ఓం శ్రీ లక్ష్మీనృసింహాయ నమ:
భోగీంద్ర భోగమణి రాజిత! పుణ్యమూర్తే! /
యోగీశ! శాశ్వత! శరణ్య! భవాబ్ధిపోత!
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలమం //
' శ్రీమంతమైన పాల సముద్రంలో ఉండువాడా!చేతియందు సుదర్శన చక్రాన్ని ధరించినవాడా! శ్రేష్ఠమైన ఆదిశేషుని శరీరంపై పవ్వళించి ప్రకాశించువాడా! పుణ్యవిగ్రహా! యోగీశ్వరుడా! శాశ్వతుడా! శరణునొసంగువాడా! సంసారసముద్రాన్ని దాటించే నౌక అయినవాడా!ఓ లక్ష్మీనృసింహా! నాకు చేయూతనిచ్చి కాపాడుము '.
2011 లో "శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం" ప్రారంభించాము.
స్వామిసేవాకార్యక్రమాలను నిర్వర్తిస్తూ,పూజలు,స్తోత్రపఠనం,సంకీర్తనలద్వారా భగవంతుని పట్ల భక్తులు భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే మార్గం 'భక్తియోగం'.
భక్తియోగం ద్వారా మన హృదయపద్మంలో పరివేష్టితుడై ఉన్న పరమాత్మను దర్శించడానికి హృదయ పవిత్రతను సాధించాలి. అచట ఆసీనుడై ఉన్న పరమాత్మను నిరంతరం ఉపాసించాలి.
అని ప్రెసిడెంటు శ్రీ సూర్యప్రకాష్ గారు సత్సంగ సభ్యులకు ప్రబోధిస్తూ,"ఐకమత్యంతో కలిసి పనిచేద్దాము,అందరం ముక్తకంఠంతో ఏకాభిప్రాయులై ఉందాము, మన సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక! మనమధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనాలి. అని ప్రతిజ్ఞ చేసి సత్సంగసభ్యులందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండి శ్రీ సాయినాధుడు ఆదేశించిన దేవాలయ నిర్మాణమునకై భక్తితో సంఘటితంగా కలిసి పనిచేయాలని సంకల్పించుకున్నాము.
" నేను ,నాది " అనే అహంకార మమకారాలే మన అజ్ఞానానికి కారణం. ఈ అజ్ఞానం తొలగిపోతే 'ఏకత్వభావన ' కలుగుతుంది. 'బ్రహ్మసత్యం,జగన్మిధ్యా అనే వివేకాన్ని పొందడమే జ్ఞానయోగం."అంతర్గతంగా ఉన్న దివ్యాత్మను వ్యక్తపరచడానికి,ఉపాసన ద్వారా గానీ, తత్వజ్ఞానం ద్వారా గానీ ఆత్మసాక్షాత్కార మార్గాన్ని అభ్యసించి ముక్తుడవుకమ్ము"అని స్వామి వివేకానంద ప్రబోధించారు."
"సంఘటిత శక్తికి మూలసూత్రం ప్రేమ." 'సేవకుడనే భావంతో పనిచేయాలి గానీ, నాయకుడననే అహంకారంతో వ్యవహరిస్తే ఇతరుల సహకారం లభించదు. కార్యనిర్వహణలో ప్రతి ఒక్కరూ ముఖ్యమేనన్న భావనతో మెలగాలి.'ప్రేమ నటిస్తూ,వారి వెనుక చెడుగా మాట్లాడడం కన్నా పాపం మరోటి లేదు.విభేదాలకు అసలు కారణం ఈ అవలక్షణమే!
అసూయ,ద్వేషాలు లేకుండా మనమంతా స్వామి నిర్దేశించిన మహత్కార్యాన్ని,సంఘటిత కార్యాచరణ ద్వారా నిర్వహించడానికి కృషిచేద్దాం.మానవజన్మ లక్ష్యమైన భగవత్సాక్షాత్కారాన్ని పొంది తరిద్దాం.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
1 comments:
అద్భుతంగా చెప్పారండి.
Post a Comment