Saturday, February 26, 2022 0 comments By: visalakshi

"నిజమైన యజమాని"

 *ఈలోకంలో మనకు నిజమైన ' యజమాని* ' *ఎవరు.??* 



శ్లో" నగురోరధికః కశ్చోత్రిషు లోకేషు విద్యతే !
    గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవోః సదాచ్యుతః !!

ముల్లోకములందును గురువుకు మించిన వస్తువు లేదు.బ్రహ్మ, విష్ణు, అవ్యయుడైన పరమాత్మ గురువే అయి ఉన్నాడు అని యోగ శిఖోపనిషత్తు తెలుపుతుంది.

మహాత్ముల మహిమ వర్ణనకు అందదు.వారితో పోల్చదగినదేది ఈ ప్రపంచంలో లేదు. వీరు అసమానులు. వీరికి  పేరు ప్రతిష్టలపై ఆశలుండవు. దేనినైనా సాధించగల అలౌకిక ప్రజ్ఞావంతులు. సమస్త ప్రాణకోటి ఆనందమే తమ ఆనందంగా భావించే మహాత్ములను పొందిన ఈ భరతభూమి ధన్యత చెందింది. మహాత్ములైన సద్గురు వల్లనే ఈ జగత్తు కొంతవరకు నిలదొక్కుకుంటోంది.


శ్లో" జీవన్ముక్తస్తు తద్విద్వా న్పూర్వోపాధిగుణాన్ త్యజేత్ !
      సచ్చిదానంద రూపత్వాత్ భవేద్భ్రమర కీటవత్ !!

ఉపాధులను , గుణాలను విస్మరించిన ఆత్మజ్ఞాని జీవన్ముక్తుండగుచున్నాడు.  తుమ్మెద యొక్క శబ్ధ సంసర్గముచే కీటకము తుమ్మెదగా మారునట్లు , జీవుడు నిరంతర బ్రహ్మ చింతనచే బ్రహ్మముగా మారుచున్నాడు. 


"***పరమాత్మ మన నిజమైన యజమాని."***





 

*ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.* 


 *ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.* 


 *దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది.అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.* 


 *అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది.* *ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.* 


 *ఈ స్థితిలో ఉన్న ఆ* *"ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.* 


 *కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,* 

 *" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,* 


 *నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..* 

 *అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం,* *నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది* 


 *అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.* 


 *అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,* 


 *"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు,* *సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను* *వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ* *బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి* *తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు* *లాగుతారు .?? అంది.* 


 *ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా* *చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని..* *వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ* *అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.* 


 *ఈ కథలో...* 


 *ఆవు* -  *సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo* .


 *పులి* -  *అహంకారం నిండిఉన్న మనస్సు.* 


 *యజమాని* - *సద్గురువు/పరమాత్మ.* 


 *బురదగుంట* - *ఈ సంసారం/ప్రపంచం* 


 *మరియు,* 


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : *నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడమo కోసం చేసే జీవన పోరాటం.* 


 *నీతి :* 


 *ఎవరిమీదా ఆధార పడకుండా జీచించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,* 


 *" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.* 


 *దీనినే* ' *అహంకారము* ' *అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.* 


 *ఈ జగత్తులో* *'సద్గురువు'*( *పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన* *మంచిని కోరుకునే వారు వేరే* *ఎవరుంటారు.?? ఉండరు.* 


 *ఎందుకంటే.??* *వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.* 


 *పరమాత్మా నీవే ఉన్నావు...!* 

 *అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!*


              ***సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..***

Thursday, February 17, 2022 3 comments By: visalakshi

కృష్ణ తత్వం.. మహత్యం

                    సర్వవ్యాపినమీశ్వరం....




