Tuesday, June 28, 2016 By: visalakshi

మా విశాలహృదయం సమాలోచనలు...ప్రేమ:---.. మౌనం.... శాంతి...

  "విశాలహృదయం" అనే పేరుతో రుక్మిణిగారు ఒక గ్రూప్ ను వాట్సాప్ లో క్రియేట్ చేసారు..మేము మాట్లాడుకున్న కొన్ని ప్రధానాంశాలను...చదువరుల కోసం...

 ప్రేమ...ఇది ఆధ్యాత్మిక,లౌకికములతో కూడిన విధంగా...తెల్లవారుఝామున మెలుకువ రాగానే వినిపించే   కోకిల రాగాలు, కిటికీ నుండి లొపలికి వస్తూ చల్లగా పలకరించిన చిరుగాలి, కళ్ళముందు మీరు ఇద్దరూ, హృదయంలో బాబాగారు...అప్పుడే నా మనసులోకి ఈ టాపిక్ ను తెచ్చాయి...కాబట్టి మీ ఇద్దరూ  ఏమి చెప్తారో వినాలని ఉంది...                         రుక్మిణీదేవి......

 ప్రేమ ...చాలా మంది పెద్దలు చాలా విధాలుగా నిర్వచించారు...ఒక్కొక్కరిదీ ఒకో మధురానుభూతి...నా దృష్టిలో ప్రేమ అంటే ఆరాధన...వ్యక్తిగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా,ఏ కోణంలో నైనా మైమరచి,తనను మరచి ఆరాధించడమే ప్రేమ...ఒప్పుకుంటారా ఫ్రెండ్స్...            విశాలాక్షి..




 ప్రేమ ... 17/10/2011 లో ఈ ప్రేమ గురించి నా అభిప్రాయం "స్మరణ" లో చెప్పాను.వీలైతే చూడండి ఫ్రెండ్స్...కొంచం బిజీగా ఉన్న కారణంగా వివరించలేకపోతున్నాను.......భారతి...


  ***                   ***                ***             ***             ***             ***           ***                  


 మౌనం...మౌనం అనేది సాధనా!...మౌనం వల్ల ఏమి సాధించవచ్చు? మిత్రుల మధ్య మౌనం సంతోషమా!..బాధాకరమా... మౌనం వల్ల ఏం కోల్పోతారు? ..ఏం పొందుతారు? మాట్లాడి సరిదిద్దుకోలేనిది..మౌనంలో సరిదిద్దబడుతుందా?  ..మౌనం అంతరార్ధం మనసు మూగబోవడమా  లేక ఆర్ధృమవడమా ! ఈ ప్ర శ్నలకు ఇద్దరూ మీ మనసుతో ఆలోచించి సమాధాం చెప్పండి...?   ......   విశాలాక్షి.....


 మంచి ప్రశ్న విశాలాక్షి గారు..మౌనం సహజమయినది..సాధనతో కూడా పొందవచ్చు.. మౌనం అంటే పైకి మాట్లాడకుండా లోపల మధనం కాదు. మిత్రుల మధ్య మౌనం సంతోషకరం కాదు.. కానీ తప్పని సరియై తన మౌనం ఆ ఎదుటి వ్యక్తులను నిందించుట లేక తూలనాడుటలాంటి విపరీత భావనలను అధిగమించవచ్చు... ఒకరిని ఏమైనా అన్నాము అనుకోండి..అది మౌనం  తో కాక మాటలతో,లేక చేతలతో సరిదిద్దగలము. ..సాధ్యం కాకపోతే మౌనం వహించక తప్పదు...ప్రయత్న పూర్వకంగా మనసు మూగబోతే అది తాత్కాలిక మౌనం అవుతుంది. ఆర్ధ్రమవడం అంటే వేదన ఎక్కువవుతుంది.అది సహయుక్తం కాదు. మనసులో రకరకాల ఆలోచనలతో ఉండి పైకి మాట్లాడడం మౌనం కాదు...శారీరక, మానసిక సంతులనతో ఉండి, సహజ స్థితిలో ఉండగలిగిన నాడు మనస్సును స్వాధీనంలోనికి తెచ్చుకున్న నాడు "మౌనం " ఎరుకలోకి వస్తుంది. ఈ మౌనంలో ఆనందమే ఉంటుంది..అందరి పట్ల సయోధ్య ఉంటుంది.. సాధనకు సంపూర్ణ స్థితిని అలవరిస్తుంది..నేను మౌనం వహిస్తున్నాను అని చీటికి, మాటికి అనుకునేది ప్రేమతో కూడినది.మాట్లాడటం వలన ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా ఉండకూడదు..అది తాత్కాలికం....          రుక్మిణీ దేవి.... 


