పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటరులో చేరాల్సిన అమ్మాయి ప్రేమలో పడింది .రోజూ వాళ్ళింటికి వచ్చే అన్న గారి స్నేహితుడిని చూసి మనసు పడి ,ఆ విషయం అతనితో చెప్పి పరస్పర అవగాహనతో ఇద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటే ,అన్నగారికి విషయం తెలిసి ఇద్దరినీ మందలించాడు. ఈ లోపులో అమ్మాయిది ఇంటరు పూర్తి అయింది. అబ్బాయికి గవర్నమెంటు జాబు వచ్చింది. ఇలా ఇంట్లో గొడవలతో వాయిదా పడుతూ వచ్చిన పెళ్ళి అనుకోకుండా ఇంకో వ్యక్తి అమ్మాయి జీవితం లోకి వచ్చి విసిగించడంతో ,అమ్మాయి డిగ్రీ పూర్తి కాకుండానే ,మరియు పెద్దవాళ్ళ అమోదం లేకుండా రిజిస్టారు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు ఆ జంట .పెళ్ళి అయ్యాక కుటుంబ సభ్యులు చాలా నెలలు కోపంగా ఉన్నా అటు వారిని ,ఇటు వారిని శాంత పరిచి అందరు ఆనందంగా కలుసుకునేలా ప్రవర్తించారు ఆ జంట .వారికి పెళ్ళి అయి ఈ రోజుకి 22సం"లు
పెళ్ళి అయిన తరువాత ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటరు కోర్సు చేసింది .కానీ హౌసు వైఫ్ గా స్థిరపడిపోయింది. ఆ అమ్మయికి ఒక పాప, ఒక బాబు.
ప్రస్తుతము పాప ,బాబు ఇంజనీరింగు చదువుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి అనబడే సదరు స్త్రీ నేనేనండీ ,వేద. మా వైవాహిక జీవితం ఒడి దుడికులతో,మరియు సుఖ సంతోషాలతో గడిచింది ,గడుస్తోంది. బ్లాగు మిత్రులందరితో సరదాగా నా కధ చెప్పాలని రాసాను .అంతే
9 comments:
Heartiest Congratulations and Wish you a very happy marriage anniversary Medha garu. Wishing you beautiful years of companionship ahead !!!
వేద గారు అది నేను పుట్టిన సంవత్సరం. ఆ రోజుల్లోనే ప్రేమలో విప్లవం తీసుకొచ్చిన మీకు అభినందనలు. ప్రేమన్నా, ప్రేమికులన్నా, ప్రేమ పెళ్లి చేసుకున్న వారన్నా నాకు ప్రత్యేక అభిమానం.
happy wedding anniversary.
Thanks for sharing your story with us.
వేదగారు,
పెళ్లిరోజు శుభాకాంక్షలు.. మీ దంపతుల ప్రేమ రోజురోజుకు పెరుగుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ..
happy wedding anniversary veda gaaru :)
thank you so much laxmi gaaru.
mee abhimaanaaniki kRtajnatalu nagesh reddy gaaru .
thank you bhavani gaaru .
dhanyavaadaalu jyoti gaaru .
thank you nestam .
హన్నా!
ఇంతకీ భోజనాలెక్కడా?ఎప్పుడూ అని :)
అభినందనలు
"prema katha 1982" anna Title supar mii premka katha caalaa baagaa ceppaaru. mee prema jantaki aalasyamgaa ceptunna pelliroju haardhika subhaakaankshalu.
Wish you a very happy marriage anniversary vedha garu
Congrats !!! Prema enni janmalakaynaa vedanidhii, meeto kalakalam vundali ani korukuntuu..
Thanks & Regards,
Ur's - DeepU
Post a Comment