Wednesday, November 26, 2008 By: visalakshi

స్త్రీ -స్వేచ్ఛ:-


కుటుంబ వ్యవస్థలో భర్త పాలనలో మధ్య తరగతి సగటు స్త్రీల స్వేచ్ఛ : ఉదా: మా బంధువుల అమ్మాయికి పెళ్ళి అయి 2సం"లు దాటాయి . భర్త రైల్వేలో చేస్తున్నాడు. ఈమె పెళ్ళికి ముందు ప్రైవేటు ఉద్యోగం చేసేది .పెళ్ళి సెటిల్ అయ్యాక మానేసింది. ఒక పాప పుట్టాక మరల జాబ్ లో జాయిన్ అయింది. నెల తిరిగేసరికి జీతం మొత్తం అత్తగారి చేతిలో. ఆ అమ్మాయికి బస్ పాస్ +10 రూ "లు . ఆఫీస్ నుండి వచ్చాక ఇంటిపని మొత్తం చేసుకోవాలి. ఇది ఆ అమ్మాయి ఆర్ధిక స్వాతంత్ర్యం ,వ్యక్తిగత స్వేచ్ఛ. కనీసము తల్లిదండ్రుల్కి, చుట్టాలకి ఫోను చెయ్యాలన్నా భర్తగారి ,అత్తగారి పర్మిషన్ ఉండాలి. ఆ అమ్మాయిని ఏదైనా ఫంక్షన్ కి పిలవాలంటే ,మా అత్తగారికి,మా వారికి చెప్పండి. వాళ్ళు పంపితే వస్తాను. ఇదీ జవాబు. ఇంత లోబడి ఉండి అవకాశం ఇచ్చి పైగా మీకు అన్నీ తెలుసుకదా అక్కా ! అత్తగారింట్లో ఎలా ఉండాలో అని అంటుంది. అంటే అలాంటి స్త్రీల ఉద్దేశ్యం " అత్తగారింట్లో ఒక బానిసలా ఉండమని. తల్లి దండ్రులు కష్టపడి చదివించి ప్రేమతో పెంచి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపిస్తారు. అని."
సాంప్రదాయం అనే ముసుగులో లోబడి ఉంటూ పైగా తన వంశం అంటే అత్తగారి తరఫు (పుట్టినప్పటి నుండీ అక్కడే ఉన్నట్టు గా ) వంశ చరిత్రను మనకు వినిపిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని గొప్పగా సమర్ధించుకుంటూ ఉంటారు. తమకి లోబడి ఉన్న స్త్రీని ,ఆమెకెంత ఘనత ఉన్నా సరే ,కుటుంబ సభ్యులు గౌరవించరు. అందరు స్త్రీలు ఇలా ఉన్నారని కాదు .ఇలా కూడా కొంతమంది మధ్య తరగతి స్త్రీలు యాంత్రికంగా జీవిస్తున్నారు.
భార్య జ్ఞానంతో ,లోకానుభవంతో మాట్లాడిందా భరించలేడు భర్త. ఎంత పట్టించుకోకపోయినా లెక్క చేయకుండా, మౌనంగా బతకగలది స్త్రీ హృదయం ఒక్కటే.
అసలు స్త్రీకి ,ఇంట్లోనూ, బయటా అధికారాలు కాదు కావలసినది. స్త్రీకి తనమీద ,తన జీవితం మీద ,తన శరీరం మీద,మనసు మీద ,హృదయం మీద సంపూర్ణ అధికారం కావాలి .బానిసత్వం లో ఏదో అశాంతి .యాంత్రికంగా అన్నీ జరిగిపోతాయి. ఎన్ని బాధలున్నా సరే స్వేచ్ఛలోనే శాంతి.ఎన్ని కష్టాలున్నా స్వేచ్ఛ కోసం పోరాడాలి స్త్రీ. అందులోనే ఉంది శాంతి, సంతృప్తి.

8 comments:

Anonymous said...

కొందరు స్త్రీలకి తల్లిదండ్రుల ఇంట్లోకూడా ఇలాంటి పరిషితే ఉంటది ఉదాహరనకి మొన్న చనిపొయిన హారిక.
తండ్రి కూడా అమ్మాయిలు అన్ని తెలిసింట్టుమాడ్లితె సహించకుండా ఉంటరు.

