"అంగుష్ఠం బ్రహ్మ సంకేతమైనది"
"అంగుష్ట మాత్ర: పురుష:, అంగుష్ట వై సమాశ్రిత:" అని వేదం చెప్తోంది. పరమపురుషుడు అంగుష్టాన్ని ఆశ్రయించి ఉంటాడని, అందుచేత అది పరమాత్మ స్వరూపమని మనవారు గుర్తించారు. అలా బొటనవ్రేలు యొక్క ప్రత్యేకత వేదాంతంలో భాగమైంది.బొటనవ్రేలుకు సంబంధించిన పరిజ్ఞానం భారతీయులకు తెలిసినంతగా ప్రపంచములో మరెవరికీ తెలియదంటే అది అతిశయోక్తి కాదు. మనవారి దృష్టిలో చేతికున్న ఐదువ్రేళ్ళు పంచభూతాలకు ప్రతీకలు.అందులో అంగుష్టం అగ్నికి సంకేతం. భారతీయ ప్రాచీన వైద్య విధానమైన యోగా లో ముద్రా చికిత్స - చేతికున్న ఐదువ్రేళ్ళతో జరుగుతుంది. ఈ వ్రేళ్ళ మధ్య అవసరమైన సమన్వయాన్ని బొటనవ్రేలు నిర్వహిస్తుంది.

యోగా - ' ముద్రాచికిత్స '.....
1. జ్ఞానముద్ర - (చిన్ముద్ర, ధ్యానముద్ర) - బొటనవ్రేలు చివరి భాగాన్ని చూపుడు వేలితో తాకించాలి.మిగతా వేళ్ళు నిటారుగా, విశ్రాంతిగా ఉంటాయి.
ఉపయోగం: ఏకాగ్రత,ధ్యానం కుదురుతుంది. పనిమీద శ్రద్ధ కుదురుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.నకారాత్మక ఆలోచనలు పోతాయి.మానసిక వత్తిడులు అంతరిస్తాయి. సోమరితనం పోతుంది. నిద్రలేమితనం పోవటంతో,పాటు దివ్యమైన దృష్టినిస్తుంది.
2. వాయుముద్ర - బొటనవ్రేలును చూపుడువేలు కణుపుపైన పెట్టి క్రిందికి నొక్కిపట్టాలి. పక్షవాతం, గ్యాస్, మెడనొప్పి, వెన్నునొప్పి,మోకాళ్ళనొప్పులు, తుంటినొప్పికి అమోఘంగా 12 నుండి24 గంటల్లో పనిచేస్తుంది.
3. ఆకాశ ముద్ర:-బొటనవ్రేలు మధ్యవేలుకు తాకించాలి. గుండెకు ఉపయోగకారి. శని ప్రభావం తొలగును. ఆగ్రహం వచ్చినపుడు ఈ ముద్ర వేస్తే 'శాంతి 'చేకూరుతుంది. ఈ ముద్ర నడిచేటపుడు, తినేటపుడు వేయరాదు.
4. శూన్యముద్ర:- బొటనవ్రేలును మధ్యవేలి కణుపుపై ఉంచి,క్రిందికి నొక్కాలి. చెవిపోటు, చీము, చెవుడు రావు. థైరాయిడ్,గుండె సమస్య, గొంతునొప్పి, నరాల బలహీనత తగ్గిపోవును.దంతపు చిగుళ్ళు గట్టి పడును. ఇది కూడా నడిచేటపుడు, తినేటపుడు చేయరాదు.
5. పృధ్వీముద్ర:- బొటనవ్రేలు ఉంగరపువేలు కొనకు తాకించాలి. ఊబకాయం తగ్గును. జీర్ణశక్తి, జీవశక్తి, పవిత్ర భావాలు పెరుగును. శరీరం చైతన్యవంతమగును. విటమిన్ లోపాలు సరిజేస్తుంది, బలం పుంజుకుంటుంది. ఆజ్ఞాచక్రాన్ని(బొట్టు పెట్టుకునే తావు)ప్రభావితం చేస్తుంది.
