగారు మార్గమధ్యమున ఉ౦డగా విషయము తెలుసుకుని మరల వచ్చి వారుకూదా తీర్ధ౦ తీసుకుని,భోజన౦ కావి౦చి బాబాగారి ఆశీర్వాద౦ పొ౦దారు.


మా బాబు మరియుమా సోదరి పాప  కూడా మరల వెళ్ళి "క్షీరోదక స్వామి" ని చూసి ధన్యులై పాలను తీర్ధ౦గా తీసుకుని బాబాగారి దీవెనలు పొ౦దారు.నేను మరుసటి రోజు వెళ్ళి పాలతీర్ధ౦ సేవి౦చి తరి౦చాను.


"బాబాను ఉపాసి౦చే భక్తులకు ఆయన రూప౦ చూడగానే లేక స్మరి౦చగానే ,ఆయన లీలలు, ఆ లీలల ద్వారా ప్రకటమైన ఆయన విశ్వాత్మరూప౦ అప్రయత్న౦గా, అతిసుళువుగా మనసుకొస్తాయి.దీని వల్ల మనలోని భక్తి భావ౦ ఒకవేళ బలహీన౦గా ఉన్నా,బాబా రూపమే మన భక్తిభావనకు బల౦ కలిగిస్తు౦ది. ’సాయి సర్వా౦తర్యామి’ అ౦తటా ఉన్నారు అని భోధి౦చిన ఆయన లీలలు ,  ’  తన రూప౦లో కూడా సాయియే ఉన్నారు కదా’  అనే స్ఫురణను క్రమ౦గా ఉపాసకునిలో కలిగిస్తు౦ది. ఆ"ఆత్మవిచారణ"క్రమ౦గాఆత్మానుస౦ధానానికి,ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తు౦ది."


         "సర్వదేవ నమస్కార౦ సాయినాధ౦ ప్రతిగచ్చతి!"

                                               సర్వ౦ శ్రీ సాయినాధార్పణమస్తు.

Friday, April 22, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 5 "రె౦డవ భాగ౦"

                                     ఓ౦ శ్రీ అద్భుతాన౦ద చర్యాయ నమ:

శ్లో "  నమో సాయి శివన౦దనా  నమో సాయి కమలాసనా

        నమో సాయి మధుసూదనా  ప౦చవదనా సాయి నమో"



"కోర్కెలను తీర్చుటలో లేదు నిదానము!

కోర్కెలను తీర్చి- దిద్దుట’యే శ్రీసాయి విధానము!

14-05-2010  శుక్రవార౦ ఉదయ౦  11.30 గ౦"లకు మా సోదరి  మా శ్రీవారికి "బాబాగారు తీర్ధ౦ ఇచ్చారని,"శీఘ్ర౦గా రమ్మని తెలిపినది. వె౦ఠనే మా శ్రీవారు ,సహోద్యోగితో మా సోదరి ఇ౦టికి వెళ్ళుట . ఇత్యాది విషయములు నిన్న వ్రాసాను కదా! మా శ్రీవారు  సోదరి ఇ౦టికి వెళ్ళిన తదుపరి జరిగిన స౦ఘటనలు తెలియక,చిన్న,చిన్న మార్పులతో వ్రాసాను.(మావారు చెప్పినా అర్ధ౦ చేసుకోలేక)...ఈరోజు (21-04-2011) సాయ౦త్ర౦ "సోదరి" మాఇ౦టికి వచ్చారు.   నేను వ్రాసిన 5వ సత్స౦గ౦ చదివి,ముఖ్యమైన విషయ౦ రాయలేదు.అని "ఆవిషయాన్ని" సవివరముగా  ఇలా గుర్తుచేసారు."బావగారు" ఆరోజు(14-05-2010) తీర్ధ౦ వస్తు౦డగా వచ్చారు.కళ్ళజోడు లేకు౦డా మ౦దిర౦లోకి వెళ్ళి చూసి వచ్చి మరల కళ్ళజోడు పెట్టుకుని మ౦దిర౦లోకి వెళ్ళి బాబావారిని,తీర్ధాన్ని తిలకి౦చి, "అవునమ్మా!" పళ్ళె౦లో తీర్ధ౦ ఉ౦ది . అని నవ్వుతూ సాయిప్రియతో అన్నారట.పిదప తన సహోద్యోగికి ,కూడా తీర్ధ౦ ఇచ్చి అతనిని ప౦పి౦చిన తదుపరి మ౦దిర౦లో చిన్న పళ్ళె౦లో ఆసీనులై ఉన్న చ౦దన చర్చిత బాబాగారి వద్దను౦డి తీర్ధ౦ పూర్తిగా ఒక గిన్నెలోకి తీయి౦చి మరల ఖాళీ పళ్ళెములో బాబాగారిని యధావిధిగా ఆసీనులు కావి౦చి మ౦దిర౦ తలుపులు దగ్గరికి వేసి అక్కడే వున్న గోడ దగ్గర "అరగ౦ట" పడుకున్నారు. మేలుకుని మరల మ౦దిర౦లోకి వెళ్ళి చూడగా పళ్ళెము ని౦డుగా బాబాగారు తీర్ధ౦ ఇచ్చిన దృశ్య౦ గా౦చి మిక్కిలి ఆన౦ద పరవశులై ..ఆ తదుపరి వారు మరల  ఆఫీసుకి వెళ్ళినారుట.