లక్ష్మి said...

నిజమే ఇంతకన్నా కనాకష్టంగా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. మార్పు రావాలి అందరిలోనూ.

Kottapali said...

"కలవారి కోడలూ కలికి కామాక్షీ!"

Bolloju Baba said...

ఇలాంటి వారు చాలా చోట్ల కనిపిస్తా ఉంటారు. బయటే ఎందుకు మా సొంత చెల్లే ఈ విధంగా మారిపోయింది. మాట్లాడితే అత్తాగారు, మావగారు, వాళ్ళ వంశం వగైరా వగైరా.... బహుసా ఆవిధంగా సమాజం వారిని బ్రైన్ వాష్ చేసేస్తుందేమో? లేక వారి పట్ల మన గౌరవమర్యాదలు పెంచాలని అలా చెప్పుకొంటారో.
మా ఆవిడ వాళ్లింట్లో ఏమని చెప్పుకొంటుందో తెలియరాలేదనుకోండి. :-)

థాట్ ప్రొవోకింగ్ పోస్ట్.

Kathi Mahesh Kumar said...

"స్త్రీకి తనమీద ,తన జీవితం మీద ,తన శరీరం మీద,మనసు మీద ,హృదయం మీద సంపూర్ణ అధికారం కావాలి"

చాలా అడిగేసారు..అంతసులువుగా ఈ (పురుష)సమాజం ఇవన్నీ ఇచ్చెయ్యదులెండి. పోరాటం సాగుతూనే వుంటుంది.

Anonymous said...

ఈ రోజే మొదటిసారి మీ బ్లాగు చూశాను.
మీ టపాలన్నీ బాగున్నాయి.
ఇంక ఈ టపాకి వస్తే..
మీరు చెప్పిన సంఘటనలో
మనకు తెలియని చాలా
విషయాలు ఆమె ఆ విధంగా
ప్రవర్తించినట్లు చేసుండవచ్చు.
పెరిగిన వాతావరణ ప్రభావమైనా
అయ్యుండవచ్చు.
మార్పు రావాలని ఆశించటం తప్ప
ఇంకేమీ చెయ్యలేం.

Rajesh said...

tree_saves_u
Asalu mee ammayeelu pelli enduku chesukuntaro naaku artham kaadu...pelli chesukoka happy ga vundavachu kada mee salary..mee jeevitham...mee swecha mee ishtam...boys elagu vunnaru...friendship ki dieting ki etc ki aina poi poi thali kattinchukuntaru... malli adi ledu,idi ledu ani badhapadtharu...telisi chestharo, teliakachestharo mundu meeru alochinchandi...emi ontariga brathakalera...

plzzzzzzzzzzzzzzzzz society kosam ani mathram anoddu....

visalakshi said...

థాంక్యూ అనానిమస్ గారు తల్లిదండ్రుల వద్ద కూడా కొంతమందికి అంతంత మాత్రమే స్వేచ్ఛ నిజం
లక్ష్మి గారు కరెక్టుగా చెప్పారు. మార్పు అందరిలోనూ రావాలి.
కొత్త పాళీ గారు మీ కామెంటు కి తిరుగు లేదండి. బాగా చెప్పారు.
బాబా గారు మీ ఇంట్లో కూడా సొంత చెల్లెలు అలాగే ఉన్నారంటే భాధగా ఉంది. సమాజం కాదండి అతి జాగ్రత్త, మంచిపేరు కోసం బహుశా అలా చెప్పుకుంటారేమో ! అందులోనే తృప్తి ఉందేమో.
మహేష్ గారూ కరెక్టుగా చెప్పారు. ఎన్ని అడిగినా ఈ (పురుష) సమాజం ఇచ్చెయ్యదు లెండి .అని .కానీ ప్రయత్న లోపం లేకుండా పోరాటం సాగిద్దాం .
రాజేష్ మీ కామెంట్ సినీ దైలాగులా ఉంది.
bhavaani gaaru thaanksamDee.