6.సూర్యముద్ర:- బొటనవ్రేలు ఉంగరపు వ్రేలు కణుపుపై పెట్టి క్రిందకు నొక్కాలి. కొవ్వు కరుగుతుంది. సమత్వం పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. రోజూ ఉదయం 5 నుండి 15 నిమిషాలు చేయాలి. ప్రధానంగా బరువు తగ్గుతారు.నెల రోజుల్లో సుమారు 4 నుండి 6 కిలోల బరువు తగ్గుతారు.డయాబెటిస్, కాలేయ సమస్యలుండవు.
7. వరుణముద్ర:- బొటనవ్రేలును చిటికెనవ్రేలుకు తాకించాలి. ఎండిపోయిన శరీరం తేమను సంతరించుకుంటుంది. గ్యాస్ట్రోఎంట్రిటీస్, మొటిమలకు బాగా పనిచేస్తుంది.
8. జలోదరనాశకముద్ర:- బొటనవ్రేలు చిటికెనవ్రేలి కణుపుపై ఉంచి క్రిందకు నొకాలి. శరీరంలోని అధిక నీటిని తగ్గిస్తుంది. జలోదర వ్యాధిని నివారిస్తుంది.

9. అపానముద్ర:- బొటనవ్రేలుమధ్యవేలు,ఉంగరపు వేలును తాకుతుంటుంది. చూపుడువ్రేలు, చిటికెనవ్రేలు నిటారుగా ఉంటాయి. వ్యర్ధ పదార్ధాలను బయటకు గెంటుతుంది. డయాబెటిస్ కు వరం. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. పైల్సు అంతరిస్తాయి. కిడ్నీలు బాగుపడతాయి. వంటికి మేలు చేస్తుంది. చెమట పట్టేదాకా చేయాలి.ఉదర రోగ నివారణం.
10. అపాన వాయు ముద్ర:- బొటనవ్రేలును మధ్యవ్రేలు మరియు ఉంగరపువ్రేలును తాకించాలి. చూపుడువ్రేలి క్రింది భాగములో అదిమిపెట్టి ఉంచాలి. చిటికెనవ్రేలు నిటారుగా ఉంటుంది. దీన్నే 'హృదయ ముద్ర ' లేక 'మృత సంజీవనీ ' ముద్ర అంటారు. గుండె పాలిట వరం. వెంటనే ఫలితాన్నిస్తుంది. 'సార్బిట్ రేట్ ట్యాబ్లేట్ ' గా పనిచేస్తుంది. గ్యాస్, తలనొప్పి పోతుంది. ఉబ్బసం బి.పి లకు లాభకారి.
11. ప్రాణముద్ర:- బొటనవ్రేలు ఉంగరపువ్రేలును మరియు చిటికెనవ్రేలు చివరలను తాకుతుంది. మిగతావ్రేళ్ళు నిటారుగా ఉంటాయి. ఈ ముద్ర చాలా ముఖ్యమైనది. ఇది ఏ సమయములోనైనా, ఏ ఆసనములోనైనా, ఏ ఆసనం లేకుండానైనా ఎంతకాలమైనా చేయవచ్చును.రోజుకు 5 నిమిషాల చొప్పున చేస్తే కళ్ళజోడుతో పని ఉండదు. ఆకలి దప్పులు ఎక్కువ ఉండవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
12. లింగముద్ర:- ఎడమచేతి బొటనవ్రేలు నిలువుగా ఉండాలి. ఎడమచేతి చిటికెన వ్రేలు కుడిచేతి చిటికెన వ్రేలికింద ఉండాలి. రెండు చేతులు వ్రేళ్ళు ఒకదాని మధ్యలో మరొకటి దూర్చాలి. వేడి జనిస్తుంది. పడిశమునకు శ్రేష్ఠము. ఉబ్బసం, దగ్గు, సైనస్, పక్షవాతము, రక్తపోటులను నివారిస్తుంది. కఫమును తొలగిస్తుంది. ఒంట్లో బరువు తగ్గుతుంది. కొవ్వు కరుగుతుంది.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
అంగుష్ఠం బొటనవ్రేలుకు సంబంధించి....ఏకలవ్యుని కధ తదుపరి టపాలో.....
1 comments:
ధార్మిక, ఆధ్యాత్మిక, జ్ఞాన, విజ్ఞాన... వివిధ అంశాలతో అలరారుతుంది "వనితావని వేదిక".
విలువైన విషయాలను వివరణాత్మకంగా విశదపరుస్తున్న విద్వన్మణి వేదజీ ...
మీకు నా అభివందనములు.
Post a Comment