Sunday, September 14, 2008 By: visalakshi

స్త్రీ స్వాతంత్ర్యం

ప్రస్తుత సమాజంలొ స్త్రీ స్వాతంత్ర్యం గురించి చాలా రచయితలు, సంఘ సంస్కర్తలు చాలా . విధాలుగా చెప్పారు, గాని చలం గారు చెప్పినది అప్పటి కి, ఇప్పటికి, ముందు తరానికి కూడా అదర్శం. వారు రాసిన స్త్రీ పుస్తకంలొ మొదటి మాట ఈ క్రింద విధంగ రాసారు:

” స్త్రీకి కూడా శరీరం ఉంది; దానికి వ్యా యామం యివ్వాలి .ఆమెకి మెదడు ఉంది; దానికి జ్ఞానం యివ్వాలి. ఆమెకి హ్రుదయం ఉంది; దానికి అనుభవం యివ్వాలి- అనే సంగతి గుర్తించని దేశానికి నెను రాసే సంగతులు ర్ధమవుతాయా? ఫ్రాశ్చాత్య నాగరికత వ్యామోహంలొ పడి వొళ్ళు తెలీక నో టికి వఛ్హినట్లు కూసినకూతలు అనుకుంటారు అని తెలుసు, కాని ఇట్లాంటి పుస్థకం నా చిన్నతనంలొ దొరికితే ఇప్పటికన్న ఎన్నొరెట్లు పవిత్రవంతం సార్ధకం చేసుకొగలిగేవాడిని . నా వంటివారు ఈ నూతన యుగంలొ ఉన్నారేమో ! ”

ఈ స్త్రీ పుస్త్టకం రచన కాలం 1925. మ నం ఇప్పుడు 2008 లో ఉన్నాం . అంటే 85 సంవత్సరంలు గడిచినవి. ఈ రొజుకు కూడ స్త్రీ స్వతంత్రపు స్వేచ్హాగాలులు పీల్చడంలేదు , సాధ్యం బహు కోద్ది మందికి అని నా అభిప్రాయం. స్త్రీ పురుషుని కన్న తక్కువ కాదు అనుకొవ డమే , తమను తాము తక్కువచేసుకోవడం పురుషుడు , పురుషుడే , స్త్రీ, స్త్రీయే , ఇద్దరు స్రుష్ఠి ముందు సమానులే. కావలసింది పరస్పర గౌరవం తద్వార సమాజ శ్రేయస్సు.

4 comments:

Ramani Rao said...

చాలా బాగా రాసారు వేద గారు. నేను చలం పుస్తకాలు కొన్ని చదివాను. మంచి ఆలోచనలు మీవి, రాస్తూ ఉండండి. కొత్తగా వచ్చినట్లున్నారు దసరా శుభాకాంక్షలో తో బ్లాగు లోకానికి స్వాగతం సుస్వాగతం.

visalakshi said...

థన్యవాదములు రమణిగారు. మీ బ్లాగులు చదివి ఆ స్పూర్థితో బ్లాగు వ్రాయుట మొదలు పెట్టాను.మీ సహకారంతో నా ఆలోచనలకి పదునుపెట్టి బ్లాగడానికి ప్రయత్నిస్తాను.

జ్యోతి said...

బ్లాగ్లోకానికి స్వాగతం వేదగారు. మంచి విషయాలు మీదైన శైలిలో రాస్తుండండి. ఆల్ ది బెస్ట్

Kottapali said...

మంచి పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు బ్లాగ్లోకంలోకి. స్వాగతం. మీనించి మరిన్ని మంచి టపాలకోసం చూస్తుంటాం.