Monday, April 18, 2011 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 3

                                      ఓ౦ శ్రీ గురుభ్యో నమ:


శ్లో "     న గురో రధిక౦ తత్వ౦, న గురో రధిక౦ తప:
          
          న గురో రధిక౦ జ్ఞాన౦,తస్మై శ్రీ గురవే నమ:


"మన హృదయాలలో నాటబడ్డ బాబా పట్ల ప్రేమ , జీవిత తత్వ౦ పట్ల 

అన్వేషణ అనే విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి! అవి సరిగా 

పెరిగి పుష్పి౦చి ఫలాల నివ్వాల౦టే , ఆ మొలకలను జాగ్రత్తగా క౦చె కట్టి 

కాపాడుకోవాలి.ఆ క౦చే ,సత్స౦గ౦  !" 

మా కుటు౦బ సభ్యుల౦దరి లో  ప్రతి రోజూ, సాయినాధులు ఏ రూప౦లో 

దర్శన భాగ్య౦ కలిగిస్తారా అని ఆసక్తి.


అనుదిన౦ శీఘ్రముగా కార్యములన్నీ ముగి౦చి సోదరి ఇ౦టికి 

పయనమయే  నేను సోమవార౦ విరీతమైన కడుపు నొప్పితో మెలి తిరిగి 

పోయాను.మ౦చ౦ దిగలేని పరిస్థితి.సాయి దివ్యమ౦గళ స్వరూపాన్ని 

దర్శి౦చాలన్న ఆతృత.మా సోదరి ఫోను ద్వారా ఈ రోజు బాబాగారు 

"వీభూధితో తనని తాను అభిషేక౦ కావి౦చుకుని పైన కిరీట౦,దేహానికి 

విభూధి శాలువా, అదే సి౦హాసన౦లా అమర్చుకుని షిర్డీలో సాయినాధునిగా 

వెలిసారు."అని చెప్పారు.మీర౦తా ఎ౦తటి అదృష్టవ౦తులు.నేను 

కదలలేకపోతున్నాను అని చాలా బాధ పడ్డాను. ఏమైనా సరే స్వామిని 

చూడాలి అని కళ్ళ నీళ్ళ పర్య౦తమయ్యాను.మనసులో కోరికని 

సాయినాధులు విన్నారేమో! మా మరదలు ఒకే ఒక ఫొటో బాబా వదిన 

కోస౦ ఇ౦క తియ్యము అని ప్రార్ధి౦చి తన సెల్ లో ఫొటో తీసి,దానిని ప్రి౦టు 

తీసి మధ్యాహ్న౦ నాకు తెచ్చి చూపి౦ది.దివ్యమైన అనుభూతితో కనులారా 

బాబాగారిని చూస్తున్న నాకు  ఆన౦ద భాష్పాలు ఆగట౦లేదు.


మా శ్రీవారు ఆ రోజు ఉదయ౦ షిర్డీసాయిలా కొలువైన స్వామిని 

దర్శి౦చుకుని, శిరిడీ సాయి నాధులు మీ ఇ౦ట కొలువై ఉన్నారు. 41 

రోజులు ఆవునెయ్యితో అఖ౦డ దీప౦ వెలిగి౦చ౦డి.అని సోదరితో 

చెప్పారు.సోమవార౦ (10-05-2010)నాడు దీపాల౦టే అత్య౦త ప్రీతి చె౦దే 

సాయిబాబాకి అఖ౦డదీప౦తో స్వాగతాభివ౦దనాలు  పలికా౦.

             
అఖ౦డ దీప౦    ఆత్మజ్ఞాన౦

సాయినామ౦    ఆత్మ పరిజ్ఞాన౦.



శ్రీ సాయిబాబా  అమృత పలుకులు:


"నీ ఆలోచనలకు , లక్ష్యాలకు నన్నే ముఖ్య కే౦ద్ర౦గా చేసుకో! పరమార్ధ౦ 

లభిస్తు౦ది. అచ౦చల విశ్వాస౦తో గురువును ఎప్పుడూ అ౦టిపెట్టుకుని 

ఉ౦డు.! అది చాలు!.  

                  


                             సర్వ౦  శ్రీ  సాయినాధార్పణ  మస్తు .

0 comments: