ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ:
ప్రతి ఒక్కరు ఈ భౌతిక ప్రపంచములో దు:ఖములను కలిగి ఉందురు. అది భౌతిక ప్రకృతి యొక్క స్వభావము.
ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది.అందుకే భగవద్గీతలో సర్వ శక్తివంతుడైన దేవాదిదేవుడు,యోగీశ్వరుడు,సర్వసిద్ధులకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి: "నా పై ఆధార పడుము.మీ అన్ని సమస్యల యొక్క పరిష్కారముల కోసము ప్రయత్నములను విడిచి,నన్నే శరణువేడుము.మీ బాధ్యతను నేను వహిస్తాను మరియు మీ సమస్త పాపకర్మల యొక్క ఫలితములను నిర్మూలిస్తాను."అని వాగ్ధానం చేశాడు.
శ్రీకృష్ణుడు మన బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆయన క్రమముగా మనకు వెలుపల నుండి బయటనుండి జ్ఞానమును ప్రసాదించుట వలన మనము బహుశా: భగవద్ధామమును చేరుకోవచ్చు.
ఐశ్వర్యము,విద్య,సౌందర్యము,ఉన్నత జన్మ మొదలగు వాటిని పొందుట అన్నది శుభప్రదమని భౌతిక దృష్టి అనుసారముగా భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా అనేక దు:ఖాలతో కూడుకున్నట్టివి.అవి నిజముగా శుభప్రదమైనవి కావు. నిజమైన శుభమంటే భగవద్ధామమును చేరుట.అనగా శాశ్వత జీవితము, శాశ్వత ఆనందము,శాశ్వత జ్ఞానమును పొందుట.దానిని మనము పొందవలెనంటే భౌతికమైనటువంటి ఎటువంటి కోరికలు లేకుండా, మనము దివ్యమైన భక్తియుక్త సేవలో నిమగ్నమగుటయే సర్వ శుభములకు ఆరంభము.ప్రతిరోజు శ్రీకృష్ణ మహామంత్ర జపమును చేయుచు భగవంతుని సేవలో ఎల్లప్పుడు నిమగ్నమై ఉందాము.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ప్రదర్శించినపుడు అర్జనుడు ఆయనతో ఇట్లనెను:" నా ప్రియమైన కృష్ణా! నిన్ను కేవలము నా మేనబావగా తలచి నేను నీ పట్ల ఎన్నియో అపరాధములను చేసితిని. నిన్ను కృష్ణా!, మిత్రమా! అని సంబోధించితిని. కాని నా ఊహకందనంతటి అపరి మేయుడవు నీవు" అది పాండవుల పరిస్థితి. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అయినను సర్వాధికుడు అయినను ఆయన ఆ రాచబిడ్డల భక్తికి, సఖ్యతకు, ప్రేమకు మురిసి వారితో కలిసి జీవించెను.శుద్ధభక్తి సేవ మహత్యమునకు ఇది ఒక నిదర్శనము.భగవానుడు గొప్పవాడు. కాని ఆయనను ఆకర్షించే 'భక్తి ' భగవానుని కంటే కూడా గొప్పది.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు