Pages

Monday, September 27, 2021

మృత్యుంజయుడు - శ్రీ సాయి బాబా

ఓం శ్రీ ద్వారకామాయి యే నమో నమః


"నీ ఆలోచనలకు, లక్ష్యాలకు నన్నే ముఖ్య కేంద్రంగా చేసుకో! పరమార్థం లభిస్తుంది. అచంచల విశ్వాసంతో గురువును ఎప్పుడూ అంటిపెట్టుకొనిఉండు..అదిచాలు!"...శ్రీసాయిబాబా.

మానవునిలో సమతను, మమతను పెంపొందించి మనిషిని దివ్యునిగా రూపొందించగల మార్గమైన 'మతమే' తద్విరుధ్ధమైన పాశవిక పైశాచిక ప్రయోజనాలకు  సాధనం  కావడమే  నిజమైన 'ధర్మగ్లాని'! అంటే ధర్మానికి పట్టిన జబ్బు! సమాజంలో ఈ ధర్మగ్లాని ముదిరి శృతిమించి రాగాన పడే సమయంలో మానవాళికి  సన్మార్గాన్ని  చూపటానికి 
అవతార పురుషులుదయిస్తారు. ధర్మగ్లాని ని మాన్పి లక్షలాది మందిని శుభమార్గంలో నడిపించడానికి ఈ యుగంలో అవతరించిన యుగపురుషుడు  శ్రీ సాయి బాబా.

శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి మొదలైన మహాత్ములు సర్వ మతాల సారం ఒక్కటేనని అన్ని భేదాలకు అతీతమైన ఆధ్యాత్మికానుభూతే పరమ సత్యమని బోధించేవారు. వారు 'జన్మతః' ఒక మతానికి చెందిన వారు అని తెలియటం చేత, ఇతర మతస్తులకు వారి హితవు అంతగా చెవికెక్కకపోవడం చూస్తాం. ఆ మహాత్ముల దివ్యసందేశాన్ని ఆచరించడానికి బదులు వారు మా మతానికి చెందినవారని చాటుకొని గర్వించడానికి మాత్రమే ఆ మత అనుయాయులు ఉపయోగించుకోవడం కూడా చూస్తున్నాం. 

అందుకే శ్రీ సాయి తమ జన్మ వివరాలను ఒక 'దేవరహస్యంగా'ఉంచారు. సర్వమతాలలోని శ్రేష్ఠ లక్షణాలు ఆయనలో మూర్తీభవించి గోచరిస్తాయి.

ఈ సామరస్యం ఎంత అద్భుతంగా ఆయనలో ఇమిడిందంటే..,వివిధ మతాల ఛాందసవాదులు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా ఆయనను 'తనవాడిగా' అనుకునేంత కనిపిస్తుంది. "ఇది మానవాళి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం." మతవిద్వేషాగ్నిలో సమిధలవుతున్న మనలోని అరిషడ్వర్గాలను , స్వార్ధపరత్వాన్నీ తమ జ్ఞానాగ్ని అనే 'ధుని'లో భస్మం చేసి ,దానికి ఫలమైన మహిమాన్వితమైన "ఊదీ"ని మనకు ప్రసాదిస్తున్నారు శ్రీ సాయి. శ్రీ సాయి అద్భుత తత్వమిది..

శ్రీ సాయి బాబా అవతార కార్యంలో ప్రధాన అంశమైన ఈ  సర్వమత సమరస  భావాన్ని త్రికరణశుధ్ధిగా ఆచరించనిదే ఎప్పటికీ మనం సాయి భక్తులవలేము.



ఈశ్వరుడు తప్ప తక్కినదంతయు మృతమే. మృతమనగా చచ్చినది అని అర్ధం . మరణం మరు జన్మకు బీజకారణం. మరుజన్మ లేక పోవుటకు అమృతమని పేరు. దుఃఖించుచూ చనిపోయిన మనకు దుఃఖించెడి జన్మమే కలుగును. ఆనందంగా ప్రాణత్యాగం కావించిన ఆ స్థితికి అమృతమని పేరు.మృతము గాక అమృతము నొసగునది ఈశ్వరుడు.

మోక్షం అనగా విడివడుట.
తగులుకున్నవాడు  దాని  నుండి
తప్పించుకొనుటయే  మోక్షం.. 

"నా గురువు నన్ను ఈ దేహంనుండి ఏనాడో విడుదల చేసాడు." అని శ్రీ సాయి బాబా చెప్పింది ఇటువంటి జీవన్ముక్తి గురించే.