 రుక్మిణీజీ మీ విశ్లేషణ చక్కగా ఉంది..భారతి...

" మౌనం మౌనమనేది సాధనా? అవునని చెప్తున్నాయి మన శాస్త్రాలు.. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం..."యోగస్య ప్రధమం, ద్వారం  వాజ్ఞి రోధ: " అన్నారు శ్రీ శంకరులు. మౌనం అనేది చింత, చింతన లేని తపస్సు. మనస్సుకు వాక్కుకు అందని పరమాత్మ తత్వం,మౌనం ద్వారానే సృశించగలమన్నది అనుభవజ్ఞుల
మాట.



 మిత్రుల మధ్యనే కాదు, ఏ బంధంలో నైనా అర్ధవంతమైన మౌనముంటే అది ఆనందదాయకమే. బలవంతంగా మౌనమయినా, ఆవేదనతో మౌనమయినా అది దుఖదాయకం..భరించడం కష్టమే! అపుడు ఆ బాధను పడేకంటే మాట్లాడి మనసులను దగ్గర చేసుకోవడమే ఉత్తమం. రెండు మనసుల మధ్య వాక్కు అనే వంతనను వేసుకోవడం ధర్మం. అయితే దానికంటే ముందు ఒకింత స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఏ కారణంచే ఎదుటివారు మౌనమయ్యారు, నాలో నొప్పించే అంశాలు ఏమున్నాయి? ఎదుటివారి మౌనంకు కారణమేమిటి?ఇత్యాది స్వశోధన చేసుకొన్నాక మాట్లాడితే తర్కవితర్కాలుండవు..గమనిస్తే, ఎదుటి వారి మౌనం మనకో బోధ కావచ్చు.....భారతి...






  మౌనం అంతరార్ధం ఇదని మాటల్లో చెప్పేకంటే అనుభవంలోకి వచ్చినపుడు అదేమిటన్నది వారి,వారి మానసిక భావనలను బట్టి అర్ధమవుతుంది.....   భారతి...


మీకు తెలియక కాదు గానీ విశాలాక్షి గారూ గుడ్ టాపిక్.. భారతిగారూ బాగుంది వివరణ....     రుక్మిణీ దేవి......

                      
                                 ***                ***              ***            ***           ***



 శాంతి....ఒక వ్యక్తి తన గురువు వద్దకు వచ్చి స్వామీ! " I WANT PEACE"   అన్నాడట...  ఏమిటి? అన్నారట     గురువుగారు  " I WANT PEACE"     అన్నాడట ఆ వ్యక్తి.  I  తీసేయి నాయనా!..నేను,నాది తీసేయి అన్నారట గురువు..ఇంకేమి మిగిలింది అన్నారట  WANT PEACE" .....want  కోరిక కూడా తీసేయి నాయనా!అన్నారట.. ఇప్పుడేమి మిగిలింది. Peace..శాంతి... నేను నాది అనే అహంభావమును తీసేసి, కోరికను జయిస్తే శాంతి కలుగుతుంది అని అర్ధము చెప్పారు గురువుగారు...ఓం శాంతి: శాంతి: శాంతి:......visalakshi...




  ఆధ్యాత్మిక పరమైన అంశాలు తదుపరి టపాలో.........mitrulaku abhinamdanalato......visala....






















             - 

1 comments:

రుక్మిణిదేవి said...

విశాలాక్షి గారు, బాగుంది .. చర్చ మన ముగ్గురిదీ గాని ఉపయుక్తమైనది అవగాహన చేసుకునే వాళ్లకి ...ముందు ముందు ఇలాంటి ఎన్నో విషయాలు మీనుండి ఆశిస్తూ .