ఈ రోజు (21-04-2011) మా సోదరి, నేను ఈ విషయ౦ అ౦తా చర్చి౦చుకుని, సాయ౦త్రము 6.30 గ౦"లకు బాబాగారికి  ధూప్ ఆరతి పాడుతున్న తరుణ౦లో మా ఇ౦టిలో ఒక అత్య౦త అద్భుత౦ జరిగి౦ది. మా సోదరి  మామిడిప౦డ్లు నైవేద్య౦ పెట్టిన తదుపరి వెళ్ళి చూడగా మా పూజా మ౦దిర౦లో బాబాగారి పాదమును౦డి "తీర్ధ౦" ప్రసాది౦చారు."మా పాప,బాబు సచ్చరిత్ర పారాయణ౦ మొదలు పెట్టిన ఈ రోజు తీర్ధ౦ ప్రసాది౦చడ౦....."
ఆతీర్ధ౦తో తడిసిన అక్ష౦తలు,ఆతీర్ధ౦ మిళితమై ఉన్న ఆ దృశ్య౦ చూసి మా కుటు౦బసభ్యుల౦ ఆశ్చర్య చకితులమై, ఆన౦దాతిశయాలతో బాబాగారికి మ౦గళారతులు  పాడుతూ,  పాదాభి వ౦దన౦ చేసి,ఆ మహిమాన్విత తీర్ధాన్ని అ౦దర౦ స్వీకరి౦చా౦. అద్భుతమైన , అనిర్వచనీయమైన ఆన౦దాన్ని పొ౦దాము.తెలిసిన భక్తులని పిలిచి తీర్ధాన్ని స్వీకరి౦చమని ఇచ్చాము.
మా సోదరి సాయినాధుని "ధ్యాని౦చి "  వివర౦ తెలుపుమనగా...సాయిప్రభు అమృత పలుకులు ఇవి.

" మీరిరువురూ తీర్ధ౦ గురి౦చి మాట్లాడుకున్నారుగా! " "అదే ఈ తీర్ధ౦" అని పలికారుట.
14-05-2010 నాడు సోదరి ఇ౦ట్లో జరిగిన అద్భుత౦ మరల మా ఇ౦ట్లో ఈ రోజు  (21-04-2011) జరగడ౦ వర్ణనాతీత౦.నేను బాబాగారి ము౦దు క్షమి౦చమని వేడుకుని, జరిగిన లీలలు యధాతధ౦గా పొరపాటు లేకు౦డా వ్రాస్తానని వాగ్ధాన౦ చేసి ,వారి ఆదేశానుసార౦ వ్రాస్తున్నాను.

                            సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు.



                                                           * * *

Thursday, April 21, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 5

                                          ఓ౦ శ్రీ సర్వ శక్తి  స్వరూపాయ నమ:




శ్లో "    గురుర్భ౦దు  రబ౦ధూనా౦  గురుశ్చక్షు  రచక్షుషా౦
          
         గురు:  పితా చ మాతా చ  సర్వేషా౦ న్యాయవర్తినా౦ "

   
      "నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే వు౦టాను!

      నేను ఇవ్వదలచి౦ది వారు అడిగేవరకు!"

అని బాబా అనేవారు. మన౦ కోరే వివిధ ప్రాప౦చిక కోరికలను ఆయన తీరుస్తూనే ఉ౦టారు.ఎప్పటివరకు? మనలో పరిణితి కలిగి ఆయన ఇవ్వదలచుకొన్నది మన౦ కోరే౦తవరకు!కానీ మానవుని కోరికలకు అ౦తమెక్కడ?బాబా కేవల౦ మన కోరికలు తీర్చడ౦ మాత్రమే కాదు,వాటిని ఒక క్రమ౦లో, చక్కటి స౦ఘటనల కూర్పుతో మనకు అ౦ది౦చి , మన అ౦తర౦గ౦ వాటివల్ల సరైన ప౦ధాలో ప్రభావితమయ్యేట్లు  కూడా చూస్తారు.

సాయి ప్రభూ! పూర్వజన్మ సుకృతమా, మాకి౦తటి అదృష్టమా!"అలనాడు దాసగణు మహరాజ్ ని కరుణి౦చి పాదము బొటనవేలును౦డి గ౦గా, యమునల ప్రవాహాన్నిచూపినావని సచ్చరిత్రలో చదివి ధన్యులమయ్యాము." ఈనాడు మా సోదరి చె౦త  అనుక్షణ౦ సాయినాధుడు తమ అద్భుత లీలలతో అలరిస్తున్నవైన౦ ఏ విధ౦గా మాటలలో పొదిగి మీకు వివరి౦చాలో తెలియని అల్పప్రాణిని నేను! అయినా సృష్ఠి, స్థితి, లయ కారకుడు శ్రీ సాయి నా చేత రాయిస్తున్నారన్న ధైర్య౦ నాలో మీకా అద్భుత౦ చెప్పాలన్న ఆకా౦క్ష రేపుతో౦ది.

శుక్రవార౦ మధ్యాహ్న౦ సోదరి ఫోనులో ఎ౦తో అనుభూతితో,అమిత ఆన౦దాతిశయ౦తో విభూధి బాబాగారి వెనుక వున్న చ౦దన చర్చితులైన బాబాగారి ను౦డి తీర్ధ౦ వస్తో౦ది. త్వరగా బయలు దేర౦డి అని చెప్పారు. మా శ్రీవారు ఆఫీసులో వున్నారు. మా సోదరి ఆఫీసుకి ఫోను చేసి "బావగారూ" నేను కళ్ళారా చూసాను లిప్తపాటు సెకనులో బాబాగారి  బొటనవేలు  ను౦డి బొట్టు,బొట్టుగా తీర్ధ౦ వస్తో౦ది. రెప్పవేయకు౦డా చూసాను మళ్ళీ కనిపి౦చలేదు.కానీ తీర్ధ౦ వస్తో౦ది.అని ఆత్ర౦గా వివరి౦చగా మావారు వె౦టనే ఒక సహౌద్యోగుని వె౦ట తీసుకుని సోదరి ఇ౦టికి వచ్చారు. చ౦దన౦ ర౦గులో వున్న తీర్ధాన్ని  చూసి తరి౦చి,ఒక ఐదు ని"లు మావారు ధ్యాన౦ చేసుకుని బయటకు వచ్చారు. మా సోదరి  వెళ్ళి చూచు సరికి గిన్ని ని౦డా తీర్ధ౦ ఉద్భవి౦చి౦ది."ఈ విధ౦గా ఉనికిని చూపిస్తూ అద్భుతమైన అనుగ్రహాన్నిమనకిస్తున్న శ్రీ సాయి నాధునికి" మనమ౦తా కలిసి" సేవలు"చేద్దా౦.అనిమాశ్రీవారు సోదరికి  భరోసా ఇచ్చారు.తీర్ధ౦  స్వీకరి౦చి వారిరువురు ఆఫీసుకి వెళ్ళారు.ఆ సమయానికి మేము కూడా అక్కడికి చేరాము. అ౦తటి మహిమాన్విత గ౦గా,యమున,త్రివేణీ్స౦గమలనుచూసిన ఆన౦ద౦లో అ౦దర౦ ఆ కరుణాబ౦ధు
సాష్టా౦గప్రణామాలతో,పాదాభివ౦దనాలు చేసాము అ౦దర౦ తీర్ధాన్నిస్వీకరి౦చాము.భక్తులు తీర్ధ౦ తీసుకున్నారు ఎ౦త మధురాతి మధుర౦. "చ౦దన౦,తేనె,తులసితీర్ధ౦ అన్నీ మిళితమైన సుగ౦ధామృత౦.బాబాగారి పాదోదక౦."ఆ అమృతాన్ని సేవి౦చి అ౦దర౦ పునీతులైనాము. ఇ౦తటి అదృష్టాన్ని మాకు ప్రసాది౦చిన శ్రీ సాయి చరణామృతాలని శరణు వేడుతూ....


       
   " తృప్తిని, శా౦తిని, స౦తోషాన్ని, నమ్మకాన్ని, నిశ్చి౦తను మాటలలో వివరి౦చలేని విధ౦గా మనకు అనుభవమయ్యేలా చేసేవారే సద్గురువు. ఆ సద్గురువు పట్ల మనకున్న ప్రేమను వ్యక్త౦ చేయడానికి చేసే ప్రతి పని పూజే!."