ఒక సందర్భంలో బాబా "నన్ను ప్రసవించినప్పుడు తనకు కుమారుడు కలిగి నందుకు నా తల్లి ఎంతో ఉప్పొంగిపోయింది.  నా మటుకు నాకు ఆమె సంతోషం చూసి ఆశ్చర్యం వేసింది. నిజానికి నన్ను ఆమె కన్నదెప్పుడు? అసలు నాకు పుట్టుక ఉన్నదా? అంతకు ముందు మాత్రం నేను లేనా? అని అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. "జాతస్యహి మరణం ధృవం". అయితే జననమే లేని శ్రీ సాయికి మరణం మాత్రం ఎక్కడిది?

1886 లో శ్రీ సాయి "భగత్ !నేను అల్లా వద్దకు వెళుతున్నాను. నీవు నిర్జీవమైన ఈ దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగం చేసి అనగా వారు సూక్ష్మ శరీరాన్ని వేరు చేయడం ద్వారా  72గంటలపాటు అనగా 3రోజులు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నారు. 3రోజుల తరువాత తిరిగి తన దేహంలో ప్రవేశించి ,ఆ తరువాత సుమారు 32 సం"లు అదే దేహంతో సంచరించిన శ్రీసాయికన్నా మృత్యుంజయుడెవరు?

సాయి అంటే ఒక శరీరం కాదు అని, శరీరాన్ని ధరించిన దివ్యశక్తి..ఆత్మజ్యోతి అనిమనం గ్రహించాలి.బాబాయొక్క మృత్యుంజయత్వం కేవలం తన దేహానికే పరిమితం కాదు. అన్ని విధాలా ఆశలు పూర్తిగా వదులుకొని ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుండి బాబా రక్షించారు. తన భక్తులను మృత్యువు నుండి రక్షించే సందర్భాలలో ఏదో అదృశ్యశక్తితో ఘర్షణ పడుతున్నట్లు తిడుతూ, బెదిరిస్తూ , అదిలిస్తూ..బాబా చేసే చర్యలు....తన భక్తుడయిన మార్కండేయుని ప్రాణం రక్షించడానికి ఆ ముక్కంటి మృత్యుదేవతతో పోరాటానికి సిధ్ధమయ్యాడని చెప్పే పురాణకధలను స్మృతికి తేక మానవు.

బాబా మృత్యుంజయుడు కనుకనే  "నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానమిస్తుంది." అని హామీ ఇచ్చి ఆ హామీని ఇప్పటికీ నెరవేరుస్తున్నారు. అందుకే శ్రీ సాయినాధుని కన్నా మృత్యుంజయుడెవరు? సాయినామాన్ని మించిన మృత్యుంజయ మంత్రమేమున్నది? 

శ్రీ సాయి మహత్యాలు భక్తులు దర్శించి అనుగ్రహముతో తెలుసుకున్నవే..వారు ఏ చమత్కారాలు చేయలేదు.. మంత్రోపదేశాలు చేయలేదు.

'నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను!
నేను ఇవ్వదలచినది వారు అడిగేంతవరకూ!
కోరికలను తీర్చి దిద్దుటయే శ్రీ సాయి విధానము...

    సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు..






12 comments:

  1. Baba devudaa???
    Guruvuku gudulemiti???

    ReplyDelete
    Replies
    1. http://vanitavanivedika.blogspot.com/2020/11/blog-post.html?m=1

      Delete
  2. మంచి ప్రశ్న... శ్రీ సాయి మాకు గురువు.. దైవం..వారు నడిపిస్తున్న జీవితం మాది.

    తమకు ఆలయాలు గుడులు నిర్మించమని ఏ గురువు.. ఏ దేవుడు అడగలేదు.."గుడి భావితరాలకు పునాది."అన్నారు బాబాగారు. అంటే... వ్యక్తి తనలోని రాగద్వేషాదులను శోధించి.,అలా శుధ్ధి చేయబడ్డ అంతరంగంలో అస్తవ్యస్తంగా పడివున్న తన హృదయవాసనలనే చంద్రశిలలను ఆగమసూత్రాలకనుగుణంగా తీర్చి పేర్చి నిర్మించిన హృదయ మందిరంలో భగవంతుడు ఆనందం తో నర్తిస్తాడు.

    మనం గుడి నిర్మించాలని తలబెట్టిన బాహ్యమందిరం ఈ హృదయమందిరాన్ని ప్రతిబింబించే తత్వమయ నిర్మాణం కావాలి.. గురువు, దైవం ధర్మస్వరూపం. స్వాధ్యాయప్రవచనాలతో కూడిన ధర్మప్రచారానికి సంస్కరణకు దేవాలయం సాధనం కావాలి.

    అప్పుడే "గుడి రానున్న తరాలకు పునాది అవుతుంది".

