ఓం శ్రీ పరబ్రహ్మ స్వరూపాయ నమ:
శ్లో " వదంతి తత్తత్వవిద
స్తత్త్వం యద్ జ్ఞానమద్వయం
బ్రహ్మేతి పరమాత్మేతి
భగవానితి శబ్ద్యతే
పరమ సత్యాన్ని తెలుసుకోగలిగిన తత్వవేత్తలు ఈ అద్వయ తత్వాన్ని బ్రహ్మమని, పరమాత్మ అని భగవంతుడని పిలుస్తారు.
ఒకే తత్వాన్ని ఉపనిషత్తులనధ్యయనం చేసిన వారు నిరాకార బ్రహ్మము అని అంటే, యోగులు పరమాత్మ అని నిర్వచిస్తే, భక్తులు భగవంతుడు అని అన్నారు....భగవంతుని వ్యక్తిత్వాన్ని నిరాకార బ్రహ్మతత్వం వెల్లడి చేస్తుంది. బ్రహ్మం అనేది సూర్యకాంతి అయితే, పరమాత్మ అనేది ఒకేచోట కేంద్రీకృతమైన సూర్యగోళం మరియు భగవంతుడు సూర్యదేవుని వంటివాడు.
శ్రీకృష్ణుని దేహప్రకాశమే బ్రహ్మతేజం. దాన్నే బ్రహ్మజ్యోతి అంటారు. ఈ భౌతిక ప్రపంచం ఆ జ్యోతి నుండే సృష్టించబడుతోంది.'బ్రహ్మతేజో రూపమైన నా నిరాకారతత్వమే అంతటా వ్యాపించి ఉంది. ' "ప్రతి వస్తువు ఆ బ్రహ్మతేజం పైననే ఆధారపడిఉంది.కానీ ప్రత్యక్షంగా మాత్రం నేను అక్కడ ఉండను...ఇదే తత్వజ్ఞానం...శ్రీ కృష్ణుని అర్ధం చెసుకోవడం అంటే బ్రహ్మమును, పరమాత్మను అర్ధం చేసుకోవడమే!
ఇక్కడ బాబాగారు మాకు ఇచ్చిన అనుగ్రహం చెప్పి ముగిస్తాను.....
కేనోపనషత్తు 3,4 భాగాలలో బ్రహ్మం సాక్షాత్కారం..అన్నీ అదే అయి అన్నిటియందూ అదే ఉండడం చేతనూ ....మనం బ్రహ్మంలో మన:పూర్వకమైన విశ్వాసంతో దాని స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలి.మనోవాక్కా యాలలో మోసం వంచనలేని మానవుడిలోనే బ్రహ్మం...బ్రహ్మజ్ఞానం ప్రకాశిస్తుంది. అని ఉపనిషత్తు ఉపదేశం....
బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు(రాక్షసులపైన) విజయం సంపాదించిందని కధ. విజయం బ్రహ్మం వలనే ఐనా, దాని వలన దేవతలు పొంగిపోయారు. నిజంగా మేమే గెలిచాం, మాదే ఈ ఘనత అనుకున్నారు.
వీరి గర్వం బ్రహ్మం తెలుసుకున్నది. వారి ఎదుట సాక్షాత్కరించింది. కానీ ఆ అపురూపమైన శక్తి ఏమిటొఓ వారికి అర్ధం కాలేదు.
దేవతలు అగ్నితో "ఓ జాతవేదుడా ఈ అపురూప శక్తి ఏమిటో నీవు తెలుసుకో" అన్నారు.అతడు ఒప్పుకున్నాడు.
అగ్ని ఆ శక్తి వద్దకు వేగంగా వెళ్ళాడు. నీవెవరివని ఆ శక్తి అతణ్ణి అడిగింది. "నేను అగ్నిని. సర్వజ్ఞుణ్ణి" అని అగ్ని బదులిచ్హాడు. "ఐతే నీలో ఏం శక్తి ఉంది?" అని శక్తి అడిగింది. "భూమ్మీద ఏదేది ఉందో అంతటినీ నేను దహించివేయగలను" అన్నాడు అగ్ని.
శక్తి అతడి ఎదుట ఒక గడ్డిపోచ ఉంచి "కాల్చు" అన్నది. అగ్ని యావచ్చక్తితో ప్రయత్నించాడు.కానీ కాల్చలేకపోయాడు.దేవతల వద్దకు మరలిపోయి "ఈ అపురూపమైన శక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను" అన్నాడు.
అప్పుడు దేవతలు వాయువుతో "ఓ వాయూ ఈ అపురూప శక్తి ఏమిటో నీవు తెలుసుకో" అన్నారు.అతడు ఒప్పుకున్నాడు.
వాయువు ఆ శక్తి వద్దకు వేగంగా వెళ్ళాడు. నీవెవరివని ఆ శక్తి అతణ్ణి అడిగింది. "నేను వాయువును, గాలికి ప్రభువును . అని బదులిచ్చాడు. "ఐతే నీలో ఏం శక్తి ఉంది?" అని శక్తి అడిగింది. "భూమ్మీద ఏదేది ఉందో అంతటినీ నేను ఎగురగొట్టగలను" అన్నాడు వాయువు .
శక్తి అతడి ఎదుట ఒక గడ్డిపోచ ఉంచి "దీన్ని ఎగురగొట్టు " అన్నది.వాయువు యావచ్చక్తితో ప్రయత్నించాడు.కానీ కదల్చలేకపోయాడు.దేవతల వద్దకు మరలిపోయి "ఈ అపురూపమైన శక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను" అన్నాడు.