ధ్యానం.... భగవధ్యానం చేసుకోడానికి ఏకాంతంగానూ ,పవిత్రంగానూ ఉండే ప్రదేశం కావాలి. అక్కడ ఎట్టి విఘ్నాలు ఉండకూడదు. ఏ కోలాహలం ఉండరాదు. ప్రశాంత స్థానం కావాలి. ఆసనంగా దర్భాసనం , తివాచీ వంటి దానిని కానీ ఉపయోగించుకోవాలి.సుఖంగా పద్మాసనం కానీ స్వస్తికాసనం గానీ వేసుకుని కుదురుగా కూర్చోవాలి. స్థిరంగా సుఖంగా అచంచలంగా ఎక్కువ సేపు కూర్చునే విధంగా ఉండాలి. శరీరము నిట్టనిలువుగా ఉండు విధముగా కూర్చోవాలి.
సంసారం క్షణభంగురం అని గుర్తించి ఆసక్తి ని పరిత్యజించి ధ్యానం చేయాలి. భగవానుడు నిర్గుణ నిరాకార రూపంలో సర్వదా , సర్వత్రా ఉన్నాడు. భగవానుడు సగుణ నిరాకారూపంలోనూ ,తరువాత సగుణ సాకారూపంలోనూ ప్రకటం అవుతూ ఉంటాడు. సగుణము ,నిర్గుణము ,సాకారము ,నిరాకారము అన్నీ ఒకే భగవానుని విభిన్నరూపాలు.
సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ భక్తులకు  సగుణ సాకారూపంలో ప్రకటమౌతాడు...భక్తుల ప్రేమ కారణంగా ఈ లీలను ప్రదర్శిస్తాడు భగవానుడు.

భగవంతుని గూర్చి తెలుసుకోవాలనుకొని అన్వేషిస్తూ ఉంటే భగవంతుని సృష్టిలోని ప్రతి లీలలోనూ పరమార్థం కనిపిస్తుంది.

గాలి వీచడంలోను, నదీజలాలు పారడంలోను ఎన్నో నిగూఢార్థాలు కలిగిఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టిలో ఏవస్తువు కూడా పనికిరానిది అంటూ ఏదీ లేదు. ఏ కారణం లేకుండా ఏ జీవి పుట్టదు. వస్తువైనా, అ వస్తువైనా దానికోసం ఏదో ఒక కారణంగా అది ఏర్పడుతోంది.

ఎపుడైతే కారణం అయిపోతుందో అపుడు ఆ ప్రాణి అదృశ్యవౌతుంది. అంటే అవి వచ్చిన లేక చేయవలసి పని అయిపోతే చాలు అవి కనిపించకుండా కాలగర్భంలో కలసిపోతాయి

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసిన ఎన్నో అద్భుత లీలలున్నాయి. శ్రీకృష్ణుడు చేసిన ఏ పనికైనా సరే అంతరార్థం మరొకటి ఉంటుంది. అవి తెలుసుకొంటే భగవంతుని తత్వమేమిటో కొద్దిగా తెలిసే అవకాశం ఉంది అనిపిస్తుంది.

అమ్మ దగ్గరపాలు తాగే వయస్సులో తనకు పాలిచ్చినట్లుగానే ఇచ్చి ప్రాణాలు తీద్దామని వచ్చిన పూతనను సంహరించాడు. అంటే - ‘పూతము’ అనగా పవిత్రము. పవిత్రము కానిది పూతన. అనగా అజ్ఞానము, అవిద్య, పవిత్రమైనది జ్ఞానము. అజ్ఞానమువలన వాసనలు బయలుదేరుతాయి. పూతన వాసనా స్వరూపమే.

పూతన రాక్షసి చిన్ని కృష్ణుడిని చంపడానికొచ్చింది. కంసుడే ఆ ఆడబూచిని పంపాడు. రవిక ఒదులు చేసుకుని, ‘రారా కృష్ణా!’ అని పిలవగానే బిరబిరా వెళ్లాడా బిడ్డడు. ‘పాలకుండలనుకుని ఆబగా జుర్రుకుంటున్నాడు. కాలకూట భాండాలని తెలియదు కాబోలు’ అనుకుంది పూతన. దేవతలకే అమృతాన్ని పంచి ఇచ్చినవాడికి, పచ్చి విషపు ఆలోచనలు తెలియకుండా ఉంటాయా? నవ్వుకుని ఉంటాడు! ఎంత రాకాసి అయినా అమ్మే కదా! చనుబాలిస్తూ రెప్పపాటు సమయం మాతృత్వ తన్మయత్వాన్ని అనుభవించింది. చాల్చాలు. ఆ కాస్త ప్రేమ చాలు. మహామహా యోగీంద్రులు యజ్ఞయాగాలు చేసి ‘కృష్ణార్పణం’ అన్నంత ఫలం ఆమె ఖాతాలో జమైపోయింది. కృష్ణప్రేమలోని గొప్పదనమే అది. పూతన ఒంట్లోని విషాన్నంతా సర్రున జుర్రుకున్నాడు. రాక్షసి అంటేనే నిలువెల్లా పాషాణం. కృష్ణయ్య చేదునంతా మింగేశాక...పూతనతోపాటే పూతనలోని రాక్షసత్వమూ చచ్చిపోయింది. శవాన్ని వూరవతల తగులబెడుతుంటే, అద్భుత పరిమళాలు! కృష్ణ ప్రేమ తాలూకు సువాసనలవి.

