సమతన్ స్నేహముచే సుతత్వమును,విశ్వాసంబు చేతన్ సఖి
త్వము,జాలన్ హితవృత్తి చేతన్ సుహృత్త్వంబున్, సుమంత్రోపదే
శముచేతన్ నిజదేశికుం డనగ నిచ్చల్ పూజ్యుడౌ నిష్టదై
వమునై వారికి కాలచక్రభయముల్ వారింపుదుం....
భా:-" సర్వసముడనైన నేను స్నేహం వల్ల కుమారుని వలెనూ, విశ్వాసము వల్ల చెలికాని వలెనూ,హితం చేకూర్చటం వల్ల ఆత్మీయుని వలెనూ, మంత్రం ఉపదేశించటం వల్ల ఆచార్యుని వలెనూ ఉంటూ వారికి నిత్యమూ పూజింపదగిన ఇష్టదైవాన్నై;కాలచక్రం వల్ల భయం కలగకుండా వారిని కాపాడుతూ ఉంటానని " అభయమిస్తూ...భక్తుడి భావాన్ని బట్టి భగవంతుడు తన అనుబంధాన్ని పెనవేసుకుంటాడు.
1. ఎవరికీ తలవంచని మనస్తత్వంతో, స్వతంత్రభావాలతో, ఋజువర్తనతో ఆత్మగౌరవానికి,విలువలకు కట్టుబడి ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆత్మాభిమానంతో మెలగాలి.
2. అహంభావంగా వ్యవహరించకుండా ,బాధ్యతల విషయంలో నిక్కచ్చిగా ఉండాలి.
3. అంతరాత్మ ప్రభోదముతో మన వ్యక్తిత్వాన్ని,ఆత్మాభిమానాన్ని చాటుకోవాలి.
4.మనలోచాలామందికిఆత్మాభిమానం(Selfrespect)కి,అహంకారాని(egotism )కి తేడా తెలియదు. ఆత్మాభిమానం పేరుతో అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అణకువ,నమ్రత పేరుతో ఆత్మన్యూనతతో తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. రెండూ హర్షణీయం కాదు.
5. ఆత్మ గౌరవం అత్యున్నతమైన గుణం. ఎక్కడా రాజీపడకూడదు. మన గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే ,ఎదుటివారిని గౌరవించాలి. -ఎదుటి వారిని గౌరవించే ప్రక్రియలో నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు.
6. ఇతరులకు సముచితమైన గౌరవాన్ని ఇస్తూ,మన ఆత్మాభిమానానికి భంగం కలగకుండా నడుచుకోవడం ఆదర్శవ్యక్తిత్వానికి చిహ్నం. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుంది.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
1 comments:
Nice post... Veda garu.
Post a Comment