అప్పుడు దేవతలు ఇంద్రుడితో "ఓ దేవేంద్రా! ఈ అపురూప శక్తి ఏమిటో నీవు తెలుసుకో" అన్నారు.అతడు ఒప్పుకున్నాడు.ఆ శక్తి వద్దకు త్వరత్వరగా వెళ్ళాడు కానీ ఆ శక్తి అతని ఎదుటనుండి అంతర్ధానమయింది.
ఆ స్థలంలోనే అతడు అద్భుత సౌందర్యవతియైన ఒక యువతిని హిమవంతుని కుమార్తెను చూశాడు. ఆమెను అడిగాడు. "ఈ అపురూపమైన శక్తి ఏమిటి?"
"అది బ్రహ్మం" అని "బ్రహ్మం విజయం వలన కదా మీరు మహిమాన్వితులయ్యారు అని ఆమె అన్నది." ఆ శక్తి బ్రహ్మం అని అతడు తెలుసుకున్నాడు. అందుచేతనే కదా ఇంద్రుడు ఇత్ర దేవతలను అధిగమించినది! అతడే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్ళాడు. ఆ శక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో అతడే ప్రధముడు. అగ్ని,వాయువు,ఇంద్రుడు వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్ళారు.కాబట్టి వారే ప్రధములు. ఈ ప్రపంచంలోని ఏవిధమైన శక్తియైనా, చలనమైనా, జీవమైనా దాని వెనిక బ్రహ్మం ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ గ్రాహ్యం. ఈ కధ బ్రహ్మం సర్వశ్రేష్ఠతను ప్రకటించే స్తుతి వాక్యం.గొప్ప గొప్ప దేవతలందరికీ ప్రాణం ఆ బ్రహ్మమే. శ్రీ శంకర భగవత్పాదుల అభిప్రాయములో ఈశ్వరుని అంటే సాకార బ్రహ్మమును ఆరాధించవలెనన్న విధి ఇది..మెరుపును ప్రకాశింపజేసేది ఆ బ్రహ్మమే.మనిషిని రెప్పలల్లార్చేటట్లు చేసేది ఆ బ్రహ్మమే.ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మమే." మనస్సు బ్రహ్మం గూర్చి తలిచేటంత శీఘ్రంగా, మనస్సు నిశ్చయించుకునేటంత శీఘ్రంగా"మనస్సు సంకల్పం ద్వారా స్మరణ ద్వారా మనస్సుచెత బ్రహ్మం క్షణమాత్రంలో దీపించుతుంది. "నిరంతరమైన మననం నిదిధ్యాసనల ద్వారా మనస్సు బ్రహ్మాన్ని తెలుసుకున్నట్లే".
స్తత్త్వం యద్ జ్ఞానమద్వయం
బ్రహ్మేతి పరమాత్మేతి
భగవానితి శబ్ద్యతే
పరమ సత్యాన్ని తెలుసుకోగలిగిన తత్వవేత్తలు ఈ అద్వయ తత్వాన్ని బ్రహ్మమని, పరమాత్మ అని భగవంతుడని పిలుస్తారు.
ఒకే తత్వాన్ని ఉపనిషత్తులనధ్యయనం చేసిన వారు నిరాకార బ్రహ్మము అని అంటే, యోగులు పరమాత్మ అని నిర్వచిస్తే, భక్తులు భగవంతుడు అని అన్నారు....భగవంతుని వ్యక్తిత్వాన్ని నిరాకార బ్రహ్మతత్వం వెల్లడి చేస్తుంది. బ్రహ్మం అనేది సూర్యకాంతి అయితే, పరమాత్మ అనేది ఒకేచోట కేంద్రీకృతమైన సూర్యగోళం మరియు భగవంతుడు సూర్యదేవుని వంటివాడు.
శ్రీకృష్ణుని దేహప్రకాశమే బ్రహ్మతేజం. దాన్నే బ్రహ్మజ్యోతి అంటారు. ఈ భౌతిక ప్రపంచం ఆ జ్యోతి నుండే సృష్టించబడుతోంది.'బ్రహ్మతేజో రూపమైన నా నిరాకారతత్వమే అంతటా వ్యాపించి ఉంది. ' "ప్రతి వస్తువు ఆ బ్రహ్మతేజం పైననే ఆధారపడిఉంది.కానీ ప్రత్యక్షంగా మాత్రం నేను అక్కడ ఉండను...ఇదే తత్వజ్ఞానం...శ్రీ కృష్ణుని అర్ధం చెసుకోవడం అంటే బ్రహ్మమును, పరమాత్మను అర్ధం చేసుకోవడమే!
ఇక్కడ బాబాగారు మాకు ఇచ్చిన అనుగ్రహం చెప్పి ముగిస్తాను.....
ఒకసారి మేము వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళినపుడు .. ఇంట్లో ఉన్న నోటె బుక్ పై బాబాగారు ఇలా వ్రాసారు..." ఏవీ సత్సంగాలు! ఇలవేల్పును దర్శించడం లాభదాయకం. అంతా మంచే.పద్మనాభారవిందాక్ష పద్మలోభ సులోచన అనంతుడికి సహస్రనామ ప్రీతికరం. మహా లక్ష్ములూ ఒక్క శ్లోకం అన్నా మననం చేయండి. నేను మీ దేవుళ్ళను వదలమని చెప్పను. అంతా బ్రహ్మమే .." సాయి ...అని అద్భుతంగా సందేశాన్నిచ్చారు. ఇక్కడ నేను మీ దేవుళ్ళను వదలమని చెప్పను లో లోతుగా ఆలోచిస్తే పరమార్ధం తెలుస్తుంది. అపుడే అంతా బ్రహ్మమే అన్నది అర్ధమవుతుంది.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
1 comments:
బ్రహ్మమంటే 'అదే'.
Post a Comment