ఈ వాసన మన దేహంలో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రిములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను పదు నాలుగు స్థానములలో తిష్ఠవేసి ఉంటుంది. మాయ త్రిగుణాత్మకం. 

మనం సంసారం అనే బండిలో భగవంతుణ్ణి మన రథసారథిగా చేసుకుంటే ఇంద్రియములు అనే గుఱ్ఱాలు సక్రమంగా నడుస్తాయి.

శకటాసుర భంజనంలో అంతరార్థం ఇదే.

ఒకసారి శ్రీకృష్ణుడు యశోదను తనకు పాలివ్వమని అల్లరిచేస్తూండసాగాడు.

అదే సమయంలో పొయ్యిమీద పెట్టిన పాలు పొంగితే యశోద అటు పరిగెడుతుంది. ఇక్కడ సామాన్య జీవికి భగవంతుని యందు భక్తికంటే ఇహముపై అనురక్తి ఎక్కువ అని తెలుసుకోవాలి. 

శ్రీకృష్ణుడు రాతితో పెరుగు కుండ పగులగొడతాడు. యశోద కోపముగా కఱ్ఱ తీసుకొని అతని వెంటబడుతుంది. ఇక్కడ కఱ్ఱ అభిమానానికి, గర్వానికి ప్రతీక.

యశోద అలసిపోయి నిస్సహాయత ప్రకటించగానే శ్రీకృష్ణుడు ఆమెకి దొరికిపోతాడు. అహంకారం, అభిమానం, గర్వం విడిచిపెట్టి తనను సేవిస్తే తాను బంధీనవుతానని పరమాత్మ చెప్పకయే చెపుతాడు.

ఒకసారి శ్రీకృష్ణుడు అల్లరి మితి మీరుతోందని భావించిన యశోద త్రాటితో బంధించటానికి ప్రయత్నిస్తుంది. కాని త్రాడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది.అంటే ఆ రెండు అంగుళముల త్రాడే అహంకార, మమకారములు. అహంకార, మమకారములు కలవారు తన దరి చేరజాలరని కేవలము ప్రేమ అనే రజ్జువుకే తాను బందీనవుతానని భగవానుని చెప్పాడన్నమాట.

గోపికా వస్త్రాపహరణలో కూడా ‘లౌకిక సంస్కార శూన్యులై ఉన్న మీరు మాయ అనే తెరను (వస్తమ్రులను) తొలగించి నా దగ్గరకు రండి. మీ మోహమనే తెరను నేను తొలగిస్తాను’ అని భగవంతుడు చెబుతున్నాడన్నమాట

ఓ ఉప్పు బొమ్మకు సముద్రం లోతులు చూడాలన్న కోరిక కలిగింది. ఆత్రుత కొద్దీ దూకేసింది. నీళ్లలోకి వెళ్లగానే తానెవరో మరచిపోయింది. తనెందుకొచ్చిందీ మరచిపోయింది. కరిగి కరిగి సముద్రంలో భాగమైపోయింది. కృష్ణ ప్రేమా అలాంటిదే. ఎవరు ఏ రూపంలో ఆయనకు తారసపడినా.... చివరికంతా కృష్ణప్రేమాంబుధిలో కలసిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. కృష్ణ...అన్న మాటకు ఆకర్షించేవాడన్న అర్థమూ ఉంది. గోపికలు వలపు భావనతో దగ్గరయ్యారు. మహర్షులు తపస్సుతో దగ్గరయ్యారు. కంసాది రాక్షసులు శతృత్వంతో దగ్గరయ్యారు. పాండవులు భక్తితో దగ్గరయ్యారు. ఎవరిదారులు వారివే. గమ్యం మాత్రం ఒకటే - కృష్ణుడే.

మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికీ అధిపతి. పద్నాలుగేళ్ల పసివాడు...అన్న బలరాముడితో కలసి కంసమామ చేపట్టిన ధనుర్యాగానికి బయల్దేరాడు. రథం దిగి వీధుల్లో నడుస్తుంటే, మధురానగరమంతా ‘అధరం మధురం, వదనం మధురం...’ అంటూ కృష్ణ సౌందర్యాన్ని కీర్తించింది. ఓ నిరుపేద నేత కళాకారుడిచ్చిన బట్టల్ని ప్రేమగా అందుకున్నాడు. తానే వెళ్లి మాలలు కట్టుకుని బతికే సుధాముడి తలుపుతట్టాడు. కుబ్జ పూసిన మంచిగంధాలకు మురిసిపోయాడు. భక్తి, ముక్తి, అనురక్తి...ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చాడు. ఎవర్నుంచి అందుకోవాల్సిన ప్రేమను వాళ్ల నుంచి అందుకున్నాడు.

పరమ రాక్షసుడైన కంసుడు కూడా తనకు తెలియకుండానే కృష్ణప్రేమలో పడిపోయాడు. కృష్ణుడు మధురలో కాలుపెట్టాడని తెలిసిన మరుక్షణమే.భయంతో సగం చచ్చిపోయాడు. అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు, కృష్ణుడొస్తున్నట్టు అనిపించేది. పూల సువాసనలు నాసికాన్ని తాకగానే...వైజయంతీమాల పరిమళమేమో అన్న భ్రమ కలిగేది. ఎవర్ని ఎవరు పిలిచినా, ‘కృష్ణా’ అన్నట్టు చెవినపడేంత చిత్త చాంచల్యం. బాలకృష్ణుడు రానేవచ్చాడు. ముద్దుగారే బాలుడు గుండెల మీద కూర్చుని పిడిగుద్దులు గుద్దుతుంటే, ‘చంపొద్దు కృష్ణా..వదిలిపెట్టు కృష్ణా...’ అంటూ మృత్యుభయంతో మెలికలు తిరిగిపోయాడు. కలవర పాటులో అయితేనేం, తలుచుకున్నాడు కదా! ఆ కాస్త స్మరణకే పొంగిపోయి, మేనమామకు ముక్తినిచ్చేశాడు కృష్ణస్వామి.

ఇన్ని విధాలుగా చెబుతూ మనలను భగవంతుని గూర్చి తెలుసుకోమని భగవంతుడే చెబుతున్నాడు. 

కాని భగవంతుని మాయ లో చిక్కిన మనం మాత్రం మాయామోహితులయ దుర్లభమైన మానవ జన్మను వృథాచేసుకొంటున్నాం.

కనుక ఇక నుంచైనా భగవంతుని చింతన చేద్దాం..🙏


                     కృష్ణం వందే జగద్గురుమ్🙏




               *** జయ జనార్ధన కృష్ణా రాధికా పతే ....***


జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…

నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే… మదన కోమలా కృష్ణా మాధవా హరే

వసుమతీ పతే కృష్ణా వాసవానుజా… వరగుణాకర కృష్ణా వైష్ణవాక్రుతే…

సురుచిరానన కృష్ణా శౌర్యవారిదే… మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా

విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణా కామ్యదాయకా…

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

విమల గాత్రనే కృష్ణా భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణా కరుణ కోమలం

కువల ఏక్షణా కృష్ణా కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణా శరణామాశ్రయే…

భువన నాయకా కృష్ణా పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణా నళినలోచనా

ప్రణయ వారిధే కృష్ణా గుణగణాకరా… దామసోదర కృష్ణా దీన వత్సలా

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

కామసుందరా కృష్ణా పాహి సర్వదా… నరక నాశనా కృష్ణా నరసహాయకా

దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…

పావనాత్మక కృష్ణా దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణా శ్యామ కోమలం

భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణా శ్రీహరి నమో

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

భక్తదాసనా కృష్ణా హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణా శలహెయ విభో

గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…

 జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…

నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే…

జన విమోచనా కృష్ణ జన్మ మోచనా...