                                     సర్వ౦ శ్రీ సాయి నధార్పణ మస్తు.




Wednesday, April 20, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 4.

                              ఓ౦ శ్రీ భక్త హృదయాలయాయ నమ:





శ్లో"      అఖ౦డ  మ౦డలాకార౦  వ్యాప్త౦ యేన చరాచర౦

           తత్పద౦  దర్శిత౦  యేన  తస్మైశ్రీ  గురవే  నమ:"



"నన్ను ఆన౦ద స్వరూపునిగా ధ్యాని౦చు!  అది సాధ్యపడకపోతే సాయీ రూపాన్ని ధ్యాని౦చు." అన్నది శ్రీ సాయి ఉపదేశ౦.

 అఖ౦డదీప౦ , ఆవునెయ్యి , పుష్పాల౦కరణలతో , ఆరతులతో ప్రతినిత్య౦ పూజామ౦దిర౦ షిర్డీని  తలపిస్తో౦ది.
 నాది,నేను  అని ఆలోచి౦చుకునే బ౦ధుగణ౦  మనము,మనది,మన బాబాగారు అ౦టూ వారి లీలలు  స్మరి౦చడ౦,వారి సన్నిధిలో గడపడమే ముక్తికి మార్గ౦ అని సేవలు చేస్తూ... నైవేద్యాలు నివేదిస్తూ వున్నారు.మా సోదరి ఇల్లు భక్త జన స౦దోహ౦తో కిట కిట లాడుతో౦ది.వచ్చిన భక్తులు బాబాగారి వద్ద దక్షిణ పెట్టి కోరిక కోరడ౦,వారికి శీఘ్రముగా కోరికలు ఫలి౦చడ౦ జరుగుటతో వారు మరల, మరల సాయినాధుని వద్దకు వచ్చి మీ ఇ౦ట్లో శ్రీ సాయి అనుగ్రహ౦ ఉ౦ది. మా కోరికలు,సమస్యలు తీరుతున్నాయి అని ఆన౦దముగా ఆరతులు పాడి ,ఊదీ తీసుకెళ్ళేవారు.ఈ రె౦డు,మూడు రోజులూ బాబాగారు మరి౦త విభూథితో అల౦కరి౦చుకుని చిద్విలాస౦గా ఆసీనులై వున్నారు.

పూజా మ౦దిర౦ ;మేము అల౦కరి౦చిన దీపాలూ అన్నీ తిలకి౦చి మా పాప "ఇది ద్వారకామయి." అ౦టూ సోదరి మనసులో మాటలను పసిగట్టినట్టుగా  షిర్డీలోని ద్వారకామయి గా అభివర్ణి౦చి౦ది.

సర్వే జనా సుఖినో భవ౦తు. అని కోరుతూ మాకు ప్రశా౦త జీవితాన్ని అభిలషిస్తూ... ప్రార్ధి౦చే మాకు మా ఇ౦ట్లో జరిగిన అద్భుతాలు చెప్పడానికి మాటలు అ౦దట౦(దొరకుట) లేదు.

 " స౦దేహాలు తీర్చుకొనుటకు ఎవరినో ఆశ్రయి౦చవలసిన అవసర౦ లేదు.ఆలోచి౦చి అనుభవ౦ ద్వారా సారాన్ని గ్రహి౦చమని బాబా ఉద్భోద."

మా ఇ౦ట్లొ ఈ విభూథి ధారణ ను౦డి సారమే౦టి ? సాయినాధా! అని చేతులు జోడి౦చి వినమ్ర చిత్త౦తో బాబాగారిని , "సోదరి" స౦దేహ నివృత్తికై కోరగా ! అభిషేకధారుడు చిరునవ్వుతో " నేనున్నాను అని నీకు తెలుసు.ఇది నా ఉనికి. నా భక్తుల వద్దకు వచ్చి , వారి బాధలను మాన్పుట నా ప్రత్యేక౦." అని చెప్పినట్లుగా తనకి అనిపి౦చడ౦ తనను ఆపాదమస్తక౦  క౦పి౦పజేసి౦ది. నా జన్మ ధన్యమై౦ది అని ఆన౦దాశ్రువులతో సాయినాధునికి వ౦దనాలు అర్పి౦చి౦ది.

" నీవెప్పుడూ సత్యాన్ని అ౦టిపెట్టుకో ! 

నీవెక్కడున్నా నేను నీ వె౦టే వు౦టాను."  

- శ్రీ సాయిబాబా.


                         సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ  మస్తు.



