Saturday, October 29, 2016 By: visalakshi

పక్షపాత రహితుడు పరమాత్మ

 శ్రీ సద్గురు సాయినాధాయ నమో నమ:

 శ్లో" సమో2హం సర్వభూతేషు న మే ద్వేష్యో2 స్తి న ప్రియ:!

    యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం!!...9అ"..29శ్లో

 భా:- నేను అన్ని ప్రాణులపట్లను సమానుడను. నాకు ద్వేషించదగినవాడు లేడు..ఇష్టుడును లేడు. ఎవరైతే నన్ను భక్తితో ఉపాసించుచున్నారో వారు నా యందున్ను, వారి యందు నేనున్ను ఉంటున్నాము.


ఆనంద పరిపూర్ణులు, జ్ఞాన ప్రతిరూపులు, సమర్ధ సద్గురులైన మీకు వందనములు బాబా!భయాన్ని నాశనం చేసి, కలియుగంలో ఉత్పన్నమయే దుష్టవాసనలను సమూలంగా దగ్ధం చేసిపారేసే మీరు ఆనందామృత సాగరమే! బాబా మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యమూ పట్టుకోదు. మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకొని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. సాక్షాత్ శుద్ధజ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు.బాబా! అనేకమంది భక్తులు మీ దర్శనానికొస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెలనిండా పొంగిపొర్లే ప్రేమతో సుఖాన్ని పొందుతారు.ఆ చరణాలు ఎలా ఉంటాయని! చంద్రుడికి వృక్షశాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదం బొటనవేలుని పట్టుకొని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం పదిహేనవరోజు అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడచిపోగానే చంద్ర దర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగా కోరిక ఉంటుంది. అలాగే బాబా! భక్తుల కోరికను ..ఎడమ మోకాలుమీద కుడిపాదం పెట్టికూచున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమచేతి చూపుడువేలు, దాని పక్కనున్న మధ్యవేలు, ఈ రెండు వేళ్ళు అనే చెట్టు రెండు కొమ్మల మధ్యప్రదేశంలో పాదం వేళ్ళు పట్టుకొని ఉంటారు.







 ఆ పాదం బొటనవ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై గంగా-యమునలను ప్రకటం చేసి దాసగణుని తృప్తి పరిచారు.ఇక్కడ మా గృహమునందు బాబా చూపిన మహత్యం మరొకసారి మీ ముందు...


సాయి ప్రభూ! పూర్వజన్మ సుకృతమా, మాకి౦తటి అదృష్టమా!"అలనాడు దాసగణు మహరాజ్ ని కరుణి౦చి పాదము బొటనవేలును౦డి గ౦గా, యమునల ప్రవాహాన్ని చూపినావని సచ్చరిత్రలో చదివి ధన్యులమయ్యాము." ఈనాడు మా సోదరి చె౦త  అనుక్షణ౦ సాయినాధుడు తమ అద్భుత లీలలతో అలరిస్తున్నవైన౦ ఏ విధ౦గా మాటలలో పొదిగి మీకు వివరి౦చాలో తెలియని అల్పప్రాణిని నేను! అయినా సృష్ఠి, స్థితి, లయ కారకుడు శ్రీ సాయి నా చేత రాయిస్తున్నారన్న ధైర్య౦ నాలో మీకా అద్భుత౦ చెప్పాలన్న ఆకా౦క్ష రేపుతో౦ది.


