Tuesday, December 30, 2008 By: visalakshi

2008 అనుభవాలు,అనుభూతులు.

ఒక కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఎం.బీ. ఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా అన్నగారి వద్ద మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలకీ వయసు తేడా 2సం"లు.
ఈ ఇద్దరు అమ్మాయిలకి  కాలనీ  సిస్టర్స్ అని పేరు .ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇంట్లో ఏ అవసరమొచ్చినా , రేషన్ కి వెళ్ళాలన్నా ఇద్దరూ జంట కవుల వలె వెళ్ళేవారు .ఏపని ఐనా కలసి చేసే వారు . కాలనీ లో అందరికీ వెల్ నోటెడ్ వీళ్ళిద్దరూ.ఒకరికొకరు అన్ని విషయాలు షేర్ చేసుకునేవారు .అలాంటి తరుణంలో అక్కకి పెళ్ళై దూరంగా వెళ్ళి పోయినా ,తనూ ఉన్నత చదువు అభ్యసించి వివాహము చేసుకుని ఉద్యోగం చేస్తూ ఎవరికి వారు బిజీ అయ్యి మరల దూరంగా ఉన్న అక్కా,బావలు ట్రాన్స్ఫర్ తో దగ్గరైన ఇద్దరమ్మాయిలు ఎవరో కాదు వేద ,రమణిలు .
ఇక విషయానికొస్తే ఈ సంవత్సరము మొదట్లో రమణి నాకు బ్లాగు రాస్తున్నాననీ ,చదువు అని చెప్పేది .కానీ నేను చిన్నప్పుడు కవితలు రాసి వినిపించేది. ఇదీ అలాంటిదే ఐ ఉంటుంది అని పట్టించుకోలేదు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను చదవమని అడిగేది. అప్పుడు నాకు పెద్దగా నెట్ గురించి తెలియదు .సరే అని మా పాపని అడిగి తెలుసుకుంటూ తన బ్లాగు ఓపెన్ చేసి చదివాను. నిజంగా తనలో ఇంతటి భావుకత ఉందా ! ,తన సహజమైన శైలి తో ,హాస్యం పండిస్తూ .నివ్వెర పోయాను.తేరుకుని నీ సొంతమేనా ఎక్కడైన కాపీనా అని అక్కగా అధికారంగా అడిగాను.తన జవాబు హ..హ..హ..హ ఎప్పుడూ ఇలాగే చిలిపిగా ఉంటుంది నా చెల్లెలు. అలా తన పోస్టులు చదువుతూ గడుపుతున్న నన్ను ఒక రోజు నువ్వూ రాయక్కా .అని అడిగింది .చదవడం ఈజీ ,రాయడం కష్టము అన్నాను.కానీ మనసులో పడింది రాయాలని.నా కంటూ ఒక బ్లాగు ఎలా అని అడిగాను .తను బాగా బిజీ ఉన్న రోజుల్లో నాకు ఆసక్తి ఎక్కువై తన బ్లాగునుండి కామెంట్స్ వచ్చిన వారి బ్లాగులు చదువుతూ శ్రీధరు గారి చిట్కాలతో కష్టపడి బ్లాగరునయ్యాను. తరువాత తెలుగులో ఎలా రాయాలో రమణి చెప్పింది. ఆ విధంగా సెప్టెంబరులో ఈ -తెలుగు లోకంలో అడుగు పెట్టిన నేను ప్రముఖులు కొంతమంది ఆశీస్సులతో నాకు తోచిన చిన్న చిన్న అంశాలు రాస్తున్నాను.నేను బ్లాగ్లోకంలోకొచ్చిన 4నెలల్లోనే అంతర్జాలంలో తెలుగు వెలుగులు అంటూ ప్రముఖ తెలుగు బ్లాగర్లని కలవడం మేము చేసుకున్న అదృష్టము .మరియు ప్రమదావనంలో కూడా ప్రముఖుల పరిచయం ,మొత్తానికి బ్లాగు కుటుంబంలో నన్ను సభ్యురాలిని చేసిన నా చెల్లికి ముందుగా కృతజ్ఞతలు.ఇంతమంది స్నేహితులు ,సన్నిహితులు కల ఈtelugu బ్లాగులోకం దిన,దిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ...............వేద

6 comments:

Unknown said...

వేద గారూ మీ అక్కాచెల్లెళ్ల అనుబంధం బాగుంది. బ్లాగ్లోకంలో ఇప్పటివరకూ స్వంత సిస్టర్స్ మీరేనేమో! ఇకపోతే మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

రాధిక said...

బావుంది.రమణి గారు కవితలా?మచ్చుకి ఒకటి విసరండి మీకు గుర్తుంటే.

నేస్తం said...

మీకు ,రమణి గారికి కూడా నూతన సంవత్సర శుభాకంక్షలు

Ramani Rao said...

అక్కా! నేనే రాద్దామనుకొంటున్నా నువ్వు రాసేసావు. 2008 అనుభవాలు అనుభూతులలో నన్ను చేర్చి బ్లాగర్స్ తో పంచుకొన్న వైనం బాగుంది. కవితల రహస్యం చెప్పేసావు. నాకు థాంక్స్ ఎందుకు అక్కా? మనిద్దరం ఇలా హ్యాపీ గా ఉందాము.బ్లాగు సిస్టర్స్ లా. :-)

రాధిక గారు: మచ్చుకో కవితని నన్ను కదిలించేస్తున్నారు కవితలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మరి. గుర్తొచ్చిన వాటిలో మచ్చుకొకటి.

ఆకాశం నీలంగా ఎందుకుంది? పచ్చగా ఉంటే బాగోదు కనక......

వహ్వా!! వహ్వా!! అని వినిపిస్తోంది మీరంటున్నారా??

అంత నచ్చేసిందా మీకు?? ఇక రేపటినుండి తవికలే ....కాదు కాదు కవితలే కవితలు నా బ్లాగంతా...:-) :-)

ఈ పోస్ట్ చదువుతున్న, చదివిన, చదవబోతున్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు -బ్లాగ్ సిస్టర్స్.

జ్యోతి said...

వేదగారు, మీరు రమణి సిస్టర్స్ ఐనా ఎంత తేడా. మీవంతు వస తను తాగేసిందేమో.. కదా.. మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుబాకాంక్షలు..

కొత్త పాళీ said...

good show.:)