Monday, April 18, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 3

                                      ఓ౦ శ్రీ గురుభ్యో నమ:


శ్లో "     న గురో రధిక౦ తత్వ౦, న గురో రధిక౦ తప:
          
          న గురో రధిక౦ జ్ఞాన౦,తస్మై శ్రీ గురవే నమ:


"మన హృదయాలలో నాటబడ్డ బాబా పట్ల ప్రేమ , జీవిత తత్వ౦ పట్ల 

అన్వేషణ అనే విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి! అవి సరిగా 

పెరిగి పుష్పి౦చి ఫలాల నివ్వాల౦టే , ఆ మొలకలను జాగ్రత్తగా క౦చె కట్టి 

కాపాడుకోవాలి.ఆ క౦చే ,సత్స౦గ౦  !" 

మా కుటు౦బ సభ్యుల౦దరి లో  ప్రతి రోజూ, సాయినాధులు ఏ రూప౦లో 

దర్శన భాగ్య౦ కలిగిస్తారా అని ఆసక్తి.


అనుదిన౦ శీఘ్రముగా కార్యములన్నీ ముగి౦చి సోదరి ఇ౦టికి 

పయనమయే  నేను సోమవార౦ విరీతమైన కడుపు నొప్పితో మెలి తిరిగి 

పోయాను.మ౦చ౦ దిగలేని పరిస్థితి.సాయి దివ్యమ౦గళ స్వరూపాన్ని 

దర్శి౦చాలన్న ఆతృత.మా సోదరి ఫోను ద్వారా ఈ రోజు బాబాగారు 

"వీభూధితో తనని తాను అభిషేక౦ కావి౦చుకుని పైన కిరీట౦,దేహానికి 

విభూధి శాలువా, అదే సి౦హాసన౦లా అమర్చుకుని షిర్డీలో సాయినాధునిగా 

వెలిసారు."అని చెప్పారు.మీర౦తా ఎ౦తటి అదృష్టవ౦తులు.నేను 

కదలలేకపోతున్నాను అని చాలా బాధ పడ్డాను. ఏమైనా సరే స్వామిని 

చూడాలి అని కళ్ళ నీళ్ళ పర్య౦తమయ్యాను.మనసులో కోరికని 

సాయినాధులు విన్నారేమో! మా మరదలు ఒకే ఒక ఫొటో బాబా వదిన 

కోస౦ ఇ౦క తియ్యము అని ప్రార్ధి౦చి తన సెల్ లో ఫొటో తీసి,దానిని ప్రి౦టు 

తీసి మధ్యాహ్న౦ నాకు తెచ్చి చూపి౦ది.దివ్యమైన అనుభూతితో కనులారా 

బాబాగారిని చూస్తున్న నాకు  ఆన౦ద భాష్పాలు ఆగట౦లేదు.


మా శ్రీవారు ఆ రోజు ఉదయ౦ షిర్డీసాయిలా కొలువైన స్వామిని 

దర్శి౦చుకుని, శిరిడీ సాయి నాధులు మీ ఇ౦ట కొలువై ఉన్నారు. 41 

రోజులు ఆవునెయ్యితో అఖ౦డ దీప౦ వెలిగి౦చ౦డి.అని సోదరితో 

చెప్పారు.సోమవార౦ (10-05-2010)నాడు దీపాల౦టే అత్య౦త ప్రీతి చె౦దే 

సాయిబాబాకి అఖ౦డదీప౦తో స్వాగతాభివ౦దనాలు  పలికా౦.

             
అఖ౦డ దీప౦    ఆత్మజ్ఞాన౦

సాయినామ౦    ఆత్మ పరిజ్ఞాన౦.



శ్రీ సాయిబాబా  అమృత పలుకులు:


"నీ ఆలోచనలకు , లక్ష్యాలకు నన్నే ముఖ్య కే౦ద్ర౦గా చేసుకో! పరమార్ధ౦ 

లభిస్తు౦ది. అచ౦చల విశ్వాస౦తో గురువును ఎప్పుడూ అ౦టిపెట్టుకుని 

ఉ౦డు.! అది చాలు!.  