          *** ....సర్వం శ్రీ సాయి కృష్ణార్పణ మస్తు...***


Tuesday, February 15, 2022 1 comments By: visalakshi

సంకల్పశక్తి...

               ఓం శ్రీ నారాయణాయ నమో నమః


శ్లోకం:  కిం నామ రోదిషి సఖే త్వయి సర్వ శక్తిః

           ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపం!

           త్రైలోక్యమేతదఖిలం తవపాదమూలే

            ఆత్మైవ హి ప్రభవతి న జఢః కదాచిత్ !!

భావం:-" ఓ స్నేహితుడా! ఎందుకు ఏడుస్తున్నావు? శక్తి అంతా నీలోనే ఉంది. నీ సహజ స్వభావమైన దివ్యత్వాన్ని ఎలుగెత్తి పిలువు. ముల్లోకాలూ నీ పాదాల ముందు సాగిలపడతాయి.

ఎందుకంటే ఆత్మ అన్నదే శాశ్వతంగా నిలబడుతుంది కానీ జడపదార్ధమైన ఈ శరీరం కాదు సుమా!"


సంకల్పశక్తి అనేది ఆత్మ, మనస్సుల కలయికతో ఏర్పడిన సమ్మేళనం. పని చేయడానికి క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ సంకల్పశక్తి ని పెంచుతుంది. ఆత్మ శక్తే సంకల్పశక్తి. అభ్యాసం ద్వారా సంకల్పశక్తి ని పెంచుకోవడం సాధ్యపడుతుంది. మన అపజయాలు భౌతిక స్థాయి లో ఉండేవే! అవి తాత్కాలికమైనవి.
ఆత్మయొక్క స్థాయిలో దివ్యత్వం ఎల్లవేళలా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది.

                 ***సంకల్ప బలం....***

సంకల్పబలం జ్ఞాన శుధ్ధతతో వచ్చేది. మనం అనుకున్నవి సాధించాలి అంటే సంకల్పబలం అనివార్యం.

ఈ సంకల్పశక్తిని  దేవాలయ నిర్మాణంకై జ్ఞాన శుధ్ధతతో ఆత్మ విశ్వాసంతో 2010నుండి అనేక విధాలుగా ప్రయత్నించాం...అనివార్య కారణాల రీత్యా ప్రయత్నం విరమించాం.ఎందుకంటే వికల్పశక్తి ఆపేసింది..అంటే అనుమానం... సందిగ్దత గల వ్యక్తిత్వం...గల శక్తులు మా..మా అహంభావాలు.. ఇత్యాది కారణాలు...

మన సంకల్పశక్తి పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్పబలం ఉన్నవారితో మన సాంగత్యం పెరగాలి. ఆత్మ శక్తిని వినియోగించుకోమని పలు సందర్భాలలో బాబాగారు చెప్పారు.

యాంత్రిక జీవితానికి సంబంధించిన విషయాలు లో లీనమై సంకల్పం ను పక్కన పెట్టాము.మా సంకల్పం నెరవేరాలంటే దాని తీరు తెన్నులను ఆకళింపు చేసుకుని.కారణ...కార్య సిధ్ధాంత అనుభవాన్ని సంపాదించుకోవాలి.

అచిర కాలంలో సంకల్పసిధ్ధి కై పూనుకోవాలి.అవరోధాలను సంకల్పబలం తో అధిగమించడానికి బాబా దివ్య ఆశీస్సులు కూడా మాకు ఉండాలి అని వారికి నమస్సులతో విన్నవించుకుంటున్నాను.



*"కల్పించుకునే ఆనంద దుఃఖాల కన్నా..పరమాత్మ సన్నిధిలో ఆత్మమయ సంతృప్తి తో లీలాగానముతో మైమరిచి తానైక్యమవడం..అద్భుతంగా ఉంటుంది.."**

                    **ఓం శ్రీ సాయి నాధాయ నమః**





రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.


ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.


తర్వాతి రోజుల్లో‌ ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో‌ బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.


కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. 

కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చాడు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.


తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.


ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీ‌బుద్ధునికి-అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!


వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.


ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం‌ నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.


'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.


దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.


ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.


తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలో‌ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.


మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!

ఈ పై కధ FB నుండి సేకరణ...

                 #ఓం నమో నారాయణాయ🙏