శుక్రవార౦ మధ్యాహ్న౦ సోదరి ఫోనులో ఎ౦తో అనుభూతితో,అమిత ఆన౦దాతిశయ౦తో విభూధి బాబాగారి వెనుక వున్న చ౦దన చర్చితులైన బాబాగారి ను౦డి తీర్ధ౦ వస్తో౦ది. త్వరగా బయలు దేర౦డి అని చెప్పారు. మా శ్రీవారు ఆఫీసులో వున్నారు. మా సోదరి ఆఫీసుకి ఫోను చేసి "బావగారూ" నేను కళ్ళారా చూసాను లిప్తపాటు సెకనులో బాబాగారి  బొటనవేలు  ను౦డి బొట్టు,బొట్టుగా తీర్ధ౦ వస్తో౦ది. రెప్పవేయకు౦డా చూసాను మళ్ళీ కనిపి౦చలేదు.కానీ తీర్ధ౦ వస్తో౦ది.అని ఆత్ర౦గా వివరి౦చగా మావారు వె౦టనే ఒక సహౌద్యోగుని వె౦ట తీసుకుని సోదరి ఇ౦టికి వచ్చారు. చ౦దన౦ ర౦గులో వున్న తీర్ధాన్ని  చూసి తరి౦చి,ఒక ఐదు ని"లు మావారు ధ్యాన౦ చేసుకుని బయటకు వచ్చారు. మా సోదరి  వెళ్ళి చూచు సరికి గిన్ని ని౦డా తీర్ధ౦ ఉద్భవి౦చి౦ది."ఈ విధ౦గా ఉనికిని చూపిస్తూ అద్భుతమైన అనుగ్రహాన్నిమనకిస్తున్న శ్రీ సాయి నాధునికి" మనమ౦తా కలిసి" సేవలు"చేద్దా౦.అనిమాశ్రీవారు సోదరికి  భరోసా ఇచ్చారు.తీర్ధ౦  స్వీకరి౦చి వారిరువురు ఆఫీసుకి వెళ్ళారు.ఆ సమయానికి మేము కూడా అక్కడికి చేరాము.అ౦తటి మహిమాన్విత గ౦గా,యమున,త్రివేణీ్స౦గమలనుచూసిన ఆన౦ద౦లో అ౦దర౦ ఆ కరుణాబ౦ధుసాష్టా౦గప్రణామాలతో,పాదాభివ౦దనా
లు చేసాము అ౦దర౦ తీర్ధాన్నిస్వీకరి౦చాము.భక్తులు తీర్ధ౦ తీసుకున్నారు ఎ౦త మధురాతి మధుర౦. "చ౦దన౦,తేనె,తులసితీర్ధ౦ అన్నీ మిళితమైన సుగ౦ధామృత౦.బాబాగారి పాదోదక౦."ఆ అమృతాన్ని సేవి౦చి అ౦దర౦ పునీతులైనాము. ఇ౦తటి అదృష్టాన్ని మాకు ప్రసాది౦చిన శ్రీ సాయి చరణామృతాలని శరణు వేడుతూ....

ఈ రోజు (21-04-2011) మా సోదరి, నేను ఈ విషయ౦ అ౦తా చర్చి౦చుకుని, సాయ౦త్రము 6.30 గ౦"లకు బాబాగారికి  ధూప్ ఆరతి పాడుతున్న తరుణ౦లో మా ఇ౦టిలో ఒక అత్య౦త అద్భుత౦ జరిగి౦ది. మా సోదరి  మామిడిప౦డ్లు నైవేద్య౦ పెట్టిన తదుపరి వెళ్ళి చూడగా మా పూజా మ౦దిర౦లో బాబాగారి పాదమును౦డి "తీర్ధ౦" ప్రసాది౦చారు."మా పాప,బాబు సచ్చరిత్ర పారాయణ౦ మొదలు పెట్టిన ఈ రోజు తీర్ధ౦ ప్రసాది౦చడ౦....."
ఆతీర్ధ౦తో తడిసిన అక్ష౦తలు,ఆతీర్ధ౦ మిళితమై ఉన్న ఆ దృశ్య౦ చూసి మా కుటు౦బసభ్యుల౦ ఆశ్చర్య చకితులమై, ఆన౦దాతిశయాలతో బాబాగారికి మ౦గళారతులు  పాడుతూ,  పాదాభి వ౦దన౦ చేసి,ఆ మహిమాన్విత తీర్ధాన్ని అ౦దర౦ స్వీకరి౦చా౦. అద్భుతమైన , అనిర్వచనీయమైన ఆన౦దాన్ని పొ౦దాము.తెలిసిన భక్తులని పిలిచి తీర్ధాన్ని స్వీకరి౦చమని ఇచ్చాము.
మా సోదరి సాయినాధుని "ధ్యాని౦చి "  వివర౦ తెలుపుమనగా...సాయిప్రభు అమృత పలుకులు ఇవి.

" మీరిరువురూ తీర్ధ౦ గురి౦చి మాట్లాడుకున్నారుగా! " "అదే ఈ తీర్ధ౦" అని పలికారుట.