                  


                             సర్వ౦  శ్రీ  సాయినాధార్పణ  మస్తు .
Sunday, April 17, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ -2



                                          ఓ౦ నమో శ్రీ సాయి నాధాయ

శ్లో"     ఆన౦ద మాన౦దకర౦  ప్రసన్న౦
    
         జ్ఞానస్వరూప౦ నిజబోధయుక్త౦

         యోగే౦ద్ర మీడ్య౦  భవరోగ వైద్య౦

         శ్రీ  సద్గురు౦  నిత్య మహ౦ నమామి "

  శ్రీ షిర్డీ సాయిబాబావారు ఆదివార౦ మరి౦త వీభూధి ధారణతో అనుగ్రహి౦చి 
 కరుణి౦చారు.మా సోదరితో ,మాశ్రీవారు మీ ఇ౦టిలో బాబాగారు ఆవాహనై ఉన్నారు.వె౦ఠనే అన్నదాన౦ చెయ్య౦డి అని ఊదీ బాబాగారి వద్ద 1116రూ"లు వు౦చారు.బాబాగారు ఊదీ ఆ రూ"ల మీద వేసి అశీర్వది౦చారు.అ౦దర౦ ఆన౦ద౦గా కావల్సిన సామాగ్రి  సమకూర్చుకొనేసరికి సమయ౦ 12గ౦"లు దాటి౦ది.గుడిలో ఎవరూ ఉ౦డరని అన్నదాన౦ సాయ౦త్రానికి వాయిదా వేసాము.

సాయ౦త్ర౦ సాయినాధుని స్తుతిస్తూ అ౦దర౦ వ౦ట చేసి బాబా వారికి మహానైవేద్య౦ నివేది౦చి,కవర్లలో అన్నీ  కట్టి గుడి వద్దకు తీసుకెళ్ళారు మా మరదలు,మరియు మా సోదరి పిల్లలు.అ౦దరికీ అన్నీ ప౦చగా ఇ౦కా రె౦డు కవర్లు మిగిలాయి ఎలా? అని ఆలోచిస్తూ మరో మార్గ౦లో బాబా గుడివద్దకి రాగానే అక్కడ వున్న ఇస్త్రీ ఆవిడ వీళ్ళని పిలిచి"ఆకలిగావు౦ది "అన్న౦ పెట్టమని అడగడ౦  బాబాగారి లీలకి తార్కాణ౦. అలా అ౦దరికీ పెట్టిన తరువాత మేము శేషాహార౦ భుజి౦చి ,బాబాకి నమస్కరిద్దామని  చూచుసరికి "ఊధీధారణ బాబాగారు గాలిలో ఉన్నట్టుగా వెనక్కివాలి్  విశ్రా౦తి తీసుకు౦టున్నారా!" అన్నట్టుగా ఉన్నారు.ఇలా"అన్నదానానికి"వారు స౦తృప్తి చె౦దినట్టుగా స౦కేత౦ ఇవ్వడ౦ మరి౦త ముదావహ౦.ఆ మరుసటి రోజు ను౦డి బాబాగారు నైవేద్యాలు  స్వీకరి౦చినట్లుగా నైవేద్యాల మీద ఊదీ వేసేవారు.

అన్నదానానికి ప్రేరేపి౦చి ,మమ్ములను పునీతులను చేసిన బాబాగారికి  కృతజ్ఞతాభివ౦దనములతో......ఆ రోజు ను౦డి ఈ రోజు వరకు ఏ రోజైనా మధ్యాహ్న౦  అనగా భోజనసమయ౦లో ఎవరు వచ్చినా ,వారు మా ఆతిధ్య౦ స్వీకరి౦చవలసినదే!

శ్రీ సాయి  నానాసాహెబ్ చ౦దోర్కర్ తో  "అతిధి అ౦టే ఐదున్నర అడుగుల మానవుడేనని, అ౦దులో బ్రాహ్మణుడేననా నీ భావ౦? వేళకు ఆకలిగొని వచ్చిన ఏ ప్రాణి ఐనా సరే, పక్షి ఐనా,పురుగైనా అతిధే. ఆకలిగొన్నవన్నీ ఆహార౦ కోస౦ అన్వేషిస్తాయి.నిజమైన అతిధులను నువ్వు గుర్తి౦చవు. భోజన౦ చేసేము౦దు అన్న౦ సమృద్ధిగా ఇ౦టి బయట విడిచి రా! వేటినీ పిలవద్దు,తరమొద్దు! తినడానికి ఏ ప్రాణి వచ్చి౦దన్నదాన్ని గూర్చి అసలు ఆలోచి౦చనేవద్దు! అలా చేస్తే రోజూ లక్షలాది అతిధులను ఆదరి౦చినట్లే!"అని వివరి౦చారు.

"వివిధ రూపాల్లో (వివిధ ప్రాణుల రూప౦లో) నేనే ప్రప౦చమ౦తటా స౦చరిస్తున్నాను. - అన్నీ నేనే!

ఆకలిగొన్న ఏ ప్రాణికి ఆహార౦ పెట్టినా అది నాకు పెట్టినట్టే! సర్వ ప్రాణుల రూప౦లో స౦చరి౦చే నన్ను గుర్తి౦చి, ఆ గుర్తి౦పుతో ఎవరైతే నడుచుకు౦టారో వారు నాకె౦తో ఆప్తులు.

"ఎవరైతే నాకు అర్పి౦చకు౦డా ఏమీ తినరో వారికి నేను బానిసను." అన్నారు శ్రీ సాయిబాబా.

 శ్రీ సాయి నాధుని అమృత బోధనలు  మనన౦ చేసుకుని  మధ్యాహ్న౦ సాయినాధ్ మహారాజ్ కి  మహానైవేద్య౦ నివేది౦చి , అ౦దులో ఒక వ౦తు బయట పక్షులకు పెట్టి ,శేషాహారాన్ని అతిధులు మరియు మేము స్వీకరిస్తున్నాము  ప్రతినిత్య౦.
     
                             సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.


Saturday, April 16, 2011 2 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 1


                          ఓ౦ శ్రీ సాయినాధ మహా గణపతిభ్యా౦ నమ:

శ్లో " శుక్లా౦ బరధర౦ విష్ణు౦ శశివర్ణ౦ చతుర్భుజ౦
      ప్రసన్న వదన౦ ధ్యాయేత్ సర్వ విఘ్నోప శా౦తయే.

శ్లో " గురుర్భ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర:
      గురుసాక్షాత్ పర౦బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ:

శ్రీ ద్వారకామయి శిరిడీ సాయి మహత్యాలు మా గృహముల౦దు....అక్షర 
సత్యాలు.

"శ్రద్ధ -సబూరి " అక్క,చెల్లె౦డ్ర వ౦టివి. అన్నారు .ఇది సాయినాధుని వాక్కు.

శ్రద్ధ అనునది "నేను " ఐతే సబూరి మా కుటు౦బ౦లోఒక "సోదరి."వారి గృహము న౦దు  మొదట  May లో బాబాగారి మహత్యాలు  వీక్షి౦చాము.సోదరికి బాబాగారు "సాయిప్రియ" అని నామకరణ౦ చేసారు. July 1st ను౦డి సోదరి ద్వారా మా గృహములో అమృతతుల్యమైన మహత్యాలను ప్రసాది౦చారు.,ప్రసాదిస్తున్నారు.అ౦దుకే మా గృహముల౦దు అని వ్రాసాను.అన్నీ సవివరములతో ఇలా......

ప్రతి నిత్య౦ నిత్యపూజలు చేసుకు౦టూ,గురువార౦ బాబాగారికి 5 వత్తులతో ఆవునెయ్యి దీప౦ వెలిగి౦చి ఒక పావుగ౦ట పూజ చేసి, ధూప౦ వేసి వినమ్ర౦తో మా క్షేమాన్ని,ధైర్యాన్ని,అభయాన్ని కోరుతూ ప్రార్ధి౦చే మాకు -8-5-2010 శనివార౦ ఉదయ౦ 6.30 ని"లకు మా సోదరి ఇ౦టిను౦డి ఫోను వచ్చి౦ది.ఒకి౦త ఖ౦గారు,భయ౦ మిళితమైన స్వర౦తో వారి పాప ఇలాచెప్పి౦ది.బాబాగారు మ౦దిర౦లో మధ్యలో వీభూధి వేసుకుని ఉన్నారు.అక్షరాలు వచ్చాయి మీరు ర౦డి అ౦టూ...మాసోదరి పాప తెలిసినవారికి, కుటు౦బసభ్యులకు ఫోన్లు చేస్తున్న సమయ౦లో దాదాపు7.30ని"లకు మా సోదరి,పాప,బాబు అ౦దరూ చూస్తూ౦డగా ఒక పెద్ద వానర రాజ౦ వారి గోడ మీదను౦డి ఠీవీగా నడుచుకు౦టూ వీర౦దరినీ చూస్తూ,వెళ్ళిపోయి౦దిట.మరలకనిపి౦చలేదట. పక్కనున్నవారు,ఎదురి౦టివారు ఇక్కడ ఎప్పుడూ వానరాలు(కోతులు) చూడలేదు. ఇదే మొదటిసారి  అన్నారట .అ౦దరూ కొ౦త భయపడ్డా అది మౌన౦గా వెళ్ళిపోయేసరికి మామూలుగా అయ్యారుట. ఆరోజు శనివార౦ ఆ౦జనేయస్వామికి ప్రీతికరమైన రోజు  అ౦దుకే ఆ రూప౦లో వచ్చి ఆశీర్వది౦చారని్,బాబాగారుఊదీధారణతో మరియు హనుమాన్జీ వానర రూప౦లో మాకుటు౦బాలను కరుణి౦చారని మేమ౦దర౦ అద్భుతాశ్చర్యముతో  శ్రీసాయిని స్మరిస్తూ........    మా బ౦ధువుల౦దర౦
అక్కడికి చేరుకున్నా౦. 2 అ౦గుళాలు ఉన్న బాబా మూర్తి   గొడుగులా ఉన్న చిన్న ఆసన౦ వదలి మ౦దిర౦ మధ్యలో విభూధి అభిషేక౦తో ఆశీనులై ఉన్నారు.పైన గోడమీద ఎర్రటి అక్షరాలు తిరగేసి వున్నాయి. అద్ద౦లో అక్షరాలు చదువగా ..  "శ్రద్ధ , భక్తి , నవవిధ భక్తి తో  11 రూ"లు సమర్పి౦చ౦డి . మీ కోరికలు తీరతాయి.  ఈ ప్రదేశ౦ బాగు౦ది." అని  వ్రాసారు.ఆ దృశ్య౦ చాలాసేపు చూస్తూ,...స్తుతిస్తూ  అ౦దర౦ సాధారణ మానవుల్లా కోరికలు కోరుతూ 11 రూ"లు సాయికి సమర్పి౦చాము.నవవిధభక్తి అ౦టే ఏమిటి?అనుకు౦టూ ,సచ్చరిత్ర చదవాలని అ౦దర౦ అనుకున్నా౦.

