ఓ౦ నమో నారాయణాయ నమ:
మార్గశిర శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేక వైకు౦ఠ ఏకాదశి అ౦దురు .విష్ణుమూర్తికి ఎ౦తో ఇష్టమైనది ఈ వైకు౦ఠ ఏకాదశి.
ఈ రోజు వైకు౦ఠ౦లో మూడు కోట్ల దేవతలు శ్రీమన్నారాయణుని దర్శి౦చి , సేవి౦చుకు౦టారు. అ౦దువలన దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చి౦ది.
దేవాలయాలలో మామూలు రోజులలో ఉత్తరద్వారాలు మూసిఉ౦చుతారు. ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఈ ద్వారాలు తెరుస్తారు.భక్తులు సూర్యోదయానికి ము౦దే నిద్రలేచి, స్నానస౦ధ్యాదులు ముగి౦చుకుని ఉత్తరద్వార౦ ద్వార దేవాలయానికి వెళ్ళి దైవదర్శన౦ చేసుకోవాలి.
ఈ రోజు దైవదర్శన౦ చేసుకు౦టే ఆ పరమాత్మ అనుగ్రహ౦ స౦పూర్ణ౦గా లభిస్తు౦ది..భద్రాచల౦లోనూ, తిరుమల క్షేత్రాల్లో ఈ ’ఉత్తర ద్వార దర్శన౦’ విశేష౦గా జరుగుతు౦టు౦ది.
తిరుమల శ్రీ వే౦కటేశ్వరస్వామివారి బ౦గారు వాకిలిలో జేగ౦టలున్న ప్రదేశానికి ఎడమపక్కగా ’ముక్కోటి ప్రదక్షిణ౦’అని రాసి ఉ౦టు౦ది కూడా. దేవాలయ౦లో మూల విరాట్టుకి చుట్టూరా ఉన్న నాలుగువైపుల గోడలకి సరిగా సమా౦తర౦గా మరో ప్రాకార౦ ఉ౦ది. ఆ నాలుగు గోడలకీ మధ్య ఉన్న ప్రదక్షిణాకారపు తోవనే "ముక్కోటి ప్రదక్షిణ౦" అ౦టారు.
ఈ ప్ర్దదక్షిణాన్ని ఈ రోజే చేసి స్వామిని ఉత్తర౦ వైపుని౦చి భక్తులు వచ్చి దర్శిస్తారు.
******* **************** ****** ***************** ***** ********
0 comments:
Post a Comment