    ReplyDelete
  3. మీకు నా ప్రశ్న అర్ధమైందాండీ???
    నా ప్రశ్నకు మీ జవాబుకు పొంతన ఉందాండీ???

    ReplyDelete
  4. అర్ధమయిందండీ..గురువుకు గుడులేమిటి?అన్న ప్రశ్నకు ఆ సమాధానం... బాబా దేవుడా?అన్న మీ సందేహానికి ...

    జన్మ జన్మల పుణ్యఫలం వలన, సాధన వలన భగవంతుడు తన ఉనికిని తెలుపుతూ విశుధ్ధ భక్తులకు తనకు తాను
    ప్రకటితమవుతాడు.అదే విధంగా
    ద్వాపరయుగంలో కృష్ణుడు ,త్రేతాయుగంలో రాముడు , కధలు పురాణాలను శ్రవణం, మననం చేసి.. పెద్దవారు చదివి వినిపించి..భగవత్ స్వరూపంగా వారిని సందర్శించుకునే భాగ్యం మనకు కలిగించారు. రామాలయం... కృష్ణా లయం..తిరుపతి లో వేంకటేశ్వర స్వామి ఇలా పలురూపాలలో భగవద్దర్శనం చేసుకునేందుకు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటాం..ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా శ్రీ సాయి అవతరించారు.

    వివిధ విషయవాసనలతో , కోరికలతో , ప్రాపంచిక వ్యామోహాలతో సతమతమవుతున్న మనలను మనస్సు యొక్క స్వభావానికి అనుగుణంగా సంస్కరించి ఉద్ధరించి సద్గతిని అందజేయడమే సాయి అవతారకార్యం యొక్క పరమార్ధం.

    'పిలిస్తే పలికే గొప్ప నిదర్శనం గల దేముడు'ఎవరని అడిగితే అందరూ"శ్రీ సాయిబాబా!"అని సమాధానం చెప్తారు. భక్తులకు వారి చరిత్ర.. ప్రబోధాల కన్నా వారి అనుగ్రహ,మహిమలే ఆకర్షించి భక్తి శ్రద్ధలతో సాయి ముందర కట్టిపడేసాయి. బాబాను ప్రార్ధించి , నిదర్శనం రావడంతో సాయిభక్తులయినవారు పలుమంది..
    "నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను"."నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా-పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొన్నట్లు-నేనే వారిని నా దగ్గరకు రప్పించుకొంటాను.ఎవరూ వారంతట వారుగా నా దగ్గరకు రారు. అనేవారు బాబా..

    ReplyDelete
  5. Demudu anaru. Devudu anali.
    Mee samadhanam sariggaa ledu

    ReplyDelete
    Replies
    1. http://vanitavanivedika.blogspot.com/2020/11/blog-post.html?m=1

      Delete
  6. అక్షర దోషం.. సరిచేసినందుకు ధన్యవాదాలు.. దేవుడు.. దేవాలయం..
    'పిలిస్తే పలికే గొప్ప నిదర్శనం గల దేవుడు'ఎవరని అడిగితే అందరూ"శ్రీ సాయిబాబా!"అని సమాధానం చెప్తారు. భక్తులకు వారి చరిత్ర.. ప్రబోధాల కన్నా వారి అనుగ్రహ,మహిమలే ఆకర్షించి భక్తి శ్రద్ధలతో సాయి ముందర కట్టిపడేసాయి. బాబాను ప్రార్ధించి , నిదర్శనం రావడంతో సాయిభక్తులయినవారు పలుమంది..
    "నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను"."నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా-పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొన్నట్లు-నేనే వారిని నా దగ్గరకు రప్పించుకొంటాను.ఎవరూ వారంతట వారుగా నా దగ్గరకు రారు. అనేవారు బాబా..

    ReplyDelete
  7. బాబా తనకి గుడులు కట్టమని ఎవరికీ చెప్పలేదు. బాబాను ఆరాధించి అనేక ప్రాపంచిక సమస్యలు విపత్తుల నుండి బయట పడిన సాయి భక్తులు ఆనందంగా గుడులు కట్టారు.

    ReplyDelete
  8. అబ్బా ఛ... బాబా గుడి కట్టమని ఆదేశించారని ఈ బ్లాగరే సాయిలీలల్లో చెప్పారే...మరి అదేమిటో?
    కృష్ణుడు కోసం నిర్మించిన ఆలయం తన ఆవాసంగా అడిగి బాబా చేసుకోలేదా?

    ReplyDelete
  9. http://smarana-bharathi.blogspot.com/2021/10/blog-post.html?m=0

    ReplyDelete
    Replies
    1. సంతృప్తికర సమాధానం ఇచ్చారు.
      మీ ఫ్రెండ్ కు హృదయపూర్వక నమస్కారాలు

      Delete