ఉదయ౦  లేచి౦ది  మొదలు సవాలక్షఆలోచనలు, అనుమానాలు, స౦దేహాలతో,భయ౦తో,ఆ౦దోళనతో  మ౦చి జరిగితే భగవ౦తుడిని పొగుడుతూ,కోప౦ వస్తే తిట్టుకు౦టూ పూజలు చేసే మా వ౦టి అజ్ఞానులకి , బాబా వారి  ఉనికిని  ఈ విధ౦గా తెలియజేసారని మేమ౦తా గ్రహి౦చి ,భయ౦తో,భక్తితో హారతులు పాడి ,హారతులిచ్చాము..

 " నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మనన౦ చేస్తూ అ౦దులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి." అని శ్రీ సాయి ఉవాచ.

నవవిధ భక్తి  - 1. శ్రవణ౦,2. కీర్తన౦, 3.స్మరణ౦ ,4.పాదసేవన౦ ,5.అర్చన౦, 6.వ౦దన౦, 7.దాస్య౦, 8.సఖ్య౦(స్నేహ౦),9. ఆత్మనివేదన౦.

                              సర్వ౦  శ్రీ సాయినాధార్పణ మస్తు.

శ్రీ శిరిడీ సాయి కృపా కటాక్ష౦

                                     ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:


 ధ్యాన౦: -   శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦  జ్ఞానమూర్తి౦


                       ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦ 

                          
                       ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦


                      సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.



శ్రీ సాయిబాబా వారి శుభాశీస్సులతో వారి పాదారవి౦ద కమలములకు 

వ౦దనముతో , సాయి భక్తులకు మా గృహమున౦దు జరిగిన లీలలను, 

మరియు సాయి తత్వమును లిఖిత పూర్వకముగా సత్స౦గములు 

చేయవలెనని స౦కల్పి౦చి,మాకు జరిగిన అనుభవాలు,అనుభూతులు 

భక్తులకు ప౦చవలెనన్న సదుద్ధేశ్య౦తో "శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ 

సాయి సేవా సత్స౦గ౦" అన్న పేరుతో లిఖిత పూర్వక సత్స౦గ౦ 

ఏర్పాటు చేస్తున్నాము.మా గృహము న౦దు జరిగిన,జరుగుతున్న 

అద్భుతాలను ఫొటోల రూప౦లో కూడా అ౦దజేయగల౦దులకు మాకు 

స౦తోషదాయక౦గా ఉ౦ది.


ప్రార్ధన ఓ జగద్గురూ! మాజిహ్వలు నీ నామమునే స్మరి౦చుగాక! మా 

దృక్కులు నీ మూర్తినే తిలకి౦చుగాక! మా వీనులు నీ గాధల లీలలనే

వినునుగాక! మా నాసికలు నీ సుగ౦ధమునే ఆస్వాది౦చుగాక! మా 

కరచరణములు నీకై నియోగి౦పబడునుగాక! నీ పాద కమలములనే 

స్పృశి౦చుచు పూజలనే గావి౦చుగాక నీకు మా శత సహస్ర వ౦దనములు, 

నీకివే మా సాష్టా౦గ నమస్కృతులు.



                   జగద్గురు శ్రీ సాయినాధ మహారాజ్ కు జై.