 ఆ పాదం బొటనవ్రేలుది ఎంత మహిమ..  ఇలా ఎందరికో ఎన్నో అనుభవాలున్నాయి..ఆనాడూ..ఈనాడూ...ఆనాటి హేమాడ్ పంత్ గారి అనుభవం వారి మాటల్లో... 

 కాకాసాహెబు దీక్షిత్ ప్రతిరోజూ పగలు ఏకనాధభాగవతం, రాత్రి భావార్ధరామాయణము గ్రంధపఠనం చేసేవాడు. ఈ రెండు గ్రంధాలు పరమార్ధాన్ని సాధింపచేయగల సారసర్వస్వాలు.ఈ గ్రంధాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి - ఈ మూడు గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటుంది. 

సాయికృపతో దీక్షిత్ కధను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది.పగలు భాగవతం, రాత్రి రామాయణం వినే అవకాశం లభించింది. అలా ఓ రోజు రాత్రి ఆ పరమపవిత్ర కధ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఓ విచిత్రం జరిగింది. రామాయణంలోని ఓ రసభరిత సన్నివేశం ..హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకొన్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టమొచ్చి దేహం మీద  పడింది. రామబాణం కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిర తిరగసాగాడు. అతని ప్రాణం కకావికలైపోయింది. అప్పుడక్కడికి అతని తండ్రి (వాయువు) వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కధలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన చిత్రాన్ని వినండి. శ్రోతలందరూ శ్రవణానందంలో మునిగిపోయారు. అప్పుడొక 'తేలు 'అనే మూర్తీభవించిన విఘ్నమే ఉత్పన్నమైంది.దానికి కధను వినటంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో! అది ఏ మాత్రం తెలీకుండా నా భుజమ్మీదకు దూకి రహస్యంగా దాక్కొని కధారస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూచుంది.అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలుని నేను చూసుకోలేదు. అయితే హరికధను వినటంలో తత్పరులైన వారి సంరక్షణను  బాబా స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటు పోయి చూసే సరికి నా కుడిభుజం మీది ఉత్తరీయంపై ఆ భయంకరమైన తేలు ఎంచకా హాయిగా కూచుని ఉండటం కనిపించింది.అసలది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంధాన్ని వినే శ్రోతలా తన స్థానంలో హాయిగా కూచుని ఉందా అన్నట్లుంది. జాతి స్వభావాన్ననుసరించి ఊరికే కొండిని ఏమాత్రం అటూ ఇటూ కదిల్చినా దాంతో నేను బాధ కలిగి ఉండేవాణ్ణి. రామకధలో అందరూ లీనమై ఉన్నారు..దానివల్ల అందరికీ రసభంగమై ఉండేది. రామకధ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ఏమీ ప్రభావం ఉండదు. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది. ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చంచల బుద్ధిగల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకొనే ఆ ఉత్తరీయం రెండు కొసలూ కలిపి కట్టాను. తేలుని గట్టిగా మూటకట్టి తోటలోకి తీసుకువెళ్ళి జారవిడిచాను.తేలు తన జాతి మూలంగా మహా భయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమైనది. కనుక దాన్ని చంపటానికి చేయి ముందుకు రాలేదు. అదినాకు హాని చేయలేదు..నేనూ దానికి హాని తలపెట్టలేదు.అందరియందు సమబుద్ధి కలిగి ఉంటానని పరమాత్మ చెప్పాడు. మానవులే కాదు సమస్తభూతాలు నాకు సమానమే! కానీ ఎవరైతే ఈ ప్రపంచంలో ఉండే ఇతర ప్రాణకోటికి, ఈ ప్రకృతికి కూడా హాని కలిగించాలని ప్రయత్నం చేస్తే మాత్రం భగవంతుడెప్పుడూ సహించడు. తనను ప్రేమతో సేవించేవారి హృదయాలలో తానుంటానని రక్షణ తానేనని వాగ్ధానం చేస్తాడు.పాముకానీ,తేలుకానీ ఏదయినా ఆయన ఆజ్ఞతోనే ప్రాణులన్నీ వ్యవహరిస్తాయి. ఆయన ఆజ్ఞను అతిక్రమించవు. కనుక ప్రతి ప్రాణిపైన దయ, ప్రేమ ఉండాలి.పక్షపాత రహితుడు పరమాత్మ. అందరినీ రక్షించే ఆ శ్రీహరే శ్రీ సాయిబాబా.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

0 comments: